Amaravathi Journal

  • Home
  • Amaravathi Journal

Amaravathi Journal PAGE FOR TELUGU NEWS UPDATES

20/09/2025

H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్
అమెరికా H1B వీసా నిబంధనల్లో మళ్లీ మార్పులు
H1B వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచిన ట్రంప్
H1B వీసా దరఖాస్తు రుసుము లక్ష డాలర్లకు పెంపు
H1B వీసా లాటరీ సిస్టమ్‌ని తొలగించిన అమెరికా
భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనున్న H1B విధానం
టెక్ సంస్థలపై పెను భారం
10 లక్షల డాలర్లకు లభించనున్న ట్రంప్ గోల్డ్ కార్డు

#ట్రంప్ #వీసా

17/09/2025

పేదవాడి కోటాలో సదుపాయాలు ఉద్యోగం పొంది 300 కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టిన విద్యుత్ శాఖ పేద ఉద్యోగి .

     #డెమోక్రసీ  #భారత్
15/09/2025

#డెమోక్రసీ #భారత్

15/09/2025
15/09/2025

11/09/2025

ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లు బదిలీ...

▪️పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి
▪️విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి
▪️తూర్పుగోదావరి కలెక్టర్‌గా కీర్తి చేకూరి
▪️గుంటూరు కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా
▪️పల్నాడు కలెక్టర్‌గా కృతిక శుక్లా
▪️బాపట్ల కలెక్టర్‌గా వినోద్‌ కుమార్‌
▪️ప్రకాశం కలెక్టర్‌గా రాజాబాబు
▪️నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా
▪️అన్నమయ్య కలెక్టర్‌గా నిషాంత్‌ కుమార్‌
▪️కర్నూలు కలెక్టర్‌గా ఎ.సిరి
▪️అనంతపురం కలెక్టర్‌గా ఆనంద్‌
▪️సత్యసాయి కలెక్టర్‌గా శ్యాంప్రసాద్
#టీడీపీ

11/09/2025

*ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు: నీలం సాహ్ని*

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.

*ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్*

▪️2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
▪️అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలి.
▪️నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి.
▪️నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి.
▪️డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
▪️డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
▪️చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.
#స్థానికసంస్థ
#ఎన్నికలు

11/09/2025

*పోఖరా నుంచి ఖాట్మండూ బయలుదేరిన తెలుగు పౌరులు*

అమరావతి: మంత్రి లోకేష్ చొరవతో నేపాల్ లోని పోఖరా నుండి 10మంది తెలుగుపౌరులు మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రత్యేక విమానంలో ఖాట్మండూ బయలుదేరారు. వారంతా 1:15 గంటలకు ఖాట్మండూ చేరుకుంటారు. ఈ మధ్యాహ్నం ఖాట్మండూ నుంచి విశాఖ బయలుదేరే ఇండిగో విమానంలోనే వారిని కూడా రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాట్మండూ నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆర్ టి జి ఎస్ వార్ రూమ్ నుంచి మంత్రి లోకేష్ నిర్వహించిన సమీక్షలో డిల్లీ లోని ఏపీ భవన్ ప్రత్యేకాధికారి అర్జా శ్రీకాంత్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, బండిరెడ్డి రాము, సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, కోన శశిధర్, కాటంనేని భాస్కర్, కృతిక శుక్లా, అజయ్ జైన్, నారాయణ భరత్ గుప్తా, ప్రఖర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా నేపాల్ నుండి రాష్ట్రానికి రాబోతున్న వారికి స్వాగతం పలికేందుకు కూటమి ప్రజా ప్రతినిధులు ఆయా ఎయిర్ పోర్టులకు చేరుకుంటున్నారు.
#టీడీపీ

10/09/2025

🔴💥*14 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..*

రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు..

గుజరాత్‌, రాజస్థాన్‌, అసోం, మేఘాలయ, బిహార్‌.. నాగాలాండ్ మణిపూర్‌, మిజోరం, త్రిపురలో వర్షాలు..

బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..

Address


Alerts

Be the first to know and let us send you an email when Amaravathi Journal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amaravathi Journal:

  • Want your business to be the top-listed Media Company?

Share