AP Regional News

  • Home
  • AP Regional News

AP Regional News 24Hours Breaking News

𝙶𝚘𝚜𝚊𝚕𝚊
11/12/2022

𝙶𝚘𝚜𝚊𝚕𝚊

NEXT ENTI ? నెక్స్ట్ ఏంటి ? | LIFE OF JYO |

11/12/2022

ఎరుమేలి లో కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న అఖిలభారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ అన్నదాన కేంద్రం. నేటి నుండి జనవరి 15 రాత్రి వరకు ఉదయం 7గంటలనుండి టిఫిన్,11గంటల నుండి భిక్ష (భోజనం )రాత్రి 6గంటల నుండి అల్పాహారం మరియు కావలసిన వారికి భోజనం రాత్రి 10గంటల వరకు అందుబాటులో ఉంది. కావున ఈ అవకాశాన్ని శబరిమల యాత్ర చేయు భక్తులు అందరికీ వాట్సాప్ ద్వారా తెలియపరచగలరు. మీ పర్సనల్ గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేయగలరు. ఏ ఒక్కరికి ఉపయోగ పడ్డా ఆకలితో ఉన్నావారి కడుపునింపిన పుణ్యం మీకు దక్కుద్ది. స్వామియే శరణం అయ్యప్ప 🙏

11/12/2022

*శ్రీకాకుళం,*
*ఇచ్చాపురం*

ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం స్వర్ణభారతి విద్యాసంస్థల ఆవరణలో మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ మాజీ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జెడి ఫౌండేషన్ అర్హతపరీక్ష కేంద్రం ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకోసం 6511 ఉద్యోగాలకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతిభావంతులైన యువకులకు మరింత ప్రోత్సాన్ని ఇచ్చేందుకు యువకులకు పరీక్షను పెట్టి ఉచిత శిక్షణకు జెడి ఫౌండేషన్ ఎంపిక చేస్తున్నది. ఈ పరీక్ష ద్వారా వెయ్యిమందిని ఎంపిక చేసి, హైదరాబాద్ ఐఏసిఈ శిక్షణ సంస్థతో కలసి జెడి ఫౌండేషన్ వారికి ఉచిత శిక్షణ ఇస్తుంది. ఎంపిక చేసిన వెయ్యి మందికి ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా శిక్షణ అందిస్తారు. మొత్తంగా ఉత్తరాంధ్రలో 21పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఇచ్చాపురం స్వర్ణ భారతి విద్యాసంస్థలను ఒక కేంద్రంగా నిర్ణయించారు. ఆదివారం ఉదయం 9:30నుంచి స్వర్ణ భారతి విద్యాసంస్థ ఆవరణలో జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్, అంటే జేడీ ఫౌండేషన్ హైదరాబాద్ ఐఏసిఈ సంస్థ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నందున ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువకులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

https://youtu.be/t4Dj5IvVO2c
10/12/2022

https://youtu.be/t4Dj5IvVO2c

ENGLISH లో స్పీచ్ అదరగొట్టిన PAVAN KALYAN | AP REPUBLIC NEWS |

10/12/2022

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్క్రోలింగ్ :

ఐఎండి సూచనల ప్రకారం

తీరం దాటిన మాండూస్ తుఫాన్

రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన తుఫాన్

సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం

దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు

చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం

రేపు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం

తుఫాను తీరం దాటినప్పటికి రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

~ డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ.

10/12/2022

*BREAKING*

*రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష*

*లోటస్ పాండ్ వద్ద కొనసాగుతున్న పోలీసుల నిర్భంధ ఖాండ*

*లోటస్ పాండ్ చుట్టూ అష్ట దిగ్బంధనం*

*పార్టీ కార్యకర్తలను లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్న పోలీస్ లు*

*కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం*

*నిన్నటి బొల్లారం పోలీస్ స్టేషన్ లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలు*

*బంజారాహిల్స్ పి ఎస్ లో 7 గురు పార్టీ నేతలు*

*ఆన్న పానీయాలు సైతం లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో కి రానివ్వాని వైనం*

*లోటస్ పాండ్ చుట్టూ ఖర్ఫ్యు వాతావరణం*

*పాదయాత్ర కి అనుమతి ఇవ్వడం,అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసే వరకు దీక్ష ఆపేది లేదంటున్న వైఎస్ షర్మిల గారు*

https://youtu.be/oolOLkVl3Bs
09/12/2022

https://youtu.be/oolOLkVl3Bs

AP REPUBLIC NEWS వార్తల సమాహారం... తెలుగు రాష్ట్రాలలో వార్తలను ఎప్పటికప్పుడు మీకందిస్తు....మీ ముందుంచడమే మాAP REPUBLIC NEWS లక్ష్యం.... ...

