Eluru News Online

  • Home
  • Eluru News Online

Eluru News Online ఏలూరుకి సంబంధించి ఎప్పట్టికప్పుడు వార్తులు తెలుసుకోవడంకోసం మన ఏలూరున్యూస్ ఆన్లైన్ పేజ్ ఫాలో చెయ్యండి.

19/02/2024

*సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఫేక్ న్యూస్ ఖండన*

అమరావతి, ఫిబ్రవరి 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూలు ట్రోల్ అవ్వడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఖండిస్తున్నది. ఇది ఉత్త ఫేక్ న్యూస్ అని, ఈ ఫేక్ న్యూస్ తో తమ కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేయడం జరిగింది.

*(పి ఆర్ ఓ, సి ఇ ఓ కార్యాలయం,ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారిచే జారీ)*

19/02/2024

ఏలూరు
రాష్ట్రం లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైన పాలన సాగుతోందని ఏలూరు నియోజక వర్గ టి డి పి ఇంచార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) విమర్శించారు.సోమవారం ఏలూరు లో బడేటి క్యాంపు కార్యసలయం లో
జరిగిన ప్రెస్ మీట్ లో బడేటి వై సి పి పాలన పై తీవ్ర విమర్శలు చేసారు.అనంతపురం లో జరిగిన సిద్ధం సభలో సి ఎం జగన్మోహన్ రెడ్డి టి డి పి జనసేన పార్టీ గుర్తులపై చేసిన విమర్శలను బడేటి తిప్పి కొట్టారు.సైకిల్ తొక్కితే ఆరోగ్యం వస్తుందని. గ్లాస్ లో టీ తాగితే జోష్ వస్తుందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో ప్యాన్ రెక్కలు విరిగిపోతే పక్కన పడేస్తారని సి ఎం జగన్మోహన్ రెడ్డి
గుర్తు పెట్టుకోవాలి బడేటి చంటి గుర్తు చేశారు.రాష్ట్రం లో చంద్రబాబు నాయుడు పాలనలో చేసిన అభివృద్ధి పై చంద్రబాబు సెల్పీ చాలంజ్ లు చేశారని అభివృద్ధి పై బహిరంగ చర్చకు జగన్ సిద్దామా అంటూ బడేటి సవాల్ విసిరారు.రాప్తాడు లో జరిగిన సిద్ధం సభకు వచ్చిన జనం పారిపోతుంటే ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్ పై
వై సి పి మూకలు మూకుమ్మడి దాడి చేయడం దుర్మార్గమన్నారు.యుద్దానికి వై సి పి సిద్ధం అయితే టి డి పి జనసేన లు కూడా సంసిద్ధమే అంటూ సి ఎం జగన్ కు బడేటి బహిరంగ సవాల్ విసిరారు.

19/02/2024

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ "శంఖారావం" - అనకాపల్లి నియోజకవర్గం.

యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏలూరు లో 06-03-2024 నెలలో  Computer Tally and MS Office పై 30 రోజులు ఉచిత శిక్షణ మొదలు అవుతుం...
19/02/2024

యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏలూరు లో 06-03-2024 నెలలో Computer Tally and MS Office పై 30 రోజులు ఉచిత శిక్షణ మొదలు అవుతుంది. భోజనం హాస్టల్ వసతి పూర్తిగా ఉచితం తెలిసినావల్లుకు తెలియచెయ్యండి 👏 మీ whatsapp ద్వారా అందరికి షేర్ చెయ్యండి నేర్చు కునే వాళ్ళు పేరు ను క్రింద వున్నా లింక్ ద్వారా 👉 https://forms.gle/xkYBNP1UKAbN6Gfz6 మీ పేరు ను రిజిస్టర్ చేసుకోండి.
Cell No. 9948565256

19/02/2024

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ "శంఖారావం" - అనకాపల్లి నియోజకవర్గం.

*పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి*  *జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్* ఏలూరు,ఫిబవరి 19 : జిల్లాలో మార్చి 18...
19/02/2024

*పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి*

*జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్*

ఏలూరు,ఫిబవరి 19 : జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి 30 వ
తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని
చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్
సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎటువంటి పొరబాట్లు దొర్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కు జరగకుండా పక్డ్బంది గా చర్యలు తీసుకోవాలన్నారు.

గత ఏడాది అనుభవాలతో ఈసారి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప విద్యార్థులతో పాటు టీచర్స్ కూడా సెల్ ఫోన్లు తీసుకురాకుడదని నిర్ణయిoచడం జరిగిందన్నారు.
జిల్లాలో 139 పరీక్షా కేంద్రాలను ముందుగానే తనిఖీ చేయాలని సూచిస్తూ, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ చెప్పారు. పరీక్ష కేంద్రం లోకి సెల్ ఫోన్లు,లాప్ టాప్ లు,కెమెరా లు, ఇ యర్ ఫోన్లు, స్పీకర్స్,స్మార్ట్ వాచ్ ల్లు, బ్లూ టూత్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమంతించబడవన్నా రు.

