బంగారు తెలంగాణ ప్రచార కమిటి

  • Home
  • బంగారు తెలంగాణ ప్రచార కమిటి

బంగారు తెలంగాణ ప్రచార కమిటి నా తెలంగాణ కోటి రతనాల వీణ...
(1)

18/09/2023




29/07/2023

సమాధానం చెప్పండి...

30/04/2023

నూతన సచివాలయం సంబరాల్లో బాణాసంచా వెలుగులు తప్పక చూడాల్సిందే..|| Telangana New Secretariat Night View

02/01/2023

10/12/2022
03/12/2022

Namaskar, Namaste or Namaskaram is a greeting gesture since ancient days in Bharat.

Recently! entire world also accepted its the most healthy method to greet.

We have been practicing this and teaching our students, the age old concepts of this land.

29/11/2022

ఆరు దశాబ్దాల తెలాంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఆపూర్వ ఘట్టం. సబ్బండ వర్గాలని ఏకం చేసిన దీక్ష.
ప్రాణాలకి తెగించి కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహారదీక్ష.
దీక్షా దివస్ నవంబర్ 29.

25/10/2022

https://youtube.com/shorts/lcqHpuduMNg?feature=share
చేనేత పై GST పూర్తిగా ఎత్తివేయాలనికేంద్రాన్ని డిమాండ్ చేస్తూ... తీర్మాణం.. || KCR Demands No GST..

22/10/2022

రంగారెడ్డి జిల్లా, మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి శ్రీ కేటీఆర్.

మంత్రి మాట్లాడుతూ...

భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రెండవ అతిపెద్ద రంగం టెక్స్‌టైల్‌ రంగం.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్నప్పుడే పద్మశాలి ఇంట్లో చదువుకున్న వ్యక్తి. అందుకే ఆయనకి చేనేతల పట్ల ప్రత్యేక ప్రేమ.

2002లో భూదాన్ పోచంపల్లిలో 8 మంది చేనేత కార్మికులు చనిపోతే జోలె పట్టి సహాయం చేసిన వ్యక్తి కేసిఆర్

సిరిసిల్లలో నేతన్నలు 9 మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు చలించిపోయి కన్నీళ్లు పెట్టిన వ్యక్తి కేసిఆర్

అప్పటి ముఖ్యమంత్రికి వారిని ఆదుకోవాలని ఉత్తరం రాస్తే స్పందించకపోవడంతో.. పార్లమెంటు సభ్యునిగా 50 లక్షల రూపాయలు సిరిసిల్ల నేతన్నలకు సహాయం చేశారు. నేతన్నల కన్నీళ్లు, కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 70 కోట్ల టెక్స్‌టైల్‌ బడ్జెట్ ను 1200 కోట్లకు పెంచారు.

ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగం కోసం 5,752 కోట్లు కేటాయించింది. కానీ 70 సంవత్సరాలలో గత ప్రభుత్వాలు ఇందులో 10 శాతం కూడా ఖర్చు చేయలేదు

ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నేతన్నలను పిలిచి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

చేనేతలకు ఏమైనా సబ్సిడీ ఉందా అని ఆరోజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 40% యార్న్ సబ్సిడీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం.

ఈ కార్యక్రమం వ్యక్తిగతంగా చేనేత కార్మికులకు లబ్ధి చేకూరాలని లక్ష్యంతో ఏర్పాటు చేశాం

ఒక్క రూపాయి మీరిస్తే రెండు రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ప్రత్యేకంగా నేతన్నకు చేయూత పొదుపు పథకాన్ని ప్రారంభించాం. 26 వేల మంది కార్మికులకు కరోనా కాలంలో దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను ముందుగానే విడుదల చేశాము.

ఈ ప్రభుత్వం నేతన్నలు తెచ్చిన ప్రభుత్వం. వారి సంక్షేమం కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపడతాం.

నిజమైన కార్మికుడికి లబ్ధి జరగాలన్న ఏకైక లక్ష్యంతోనే మగ్గాల జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టాము.

రాష్ట్రంలో ఇంకా ఎవరైనా కార్మికులు మిగిలిపోతే మరోసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం.

