Karthik Reddy

  • Home
  • Karthik Reddy

Karthik Reddy భారతదేశం నా ఆత్మ, హిందుత్వం నా ఊపిరి. Please Like, Follow our page and support us. Thank you.

తాను జీవించాలి అని తపనపడుతూ, భయంతో ఆర్తనాదాలు పెడుతున్న ఒక మూగ జీవిని కర్కశంగా హత్య చే‌సి దాని శవాన్ని ఆహారంగా వండుకుని ...
28/06/2024

తాను జీవించాలి అని తపనపడుతూ, భయంతో ఆర్తనాదాలు పెడుతున్న ఒక మూగ జీవిని కర్కశంగా హత్య చే‌సి దాని శవాన్ని ఆహారంగా వండుకుని మన నాలికను సంతృప్తి పర్చుకోవడం కంటే మన శరీరానికి, మనసుకు ఆరోగ్యాన్ని పంచే సాత్వికమైన శాఖాహారాన్ని తీసుకోవడం మంచిది కదా!?

శాఖాహారం మానవులకు సర్వ శ్రేష్ఠమైనది, అలాగే ప్రకృతి సహితమైనది 🙏
..
ప్ర) కౄర జంతువులు మరో జీవిని వేటాడి చంపి తింటాయి కదా మరి మనిషి మరో జీవిని చంపి తినడం ఎందుకు నేరం అవుతుంది?

జ- క్రూర జంతువు యొక్క శరీర నిర్మాణానికి అనుగుణంగా దాని ఆహార అవసరాల కోసం మాంసం పై సహజంగా ఆధారపడాలి. మాంసం అనేది దానికి Optional కాదు అది Definite Need. అదే మనిషి శరీర నిర్మాణంలో జీర్ణ వ్యవస్థకు మాంసం అనేది విరుద్దమైనది అందుకే పచ్చి మాం‌సాన్ని మనం తినలేం, కాల్చి వండుకుని మాత్రమే తినగలం. మనం సహజంగా మాంసాహారులం అయితే పచ్చి మాంసం తినగలిగే శరీర తీరు సహజంగా వచ్చేది. అయితే ఆది మానవుడు తొలుత మాంసాన్ని తిన్నాడు అని చెప్పే నేటి సైన్స్ పుస్తకాలు అన్నీ బూటకం, అవన్నీ మతిలేని వాడి తప్పుడు రాతలు. ఆదిమానవుడు పండ్లు, అలములు, దుంపలు మాత్రమే తిన్నాడు కానీ పరిణామం చెందుతున్న కొద్దీ ఎప్పుడైతే నిప్పుని కనుగొన్నాడో అప్పుడు జంతువులను వేటాడి కాల్చి తినడం ప్రారంభించాడు. ముఖ్యంగా గల్ఫ్ వంటి ఎడారి ప్రాంతాల్లో, ఐరోపా వంటి చలి ప్రాంతాల్లో ఆహారం దొరకని చోట మాంసం పై ఎక్కువగా ఆధారపడ్డాడు. కానీ భారత్ వంటి భూభాగాల్లో ఎన్నో ప్రకృతి వనరులు ఉన్న చోట సహజంగా నాగరిక జీవనానికి అలవాటు పడిన మానవ సమూహాలు వేల సంవత్సరాలుగా శాఖాహారాన్ని మాత్రమే ఆహారంగా తీసుకున్నాయి. ఒక జంతువు మరో జంతువుని ఆహారం కోసం మాత్రమే వేటాడి చంపి తింటాయి కానీ మానవుడు ఆకలితో కాకుండా కోరికతో, రుచి కోసం మాంసాన్ని తింటాడు. మనిషి తన నాలుకను సంతృప్తి పర్చుకోవడం కోసం దొరికిన ప్రాణులను అన్నింటినీ తినుకుంటూ వెళ్తే పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇక ఫార్మ్ లో పెంచే జంతువుల మాంసం తినడం వల్ల మనిషి ఆరోగ్యం పై ఎంత ప్రభావం పడుతుందో ఈరోజు మనం గమనిస్తున్నాం.

