అందరికి నమస్కారం...!
పేస్బుక్ లో చాలమంది తమ తమ ప్రాంతాల గురించి పెడుతున్న పోస్టింగ్స్ చూసి మన ప్రాంతం గురించి వెతికాను కాని నాకు ఒక్క పోస్ట్ కూడా కనిపించలేదు, మాములుగానే కాదు పేస్బుక్ లో కూడా మన ప్రాంతం వెనుకబడి ఉందని గ్రహించి ఒకింత మనస్తాపానికి గురయ్యాను.
రాయలసీమ గొప్పదనాన్ని, రాతనాలసీమ ప్రాభవాన్ని అందరికి తెలియచెప్పాలనే సదుద్దేశ్యంతో ఈ " మా రాయలసీమ " పేజి మొదలుపెట్టడం జరిగింది.
ముందుగా రాయల
సీమ అనే పేరే పెడదామనుకున్నాను కాని దానికి ముందు ఏదైనా ఉంటె బాగుండనిపించింది అందుకని మా రాయలసీమ అని పెట్టాను.. చాల మంది పేరు మార్చమని అడిగారు, యుసర్ నేం అయితే మార్చగలిగాను కాని పేజి నేమ్ మాత్రం మార్చడం కుదరడంలేదు. ఇది ' మీ ' ' మా ' ' మనందరి సీమ '
" మన రాయలసీమ "
_______________________________________
ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాలసీమ
తనువెల్ల తరుగని ఘనులున్నసీమ విరులున్నసీమ
వానగాలికి సీమ స్నానం అడినపుడు వజ్రాలు ఈ నేల ఒంటి పై తేలాడు
పొరలు నిమిరితే పుష్యరాగాలు దొర్లు రాగాలు దొర్లు
బంగారు గనులున్న బంగరి తల్లి పొంగిపోదమ్మ
కలియుగమ్మున నరులు ఒర్వలేరని తెలిసి నల్ల రాయయి వెలిసి ఎల్లలోకములేలు
వెంకటాచలము భువైకుంటస్థలమో వైకుంటస్థలమో
దర్శించిన జన్మ దన్యమావుతాదో పుణ్యమవుతదో
హరిహరబుక్కరాయ అడవికేటాకెల్తే కుందేళ్ళు కుక్కాల వెంటబడ్డాయంట
పౌరుషాలపురిటి జీవగడ్డమ్మో జీవగడ్డమ్మో
ప్రతిన పట్టితే శత్రువు ఇక పతనమేర ఇక పతనమేర
పాపాలు కడిగేటి పాతాళ గంగమ్మ ఆదిగురువుల తపము నాచరించిన నిలము
హఠకేస్వరాశిఖర అవని కైలాసం అవని కైలాసం
తనకు తానేలసిన శివలింగమమ్మో శ్రిశైలమ్మమ్మో
సత్రాలు సాదువులు భైరాగితత్వాలు సీమ ఊరూరూన మారుమ్రోగుతాయి
శిథిలమైన గుళ్ళు శివనందులమ్మో శివనందులమ్మో
వీరబ్రహ్మం మఠం సీమకే మకుఠం సీమకే మకుఠం
ఎత్తు బండరాళ్ళు ఎర్రాని తుప్పులు పలుకురాళ్ళగట్లు పైటికంపపొదలు
నెర్రెలు వాలిన నల్లరేగళ్ళు నల్లరేగళ్ళు
ఆరుతడిపితే పెరిగే వేరుసెనగమ్మో వేరుసెనగమ్మో
హరుని కంటికే కన్నప్పగించిన కన్నప్ప భక్తవరుడు
విజయనగర సామ్రాజ్య కృష్ణదేవరాయ భూవిభుడు
చరిత్ర కెక్కిన ధరణి ఇది
పదాలనే స్వరపదాన నడిపిన అన్నమయ్య కృతులు
ఇహపరాలకలిపినా వీరబ్రహ్మేంద్ర తత్వగతులు
అలలై పొంగిన అవని ఇది అలలై పొంగిన అవని ఇది
తెల్లదొరల హడలెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
మడమతిప్పక స్వరాజ్యసంగ్రామం నడిపిన కడపకోటిరెడ్డి
తాడిచర్ల కల్లూరి, సదాశివం పప్పూరి, హంపన్న, లింగన్న,
షేక్ పీర్ లబియాబి....
ఒక్కరా ఇద్దరా పదుగురా నూర్గురా
ఎందరెందరో త్యాగదనులకు జన్మనిచ్చిన జనని ఇది