Vusulu online weekly magazine

  • Home
  • Vusulu online weekly magazine

Vusulu online weekly magazine To read interesting telugu stories, serials, poetry, and many more topics on different issues.

vusulu online magazine71st Edition
15/08/2022

vusulu online magazine
71st Edition

undefined

దేవుడా భార్యను ఇవ్వు అంటే మర్చిపోయి బాదుడినే భార్యగా ఇచ్చినట్టు ఉన్నావు. సేమ్ అభ్యర్ధన నాది కూడా... అవకాశం ఉంటే నా భార్య...
10/08/2022

దేవుడా భార్యను ఇవ్వు అంటే మర్చిపోయి బాదుడినే భార్యగా ఇచ్చినట్టు ఉన్నావు. సేమ్ అభ్యర్ధన నాది కూడా... అవకాశం ఉంటే నా భార్యను కూడా మార్చెయ్ స్వామి...అన్నాను నేను దేవుడికి మొక్కినట్టు...

ఏమన్నారు... నేను బాదుడినా.. రాత్రేమో దేవతని అంటారు... పగలేమో బాదుడిని అంటారా... ఇది పచ్చి మోసం కదా అంది.
మోసం ఏం ఉంది... చీకటిలో సరిగా కనిపించక అలా అని... పగలు కనిపించి ఇలా అన్నానేమో అన్నాను నవ్వుతూ...

undefined

ఏరా బాలరాజు.. నాకు డాన్స్ లో పోటీ ఇస్తావు అనుకుంటే పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించావు. జీవితంలో ఇంత సేపు ఎప్పుడు నవ్వుతూ ఉ...
10/08/2022

ఏరా బాలరాజు.. నాకు డాన్స్ లో పోటీ ఇస్తావు అనుకుంటే పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించావు. జీవితంలో ఇంత సేపు ఎప్పుడు నవ్వుతూ ఉండలేదు. నువ్వు సినిమా ఆడిషన్స్ లో ఎందుకు సెలెక్ట్ కాలేదో ఇప్పుడు అర్ధం అయ్యింది అని నవ్వడం మొదలుపెట్టింది జ్యోతి.

బాలరాజు కి ఏదో అర్ధం అవుతుంది. అర్ధం కానట్టు ఉంది. కానీ ఏం జరిగినా తన బింకం సడలించకూడదు. ముందు తను స్టేజ్ మీద పడిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాడు.

undefined

తను చాలా బాగా పాటలు పాడుతుంది. ఒకప్పుడు సరదాగా నేర్చుకున్న సంగీతం, పాటలే ఇప్పుడు తమకు జీవనాధారం అయ్యాయి. రెండు సంవత్సరాల...
10/08/2022

తను చాలా బాగా పాటలు పాడుతుంది. ఒకప్పుడు సరదాగా నేర్చుకున్న సంగీతం, పాటలే ఇప్పుడు తమకు జీవనాధారం అయ్యాయి. రెండు సంవత్సరాల నాడు తండ్రి చనిపోయిన తర్వాత... చెల్లి, తను, అమ్మ ముగ్గురం అనాధలమయ్యాం. చేతిలో కనీసం అవసరాలకు కూడా డబ్బు లేని క్లిష్ట సమయంలో నన్ను ఆదుకున్నారు రాజు బాబాయ్. ఆయన మాకు దూరపు బంధువు.
ఏదో పెళ్లిలో నన్ను చూసి, నేను పాటలు బాగా పాడతానని తెలుసుకొని, నన్ను కూడా ఆయన ఆర్కెస్ట్రా గ్రూపులో భాగం చేసుకున్నారు.

అప్పటికే రెండు మూడు చోట్ల ఉద్యోగ ప్రయత్నాలు అవీ చేసి, అవి సరిగా లేకపోవడంతో... ఇక తప్పక ఈ పాటలు పాడే పనికి ఒప్పుకోవాల్సి వచ్చింది. మా గ్రూపులో కీబోర్డు, డ్రమ్స్ ఇంకా కీప్యాడ్ ప్లే చేసే ఆర్కెస్ట్రా వాళ్ళు ముగ్గురు.

undefined

ఇంకోరోజు బట్టలు సర్దుతుంటే బీరువాలో కుచ్చుల తెల్లగౌను కనిపించింది. తల్లి చేతిక్రింది నుండి దూరి, "హాయ్, నా కుచ్చులగౌను" ...
10/08/2022