ప్ర) మరి చెట్లు సైతం ప్రాణులే కదా వాటిని తినడం కూడా తప్పే కదా?

జ- చర, అచర జీవులుగా రెండు విభాగాలుగా ప్రాణులు ఉంటాయి ఈ విశ్వంలో. అచర జీవులు అంటే కదలలేనివి. అందులో వచ్చేవి చెట్లు, మొక్కలు.. వీటి నిర్మాణం చర జీవులతో పోల్చి చూస్తే విభిన్నమైనదిగా ఉంటుంది. చర జీవి, అంటే కదిలే స్వభావం ఉన్న జీవిలో ఏ శరీర అంగాన్ని మనం వేరు చేసినా ఆ శరీర అంగం పునః సృష్టి కాలేదు. కానీ అచర జీవి అయిన చెట్టు మాత్రం ఒక చిన్న వేరు ఉన్నా చాలు మళ్లీ తనను తాను పూర్తిగా పునః నిర్మాణం చేస్కోగలదు. మనిషి చెట్టు ఫలాలను, ఆకులను, కొమ్మలను ఏ అవసరానికి వాడుకున్నా అవి పునః నిర్మితమౌతాయి. చెట్టు సహజ స్వభావమే ప్రకృతిలోని జీవులకు తనని తాను సమర్పించుకోవడం. మరియు అతిముఖ్యమైనది ఏంటంటే కదిలే జీవుల్లో ఉండే నాడీ వ్యవస్థ ఏదైతే బాధను, ఆనందాన్ని కలిగిస్తాయో అదే రకమైన నాడీ వ్యవస్థ అచర జీవుల్లో ఉండదు. ఫలం కానీ పుష్పం కానీ పత్రం కానీ ఇవి చెట్టు నుండి వేరు చేసినా మళ్లీ పునః సృష్టించబడుతాయి. కాబట్టి చెట్లు, మొక్కలు అందించే ఆహారాన్ని తీస్కోవడం ప్రకృతికి ఏ రకమైన హాని కలిగించదు.
..
ఈ విషయాలను మనం అర్ధం చేస్కోవడానికి ఏ మత గ్రంథాలు చదవనవసరం లేదు, కోరికలను పక్కనబెట్టి వివేకంతో ఆలోచిస్తే చాలు మనకు ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏంటో తెలుస్తుంది 🙏

Karthik Reddy

28/06/2024

నేటి సమాజంలో దానం చేయడం గొప్ప అనే భావన ఉంది కానీ దానం పొందే అర్హత ఉన్న వ్యక్తులకు తప్పా ఎవరికి పడితే వారికి మన శ్రమను, డబ్బును, ఆస్తులను పంచడం ధర్మం కాదు. దానం పొందే అర్హత కలిగి ఉండడం అంటే ముందు ధర్మాన్ని ఆచరించే వాడై ఉండాలి. రాక్షసుడికి చేసిన దానం ధర్మం ఎలా అవుతుంది?

28/06/2024

కర్ణుడు గొప్పవాడు కానీ అధర్మం వైపు నిలబడ్డాడు.. అర్జునుడు మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పకూడదని శ్రీకృష్ణుడి చేత గీతోపదేశం పొంది మరీ యుద్ధాన్ని గెలిచాడు. అర్జునుడు అంటే మన మనస్సు, కర్ణుడు అంటే ఎమోషన్. ఎమోషనల్ అయి తప్పటడుగులు వేయడం నష్టం చేస్తుంది. మనసుని నిలకడగా పెట్టుకోవాలి. ధర్మాన్ని, దైవత్వాన్ని అర్జునుడి వలె అన్వేషణ చేయాలి. 🙏

27/06/2024

భారత్ విజయం!! 👌🏽
ఫైనల్స్ కి ఎంట్రీ 😊

27/06/2024

172 పరుగులు ఆ పిచ్ పై కష్టమే.. బాల్ ఊహకు అందని విధంగా టర్న్ అవుతోంది. జడేజా, కుల్దీప్ లు మ్యాచ్ గెలిపిస్తారు అనిపిస్తుంది. 🤔 ఇంగ్లాండ్ టీం కి గెలుపు అంత ఈజీ ఏం కాదు!

