కరోనా వ్యాధి నివారణపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట RDO మోహన్ రావు అన్నారు. శుక్రవారం స్థానిక మహత్మా గాంధీ విగ్రహం వద్ద కరోనా నివారణ చర్యలలో భాగంగా చేతులను శుభ్రపరచుకొనే అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... మందుల షాపులలో దోరికే వంద మిల్లీ గ్రాములు స్పిరిట్ ను లీటర్ నీటిలో కలిపి 10 నిమిషాలకు ఒకసారి చేతులను శుభ్రపరచుకోవాలని అన్నారు. తుమ్మినపుడు, దగ్గి నపుడు చేతిరుమాలును అడ్డం పెట్టుకోవాలని అన్నారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. వేరే దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను కలువకూడదని అటువంటి వారిపై అధికారులకు తెలియాజేయలని అన్నారు. ఆదివారం జరిగే జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటల దాకా ప్రజలు ఎవరు ఇంటి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాసవి క్లబ్ గవర్నర్ రుద్ర౦గి రవి, ఇంటర్ నేషనల్ డైరెక్టర్ తోట శ్యామ్ ప్రసాద్ లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ చౌరస్తా వద్ద గల ఇండియన్ గ్యాస్ కార్యాలయం వద్ద వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో కరోన వ్యాధి, వ్యాధినివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించి మాస్కులు అందజేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ... ప్రతిఒక్కరూ తమచేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా రెండు చెతులు జోడించి నమస్కరం పెట్టాలని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు ఈనెల 22 న ఎవరికి వారు స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ విధించుకొని ఇంటి వద్దనే ఉండాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా కరోన వ్యాధి మూలముగా ఎన్నో సేవాకార్యక్రమములు కూడా నిలిపివేసినట్
స్థానిక MRO ఆఫీస్ రోడ్డులో గల శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవముల ముగింపు సందర్భంగా ప్రాతఃకాలమున ఆరాధన, సేవాకాలం, బాల భోగం, యాగశాల మంటప ఆరాధన, హోమం, మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో అభిషేకం చేసారు. అభిషేకం అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలు ధరింపజేసి పవిత్ర అలంకరణ చేశారు. తదుపరి ఋత్విక్ సన్మానం ఆరగింపు తీర్థ ప్రసాద వినియోగం అన్నప్రసాద వితరణ జరిగినది. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల మురళీధరాచార్యులు, సంకర్షణా చార్యులు, రామానుజాచార్యులు, సుదర్శనాచార్యులు, యజ్ఞాచార్యులు ఆనంద్ కుమారా చార్యులు కార్యనిర్వహణ అధికారి రంగారావు, భక్తులు వుప్పల గోపాలకృష్ణయ్య, వీర్లపాటి సత్యనారాయణ, కందగట్ల శ్రీనివాస్, డాక్టర్ ఆచార్య, శ్రీరంగం రాము,
SRSP కాలువల ద్వారా నీరురావడంతో సంతోషంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన రైతన్నకు నాగారం మండలంలో గురువారం రాత్రి కుడి వడగళ్ల వాన కడగండ్లను మిగిల్చింది. వివరాల్లోకి వెళితే... నాగారం మండలంలోని ఫణిగిరి, ఈటూరు, పస్తాల, డి కొత్తపల్లి గ్రామాల్లో కోతదశలో ఉన్న వరి పొలాలు వంగి దాన్యం రాలిపోయింది. దీంతో వందల ఎకరాలు చేతికందకుండా పోయి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఫణిగిరిలో కళ్లెట్లపల్లి ఉప్పలయ్యకు చెందిన 5 ఎకరాల పొలం నేల రాలిపోయింది. ఈటూరులో కన్నెబోయిన యాదగిరి, మొగుళ్ల సావిత్రమ్మ, కొడారి లింగమల్లు, కన్నెబోయిన శ్రీను, వెంకన్న వరి పొలాలు నేల మట్టం అయ్యాయని, ప్రభుత్వం ఆదుకోని నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
