Nuzvid Mirror

  • Home
  • Nuzvid Mirror

Nuzvid Mirror Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nuzvid Mirror, Media/News Company, .

కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాల లోని గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రమే 18 సంవత్సరాల నుండి 45 వయసు గల యువకులకు మాత్రమే...
20/04/2023

కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాల లోని గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రమే

18 సంవత్సరాల నుండి 45 వయసు గల యువకులకు మాత్రమే.

C. C. కెమెరా installation &repaing లో శిక్షణ -13 రోజులు

మొబైల్ repairing లో శిక్షణ 30 రోజులు.

18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల ఆడవారికి టైలరింగ్ లో శిక్షణ

శిక్షణ అనంతరం మెషిన్ ఉచితంగా ఇవ్వబడును.

Car driving,జ్యూట్ బాగ్స్ తయారీలో కూడా శిక్షణ ఇవ్వబడును.

పై శిక్షణలు అన్నీ కూడా పూర్తిగా ఉచితం.

దూర ప్రాంతాల వారికి ఉచిత హాస్టల్ and ఉచిత భోజన సదుపాయం కలదు.

శిక్షణ తర్వాత MORD(Ministry Of Rural Devolopment) ద్వారా certificate ఇవ్వబడును.

మరిన్ని వివరాలకు సంప్రదించండి

రామకృష్ణ

9398804633

17/04/2023
17/04/2023

వైసిపి ఎమ్మెల్యే మేక ప్రతాప్ కి గాని, వాళ్ల పార్టీ కార్యకర్తలకు కాని నాయకులకు కానీ ముసునూరు మండలం లో ఉన్న ఇసక అక్రమ రవాణాలో గాని ఫారెస్ట్ భూములు అమ్మకాల్లో గాని ఏ విధమైన సంబంధం లేదు అని ఏ గుడిలో అయినా చర్చిలో అయన మసీదులో అయినా ప్రమాణం చేయగలే దమ్ము ఉందా అని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గద్దే రఘు సవాల్ చేయడం జరిగింది.. దశలవారీగా మద్యపానం నిషేధం చెప్పిన ఈ ప్రభుత్వం ముసునూరు మండలంలో నూతనంగా మూడో బ్రాందీ షాపును ఏర్పాటు చేసిందని ముసునూరు మండలంలో 2019 ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు వారిచ్చిన కానుక అని ఏదేవా చేశారు...

ఏలూరు : ఉద్యోగాల పేరుతో వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడి మోసం - నిరుద్యోగులకు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు అనుచరుడు అల్లామ్ టోకర...
16/06/2022

ఏలూరు : ఉద్యోగాల పేరుతో వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడి మోసం - నిరుద్యోగులకు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు అనుచరుడు అల్లామ్ టోకరా - రైల్వేలో ఉద్యోగాల పేరుతో 15 మంది నుంచి రూ.14 లక్షలు వసూలు - మున్సిపల్ వైస్‍చైర్మన్ కొడుకు ఖాతాలో డబ్బు జమ చేసిన బాధితులు - రూ.14 లక్షలు వసూలు చేసి దుబాయ్ పారిపోయిన వైసీపీ నేత అల్లామ్ - నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు - కేసు నమోదు చేయకుండా పోలీసుల రహస్య విచారణ

16/06/2022

నూజివీడు పట్టణం ఎంప్లాయిస్ కాలనీకి చెందిన మార్పు త్రినాథ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అనుచరుడిగా చెప్పుకునే అలామ్ అహ్మద్ అక్షరాల 13 లక్షల రూపాయలు స్వాహా చేసి ఉడాయించిన ఘటన గురువారం రాత్రి వెలుగు చూసింది. బాధితుడు త్రినాథ్ కథనం మేరకు కేడీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, క్లర్క్ పోస్టులకు గత ఏడాది ఆగస్టు 3వ తేదీన ఎగ్జాం రాసినట్లు పేర్కొన్నాడు. ఈ ఎగ్జామ్ కు సంబంధించి గత ఏడాది జనవరిలో నోటిఫికేషన్ పడిన సందర్భంలో సీఎం చంటి ద్వారా అహ్మద్ పరిచయం ఏర్పడిందని, రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలను చూపి మాయ చేసినట్లుగా బాధితుడు వాపోయాడు. గత ఏడాది సీఎం చంటి గా పిలిపించుకునే త్రిబుల్ ఐటీ అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న చంటి ఉద్యోగం ఇప్పిస్తానని 13 లక్షలకు బేరం కుదిర్చాడు. ఫిబ్రవరి 21 తేదీన 30 వేల రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. కేడీసీసీ చైర్పర్సన్ తన్నీరు నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టడంతో పోస్ట్ 15 లక్షలు గా పలుకుతున్నట్లు తనకు చెప్పారని బాధితుడు తెలిపాడు. వివిధ దశల్లో 3.81 లక్షలు ఇవ్వడం జరిగింది.
పోస్ట్ కు డిమాండ్ పెరగడంతో 20 లక్షలు పలుకుతుందని అహ్మద్ నమ్మబలికాడు. అంతకంటే తక్కువ లో ప్రభుత్వ ఉద్యోగాలు గా కారుణ్య నియామకాలు, లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి వాటిలో ఇప్పిస్తానని తెలిపాడు. బ్యాంకు అకౌంట్ల ద్వారా 6 లక్షలు,
నూజివీడు మున్సిపల్ ఫస్ట్ వైస్ చైర్ పర్సన్ షేక్ అమీరున్నిసా బేగం ఫోన్ పే కు 2.30 లక్షలు పంపినట్లు బాధితుడు త్రినాద్ తెలిపాడు. మరో ఫోన్ పే నెంబర్ కు 20 వేలు పంపినట్లు చెప్పాడు. పెట్టిన గడువు మేరకు 15 రోజులు మించిపోవడంతో పోస్ట్ విషయమై ప్రశ్నించగా కాలయాపన చేస్తూ నెలరోజులు గడిపినట్లు చెప్పాడు. ఈ విషయమై 15 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని బాధితుడు త్రినాథ్ వాపోతున్నారు.

