All India Radio News Hyderabad

  • Home
  • All India Radio News Hyderabad

All India Radio News Hyderabad Official Page of All India Radio News, Hyderabad Official account of Regional News Unit Hyderabad, All India Radio News

జోగులాంబ గద్వాల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన...
27/12/2024

జోగులాంబ గద్వాల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురు వినతిపత్రాలు సమర్పించారు.

బోర్డర్-గవాస్కర్ క్రికెట్ ట్రోఫీ ఛాంపియన్ షిప్ లో భాగంగా మెల్‌బోర్న్‌ లో జరుగుతున్న నాల్గవ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే...
27/12/2024

బోర్డర్-గవాస్కర్ క్రికెట్ ట్రోఫీ ఛాంపియన్ షిప్ లో భాగంగా మెల్‌బోర్న్‌ లో జరుగుతున్న నాల్గవ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి, భారత్ తొలి ఇన్నింగ్స్‌ లో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. భారత జట్టు ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉంది.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర రేపు ఉదయం 9.30 గంటలకు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్ ...
27/12/2024

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర రేపు ఉదయం 9.30 గంటలకు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్ ఘాట్ శ్మశానవాటికకు చేరుకుంటుంది. ఆయన భౌతికకాయానికి కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలు నివాళులు అర్పించే అవకాశం కల్పించనున్నారు.

27/12/2024

పంజాబ్‌లోని భటిండాలో జరిగిన బస్సు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 46 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన 493 శాఖలు 2025 జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో వి...
27/12/2024

తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన 493 శాఖలు 2025 జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం కానున్నాయని టీజీబీ చైర్మన్ వై. శోభా ప్రకటించారు. ఒక రాష్ట్రం ఒక రూరల్ బ్యాంక్ పేరుతో కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం జరిగిందని తెలిపారు.

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ Jishnu Dev Varma విచారం వ్యక్తం చేశారు. భారత రాజకీయ చ...
27/12/2024

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ Jishnu Dev Varma విచారం వ్యక్తం చేశారు. భారత రాజకీయ చరిత్రలో ప్రసిద్ధి చెందిన జాతీయ నాయకుల్లో ఒకరని, నిర్వహించిన ప్రతి పదవిలోనూ తనదైన చెరగని ముద్ర వేశారని గవర్నర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి ఆరోగ్యశాఖ మంత్రి Damodar Rajanarsimha Cilarapu నివాళులర్పించారు.
27/12/2024

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి ఆరోగ్యశాఖ మంత్రి Damodar Rajanarsimha Cilarapu నివాళులర్పించారు.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు ...
27/12/2024

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు ఓ మోస్తరుగా రాణించాయి. ముఖ్యంగా ఫార్మా, హెల్త్ కేర్‌, బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్ లో కొనుగోళ్లతో సూచీలకు కలిసొచ్చింది.

సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ విచారణ జనవరి 10వ తేదీకి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసు...
27/12/2024

సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ విచారణ జనవరి 10వ తేదీకి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.
Allu Arjun

ఫార్ములా – ఈ కార్ రేసులో మాజీ మంత్రి కే. తారక రామారావు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. తదుపరి...
27/12/2024

ఫార్ములా – ఈ కార్ రేసులో మాజీ మంత్రి కే. తారక రామారావు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

తిరుమల తిరుపతి దేవస్దానాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేటాయించిన విధంగానే తెలంగాణ ప్రాంతానికి నిధులు కేటాయించాలని దేవాద...
27/12/2024

తిరుమల తిరుపతి దేవస్దానాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేటాయించిన విధంగానే తెలంగాణ ప్రాంతానికి నిధులు కేటాయించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. అధిక భక్తులు, రాబడి వస్తున్న తెలంగాణపై టీటీడీ దృష్టి సారించాలన్నారు.

న్యూయార్క్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, హ్యూస్టన్, అట్లాంటాలో ఉన్న   బృందం.. సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులపై దృ...
27/12/2024

న్యూయార్క్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, హ్యూస్టన్, అట్లాంటాలో ఉన్న బృందం.. సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులపై దృష్టి సారించి భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి గల అవకాశాలు చర్చించారు. USAలోని భారతీయులకి మెరుగైన సేవలందించడంపై అభిప్రాయాలను పంచుకున్నారు.

అధునాతన హంగులతో సిద్దమైన చర్లపల్లి రైల్ టెర్మినల్  ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తదుప...
27/12/2024

అధునాతన హంగులతో సిద్దమైన చర్లపల్లి రైల్ టెర్మినల్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తదుపరి ప్రారంభోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలియచేసింది.

వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు 5 వికెట్ల  తెడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 38...
27/12/2024

వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు 5 వికెట్ల తెడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 38.5 ఓవర్లలో 162 పరుగులకే అలౌటైంది.



మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్య క్రియలు రేపు ఢిల్లీలోని రాజ్ ఘాట్ సమీపంలో నిర్వహించనున్నారు. అంతకు ముందు ఆయన భౌతి...
27/12/2024

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్య క్రియలు రేపు ఢిల్లీలోని రాజ్ ఘాట్ సమీపంలో నిర్వహించనున్నారు. అంతకు ముందు ఆయన భౌతిక కాయాన్ని ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
27/12/2024

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

27/12/2024

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ఆర్థికశాఖ మంత్రి Nirmala Sitharaman.

Address


Alerts

Be the first to know and let us send you an email when All India Radio News Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share