![దయన్నా ఎట్లున్నవ్..? అచ్చెన్నా.. అంతా బాగే!అమరావతి: ఒకప్పుడు వారందరిదీ ఒకే పార్టీ.. ఒకే జెండా.. ప్రస్తుతం రాష్ట్రాలు వేర...](https://img4.medioq.com/823/047/1172343908230478.jpg)
25/12/2024
దయన్నా ఎట్లున్నవ్..? అచ్చెన్నా.. అంతా బాగే!
అమరావతి: ఒకప్పుడు వారందరిదీ ఒకే పార్టీ.. ఒకే జెండా.. ప్రస్తుతం రాష్ట్రాలు వేర్పడ్డాయి... వారు పార్టీలు వేరయ్యారు.. ఓ కేసు విచారణ సంద ర్భంగా కోర్టు వద్ద కలుసుకున్నవారంతా పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. క్షేమ సమాచారాలు.. రాజకీయ సమీకరణాల తదితరాల గురించి మాట్లాడుకున్నారు. న్యాయవాదులు, కక్షిదారులు వారి కలయికను ఆసక్తిగా గమనించారు. కేసు వాయిదా పడటంతో ఎవరి తోవన వారు వెళ్లిపోయారు. 2007లో ఓబుళాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాలు అడ్డగోలుగా జరిగాయి. గాలి జనార్ద నరెడ్డికి ప్రభుత్వం గనులను దోచిపెడుతోందని ఆరో పిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ నేతలు ఓబుళాపురం తరలివెళ్లారు పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంగళవారం విజయవాడ కోర్టు సముదా యాల్లోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ కేసు విచారణకు
వారంతా తరలివచ్చారు. ఈ సందర్భంగా పాత స్నేహి తులంతా కలిశారు. వారిలో కింజరాపు అచ్చెన్నాయుడు, నాగం జనార్దన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, మెట్టు గోవిందరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, వేం నరేంద రెడ్డి, చిన్నం బాబూరమేష్, పడాల అరుణ, లలితకు మారి, బొమ్మిడి నారాయణరావు, వైవీబీ రాజేంద్రప్రసాద్, మసాల పద్మజ, నిమ్మకాయల చినరాజప్ప, అమర్నాద్ రెడ్డి, పూల నాగరాజు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, వీరంకి గురుమూర్తి ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. 'మేమంతా స్నేహితులమే. గతంలో తెదేపాలో పని చేశాం. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా.. అంతా ప్రజాసేవ లోనే ఉన్నాం' అన్నారు. ఈ కలయిక ఆనందంగా ఉంద న్నారు. జనవరి 34 కేసు వాయిదా వేశారని న్యాయవాది జి. లక్ష్మీనారాయణ చెప్పారు.
• నాటి మిత్రులను కలిపిన పాత కేసు
విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన మెట్టు గోవిందరెడ్డి, వైవీబీ రాజేంద్రప్రసాద్, అచ్చెన్నాయుడు, నాగం జనార్దనరెడ్డి, దేవినేని ఉమా, అమర్నాథ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, చినరాజప్ప తదితరులు Amaravathi Report