ఇంకోరోజు బట్టలు సర్దుతుంటే బీరువాలో కుచ్చుల తెల్లగౌను కనిపించింది. తల్లి చేతిక్రింది నుండి దూరి, "హాయ్, నా కుచ్చులగౌను" అంటూ దాన్ని అపురూపంగా పట్టుకొని గుండెలకు హత్తుకుంది. "ఇప్పుడు గౌనూ లేదు ఏమీ లేదు ఇలా ఇవ్వు" అంటూ వాళ్ళమ్మ చేతిలోంచి లాక్కోబోయింది. అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతున్న కిరణ్మయి "పోనీలే వదినా ఆ గౌను అంటే దానికి ఇష్టం లా ఉంది. వాళ్ళ నాన్న కొన్నాడు కదా" అంది.
బీరువా సర్దడం ఆపేసి "ఓహ్ నువ్వా..ఇదేనా రావడం" అంటూ ఆమె చేతిలో బాగ్ తీసుకొని లోపల పెట్టి కూర్చోడానికి కుర్చీ చూపించింది. ఆమె పక్కన వాళ్ళమ్మాయి రెండేళ్ల ధన్వి. తెల్లగా బొద్దుగా గుండ్రని నల్లని కళ్ళతో చూడ్డానికి అచ్చం బొమ్మలాగా ఉంది.

undefined

అది సరేనే ఇంతకీ ఇన్ని సంవత్సరాలు గా లేని ఈ ఆర్థికంగా నీకు నువ్వు నిలబడాలని ఎందుకనిపించింది? ఏదో బలమైన కారణం ఉంటే కాని ను...
10/08/2022

అది సరేనే ఇంతకీ ఇన్ని సంవత్సరాలు గా లేని ఈ ఆర్థికంగా నీకు నువ్వు నిలబడాలని ఎందుకనిపించింది? ఏదో బలమైన కారణం ఉంటే కాని నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవు అంది.

రాధ గట్టిగా నిట్టూర్చి ఒకమాట చెప్పనా రాధ
కొన్ని మాటలు చిన్నవే అయినా అవి చేసే గాయం పెద్దగా ఉంటుంది. అదీ మనం ప్రాణంగా ప్రేమించేవారి నుండి వచ్చే నిర్లక్ష్యపు మాటలు తట్టుకోవటం కాస్త కష్టమే..నేనేం చెప్పాలనుకున్నానో ఈ పాటికి నీకు అర్థం అయ్యే ఉంటుంది. మీ అన్నయ్యే కాదు, రేపు భవిష్యత్తు లో నా పిల్లల నుండి కూడా అలాంటి సంఘటనలు ఎదురు కాకూడదు అని నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఇదేదో మొగుణ్ణి ఎదిరించటానికో సంసారాన్ని నేను కూడా పోషిస్తున్నానని చెప్పుకోటానికో, గొప్పకోసమో కాదు.

undefined

ప్రేమంటే యుద్ధమే కదా...అది ఒకసారి ఆందోళనగా కూత పెట్టి యుద్ధం చెయ్యడానికి సిద్ధమైనట్టుగా చెట్టు మీద నుండి గాలిలోకి ఎగిరిం...
10/08/2022

ప్రేమంటే యుద్ధమే కదా...

అది ఒకసారి ఆందోళనగా కూత పెట్టి యుద్ధం చెయ్యడానికి సిద్ధమైనట్టుగా చెట్టు మీద నుండి గాలిలోకి ఎగిరింది.

పాపం... వీచే గాలి ముందు దాని రెక్కలు ఎంత...?
గాలి దాన్ని అటు ఇటు విసిరేస్తుంది. అది అతి బలవంతగా రెక్కలు ఊపుతుంది. అలా ఎంతో సేపు ఎగరలేను అని దానికి అర్ధం అవుతుంది.

మళ్ళీ ఒకసారి ఆందోళనగా కూత పెట్టింది. తన కూతకు తన జత పావురం వింటే సమాధానం ఇస్తుంది అని...

undefined

vusulu online magazine70 th Edition
10/08/2022

vusulu online magazine
70 th Edition

undefined

అవును... భూమి మీద అన్ని అంటే మన ఇద్దరితో కలిపేనా" అని నవ్వింది తను.నేను నవ్వేశా... "భూమి మీద అద్భుతాలు ఉన్నట్టే కొన్ని వ...
04/08/2022

అవును... భూమి మీద అన్ని అంటే మన ఇద్దరితో కలిపేనా" అని నవ్వింది తను.