27/06/2024

కల్కి 2898 AD సినిమా చూశారా.. ఎలా ఉంది?
పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి!
బాహుబలి తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు హీరో ప్రభాస్ ఖాతాలో మరో హిట్ సినిమా పడినట్లేనా?

కాంగ్రేసీలకు దేశం బాగుపడడం ఇష్టం ఉండదు.. 🤦
27/06/2024

కాంగ్రేసీలకు దేశం బాగుపడడం ఇష్టం ఉండదు.. 🤦

రేపు దక్షిణాఫ్రికా పై అఫ్గానిస్థాన్ గెలిచి ఫైనల్ లో భారత్ తో తలపడుతుంది అనిపిస్తుంది.😄 భారత్ పై లేదా ఇంగ్లాండ్ పై గెలిచి...
26/06/2024

రేపు దక్షిణాఫ్రికా పై అఫ్గానిస్థాన్ గెలిచి ఫైనల్ లో భారత్ తో తలపడుతుంది అనిపిస్తుంది.😄 భారత్ పై లేదా ఇంగ్లాండ్ పై గెలిచి ఆఫ్గనిస్తాన్ ప్రపంచ కప్ గెలిస్తే అది సంచలనమే. అయితే అఫ్గానిస్థాన్ తో భారత్ సత్సంబంధాలను క్రికెట్ అనే మాధ్యమం ద్వారా మరింత బలపర్చుకోవాలి. ఇందుకు బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రస్తుత తాలీబాన్ ప్రభుత్వం ఇదివరకటిలా కాకుండా కాస్త లిబరల్ గా మారింది. దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఏం చర్యలు తీసుకోవాలో వాటిపై దృష్టి సారించింది. భారత్ తో తాలీబాన్ ప్రభుత్వం సఖ్యతగా ఉంటోంది. తమ దేశ అవసరాలను తీర్చే పెద్దన్నగా భారత్ ని భావిస్తోంది.

మరోవైపు అఫ్గానిస్థాన్ ప్రజలు కూడా భారత్ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. పాకిస్థాన్ ని బలహీనం చేయాలంటే అఫ్గానిస్థాన్ తో ఉన్న భారత్ స్నేహ బంధాన్ని మరింత పటిష్టం చేస్కోవాలి. క్రికెట్ ద్వారా అది సాధ్యపడుతుంది. క్రీడల ద్వారా సైతం విదేశాలతో దౌత్యానికి మార్గం ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో అఫ్గానిస్థాన్ లో భారత క్రికెట్ జట్టు అలా పర్యటనకు వెళ్లి ఒక టోర్నీ ఆడి వస్తే పక్కనున్న పాకిస్థాన్ దేశం మొత్తం సిగ్గుతో తలదించుకుంటుంది.

Karthik Reddy

కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా ఈ సుమన్ టీవీ ఛానెల్స్ ఉన్నాయి.. ఇప్పటివరకు 20కి పైగా ఛానెల్స్ ని బ్లాక్ చేసినా ఇంకా కొత్తవి...
26/06/2024

కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా ఈ సుమన్ టీవీ ఛానెల్స్ ఉన్నాయి.. ఇప్పటివరకు 20కి పైగా ఛానెల్స్ ని బ్లాక్ చేసినా ఇంకా కొత్తవి వాల్ పై వస్తూనే ఉన్నాయి.🤦
అయినా సరే ఇలా ఎన్ని వచ్చినా సుమన్ టీవి అని కనబడితే బ్లాక్ చేసుడే.