తనపై ఫిర్యాదు చేసిన ప్రెస్ మీట్ పెట్టిన ఎవరూ ఏమీ చేయలేరని, పైగా నా అంతు చూస్తానని అహ్మద్ బెదిరించినట్లు గా బాధితుడు త్రినాథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

JanaSena Party Nuzvid NUZVID Cbnarmy Nuzvid Janasena Nuzvid Nuzvid TDP Nuzvid Nuzvid Nuzvid Janasena - Nuzvid JanaSena Nuzvid TDP Nuzvid Nuzvidu YSRCP MV Pratap Apparao Chanti Nayana

21/03/2022

*అమరావతి*

*రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డిపోల్లో సర్వర్ల సమస్య*

*ఈనెల 18 తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ*

*మూడు రోజులుగా పని చేయని సర్వర్లు*

*డిపోల వద్ద గంటల తరబడి వేచి ఉంటున్న ప్రజలు*

*రేషన్ పంపిణీ కి ఆటంకాలు*

*ఒక్కోకార్డుకు దాదాపు 30 నిమిషాలు పడుతున్న సమయం*

*సర్వర్ సమస్య ను పట్టించుకోని ఉన్నతాధికారులు*

*శని, ఆదివారం ప్రజల రద్దీ ఉన్నా...‌ పట్టించుకోరా అంటూ ప్రజల ఆగ్రహం*

శ్రీవారి భక్తులకు శుభవార్త..25 వేల టికెట్లు నేడు విడుదల!తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ ఆన్ ...
21/03/2022

శ్రీవారి భక్తులకు శుభవార్త..25 వేల టికెట్లు నేడు విడుదల!

తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఏకంగా..ఏప్రిల్ మాసానికి సంబంధించిన టికెట్లు, రేపు మే మాసం..ఎల్లుండి జూన్ మాసంకు సంభందించిన టికెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి.సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30 వేల చొప్పున.. గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకి 25 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. 3 నెలలకు సంభందించి 25 లక్షల టికెట్లు విక్రయం ద్వారా టిటిడి ఖజానాకు ఏకంగా రూ.75 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ఇక టీటీడీ పాలక మండలి.. తాజా ప్రకటన తో… భక్తులు ఫుల్‌ ఖుషీ లో ఉన్నారు. కాగా.. నిన్న శ్రీవారిని 72,265 మంది భక్తులు దర్శించుకు కోగా.. తలనీలాలు 34,517 మంది భక్తులు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం రూ.4.59 కోట్లకు చేరింది.

అప్పట్లో 20మద్యం బ్రాండ్లకు అనుమతి..ప్రస్తుతం రాష్ట్రంలో 300 బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి..ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన క...
21/03/2022

అప్పట్లో 20మద్యం బ్రాండ్లకు అనుమతి..

ప్రస్తుతం రాష్ట్రంలో 300 బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి..

ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడి..

విలేకరుల ప్రశ్నలకు దాటవేత ధోరణి

అమరావతి: రాష్ట్రంలో 2019-20లో 20 మద్యం బ్రాండ్లకు అనుమతిచ్చామని ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు.
తర్వాత ఏ బ్రాండుకూ అనుమతివ్వలేదని చెప్పారు. ప్రస్తుతం 76 మంది సరఫరాదారులకు చెందిన 300 మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 2020-21 మధ్య రాష్ట్రంలో 1.55 లక్షల మద్యం నమూనాలను పరీక్షించామని, వాటిలో ప్రాణాంతకమైనవి ఏమీ లేవని తేలిందని ప్రకటించారు. మొత్తం బ్రాండ్లలో వేటికి ఎప్పుడు అనుమతిచ్చారో జాబితా ఇవ్వాలని విలేకరులు అడగ్గా... ఇస్తామన్నారే తప్ప ఇవ్వలేదు. 2019 ఫిబ్రవరి తర్వాత కొత్తగా ఒక్క డిస్టిలరీ ఏర్పాటుకూ అనుమతివ్వలేదన్నారు. ఉన్న వాటిలో ఏవైనా చేతులు మారాయా? అనే విషయం వెల్లడించలేదు.

21/03/2022
21/03/2022

Address


Telephone

+919999999999

Website

Alerts

Be the first to know and let us send you an email when Nuzvid Mirror posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nuzvid Mirror:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share