నేను నవ్వేశా... "భూమి మీద అద్భుతాలు ఉన్నట్టే కొన్ని వ్యర్ధాలు ఉంటాయి. సో నువ్వు అద్భుతం... నేను వ్యర్థం" అన్నాను.
"సరిపోయింది...మీరు వ్యర్థం, నేను అద్భుతం... ఇటువంటి మాటలు మాట్లాడే నా కోపం నషాలానికి అంటేలా చేస్తారు" అంటూ కోపంతో లోపలకి వెళ్లి పోయింది.

"ఇప్పుడు అలక అనే మబ్బు కమ్మింది. సంసారం అనే అరుణోదయ సమయాన.. సంతోషం అనే వికసించిన పూలను చూడాలి అంటే... అలక అనే మబ్బును తొలగించుకోవలసిన బాధ్యత నా పైనే ఉంది."

undefined

అలా అందరి లా నేనుకూడా కొని తింటే ఏం మజా ఉంటుంది" అన్నాడు జిలానీ సాదిక్ తో"ఈ సిచ్యుయేషన్ లో అదొక్కటే తక్కువ నా ముఖానికి" ...
04/08/2022

అలా అందరి లా నేనుకూడా కొని తింటే ఏం మజా ఉంటుంది" అన్నాడు జిలానీ సాదిక్ తో

"ఈ సిచ్యుయేషన్ లో అదొక్కటే తక్కువ నా ముఖానికి" అన్నాడు సాదిక్ కోపంగా.

"ఎందుకురా అంత కోపం?" అన్నాడు జిలానీ సాదిక్ వైపు చూసి.

"కోపం కాక మరేంట్రా? ఇప్పుడు నువ్వు గనక బటానీ గింజలు ఏరుకొని తింటే ఈ బస్టాండ్ లో దెబ్బకి నాపరువు మొత్తం గంగలో కలసి పోతుంది రా" అన్నాడు సాదిక్ కోపంగా.

"రేయ్ మాము మనం ఎప్పుడూ మన కోసం మనం బ్రతకాలిగానీ ఎదుటివారి కోసం కాదు" అన్నాడు జిలానీ నవ్వుతూ..

"ఆపుతావా నీ యదవ ఫిలాసఫీ" అన్నాడు సాదిక్ అసహనంగా..

undefined

ఆకాశంలో ఊరుముల శబ్దం, వెంటనే మెరిసిన మెరుపుల వెలుగులో ఆమెను చూసిన అతనికి అక్కడనుండి కాంతి వేగంతో పారిపోవాలనిపించిది. కాన...
04/08/2022

ఆకాశంలో ఊరుముల శబ్దం, వెంటనే మెరిసిన మెరుపుల వెలుగులో ఆమెను చూసిన అతనికి అక్కడనుండి కాంతి వేగంతో పారిపోవాలనిపించిది. కానీ, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది.

అతనిని చూసిన ఆమె తన నడుముకింది భాగాన్ని వేగంగా అతని వైపు విసరడం, అతను సముద్రంలో పడుతూ... సా...సా...గ...ర...క...న్య... అన్న అతని చివరి మాటలు పూర్తికాకుండానే ప్రాణాలు విడిచిపెట్టడం ఒకేసారి జరిగింది.

undefined

అమ్మాయ్ చిన్నమ్మా..తలుపు తీస్తావా, నన్ను వెళ్లిపొమ్మంటావా" ఆవిడ తన అరుపు ఆపింది. చిన్మయి తలుపుతీసింది. ఆవిడకు సుమారు అరవ...
04/08/2022

అమ్మాయ్ చిన్నమ్మా..తలుపు తీస్తావా, నన్ను వెళ్లిపొమ్మంటావా" ఆవిడ తన అరుపు ఆపింది. చిన్మయి తలుపుతీసింది. ఆవిడకు సుమారు అరవై ఏళ్ళుంటాయి. నెరసిన జుట్టు, ముడుతలు పడ్డ శరీరం కానీ చురుకుదనం అణువణువునా కనిపిస్తున్నది. వెలసిన పట్టుచీరె, చేతులకు మట్టిగాజులు, నుదుట ఎర్రకుంకుమ బొట్టు..చూడగానే స్నేహభావం అనిపిస్తున్నది. ఎంత ఆలోచించినా చిన్మయికి ఆవిడ ముఖకవళికలు గుర్తు రావడం లేదు. ఆవిడ పిలుపు మాత్రం పుట్టింటి వాళ్లను గుర్తు తెస్తున్నది. మర్యాదగా ఆవిడను లోపలికి ఆహ్వానించింది.