09/12/2022

*ఫైల్ నేమ్:-మాండాస్ తుఫాన్ వస్తుంది జాగ్రత్త..*

*రిపోర్టర్:-వి.రమేష్..కడపజిల్లా..రాయచోటి..తేది:-9.12.2022*

అన్నమయ్యజిల్లా..రాయచోటి
జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ...బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ ప్రభావంతో అన్నమయ్యజిల్లాలో రేపు ఎల్లుండి,ఆ మరసటి రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఆవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మూడు రోజులు నదులు, వాగులు,వంకలు పరిసర ప్రాంతాలకు వెళ్ళద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఉదృతంగా ప్రవహించే నదులు,వాగులు, వంకల్లోకి దాటేందుకు సాహసం చేయొద్దన్నారు.గత సంవత్సరం నవంబర్ చివరన భారీ వర్షాలు జిల్లాలో కురిశాయిన్నారు.ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి,ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ శాఖ చెప్పడం జరిగిందన్నారు. మండూస్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఎటువంటి ఇబ్బంది ఉన్న జిల్లా కమాండ్ కంట్రోల్ రూం 08561293006 నంబర్ కు సమాచారం అందివ్వాలన్నారు.

బైట్స్:-

1) గిరీషా పీఎస్ (అన్నమయ్య జిల్లా..కలెక్టర్)..

09/12/2022

స్లగ్:
చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం..
నాదెండ్ల మనోహర్

సెంటర్:విశాఖ
హరి
రీజనల్ కో ఆర్డినేటర్.
తేది:9.12.22

యాంకర్:
జనసేన పి.ఏ.సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖ నోవాటేల్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో యువశక్తి అనే కార్యక్రమాన్ని జనసేన నిర్వహిస్తోందన్నారు.అధినేత పవన్ కళ్యాణ్ పాలుగోనే అని ఈ కార్యక్రమంను ఒక యువజనోత్సవ వేడుక నిర్వహిస్తామన్నారు.ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. యువతకు భరోసా ఇవ్వడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
వారాహి విషయంలో ముందే కొందరు ప్రెస్ మీట్ పెట్టి కంగారు పడిపోతున్నారని హెద్దేవా చేశారు.మేము నిబ్బందనలు మేరకే నడుచుకుంటున్నామని,దానికి అంత రాద్దాంతం చేయాల్సిన పనిలేదన్నారు.జగన్నన్న కాలనీ ఒక పెద్ద కుంభకోణమని,వైసీపీ ప్రభుత్వం చిత్త శుద్ధి లేని ప్రభుత్వమని అన్నారు.వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మూడు నెలల్లో ఏపీ ఆస్తులు తెలంగాణాకు కట్టబెట్టేసి ఇప్పుడు రాష్ట్రం కలసి ఉంటే బాగుటుందని ప్రజలను అయోమయ స్థితిలోకి నెట్టుతున్నారని ఆరోపించారు.
ఉద్యోగులు ఒత్తిడిలో ఉన్నారని
రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందన్నారు.విజయవాడలో జరిగిన బిసి గర్జనకు
ఆర్టీసీ బస్ లు తరలించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసారని, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ని వై.ఎస్.ఆర్టీసీ గా మార్చేశారని ఆరోపించారు.

09/12/2022

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట

పెనుగంచిప్రోలుశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో రూ. 13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ విప్పు సామినేని ఉదయభాను.

దేవాలయంలో చేపట్టిన కేశఖండనశాల, కళ్యాణ మండపాలు, గదులు, ప్రత్యేక షెడ్లు నిర్మాణం చేసేందుకు 13 కోట్లతో చేపట్టే నిర్మాణాలకు మంత్రి సత్యనారాయణ. అంతకుముందు మంత్రి సత్యనారాయణ, ప్రభుత్వ విప్పుసామినేని ఉదయభాను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