సమావేశంలో ముందుగా జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం ఎస్ ఎస్ సి మార్చి 2024 పరీక్షలకు
సంబంధించిన నివేదికను కలెక్టర్ కు సమర్పించారు. జిల్లాలో 10 వ తరగతి పరీక్షలకు మొత్తం 32,355 మంది హాజరుకానున్నారని, వీరిలో 16,760 మంది బాలురు, 15,595 మంది బాలికలు ఉన్నారని వీరిలో రెగ్యులర్ విద్యార్థినీ విద్యార్థులు 24,125 కాగా ప్రైవేట్ విద్యార్థిని విద్యార్థులు 8,230
మొత్తం సంఖ్య 32,355 మంది హాజరు కానున్నారన్నారు. పరీక్షల
నిర్వహణకు జిల్లాలో 139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 139 మంది చొప్పున చీఫ్ సూపరిండెంటెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను
నియమించామన్నారు. పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్ల
నియామిక ప్రక్రియ చేస్తున్నామన్నారు.పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్ధులను ఉదయం 8.45 నుంచి 9.30 కేంద్రాల్లోకి
అనుమతిస్తామన్నారు. ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన వారిని కేంద్రంలోకి అనుమతించేది
లేదని స్పష్టం చేశారు.

సమావేశంలో ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, అడిషనల్ ఎస్పీ జి.స్వరూప రాణి సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

19/02/2024
ఈరోజు రైతు బజార్ లో కూరగాయల ధరలు
19/02/2024

ఈరోజు రైతు బజార్ లో కూరగాయల ధరలు

18/02/2024

జిజేపి ఏలూరు పార్లమెంటు అభ్యర్థి గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన చౌదరి) ప్రచారంలో వినూత్నంగా దూసుకుపోతున్నారు.ఏలూరు కాన్స్టెంసీలో పలు గ్రామాల్లో జబర్దస్త్ టీం తో కామిడీ స్కిట్స్ చేస్తూ తపనా చౌదరి చేస్తున కార్యక్రమాలు, సేవలు గురించి వివరిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంక్కన్నగూడెం, పినకడిమి, చొదిమెళ్ళ పరిసర గ్రామాల్లో కామెడీ స్కిట్స్ చేస్తూ తపన చౌదరి గురించి వివరిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

These students, who've spent most of their school days at Siddhartha Quest, are living proof of the value of holistic ed...
18/02/2024

These students, who've spent most of their school days at Siddhartha Quest, are living proof of the value of holistic education. It's a reminder that nurturing all aspects of a child's growth is far more valuable than the rigid, pressure-filled rote learning often seen in corporate-driven schooling. What's more, they achieved this without any specialized IIT classes, highlighting the breadth and depth of their well-rounded education.

💐💐💐💐👏👏👏👏👏👏👏

18/02/2024

జగన్ సర్కార్ అరాచకంపై నారా లోకేష్ "శంఖారావం" - విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం

18/02/2024

జగన్ సర్కార్ అరాచకంపై నారా లోకేష్ "శంఖారావం" - విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 2024-02-18

18/02/2024

public meeting at Raptadu in Anantapur District || Siddham Sabha

18/02/2024

జగన్ సర్కార్ అరాచకంపై నారా లోకేష్ "శంఖారావం" - విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం

మన ఏలూరు యువకుడు దుర్గా దేవి నాయుడు చిన్ని మార్కండేయులు గారి అబ్బాయి గత పది సంవత్సరాలుగా సినిమానే నమ్ముకుని ఎన్నో కష్టాల...
18/02/2024

మన ఏలూరు యువకుడు దుర్గా దేవి నాయుడు చిన్ని మార్కండేయులు గారి అబ్బాయి గత పది సంవత్సరాలుగా సినిమానే నమ్ముకుని ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని డైరెక్షన్ మరియు హీరో "ప్రవీణ్ IPS" పేరుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్.. మన ఏలూరు విజయలక్ష్మి థియేటర్లో ప్రదర్శన పడుతుంది

ఐపీఎస్‌ అధికారిగా ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు తెరలేపి.. ముఖ్యంగా గురుకులాల్లో చైతన్యవంతమైన మార్పులు తీసుకొచ్చిన బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్‌...