undefined

నా చేతిని నీ చేతిలో ఉంచుకొని అలా ఎంతో సమయం నన్ను చూస్తూ గడిపేవాడివి. ఒక పూట నేను కపడకపోతే నీ ప్రాణం పోతున్నంతగా విలవిలలా...
04/08/2022

నా చేతిని నీ చేతిలో ఉంచుకొని అలా ఎంతో సమయం నన్ను చూస్తూ గడిపేవాడివి. ఒక పూట నేను కపడకపోతే నీ ప్రాణం పోతున్నంతగా విలవిలలాడిపోయే వాడివి.
అలాగే నిన్ను చూస్తూ నా మనసు నీకు చెప్పమని తొందరచేసే ఆ మాటను చెప్పేస్తూ నీ గుండె లో తలదాచుకోవాలనుంది. నువ్వు ఎప్పుడూ అడిగేవాడివి కదా ఆ మాట ఎప్పుడు చెప్తావని...ఇప్పుడే చెప్పాలని ఉంది.
నా కనులతోనే నీ కనులకు చెప్పిన ఆ మాటను నా పెదాలపై పలికిస్తూ రాస్తున్నా...

undefined

ఎందరెందరో పండితులను, పురోహితులను సంప్రదించాడు. వారెవ్వరు ధర్మసూక్ష్మం చెప్పలేక పోయారు. చివరకు ఖాండిక్యునికి కబురు చేసి, ...
04/08/2022

ఎందరెందరో పండితులను, పురోహితులను సంప్రదించాడు. వారెవ్వరు ధర్మసూక్ష్మం చెప్పలేక పోయారు. చివరకు ఖాండిక్యునికి కబురు చేసి, ధర్మసూక్ష్మం అడిగి తెలుసుకోమన్నారు. కేశిధ్వజుడు క్షణం కూడ ఆలస్యం చేయలేదు. అతడు తన శత్రువని అనుకోలేదు. తన సైనికుల్ని రావించి, ఖాండిక్యుని రాచమర్యాదలతో తీసుకొని రమ్మని చెప్పాడు.

ఖాండిక్యుడు ఏ సందేహాలకు తావు లేకుండా, రాజ్యంలోకి వచ్చి శత్రువైన కేశిధ్వజునకు పూర్తిగా సహకరించి, యాగాన్ని చక్కగా పూర్తయ్యేలా సహకరించాడు. ఇద్దరూ తమ మనస్సులో ఉన్న సంశయాల్ని తొలగించి, ఆర్షధర్మాల్ని చక్కగా నిర్వర్తించి గొప్ప క్రతువును ఘనంగా పూర్తిచేశారు.

undefined

రెండు లక్షలు మమ్మీ. మళ్ళీ అతను అడిగినప్పుడు ఇచ్చేయాలి మనం. నేను సంకల్ప్ కలిసి పబ్ కి వెళ్తున్నాం. నైన్ కల్లా వచ్చేస్తాను...
04/08/2022

రెండు లక్షలు మమ్మీ. మళ్ళీ అతను అడిగినప్పుడు ఇచ్చేయాలి మనం. నేను సంకల్ప్ కలిసి పబ్ కి వెళ్తున్నాం. నైన్ కల్లా వచ్చేస్తాను..మై స్వీట్ మమ్మీ’’ అనేసి తల్లి జవాబు కోసం చూడకుండా వెళ్ళిపోయింది రతి.

గబగబా వీధి తలుపు వేసి డబ్బు పట్టుకెళ్ళి బెడ్ రూమ్ లో తన సీక్రెట్ లాకర్ లో దాచింది అంబిక.
మళ్ళీ వచ్చి టీవీ ముందు కూర్చుంది ఆమె. టీవీ లో దృశ్యాలు చూస్తూ ఉంది గానీ ఆమె మనసంతా కూతురు తెచ్చిన డబ్బు మీదే ఉంది. సంకల్ప్ తండ్రి ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్ల హోల్-సేల్ డీలర్. సిటీ లో మంచి సెంటర్ లో పెద్ద షాప్ వాళ్ళది. సంకల్ప్ అన్నయ్య, తండ్రి కలిసి వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేశారు. సంకల్ప్ తండ్రి చాలా స్ట్రిక్ట్. చదువుకునే పిల్లలకి పాకెట్ మనీ తప్ప అవసరానికి మించిన డబ్బు ఇస్తే వాళ్ళు చెడిపోతారని ఆయన నమ్మకం. అందుకే వ్యాపార విషయాలన్నీ తనే స్వయంగా చూసుకుంటాడు ఆయన.