పర్యావరణానికి మేలుచేసే సంచులనే ప్రజలు వాడి పర్యావరణానికి సహకరించాలని సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నెలకొల్పిన రీతు నేచర్ ప్రొడక్ట్స్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుతం పర్యావరణం కాలుష్యమై రానురాను తాగే నీరు, పీల్చే గాలి దోరకడం గగనమై పోతుందని అన్నారు. ప్రతిఒక్కరూ తమవంతుగా పర్యావరణానికి మేలుచేసే విధంగా కాలుష్య రహిత సంచులను వాడాలన్నారు. ఈ సందర్బంగా షాప్ నిర్వహకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కిషోర్, సూర్యాపేట ZPTC జీడి భిక్షం, నిర్వహకులు బొజ్జ ఎడ్వర్డ్, వెంకట రెడ్డి, చందు, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న IKP VOAలకు ప్రభుత్వం కనీస వేతనం 18వేలు అమలు చేయాలని TRSKV జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఆ సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం VOA లకు హెల్త్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ESI, PF సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గ అధ్యక్షురాలిగా శారద, ప్రధాన కార్యదర్శిగా శైలజ, సహాయ కార్యదర్శిగా సరళ, ఉపాధ్యక్షులుగా వెంకన్న, కోశాధికారిగా ఉమాదేవిలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ నాయక్, రజిత, అనిత, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా వైరస్ ఎఫెక్టుతో బార్లు, రెస్టారెంట్లు బంద్ చేయించిన విధంగా సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైన్ షాప్‌లను బంద్ చేయాలని MRPS జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజయ్య మాదిగ డిమాండ్ చేశారు. MRPS వ్యవస్థాపకులు SC,ST,BC మైనార్టీ కులాల చైర్మన్ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు గురువారం సూర్యాపేట పట్టణంలో ఎక్సైజ్ జిల్లా సూపరిండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్లు బందు చేయించిన విధంగానే వైన్ షాప్ లను మూసివేయాలని అన్నారు. వైన్ షాప్ లోకి సామాన్య ప్రజలు వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే CM KCR స్పందించి వైన్ షాపులను మూసి వేయించాలని డిమాండ్ చేసారు. అనంతరం ఆఫీస్ సూపరిండెంట్ కి వినతిపత్రాన్నిఅందజేసిన. ఈ కార్యక్రమంలో MRPS జాతీయ నాయకులు గుద్దేటి ఎల్లయ్య, జిల్లా
తెలంగాణ ప్రజా వైద్యాఆరోగ్య ఉద్యోగుల సంఘం హెచ్ 1 ఆదర్యంలో రూపొందించిన తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం క్యాలెండర్ ను గ్రందాలయ సంస్థ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గురువారం జిల్లా కేంద్రంలోని DMHO కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తుందని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటరమణ, సల్వాది శ్రీనివాస్, జిల్లా అద్యక్షులు బూతరాజు సైదులు నాయకులు బొల్లి శ్రీనివాస్, వాంకుడోత్ వెంకన్న, షాబోద్దిన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయిబజార్ లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో ఈ నెల 25 నుండి ఏప్రిల్ 2 వరకు శ్రీ సీతారామచంద్ర స్వామి నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు శ్రీ వేదాంత భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వర రావు తెలిపారు. గురువారం శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకుని మహిళలు పసుపు కొట్టి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు భక్తులు తెచ్చిన పసుపు కొమ్ములు స్వామి వారి సన్నిధిలో కొట్టి అట్టి పసుపును శ్రీ రామనవమి వేడుకల్లో వినియోగించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు వాయణములు ఇచ్చి తీర్థ ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిర ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్, కోశాధికారి సోమా అశోక్, మందిర ప్రధాన అర్చ
ఆత్మ బలిదానాలు వొద్దు పోరాటలే ముద్దు అనే నినాదంతో పాదయాత్ర చేసి నేటికి పదేళ్ళు పూర్తియిన సందర్భంగా సూర్యాపేటలో జరిగిన విలేఖరుల సమావేశంలో TEMJU రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరపున తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని అన్నారు. 2010 మార్చి 18 నుండి మార్చి 28వ వరకు పాదయాత్ర చేసి నేటికి సరిగ్గా పది సంవత్సరాలు అయిందని ఆయన అన్నారు.
