27/06/2022
ఈరోజే "జనగామ అభివృద్ధి"పై జనగామ జిల్లా JAC ఆధ్వర్యంలో 'రౌండ్ టేబుల్' సమావేశం..
దివి. 27.06.2022 సోమవారం మ,, *2.00గం,,లకు* SRR డిగ్రీ కళాశాలలో *"జనగామ అభివృద్ధి"* పై జనగామ జిల్లా JAC ఆధ్వర్యంలో *'రౌండ్ టేబుల్'* సమావేశం..
*జనగామ జిల్లా అభివృద్ధి జనగామ ప్రజల హక్కు..*
*- జనగామ జిల్లా JAC..*
జనగామ జిల్లా 6 సం,, లు పూర్తి చేసినప్పటికి *జనగామ జిల్లా ఫలాలు ప్రజలకు అందకపోవడం ఎంతో బాధాకరం..*
జనగామ ప్రజల డిమాండ్స్..
*1* జనగామ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో *స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి..*
2. జనగామ జిల్లా ఉద్యమం భావితరాలకు తెలిసేలా *జిల్లా ఉద్యమ స్థూపం* ని ఉద్యమ చౌక్ లో ప్రభుత్వమే నిర్మించాలి..
*3*. జిల్లా ఏర్పడ్డాక జనగామ గుండాల మండలాన్ని వేరే జిల్లాలో కలిపి చిన్న జిల్లా చేసిన ప్రభుత్వం *జనగామ అర్బన్, జనగామ రురల్ మండలాలు, మరో 3 మండలలతో కలిపి 16 మండలాలు ఏర్పాటు చేయాలి..*
*4*. జనగామకి ప్రత్యేక *S.P. కార్యాలయం* లేకపోవడం వల్ల జిల్లా ఏర్పాటు చేసాక *Traffic police station* ఎత్తివేశారు.. Warangal కమిషనర్ పరిధిలో జనగామ పోలీస్ వ్యవస్థ ఉండటం ద్వారా *జనగామ ప్రజలు వరంగల్ కి వెళ్లాల్సి వస్తుంది*.. కావున *"జనగామ SP కార్యాలయం ఏర్పాటు చేయాలి".*
*5*. జనగామ జిల్లా కేంద్రానికి రూ. *100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలి..*
*6*. జిల్లా కేంద్రంలో మ్యూజియం, *అంబేద్కర్ ఆడిటోరియం,* క్రీడాకారుల ఉపయోగ పడేలా అధునాతన స్టేడియం ఏర్పాటు చేయాలి..
*7.* అనుమతులు వచ్చి నిర్మాణం నోచుకోని ప్రభుత్వ ITI, యూనివర్సిటీ PG కాలేజి, MLA క్యాంప్ ఆఫీస్ నిర్మాణాలు వెంటనే చేపట్టాలి..
*8.* జనగామ జిల్లా కేంద్రంలో *కేంద్రీయ విద్యాలయం* ఏర్పాటు చేయాలి..
*9. St.ఘనపురం, పాలకుర్తిలను మున్సిపాలిటీలుగా ప్రకటించాలి..*
*10.* ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు..
*11* . జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు సరైన పార్కు ఏర్పాటు కాలేదు.. *రంగప్ప చెరువు, బతుకమ్మ కుంటల* అభివృద్ధి, వార్డుల్లో మినీ పార్కుల ఏర్పాటు.. వెంటనే ప్రారంభించాలి..
*12. తెలంగాణ ఏర్పడ్డ నాటినుండి ఊరిస్తున్న జనగామ పూర్తి స్థాయి రింగు రోడ్డు.. నిర్మాణం..*
*13* . తెలంగాణ సాయుధ పోరాట కేంద్రమైన జనగామలో సాయుధ పోరాట యోధులు *నల్ల నర్సింహులు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య* ల స్మారక కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
*14* . బహుజన యుద్ధ వీరుడు *సర్వాయి పాపన్న గౌడ్* వీరత్వాన్ని తెలిపేలా *ఖిలా షాపురం కోట* ని పునఃనిర్మించాలి...
*15* . ఉగ్గు కథ పితామహుడు *చుక్క సత్తయ్య కళా క్షేత్రం* మణిక్యపురంలో ఏర్పాటు చేసి ఉగ్గు కళ అభివృద్ధి చేయాలి..
*16* . జీడికల్, పాలకుర్తి, చిలుపుర్, సిద్ధుల గుట్ట, చిటకోడూర్, బాణపురం దేవాలయాల అభివృద్ధికి నిధులు వెంటనే కేటాయించాలి..
*17* . ప్రపంచ ప్రఖ్యాత పెంబర్తిలో *కుల వృత్తుల నైపుణ్య అభివృద్ధి కేంద్రం* ఏర్పాటు చేయాలి..
*18* . అసంతృప్తిగా ఉన్న *మాడల్ మార్కెట్* కి నిధులు..
*19* . జనగామ జిల్లా ఆసుపత్రిలో *CT-SCAN, MRI, ఆంజియో గ్రామ్* సదుపాయాలు కల్పించాలి..
*20.* చంపకిల్స్, చిటకోడూర్ డ్యామ్ లను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి...
*21.* JUDA ( Jangaon Urban Development Authority) ఏర్పాటు చేసి జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి..
*22.* 50 సం,,ల చరిత్రగల జనగామ బస్టాండ్ ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా... జిల్లాస్థాయి బస్టాండ్ గా అభివృద్ధిపరిచి *వరంగల్ హైదరాబాద్ వెళ్లే ప్రతి బస్సు జనగామలో ఆగేలా* చర్యలు తీసుకోవాలి..
*23.* ఎలక్షన్ ప్రచారంలో జనగామ జిల్లాలో *ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల* ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు...
*24.* 2014 లో మొదటి అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించిన *పెంబర్తి వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్* జనగామ నిరుద్యోగ యువతకు ఇప్పటికీ అందని ద్రాక్షే...
*25.* ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నా జనగామలో *BC స్టడీ సర్కిల్* ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు..
*26.* 4సం,, ల క్రితం ప్రారంభం కావాల్సిన అధునాతన జిల్లా గ్రంధాలయ భవనం ఎప్పుడు..
*27.* జిల్లా పరిషత్(ZP) భవనం నిర్మాణం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు...
*28.* చంపకిల్స్ ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి, జనగామ చౌరస్తాలో బహుజన ఉద్యమ వీరుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి..
*-జై జనగామ*
*- జనగామ జిల్లా JAC*