undefined

vusulu online magazineEdition 69
04/08/2022

vusulu online magazine
Edition 69

undefined

అది కిర్రున శబ్దం చేయసాగింది. ఆ శబ్దం విన్న సుబ్బారావు... నువ్వు బాధ పడుతున్నావు. నీ బాధ నాకు శబ్దం రూపంలో వినిపిస్తుంది...
26/07/2022

అది కిర్రున శబ్దం చేయసాగింది. ఆ శబ్దం విన్న సుబ్బారావు... నువ్వు బాధ పడుతున్నావు. నీ బాధ నాకు శబ్దం రూపంలో వినిపిస్తుంది. నువ్వు బాధ పడొద్దు. చెపుతున్నాగా... ఇప్పుడే నిన్ను బాగు చేయిస్తా అని దాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేశాడు.

అది కిర్రున శబ్దం చేసి ఆగిపోయింది. విరిగి ఉన్న ఊచలు దానిని ముందుకు కదలనివ్వడం లేదు.

ఊచలు అడ్డు వస్తున్న విషయం గమనించకుండా... ఎందుకు నువ్వు కూడా మనుషుల్లా ప్రవర్తిస్తావ్. ఏదో సీరియల్ హీరోయిన్ ఒక ఎపిసోడ్ కి నెలరోజులు ఏడ్చినట్టు ఏడుస్తున్నావ్. మంచిగా మాట వినాలి.

undefined

ఇప్పుడు చెప్పండి ఏమైంది అంది తను ఖంగారుగా...నేను తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తన స్పర్శలో సాంత్వన కోరుకుంటూ తనను దగ్గర...
26/07/2022

ఇప్పుడు చెప్పండి ఏమైంది అంది తను ఖంగారుగా...
నేను తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తన స్పర్శలో సాంత్వన కోరుకుంటూ తనను దగ్గరకు లాక్కున్నాను.

తన నుదిటినుంచి మొదలుపెట్టి తన కాలిపాదం వరకూ అణువణువు నా పెదాలతో స్పృశిస్తూ తనని పూర్తిగా నాలో కలుపుకున్నాను.

అరగంట గడిచాక తన చేతిపై తలపెట్టి పడుకుని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్న నా వైపు చూసి "ఎందుకండీ అంతబాధ" అంది తను తన వేళ్ళతో నా జుట్టును సవరిస్తూ..
"నా వల్ల కాదు నిన్ను వదిలివెళ్ళడం అన్నాను" నేను చిన్నపిల్లాడిలా తన గుండెలపై తలవాల్చి పడుకుంటూ.

undefined

రోడ్డు పక్కన ముసలి తాత బరువులెత్తుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. ఒక చిన్న పిల్లోడు సైకిల్ కి రెండు వైపులా పాల వ్యానులు కట్ట...
26/07/2022

రోడ్డు పక్కన ముసలి తాత బరువులెత్తుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. ఒక చిన్న పిల్లోడు సైకిల్ కి రెండు వైపులా పాల వ్యానులు కట్టుకుని ఎక్కడికో పోతున్నాడు.
చూస్తుండగానే రోడ్లన్నీ జనాలతో నిండిపోతున్నాయి.
అసలు కనీసం వీళ్ళకి తామేం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అయినా తెలుసా...?
కొంతమంది డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తున్నారు. మరి కొంతమందికి తామెందుకు బతుకుతున్నారో తమకే తెలియదు. చాలామంది మేమే గొప్ప వాళ్ళం అనుకుని విర్రవీగుతూ ఉంటారు.
చివరికి వీళ్ళందరూ వెళ్లేది ఎక్కడికి?
మూటగట్టుకుని పోయేదేంటి?