మొగుడు పెళ్లాల కొట్లాటలను సెన్సెషనలైజ్ చేయడం, మూఢనమ్మకాలను ప్రమోట్ చేయడం వంటివి చేస్తున్నందుకు నేను సుమన్ టీవీ ఛానెల్ ని పూర్తిగా బహిష్కరిస్తున్నాను. సమాజాన్ని చైతన్యవంతం చేయడం, సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడడం, జాతీయవాద భావనలు నింపడం వంటి మంచి మంచి కంటెంట్ ని తప్పనిసరిగా ప్రోత్సహిస్తాను కానీ వ్యూస్ కోసం ప్రజలను వెర్రోలను చేసే అర్ధంపర్ధం లేని కంటెంట్ ని నేనైతే అస్సలు ప్రోత్సహించను🙏

26/06/2024

😂

26/06/2024

కాంగ్రెస్ వారి ఏప్రిల్ ఫూల్ యాడ్ 😂👇

26/06/2024
26/06/2024

లోక్ సభ స్పీకర్ గా
శ్రీ ఓం బిర్లా గారు ఎన్నిక!!
👌🏽🙂

26/06/2024

కర్ణాటకలో నందినీ పాల పై ₹2/లీ పెంపు. మొన్నీమధ్య పెట్రోల్, డీజిల్ పై ₹3/లీ పెంచింది కాంగ్రెస్. కరెంట్, ఆర్టీసీ చార్జీలు పెంచే యోచన చేస్తున్న నిద్ధరామయ్య. కర్ణాటక లో అభివృద్ధి అటక ఎక్కింది, 5 గ్యారెంటీలకు ఓటేసి ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

26/06/2024

"జై హిందూ రాష్ట్ర, జై భారత్"

నిన్న పార్లమెంటులో ప్రమాణ స్వీకారం సమయంలో ఓవైసి "జై పాలస్తీనా" అని నినాదం ఇచ్చి భారత్ ని అవమానించడంతో బీజేపీ ఎంపీ ఛత్రపాల్ సింగ్ గంగ్వార్ ఓవైసికి, ఇండీ కూటమికి సమాధానంగా "జై హిందూ రాష్ట్ర, జై భారత్" అంటూ నినాదాన్ని ఇచ్చాడు.👌🏽

25/06/2024

"జై భీమ్, జై పాలస్తీనా, జై తెలంగాణ"

ఇవి పార్లమెంటులో హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ అన్న మాటలు. జై భీమ్ కి జై పాలస్తీనా కి ఏంటి సంబంధం. ఒక్క బీజేపీ సభ్యులు తప్పా వేరెవరూ అదేంటని ప్రశ్నించలేదు. ఇంకా నయం జై హమాస్ అనలేదు. అలా అన్నా కూడా బీజేపీ తప్పా ఏ పార్టీ ప్రశ్నించేది కాదు.

25/06/2024

ఈ కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు తమ రాజకీయ అవసరం కోసం చీటికిమాటికి రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ఫోటోలు దిగుతూ కాస్త ఎక్స్ట్రా లు చేస్తుంటే రాజ్యాంగం యొక్క గౌరవాన్ని వాళ్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది‌. రాజ్యంగాన్ని రద్దు చేస్తారు, రద్దు చేస్తారు అనే నినాదాన్ని రాజకీయ అస్త్రంగా కాంగ్రెస్ వాడుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది.

25/06/2024

రష్యా లోని డాగెస్తాన్ ప్రావిన్స్ లో ఐసిస్ తీవ్రవాదులు దాడులు జరిపి 20 మంది పోలీసులను, అలాగే పదుల సంఖ్యలో పౌరులను బలిగొన్నారు. అంతేకాకుండా ఒక చర్చి ఇంకా యూదుల సైనగాగ్ ని కాల్చి బూడిద చేశారు. ఇజ్రాయెల్ పై సైతం ఇదే విధంగా దాడులు చేసింది హమాస్.

