JRN Journalist Ravi News

  • Home
  • JRN Journalist Ravi News

JRN Journalist Ravi News This is official page Journalist Ravi
(Palakollu News is the first priority)

రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అధ్యక్షతన మంత్రులు, సెక్రటరీలతో సమీక్షా సమావేశం జరిగింది...
12/01/2026

రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, సెక్రటరీలతో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి వర్చువల్‌గా హాజరైన జిల్లా కలెక్టర్లు.

👉 షిర్డీ లోని సాయినాథుడ్ని ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి దర్శించుకున్నారు.👉 సాయిబాబాకు నిర్వహించే కాగడ హా...
12/01/2026

👉 షిర్డీ లోని సాయినాథుడ్ని ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి దర్శించుకున్నారు.

👉 సాయిబాబాకు నిర్వహించే కాగడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు.

👉 మంత్రి లోకేశ్ దంపతులకు ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు.

👉 హారతి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. మంత్రి లోకేశ్ వెంట ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు.

12/01/2026

👉 ప్రధాని నరేంద్రమోదీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు.

👉 జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు.

👉 ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ.. అహ్మదాబాద్ లోని సబర్మతి నదీతీరంలో జరుగుతోన్న ఈ ఫెస్టివల్ లో ఛాన్సలర్ తో కలిసి కైట్ ఎగురవేశారు.

12/01/2026
12/01/2026

PSLV -C62 రాకెట్.. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన “EOS-N1" ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతున్నారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది.

12/01/2026

పాలకొల్లులో రూ 26 లక్షల CMRF చెక్కుల పంపిణీ
@ మంత్రి నిమ్మల రామానాయుడు

👉 పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ...
12/01/2026

👉 పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో భాగంగా కీర్తిశేషులు ఆడిటర్ కలిదిండి రామరాజు జ్ఞాపకార్థంగా నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.

👉 ఈ కబడ్డీ పోటీలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీమ్ ఆస్మి లతో కలిసి ప్రారంభించారు. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఎగరవేయగా, క్రీడా పతాకాన్ని జిల్లా ఎస్పీలు ఆవిష్కరించారు. శాంతికి సూచికగా పావురాలు, బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం క్రీడాకారులతో మంత్రి రామానాయుడు పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

12/01/2026

👉 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి గత 11 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడా పోటీలను నిరంతరంగా నిర్వహిస్తున్నాం. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను క్రీడల ద్వారా మరింత అర్థవంతంగా జరుపుకోవాలన్నదే లక్ష్యం. పండుగ పేరుతో యువత కోడిపందాలు, జూదం వంటి దుష్ప్రవర్తనల వైపు వెళ్లకుండా నిలువరించే శక్తి క్రీడలకు మాత్రమే ఉంది. అందుకే క్రీడా ఉత్సవాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
-- రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు,

👉 పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో భాగంగా కీర్తిశేషులు ఆడిటర్ కలిదిండి రామరాజు జ్ఞాపకార్థంగా నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.

👉 ఈ కబడ్డీ పోటీలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీమ్ ఆస్మి లతో కలిసి ప్రారంభించారు. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఎగరవేయగా, క్రీడా పతాకాన్ని జిల్లా ఎస్పీలు ఆవిష్కరించారు. శాంతికి సూచికగా పావురాలు, బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం క్రీడాకారులతో మంత్రి రామానాయుడు పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

12/01/2026

👉 పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో భాగంగా కీర్తిశేషులు ఆడిటర్ కలిదిండి రామరాజు జ్ఞాపకార్థంగా నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.

👉 ఈ కబడ్డీ పోటీలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీమ్ ఆస్మి లతో కలిసి ప్రారంభించారు. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఎగరవేయగా, క్రీడా పతాకాన్ని జిల్లా ఎస్పీలు ఆవిష్కరించారు. శాంతికి సూచికగా పావురాలు, బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం క్రీడాకారులతో మంత్రి రామానాయుడు పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా.. పాలకొల్లు సరస్వతి శిశు మందిర్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి, పాలకొల్లు పట్టణ...
12/01/2026

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా.. పాలకొల్లు సరస్వతి శిశు మందిర్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి, పాలకొల్లు పట్టణంలో ఉన్న వివేకానంద విగ్రహాలకు పాలకొల్లు యోగ సత్సంగం సభ్యులు నివాళులర్పించారు.

Address

Telephone

+918247078819

Website

Alerts

Be the first to know and let us send you an email when JRN Journalist Ravi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JRN Journalist Ravi News:

  • Want your business to be the top-listed Media Company?

Share