ఏంటో... అన్నీ తెలిసి కూడా ఎవరూ వాటి గురించి పట్టించుకోరు. ఆలోచించరు కదా... నవ్వొచ్చింది నాకు.

undefined

26/07/2022

వర్షం మెల్ల మెల్లగా పడుతుంది. ఇంకా పెరిగిపోయేలా కూడా ఉంది. కార్తీక్ మాత్రం బైక్ ఆపడం లేదు. తనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పడం లేదు. పల్లవికి మాత్రం మనసులో ఏవేవో ఆలోచనలు. పది నిమిషాల తర్వాత, ఊరికి కాస్త దూరంలో ప్రశాంతంగా ఉండే చోటుకు తీసుకెళ్ళి బైక్ ఆపాడు వినోద్. చుట్టూ ఎవ్వరూ లేరు. వర్షం మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువా లేదు. అప్పటికే ఇద్దరు పూర్తిగా తడిచిపోయారు. ఓ చెట్టు కింద నిశ్శబ్దంగా నిలబడ్డారు. పల్లవికి ఏమీ అర్థం కాలేదు.

"ఏంటండీ. ఇంత వర్షంలో ఇక్కడికి తీసుకొచ్చారు!? ఇక్కడేం పనుంది!?" అని చలికి చిన్నగా వణుకుతూ అడిగింది.

"నాకేం పనా...? సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నన్ను నా శ్రీమతి అడిగింది. ఇలా వర్షంలో తడుస్తూ బైక్ మీద ఊరంతా తిరగాలని ఉందని. అందుకే ఇదంతా!" అని మనసులో నిండిన ఆనందాన్ని పెదాలపై చిందిస్తూ చెప్పాడు వినోద్. పల్లవి నోట మాట రాక, ఆశ్చర్యం, ప్రేమ కలగలిసిన కళ్ళతో భర్త వైపు చూస్తుంటే...

తమ్ముడి పొలం వద్దకు వెళ్ళేసరికి పొలం అంతా శుభ్రంగా ఒక వ్యక్తి దున్నుతూ కనిపించాడు. నాకు ఎద్దులు కావాలని మా తమ్ముణ్ణి అడి...
26/07/2022

తమ్ముడి పొలం వద్దకు వెళ్ళేసరికి పొలం అంతా శుభ్రంగా ఒక వ్యక్తి దున్నుతూ కనిపించాడు. నాకు ఎద్దులు కావాలని మా తమ్ముణ్ణి అడిగాను. వాడేమో పొలం వెళ్ళి తీసుకో అన్నాడు. కాబట్టి నాకో జత ఎద్దులు ఇవ్వు అన్నాడు. పొలం దున్నుతున్న ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండానే, ఆ మూల మేస్తున్న ఎద్దుల్ని తీసుకెళ్ళు అన్నాడు. "అవునూ మా తమ్ముడు ఏం పని చేసినట్లు కనపడదు కదా. మరి ఈ సంపద ఎలా కలిగిందంటావు. అడిగాడు అన్న. "నాయనా, నేను మీ తమ్ముడి అదృష్టాన్ని. ఒక వ్యక్తికి అదృష్టం పడితే, వాళ్ళేమీ చేయకుండానే అన్ని పనులు అవుతూ ఉంటాయి." అన్నాడు.
అయితే నాకూ ఒక అదృష్ట దేవుడుంటాడా? అడిగాడు.

undefined

పరువు తీసే అంత పని నేనేమి చేయటం లేదు, నా మనసులో మాట చెప్పాను. మీరు ఎన్ని సంబంధాలు తెచ్చినా ఇదే మాట చెప్తాను, ఇంకా నన్ను ...
26/07/2022

పరువు తీసే అంత పని నేనేమి చేయటం లేదు, నా మనసులో మాట చెప్పాను. మీరు ఎన్ని సంబంధాలు తెచ్చినా ఇదే మాట చెప్తాను, ఇంకా నన్ను బలవంతం చేశారంటే బయటకు వెళ్లి తిన్నగా వాళ్లతోనే ఇష్టం లేదు పొమ్మని చెప్పేస్తాను జాగ్రత్త.

మీకు నచ్చితే అభినవ్ తోనే నాకు పెళ్లి చేయండి, లేదా జీవితకాలం నన్ను ఇలానే ఉండనీయండి. ఇప్పటివరకు నాకు ఊహ తెలిసిన తరువాత మిమ్మల్ని ఏది అడగలేదు. ఇకమీదట కూడా అభినవ్ నీ తప్ప మరి ఏమి అడగను అని ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అన్విత.

undefined

vusulu online magazineEdition 68
26/07/2022

vusulu online magazine
Edition 68

undefined

Address


Alerts

Be the first to know and let us send you an email when Vusulu online weekly magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vusulu online weekly magazine:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share