చాలా చాలా ముఖ్యమైన మాట :
అందరికీ నచ్చేవిధంగా ఎంతో కష్టపడి తీసిన సినిమా ప్రతి సన్నివేశం చాలా అందంగా చిత్రీకరించారు మనసు హత్తుకునేటట్లు ఉంది...అన్నీ కళ గా మలిచి మైమరిపించిన సినిమా... యువత తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు యువతరాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది....

*రేపే వైసీపీ మేనిఫెస్టో.. AP: అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు వైసీపీ నిర్వహిస్తోన్న సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల...
17/02/2024

*రేపే వైసీపీ మేనిఫెస్టో..

AP: అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు వైసీపీ నిర్వహిస్తోన్న సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. వృద్ధులు, వితంతువుల పెన్షన్లను రూ.4వేలకు పెంచడంతోపాటు రైతు రుణమాఫీ అంశాలు అందులో ఉంటాయని వార్తలు వస్తున్నాయి. అలాగే మహిళల కోసం సరికొత్త పథకాలను ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మేనిఫెస్టోపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది

ఏలూరు జిల్లా :ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం రత్నాపురం గ్రామంలో దళితుల భూ వివాదంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్  మాముడూ...
17/02/2024

ఏలూరు జిల్లా :
ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం రత్నాపురం గ్రామంలో దళితుల భూ వివాదంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ మాముడూరి విక్టర్ ప్రసాద్ శనివారం సాయంత్రం సందర్శించారు. భూ వివాదం పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏలూరు ఆర్డీవో, డిఎస్పీ లకు ఆదేశాలు జారీ చేశారు.

17/02/2024

Lock Down సమయంలో నిర్మానుష్యం గా మారిన ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి పాతబస్టాండ్ వరకు పాతవీడియో

17/02/2024

పర్చూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి "రా... కదలిరా" బహిరంగసభ. #రాకదలిరా..

17/02/2024

పర్చూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి "రా... కదలిరా" బహిరంగసభ. #రాకదలిరా..

ఏలూరు జిల్లా.... ఏలూరుజిల్లా:దెందులూరు జాతీయ రహదారిపై  రోడ్డు ప్రమాదం..సామర్లకోట నుంచి వరంగల్ వెళుతున్న కారు ఆగి ఉన్న లా...
17/02/2024

ఏలూరు జిల్లా....



ఏలూరుజిల్లా:
దెందులూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

సామర్లకోట నుంచి వరంగల్ వెళుతున్న కారు ఆగి ఉన్న లారీ ను ఢీ కొట్టడం తో ముగ్గురికి తీవ్ర గాయాలు...

క్షతగాత్రులను 108 వాహనంలో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలింపు

16/02/2024

ఏలూరు జిల్లా:

ఏలూరు టుటౌన్ పరిధి వసంతమహల్ సెంటర్లో నిన్న అర్ద రాత్రి మితిమీరిన వేగంతో బైక్ ను ఢీకొట్టి వెళిపోయిన గుర్తుతెలియని‌ కారు...

బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకి గాయాలు...

క్షతగాతృలని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు..

తీవ్రగాయాలై రోడ్డుమీద పడిన యువకులని కనీసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయకుండా ఓల్డ్ బస్టాండు వైపుకు దూసుకుపోయిన కారు..

కేసునమోదు చేశి CCకెమేరా దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్న టుటౌన్ పోలీసులు..

16/02/2024

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ "శంఖారావం" - గజపతినగరం నియోజకవర్గం

16/02/2024

*ఎంప్లాయిస్ గ్రీవెన్స్ లో 14 అర్జీలు స్వీకరణ*

*జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న* *వెంకటేష్*

ఏలూరు,ఫిబ్రవరి 16:ఉద్యోగులు మరింత స్వేచ్ఛగా,సమర్థవంతంగా పనిచేయడానికి ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు.

శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉద్యోగుల నుండి విజ్ఞాపనలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఉన్న సర్వీస్ సమస్యలు పరిష్కారం అయితే వారు మరింత స్వేచ్ఛాయుత వాతావరణంలో పని చేయడానికి దోహదపడుతుందన్నారు. ఉద్యోగుల సర్వీసు మేటర్స్, పెన్షన్ సమస్యలు, ఆర్థికపరమైన అంశాలు, క్రమశిక్షణ కేసులు, తదితర సమస్యలపై విజ్ఞాపనలను ఉద్యోగుల గ్రీవెన్స్ నందు అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయా శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. ఈరోజు నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో *14దరఖాస్తులను స్వీకరించడం* జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి. పుష్పమణీ, కలెక్టరేట్ ఏవో కె. కాశీ విశ్వేశ్వరరావు ఉన్నారు.

Address


Telephone

+919393939659

Website

Alerts

Be the first to know and let us send you an email when Eluru News Online posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share