25/06/2024

కాంగ్రెస్ కి కేంద్రంలో ఒక్కసారి అవకాశం ఇస్తే మరోసారి ఎమర్జెన్సీ విధించి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లాగా రాజ్యాంగంలో మార్పులు చేసి ఇకపై ఎన్నికలు లేకుండా, ప్రజలకు రాజ్యాంగ హక్కులు లేకుండా చేస్తుంది. ఇందిరా గాంధీ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాజ్యాంగం సైతం తనని ప్రశ్నించకుండా చేస్కుంది.

25/06/2024

The Dictator and Family!! 👇🏽

25/06/2024

ఎమర్జెన్సీ తెచ్చింది ఎవరు..? ఎదిరించింది ఎవరు..?
---
చరిత్రలో కొన్ని సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే. వాటి విశ్లేషణ చాలా ముఖ్యం. ఆ సంఘటనల కారకులు. వారి అహంకారం. కేవలం పదవిని కాపాడుకోవడం కోసం దేశ భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టే వారి స్వార్థపరత్వం. అటువంటి మూర్ఖత్వాన్ని సమర్థించిన వ్యక్తుల స్వార్థం. ఆ అరాచకాన్ని నిరసిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన నాయకులను తలచు కోవటం చాలా అవసరం.అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) హీరోలను గుర్తుంచుకోవడంలో విఫలమైతే, దాని విలన్లు ఎవరో మరచిపోతే, మన ప్రజాస్వామ్య జీవన విధానాన్ని పరిరక్షించలేము.

జూన్ నెల దానితో తెచ్చే భయంకరమైన వేడి కాకుండా, జూన్ 25, 1975 న కాంగ్రెస్ ప్రధాని ఇందిరా గాంధీ దేశంపై విధించిన నిరంకుశ అత్యవసర పరిస్థితి బాధాకరమైన జ్ఞాపకాలను కూడా తిరిగి తెస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, జీవించే హక్కు కూడా కాల రాసిన కాలం అది . ప్రజాస్వామ్యం ఎలా పట్టాలు తప్పిందో, భారతదేశం ఒక నియంతృత్వ పాలనలో ఉన్నప్పుడు ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి 1975-77 నాటి సంఘటనలను మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్య జీవన విధానాన్ని మనం కాపాడుకోగలం. అలాగే మన రాజ్యాంగంలోని ప్రధాన విలువలను కాపాడుకోవాలనుకుంటే కూడా ఇది అవసరం.