అల్లం నారాయణ, క్రాంతి కుమార్ ల నాయకత్వంలో జర్నలిస్టులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర౦లో నేడు CM KCR నాయకత్వంలో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, రైతుసంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని, విద్య, ఉపాధి ప్రణాళికలు రూపొందిండం జరుగుతుందన్నారు. ఇటువంటి సమయంలో కూడ తెలంగాణ రాష్
స్థానిక MRO ఆఫీస్ రోడ్డులో గల శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో బుధవారం పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటిరోజు ప్రాతః కాలమున ఆరాధన, సేవాకాలం, బాలభోగం నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు యాగశాల ప్రవేశం, కుంభ స్థాపన, ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, అగ్నిప్రతిష్ట, మూలమంత్ర హోమం, పవిత్ర ఆధివాసము, హోమం, నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు నల్లాన్ చక్రవర్తుల మురళీధరాచార్యులు, యజ్ఞాచార్యులు నల్లాన్ చక్రవర్తుల సంకర్షణాచార్యులు, సుదర్శన్ ఆచార్యులు, రామానుజాచార్యులు, భక్తులు శ్రీరంగం రాము, చేపూరి వేణుగోపాల్, కొత్తపేట రామకృష్ణారావు, అనురాధ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తెలంగాణ సమాచార హక్కుసాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో జరిగిన సమాచార చైతన్య సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాచారహక్కు చట్టం ద్వారా సమాజాన్ని మార్చే శక్తి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించడంతో పాటు కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సదస్సులో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నక్క లక్ష్మి, పాండురంగాచారి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
.
రాష్ట్రంలోని మహిళల శిశు సంక్షేమ అభివృద్దే ముఖ్యమంత్రి KCR లక్ష్యమని 32 వార్డు కౌన్సిలర్ SK జహిర్ అన్నారు. బుధవారం వార్డులోని మూడు అంగన్వాడి సెంటర్ లకు దాతల సాయంతో కుర్చిలు, పేట్లు, చాపలు, కుండలును అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా ముఖ్యమంత్రి KCR గర్బీనీలకు అంగన్వాడి సెంటర్ల ద్వారా పౌష్టిక ఆహారం, చిన్నారులకు బాలామృతం లాంటి ఆహారాన్ని అందిస్తున్నారని అన్నారు. అదే విధంగా శిశువు తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి ప్రపంచాన్ని చూసే దాక ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలను అందిస్తూ మగ శిశువు జన్మిస్తే 12 వేలు, ఆడ శిశువు జన్మిస్తే 13 వేలను అందిస్తు, KCR కిట్ ను అందజెస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో CDPO వెంకటలక్ష్మి, దాతలు గుణగంటి బాబు, డాక్టర్ షరిఫ్, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు జానిమీయా, వెన్న శ్రీని
సావిత్రిబాయి పూలే ఆశయ సాధనతోనే మహిళల ప్రగతి సాధ్యమౌతుందని తెలంగాణ BC సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని MG రోడ్ లోగల పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 93వ వర్ధంతి కార్యక్రమాన్ని BC మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తోటి మహిళల ప్రగతి కొరకు కృషి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పెరుమాళ్ళ రాజారావు, నీలకంఠ చలమంద, బత్తుల కౌసల్య యాదవ్, దైద వెంకన్న, బత్తుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని BC సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షులు చల్లమల్ల నరసింహా అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని MG రోడ్ లోగల పూలే విగ్రహం వద్ద సావిత్రీ బాయి పూలే 123 వ వర్ధంతి కార్యక్రమ౦ తెలంగాణ రాష్ట్ర BC స౦క్షేమ సంఘం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంహం నాయకులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, బైరు వెంకన్న, ఉప్పల మధు యాదవ్, మారపాక వెంకన్న, కందాల బాస్కర్, పోతుగంటి వీరాచారి తదితరులు పాల్గొన్నారు.