రైతుబంధు, రైతు బీమాను దేశంలో ఎవరు ఆలోచించనప్పుడే ఇక్కడ కేసీఆర్ గారు ప్రారంభించారు. అదేవిధంగా నేతన్నకు బీమా కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాం. ఎవరైనా నేత కార్మికుడు దురదృష్టవశాత్తు చనిపోతే వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయలను వారి కుటుంబాలకు అందజేస్తున్నాం.

ఇప్పటికే 40000 కు పైగా కార్మికులు ఈ కార్యక్రమంలో చేరారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వెంటనే చేరాలని విజ్ఞప్తి చేస్తున్న. ఇందుకు మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం.

ఒక చేనేత సమీకృత కేంద్రాన్ని నారాయణ పేట్ లో ఏర్పాటు చేస్తున్నాం. నల్గొండ జిల్లాలోని కొయ్యలగూడెం, పుట్టపాక వంటి చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అవుతున్న పట్టుచీరల అమ్మకానికి ప్రత్యేక మార్కెటింగ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తాం.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద ఒక అవార్డుని కూడా ప్రభుత్వం నెలకొల్పింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హార్టికల్చర్ యూనివర్సిటీకి సైతం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాం.

ఏ జలదృశ్యంలో అయితే అప్పటి ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించిందో.. అక్కడే ఒక అద్భుతమైన బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించాం.

హైదరాబాద్ లోని కోకాపేటలో ఖరీదైన స్థలాన్ని పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి ఇచ్చాము. త్వరలోనే ఈ భవన నిర్మాణాన్ని పూర్తిచేసి అప్పజెప్తాం.

ఒరిస్సా నుంచి వచ్చిన ఆ రాష్ట్ర టెక్స్టైల్ శాఖ మంత్రి రీతా సాహూ మన రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రశంసలు అందించారు. ఇంత చక్కటి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కార్యక్రమాలను ఒరిస్సాలో ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

ఇలా అనేక రాష్ట్రాల నుంచి మన కార్యక్రమాలకు పథకాలకు అభినందనలు అందుతున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం నేతన్న సంక్షేమానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నారు.

జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు, జాతీయ పవర్లూమ్ బోర్డు, నేతన్నల పొదుపు పథకం రద్దు నేతన్నల భీమా పథకం రద్దు.. ఇలా అన్నింటిని రద్దు చేస్తోంది.

మహాత్మా గాంధీ చెప్పిన మాటలకు విరుద్ధంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో 14 మంది ప్రధాన మంత్రులు చేయని దుర్మార్గాన్ని నరేంద్ర మోడీ చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారి చేనేతల పైన ఐదు శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్న నేతన్నలను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ దేశవ్యాప్తంగా ఎన్నో విజ్ఞప్తులు వచ్చినా ప్రధానమంత్రి స్పందించలేదు.

అందుకే కేంద్ర ప్రభుత్వం చేనేత మీద ఐదు శాతం జీఎస్టీ రద్దు చేయాలంటూ ప్రధానమంత్రి కి లేఖ రాస్తున్నాను.
రాష్ట్రంలోని నేతన్నలంతా లక్షలాదిగా ప్రధానమంత్రికి ఈ మేరకు ఉత్తరాలు రాయాలి. ఈ మేరకు ప్రధానమంత్రికి భారీగా ఉత్తరాలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం అప్పుడైనా చేనేతల పైన పన్ను రద్దు చేస్తూందేమో.

ఈ మధ్య దినపత్రికలో శ్రామికులుగా పోయి.. పారిశ్రామికులుగా తిరిగి వచ్చారు అనే శీర్షికతో తెలంగాణాలో టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ నుండి వలస వెళ్లిన వారు తిరిగివచ్చారని వార్త చదివినప్పుడు గర్వంగా అనిపించింది. ఇది మనందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధి విషయంలో సరైన మార్గంలో పోతున్నది అనడానికి ఇదొక ఉదాహరణ.

నేతన్నల సంక్షేమం కొసం తెలంగాణ అడిగిన ఏ ప్రతిపాదనకు కేంద్రం నుంచి స్పందన లేదు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్ కు కేంద్రం మొండిచేయి చూపింది. హైదరాబాద్ నగరంలో నేషనల్ టెక్స్‌టైల్‌ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే స్పందన లేదు. హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే స్పందన లేదు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని కోరితే ఉలుకూ పలుకూ లేదు. పెద్ద ఎత్తున బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కోరితే స్పందన లేదు.
నారాయణపేటలో స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హ్యాండ్లూమ్ పార్క్ పెడతామన్నారు. నాలుగేళ్లయినా దానికి దిక్కులేదు.

