07/11/2024
#మొగలుల కట్టడాలు కూలుతున్నాయి
#ఆగ్రా అంటే తాజ్‌మహల్ గుర్తుకు వస్తుంది. కానీ మొగల్ వంశ స్థాపకుడు బాబర్ కుమార్తె జుహారా మహల్ కట్టించినట్టు చెప్పే మూడు అంతస్తుల కట్టడం కూడా అక్కడ ఉంది. కానీ ప్రతీది తాజ్‌మహల్ అంత ప్రసిద్ధి లోకి రాలేదు.
ఇంతకీ ఈ మూడు అంతస్తులలో రెండు అక్టోబర్ 27వ తేదీన హఠాత్తుగా కూలిపోయాయి. ఈ కట్టడాన్ని అక్కడ జోరా బాగ్ అని పిలుస్తారు. ఇది ఒక పార్కు వంటి విహార కేంద్రం.
కేంద్ర పురావస్తు పరిశోధక శాఖ రక్షణలో ఉన్న కట్టడాలలో ఒకటి. నిజానికి దీనికి మరమ్మతులు చేయాలని #పురావస్తు శాఖ ప్రణాళికలు తయారు చేసిన తరుణంలో కూలిపోయింది. పురావస్తు శాఖ ఉన్నతాధికారి రాజ్‌కుమార్ పటేల్ శిథిలాలను పరిశీలించి వచ్చారు. మొదట జోరా బాగ్‌కు దారి ఏర్పరచాలని అనుకున్నారు. అక్కడికి చేరాలంటే చిని కా రౌజా అనే ప్రాంతం చుట్టూ తిరిగి వెళ్లాలి. మొదట బాగ్‌కు నేరుగా దారి ఏర్పరిచే పనులు ప్రారంభించారు. కానీ ఇంతలోనే ఆ కట్టడం కాస్తా కూలింది. వర్షం నీరు కారణంగా ఈ కట్టడం కూలి ఉంటుందని భావిస్తున్నట్టు పటేల్ తెలియచేశారు. అయినా ఇప్పుడు మళ్లీ పాత నమూనాలోనే ఆ కట్టడాన్ని పునరుద్ధరించే పనిలో పురావస్తు శాఖ ఉన్నది.
1526 ప్రాంతంలో కట్టిన జోరా బాగ్ #యమునా తీరంలో చిని కారౌజ్ అనే ప్రాంతానికి, జవహర్ బ్రిడ్జ్‌కి నడుమ ఉంది. దీనిని మినీ కాబూల్ అని పిలుస్తారు. నిజానికి ఆగ్రాలోని అనేక మొగలుల కాలం నాటి కట్టడాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. చరిత్రాత్మక ఎత్మద్ ఉద్ దౌలా, రాంభాగ్ అనే కట్టడాలు కూడా వర్షాల కారణంగా ఒరిగి పోయాయి.
ఆఖరికి #తాజ్‌మహల్ చుట్టూ ఉండే గోడలు కూడా కొన్ని కూలాయి. సికింద్రా అనే ప్రాంతంలో ఉన్న 500 సంవత్సరాల నాటి ఒక మసీదు కూడా కూలిపోయింది.