మనం ఎప్పటికీ మరచిపోకూడని హీరోలు

i) ఇందిరా గాంధీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, చివరికి మార్చి, 1977 లో ప్రజాస్వామ్యాన్ని పట్టాలపైకి తేవడంలో రాజకీయ, సామాజిక నాయకులు, కార్మికుల త్యాగం అపూర్వమైనది. వారిలో జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి . చంద్రశేఖర్. జార్జి ఫెర్నాండేజ్. ఎల్ కే అద్వానీ. చరణ్ సింగ్. మధు దండావతే. మొరార్జీ దేశాయి. నానాజీ దేశ్ ముఖ్. రామకృష్ణ హెగ్డే. సికిందర్ భక్త్. నరేంద్ర మోడి. హెచ్ డి దేవగౌడ. లాలూ ప్రసాద్ యాదవ్. నితీష్ కుమార్ మొదలైన అనేక నాయకులున్నారు.
ii) ప్రజాస్వామ్యం పునరుద్ధరణలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా) కింద జైలు శిక్ష అనుభవించిన 6,330 మందిలో 4,026 మంది ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ (భారతీయ జనతా పార్టీకి పూర్వ సంస్థ ) కు చెందినవారు. వారిలో, పైన పేర్కొన్న వారిలో కొంతమందితో పాటు, అప్పటి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ బాలసాహెబ్ దేవరస్, ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, అనంత్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్ మొదలైనవారు ఉన్నారు. బిజెపి ఎంపి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి రెండుసార్లు ప్రభుత్వం కన్నుగప్పి విదేశాలకు వెళ్ళి అక్కడి భారతీయ సమాజాన్ని చైతన్య పరిచారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఆర్ఎస్ఎస్ ప్రచారక్, మారు వేషాలతో తిరుగుతూ , ఉద్యమాన్ని నిర్వహించడం, అత్యవసర పరిస్థితి వ్యతిరేక సాహిత్యాన్ని పంపిణీ చేయడం, జైలు శిక్ష అనుభవిస్తున్న నాయకుల కుటుంబాలకు సహాయం చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.
iii) గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన వ్యక్తి జస్టిస్ హెచ ఆర్ ఖన్నా. సుప్రీంకోర్టులో ADM, జబల్పూర్ వర్సెస్ శివ్ కాంత్ శుక్లా కేసు (హేబియస్ కార్పస్ కేసు అని కూడా పిలుస్తారు) ను పరిష్కరించి ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ లో ఈయన ఒకరు. ఏదైనా ప్రజాస్వామ్య హక్కులు లేకపోవడం వల్ల అరాచకత్వం ఏర్పడే అవకాశం ఉంది. అటార్నీ జనరల్, నిరెన్ డే, పౌరులకు జీవించే హక్కు , వ్యక్తిగత స్వేచ్ఛ లేదని ప్రభుత్వ అభిప్రాయాన్ని అంగీకరించమని ఒత్తిడి చేశారు కూడా. ఒక పోలీసు అధికారి వ్యక్తిగత శత్రుత్వం వల్ల ఒక వ్యక్తిని చంపినట్లయితే న్యాయ పరిహారం ఉంటుందా,లేదా అని జస్టిస్ ఖన్నా ఆయనను అడిగారు.

Read Also : ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం

“అవును, న్యాయ పరిహారం ఉండదు” అని నిరెన్ డే నిర్లక్ష్యం గా అన్నారు. కోర్టు గదిలో ఉన్నవారు ఈ వాదనను చూసి ఆవాక్కైపోయారు. జస్టిస్ ఖన్నా తన ఆత్మకథలో బెంచ్‌లోని ఇతర న్యాయమూర్తులు – చీఫ్ జస్టిస్ ఎఎన్ రే మరియు జస్టిస్ ఎంహెచ్ బేగ్, వైవి చంద్రచూడ్ మరియు పిఎన్ భగవతి – ఇవన్నీ జరిగినప్పుడు ‘ బెల్లం కొట్టిన రాయిల్లా’ ఉండి పోవడం తనకు దిగ్భ్రాంతి కలిగించింది గుర్తుచేసుకున్నారు కూడా. చివరికి, జస్టిస్ ఖన్నా తప్ప మిగిలిన వారందరూ ప్రభుత్వ అభిప్రాయాన్ని సమర్థించారు. పౌరుడి జీవన హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును కూడా హరించేశారు. జస్టిస్ ఖన్నా అసమ్మతి స్వరం పర్యవసానం. ఆయన సీనియారిటీ పక్కన పెట్టి మరీ. ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో ని ప్రభుత్వం. జస్టిస్ బేగ్‌ను ప్రధాన న్యాయమూర్తి గా ప్రకటించింది. అందుకే ప్రజాస్వామ్యానికీ, ప్రాథమిక హక్కులకు విలువ ఇచ్చే వారందరికీ జస్టిస్ ఖన్నా హీరోగా మిగిలిపోయారు.