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వలన బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల కన్నా వస్త్ర ఉత్పత్తిలో బాగా వెనుకబడి ఉన్నాం.

ఏ ప్రభుత్వం అయితే నేతన్నల కోసం పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత నేత కార్మికుల పైన ఉన్నదని కోరుతున్నాను.

సొంత జాగా ఉండి అర్హులైన నేత కార్మికులందరికీ.. ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలను ఇచ్చే బాధ్యత నాది.

మా ప్రభుత్వం అనేక కొత్త పథకాలు సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చింది. కరోనా లాంటి కష్టకాలంలో మీ వెంట నిలబడ్డది. అలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం మరియు బిజెపి యొక్క అసత్యాలను అబద్ధాలను నమ్మితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టెక్స్‌టైల్‌ రంగం మరోసారి సంక్షోభంలోకి పోతుందని నేత కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా.

05/10/2022

https://youtu.be/U4-Gx1-WsWg
TRS నుండి BRS (భారత్ రాష్ట్రీయ సమితి) గా స్వయంగా ప్రకటించిన KCR.. || Barath Rastriya Samithi ||

TRS to BRS
05/10/2022

TRS to BRS

తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.💐
03/10/2022

తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.💐

నారాయణగూడ టెస్కో కార్యాలయంలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ హ...
28/09/2022

నారాయణగూడ టెస్కో కార్యాలయంలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ హరీష్ రావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్.

హాజరైన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు.

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి, సంస్థకు మంచిపేరు తేవాలని మంత్రులు ఆకాక్షించారు. శుభాకాంక్షలు తెలిపారు.

26/09/2022

బాసర ట్రిపుల్ ఐటీలో KTR కి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు.. సమస్యలు 2 నెలల్లో పరిష్కారానికి KTR హామీ..
#బంగారు_తెలంగాణ_ప్రచార_కమిటీ
https://youtu.be/XFfEgGEEUF0

26/09/2022

ఎటు చూసినా బతుకమ్మ...

అమ్మతో బతుకమ్మ😊😊సబ్బండ వర్ణాల పండుగ సద్దుల‌ బతుకమ్మ శుభాకాంక్షలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క....!! రాష్ట్ర ప్రజలందరికీ...
25/09/2022

అమ్మతో బతుకమ్మ😊😊

సబ్బండ వర్ణాల పండుగ సద్దుల‌ బతుకమ్మ శుభాకాంక్షలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క....!!

రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీకైన 'బతుకమ్మ' పండుగ శుభాకాంక్షలు.ఇంటిల్లిపాదీ ఏకమై,ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ.ఆదివారం నుండి తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ఘనంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణం.బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ గారు పుట్టింటి కానుకగా కోటికి‌ పైగా చీరలను అందిస్తూ మహిళలకు గొప్ప గౌరవాన్ని అందిస్తున్నారు....

తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను కేవలం మన రాష్ట్రంలోనే గాక, దేశ విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలంతా వారి ప్రాంతంల్లో ఘనంగా నిర్వహిస్తూన్నారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎనిమిది దేశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాను. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో,ముంబై లాంటి కీలక నగరాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది....

- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క

Kalvakuntla Kavitha Kalvakuntla Kavitha Office

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...
25/09/2022

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...

పండుగలు మత సామరస్యానికి వేదిక కావాలి...భారతీయులం ఐక్య మత్యంగా ఉండాలి... జై తెలంగాణ   #బంగారు_తెలంగాణ_ప్రచార_కమిటీ
23/09/2022

పండుగలు మత సామరస్యానికి వేదిక కావాలి...
భారతీయులం ఐక్య మత్యంగా ఉండాలి..
. జై తెలంగాణ
#బంగారు_తెలంగాణ_ప్రచార_కమిటీ

Address


Alerts

Be the first to know and let us send you an email when బంగారు తెలంగాణ ప్రచార కమిటి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to బంగారు తెలంగాణ ప్రచార కమిటి:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share