13/10/2025
కాలభైరవదీక్ష ఎప్పుడు స్వీకరించాలి?
కాలభైరవజయంతి12.12.2025 కాలభైరవాష్టమి12.12.2025 శుక్రవారం
#స్వర్ణాకర్షణభైరవదేవాలయం
41 రోజులు 26.10.2025 ఆదివారం
21 రోజులు 16.11.2025 ఆదివారం
11 రోజులు 30.11.2025 ఆదివారం కాలభైరవ దీక్షలు రాజమండ్రి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో ప్రారంభమగును. దీక్షా విరమణ కాలభైరవాష్టమి 12.12.2025 సాయంత్రం 4గంటలకు.
దీక్షా విరమణ క్షేత్రం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయం, రాజమండ్రి. ఆంధ్రప్రదేశ్. #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ
కాలభైరవదీక్ష-KalabhairavaDeeksha
మనలో ఉన్న మనోబలమును, మనోబుద్ధిని, మనోదృఢత్వంను మనోసంకల్పాన్ని పెంచే అత్యుత్తమదీక్షయే కాలభైరవదీక్ష. మనలో అంతర్గతంగా ఉన్న దివ్య శక్తులను, అనంత జ్ఞానాన్ని మేల్కొల్పి జన్మ సార్ధక దిశగా అడుగులు వేయించి, సాహసోపేత నిర్ణయాలు తీసుకునే శక్తిని అనుగ్రహించే దీక్షయే కాలభైరవ దీక్ష.
ఈ దీక్ష అందరూ చేయలేరు. చాలా తక్కువ మంది అనగా పూర్వజన్మలో అనంతమైన పరమశివభక్తి పరులకు మాత్రమే ఈ జన్మలో అనుకూలిస్తుంది. ఎందుకంటే ఈ దీక్ష కొన్ని త్యాగాలతో కూడుకొని ఉంటుంది. కఠినంగా కూడా ఉంటుంది. ఈ దీక్ష ఒక తపస్సు వంటిది.
ఒక్కరోజు దీక్ష మొదలు ఆజన్మాంత దీక్ష వరకు అన్నీ దీక్షలే. కారడవులలో కందమూలాలు తింటూ ఆచరించే తపస్సూ కూడా దీక్షే, కానీ ఈ లౌకిక ప్రపంచంలో కొట్టుమిట్టాడే మనకు తపస్సుల వంటి దీక్షలను ఆచరించటం సాధ్యంకాదు. కలియుగ ప్రామాణికం ప్రకారము సంసారాన్ని సమాజాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. సంసారంలోనే గృహస్థాస్త్రము ధర్మములోనే ఉంటూ సమాజంలోనే ఉంటూ మనల్ని మనం ఉద్ధరించుకొని జన్మ సార్ధకత గావించుకునే మహోన్నతమైనటువంటి దీక్షయే కాలభైరవ దీక్ష. అందుకు "సూక్ష్మంలో మోక్షం” అన్నట్లు మండలం దీక్షలు, అర్ధమండల దీక్షలు అవతరించాయి.
ఈ కలియుగమున కూడా ఎంతో మంది కాలభైరవ ప్రియ భక్తులు కాలభైరవ దీక్షను కొన్ని మండలాలు పాటు స్వీకరించి తరించినట్లు ప్రాచీన చరిత్ర తెలియజేస్తుంది. వారిలో శ్రీనాథ కవిసార్వభౌముని ఆప్తుడు వల్లభరాయుడు, కుర్తాళపీఠ స్థాపకులు శ్రీశ్రీ మౌన స్వామివారు, శ్రీ రామకృష్ణ పరమహంసకు అద్వైత సాధన నేర్పిన గురువుగా తోతాపురి అలాగే కాలభైరవ సాక్షాత్కారం పొందినవారిలో ప్రముఖులుగా రామకృష్ణపరమహంస, కీనారాంబాబా, విశుద్ధానంద స్వామి, పండిత మదన్మోహన్ మాలావ్య, ఇండోర్ మహారాణి అహల్యాబాయి, వంగదేశపు మహారాణి భవానీదేవి, పాండవులలో భీముడు ప్రముఖులుగా ఉన్నారు. ప్రస్తుతం కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బాహ్యంగా అంతర్ముఖంగా కాలభైరవ సాధన చేసి వారి వారి జన్మ సంకల్పాలు నెరవేర్చుకుంటూ చరిత్రలో వారికంటూ ఒక కీలకమైన మైలురాయిని శిరస్థాయిగా నిలుపుకుంటూ ఉన్నారు.