మనం క్షమించకూడని వ్యక్తులు మరియు మరచి పోగూడని సంఘటనలు

i) ఇందిరా గాంధీ
ప్రజాస్వామ్యాన్నినియంతృత్వంగా మార్చినందుకు; తనను తాను రక్షించుకోవడానికి రాజ్యాంగం, ఎన్నికల చట్టాలతో ఆడుకున్నందుకు; ఉన్నత న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేయడానికి 42 వ సవరణను తీసుకువచ్చినందుకు; అలాగే కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగాన్ని సవరించడానికి రాష్ట్రపతికి అధికారం ఇవ్వడం కోసం ప్రయత్నించి రాజ్యాంగ మూల స్ఫూర్తి ని అపహాస్యం చేసినందుకు ఆమెను క్షమించలేము.

ii) కాలికట్‌లోని ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి పి.రాజన్‌ను దారుణంగా హింసించి హత్య చేసిన కేరళ పోలీసులకు ఇప్పటికీ శిక్షపడలేదు
iii) లారెన్స్ ఫెర్నాండెజ్‌ను చాలా నెలలు హింసించిన కర్నాటక పోలీసులు శిక్షించబడలేదు

iv) సెన్సార్‌షిప్ విధించిన ఇందిరా గాంధీ ప్రభుత్వంలో సమాచార మరియు ప్రసార మంత్రి వి.సి. శుక్లా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై ప్రభుత్వ నియంత్రణ కోసం విశ్వప్రయత్నం చేశారు. వార్తాపత్రిక కార్యాలయాలపై దాడి చేయడానికి, మూసివేయడానికి జిల్లా న్యాయాధికారులకు అధికారం ఇచ్చే కఠినమైన ప్రెస్ వ్యతిరేక చట్టాలను ఆమోదించారు. మహాత్మా గాంధీ, ఠాగూర్ ల రచనలు కూడా ప్రచురించకూడదని వార్తాపత్రికలపై ఆంక్షలు విధించేంత మూర్ఖత్వాన్ని శుక్లా ప్రదర్శించారు. తాము కోరిన పాటను పాడలేదని . కిషోర్ కుమార్ పాడిన ఏ పాటనూ ప్రసారం చేయవద్దని ఆల్ ఇండియా రేడియోను శుక్లా గారు ఆదేశించారు.
v) ఇందిరా గాంధీ రాజకీయ ఖైదీలను ‘తల్లిలా’ సంరక్షిస్తున్నారని, “మంచి ఆహారం, అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తూ ఖైదీలపట్ల అధికారులు చూపిన శ్రద్ధ తల్లిలా ఉన్నాయని మేము అర్థం చేసుకున్నాము” అని జస్టిస్ బేగ్, ‘హేబియాస్ కార్పస్’ తీర్పులో అన్నారు.
vi) నవీన్ చావ్లా, అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యదర్శి కిషన్ చంద్, రాజ్యాంగేతర అధికారశక్తి గా అవతరించారు. చాలా మంది రాజకీయ ఖైదీలను ఉంచడానికి స్థలం లేదని తిహార్ జైలు సూపరింటెండెంట్ చెప్పినప్పుడు, వారిని రేకులతో నిర్మించిన జైలు గదుల్లో ఉంచాలని, “వేడి లో మాడనివ్వండి ” అని చావ్లా ఆదేశించాడు. “ఇంకా స్థలం సరిపోక పోతే కొంతమందిని మతి స్తిమితం తప్పిన నేరస్తుల తో కలిపి ఉంచండి” అని కూడా ఆదేశించాడు. జైళ్లలోని పరిస్థితుల గురించి జస్టిస్ బేగ్ ఎంత అనాలోచితంగా ఉన్నారో షా కమిషన్ ముందు చావ్లాకు వ్యతిరేకంగా వచ్చిన సాక్ష్యం చక్కగా నిరూపించింది.
vii) మధ్యయుగ నిరంకుశత్వాన్ని ప్రదర్శించడమేకాక, తన మాట విననివారి జీవితాలను, వృత్తిని నాశనం చేయడానికి ప్రయత్నించిన హర్యానా ముఖ్యమంత్రి, తరువాత ఇందిరా గాంధీ అత్యవసర మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా పనిచేసిన బన్సీ లాల్ అకృత్యాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అతను స్వయంగా సామూహిక కుటుంబానియంత్రణ శిబిరాలను పర్యవేక్షించాడు. హరియాణలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న ఉత్తవర్ గ్రామంపై దాడి ఆయన ఘనకార్యమే. పోలీసులు ట్రక్కులలో వచ్చారు, గ్రామాన్ని చుట్టుముట్టారు, 8 నుండి 80 సంవత్సరాల వయస్సు గల పురుషులను బయటకు పిలిచి, వారిని బలవంతంగా కుటుంబానియంత్రణ ఆపరేషన్ చేసే శిబిరానికి తీసుకువెళ్లారు. చాలావరకు ఉత్తర భారత రాష్ట్రాల్లో, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసులకు కుటుంబానియంత్రణ ఆపరేషన్ కోటాలు ఇవ్వబడ్డాయి. అనేక సందర్భాల్లో, ఉపాధ్యాయులు కూడా చేయించుకోవలసి వచ్చింది. ఆపరేషన్ కు ఒప్పుకొని వారిని భయంకరమైన MISA కింద జైలులో పెట్టారు.