దీక్ష నియమాలు
1. నీలం రంగు వస్త్రాలు ధరించాలి
2. పురుషులు మండలం రోజులు స్త్రీలు అర్థమండలం రోజులు స్వీకరించవచ్చు.
3. 108 పూసలు, 1కొనపూస కలిగిన రుద్రాక్షమాలకు కాలభైరవ స్వామి ముద్ర వేసి ధరించాలి.
4. దీక్ష స్వీకరణ సమయంలో గురు ముఖతా మంత్రం ఉపదేశం పొందాలి.
5. ఆ మంత్రము దీక్ష కాలమంతా రోజు 11 మాలలు జపించాలి.
గృహంలోనే కాలభైరవ స్వామి వారి చిత్రపటం లేదా ప్రతిమ లేదా యంత్ర రాజం పెట్టుకొని పూజించాలి.
6. ఉదయము, సాయంత్రము పంచోపచార పూజ మరియు 11 మాలలు జపము చేయాలి.
7. నేల మీద నిదురపోవాలి.
8.శాఖాహారం మాత్రమే స్వీకరించాలి.
ఉదయం 8 గంటల లోపు అల్పాహారము. మధ్యాహ్నం రెండు గంటల లోపు భోజన ప్రసాదము స్వీకరించాలి. రాత్రి పూజ జపం తర్వాత కేవలం ద్రవపదార్థం (పాలు) మాత్రం స్వీకరించాలి
9. రెండు ఉదయం , సాయంత్రం స్నానమాచరించాలి.
10.అందరిని "స్వామి" అని మాత్రమే సంబోధించాలి.
11. ఎవరికైనా కోపతాపాలు చూపించరాదు. నిదానంగానే ప్రవర్తించాలి.
12. దీక్ష కాలంలో చెడు వ్యసనాలు మద్యం మాంసం గుట్కా పూర్తిగా మానేయాలి.
13. ఎవరిపైన దూషణలు చేయరాదు అనవసరమైన ప్రసంగం చేయకూడదు. అవసరమైతేనే మాట్లాడాలి.
14. మీ వృత్తి వ్యాపార వ్యవహారాలు అన్ని యధావిధిగా చేసుకొన వచ్చు.
15. పుకార్లు వినరాదు ప్రచారం చేయరాదు.
16. దీక్ష కాలం అంత ఎక్కడబడితే అక్కడ ఏది పడితే అది తినకూడదు
17. ఇంట్లో తయారు చేసినది లేదా మీరు స్వయంగా తయారు చేసుకున్నది లేదా ఫలములు స్వీకరించాలి.
18. దీక్ష పూర్తయిన తర్వాత కాలభైరవ జయంతి పర్వదినాన కాలభైరవ ఇరుముడితో గురు సన్నిధికి చేరుకొని, కాలభైరవ దీక్ష ప్రత్యేక పూర్ణాహుతిలో ఇరుముడిని సమర్పించి, గురు ఆశీస్సులను పొంది, మాల విరమణ చేయాలి.
19. దీక్ష కాలమంతా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి.
20. మెడలో ధరించిన రుద్రాక్ష మాల నేలపైన తాకరాదు.
21. జపమాల ఉంటే జపమాలతో జపం చేయవచ్చు. మాల లేకున్నా నిర్ణీత సమయం ఉదయం 45 నిమిషాలు సాయంత్రం 45 నిమిషాలు జపం చేయాలి.
22. దీక్ష కాలమంతా రోజులో ఒకసారి కాలభైరవ సహస్రనామావళి పారాయణం చేయాలి. పారాయణం చేస్తూ మీ పీఠంలో స్వామివారి చిత్రపటానికి ప్రతిమకు యంత్రానికి పువ్వులతో ఎరుపు రంగు అక్షింతలతో అర్చన కూడా చేసుకోవచ్చు
23. మీ తల్లిదండ్రుల యొక్క లేదా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనుమతితో మాత్రమే దీక్షికరించాలి.
24. సోషల్ మీడియాలో అనవసరమైన రాద్ధాంతాలు పనికిమాలిన విషయాలు చూడరాదు.
ఇంకా మీకు ఏమైనా దీక్షకు సంబంధించి సందేహాలు ఉంటే క్రింద కామెంట్ లో తెలియజేయండి.
శ్రీ కాలభైరవ స్వామి వారి దీక్షను స్వీకరించి సర్వ వ్యవహారాలలో విజయాన్ని సాధించి సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను పొంది మీ జన్మని సార్ధకత గావించుకోగలరు శుభంభవతు🙌 Subhambhavatu🙌
ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో క్రింద కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారికి ప్రత్యేక కార్యసిద్ధి దీపారాధన సేవ కార్యక్రమము ఉంటుంది.