ఇది పూర్తి జాబితా కాదు. కానీ, అత్యవసర పరిస్థితి విలన్లను గుర్తుంచుకోవడంలో, ఆ అణచివేత రోజుల నుండి సరైన పాఠాలు నేర్చుకోవడంలో విఫలమైతే, మన ప్రజాస్వామ్య జీవన విధానాన్ని పరిరక్షించలేము.

- ఏ సూర్య ప్రకాష్
This article was first published in 2020
- వీఎస్‌కే తెలంగాణ సౌజన్యంతో ..

25/06/2024
25/06/2024

జూన్ 25, 1975
ప్రజాస్వామ్యాన్ని ఇందిరా గాంధీ పాతరే‌సిన రోజు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన రోజు. మానవ హక్కులను కాలరాసిన రోజు. వాక్ స్వాతంత్ర్యాన్ని హరించిన రోజు. బ్రిటిష్ పాలనకు కాంగ్రెస్ పాలన అనేది ఒక కొనసాగింపు అని చెప్పేందుకు ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ ఒక ఉదాహరణ.

24/06/2024
23/06/2024

పెట్రోల్, డీజిల్ లను GST పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు. అయితే పెట్రోల్ డీజిల్ లను GST పరిధిలోకి తేవాలంటే రాష్ట్రాల సమ్మతి తప్పనిసరి. వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ ప్రభుత్వాల పై వత్తిడి తెస్తే అది సాధ్యమౌతుంది.

23/06/2024

అమెరికాలో రోజురోజుకు గన్ కల్చర్ పెట్రేగిపోతుంది. మన భారతీయ విద్యార్ధులు ఎన్నో ఆశలు పెట్టుకుని అమేరికా వెళ్లి చివరికి అక్కడ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. లేటెస్టుగా బాపట్లకు చెందిన గోపిక్రిష్ణ టెక్సాస్ లోని ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తుండగా కనికరం లేకుండా గన్ తో వచ్చి కాల్చి పడేసి సిగరెట్లను ఎత్తుకెళ్లాడు ఒక దొంగ.

23/06/2024

మానవ నిర్మాణంలో ఊహించని మార్పులు!! బాలికల్లో early puberty ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోందట. సాధారణంగా 12, 13 ఏళ్లకు ప్రారంభం అయ్యే స్త్రీలోని ప్రత్యుత్పత్తి హార్మోన్లు ఇప్పుడు 8 ఏళ్ల కంటే ముందే ప్రారంభం అవ్వడం కాస్త అయోమయానికి గురి చేసే విషయమే.

Address


Telephone

+919010648287

Website

Alerts

Be the first to know and let us send you an email when Karthik Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Karthik Reddy:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share