09/12/2022

*చిల్లకూరు మండలం చింతవరం కొత్తపాలెం లో సోదరిపై అన్న దాడి*

*తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు*

సోదరి బాగోగులు చూడాల్సిన అన్న ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసినా ఘటన తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం కొత్తపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో బాధితురాలు గురువారం రాత్రి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. వివరాలోకి వెళితే చిల్లకూరు మండలం చింతవరం కొత్తపాలెం గ్రామానికి చెందిన మొగలిగుంట వరలక్ష్మికి పెళ్లి ఆరు నెలల బాబు ఉన్నారు. ఆరు నెలల క్రితం ప్రసవం అవడంతో కొత్తపాలెం లోని తన పుట్టింటికి వచ్చారు. అన్న వెంకయ్య ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. ఈ క్రమంలో పద్ధతి మార్చుకోమన్నందుకు సోదరి వరలక్ష్మి పై దాడి చేశారు. ఇలాంటి దాడి రెండుసార్లు జరగడంతో బాధితురాలు ఆందోళన చెందుతున్నారు. తన సోదరుడు వెంకయ్య తో పాటు స్నేహితులు కూడా వచ్చి తమను చంపుతామని బెదిరిస్తున్నట్లు మీడియా ముందు వాపోయారు. పోలీసులు న్యాయం చేయాలని కోరారు

09/12/2022

అనకాపల్లి జిల్లా..
పాయకరావుపేట...

హత్య కేసును చేదించిన పాయకరావుపేట పోలీసులు..

అభినందించిన సబ్ డివిజనల్ అధికారి కే. ప్రవీణ్ కుమార్

బద్దా శ్రీను, కోనేటి పెదబాబు,లను నిందితులుగా గుర్తించారు.

పాయకరావుపేట లో స్థానిక అంబేద్కర్ కాలనీకి చెందిన చిరుకూరి చిన్న అప్పారావు తండ్రి లేటు కిట్టమ్మ (47)ను గుర్తుతెలియని వ్యక్తులు బండ రాయితో కొట్టిచంపినట్లు చిన్న అప్పారావు కుమార్తె ఇంజరపు శ్రీదేవి భర్త రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ అప్పలరాజు సెక్షన్ 302 ఐపిసి గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి క్లూస్ టీం అండ్ డాగ్ స్కేడ్ ఆధారంతో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ నర్సీపట్నం కె.ప్రవీణ్ కుమార్ సూచనలతో పోలీస్ సిబ్బందిని ముగ్గురు ఎస్సైలను రమేష్,జోగారావు, సత్యనారాయణలతో నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా చుట్టుపక్క వారిని అడిగి తెలుసుకోగా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని స్టేషన్ కు పిలిపించి సాంకేతిక ఆధారాలు సేకరించి విచారణ చేపట్టమన్నారు. తద్వారా చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకోగా మండలానికి చెందిన మంగవరం గ్రామానికి చెందిన వ్యక్తి బద్దా శ్రీను అలియాస్ అబ్బాస్, అలాగే అచ్చుతాపురం గ్రామానికి చెందిన కోనేటి పెద్దబాబు అలియాస్ జానీ, చిన్నప్పారావు ముగ్గురు కలిసి గంజాయి త్రాగుతూ తిరిగేవారని అలాగే ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మేవారిని ఆ డబ్బులు విషయంలో వారికి తగదా జరిగినట్లు చిన్న అప్పారావు,కోనేటి పెద్దబాబును కాలుతో తన్నినట్లు,అది జీర్ణించుకోలేని పెదబాబు, బద్దా శ్రీను సహకారంతో పెద్ద బండరాయితో నిద్రిస్తున్న చిన్న అప్పారావు మొఖంపై అదిమిపెట్టి నొక్కినట్లు అంతట చిన్న అప్పారావు మృతి చెందినట్లు అంతటా నిందితులిద్దరూ పారిపోయినట్లు నిందితులను 8-12-22న తుని తాండవ నది రోడ్డు బ్రిడ్జి వద్ద అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

08/12/2022

అమరావతి

*పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పై వైసిపి చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చిన నాదెండ్ల మనోహర్*

*ఐటీ విభాగం ప్రతినిధులతో జనసేన పిఎసి‌ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం*

*నాదెండ్ల మనోహర్*

ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేసి

హైకోర్టుతో మొట్టికాయలు తిన్న వారు కూడా

జనసేన పార్టీ వారాహి వాహనం రంగు గురించి మాట్లాడటం,

నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.

వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా సిద్ధం అవుతోంది.

నిబంధనలు పరిశీలించకుండా రవాణా శాఖ వారు అనుమతి ఎలా ఇస్తారు?

ఏ మాత్రం ఆలోచన లేకుండా విమర్శలు చేయడం

వైసీపీ నాయకుల బుద్ధిరాహిత్యాన్ని, మూర్ఖత్వాన్ని తెలుపుతోంది.

ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం పార్టీ రంగులు వేసుకునే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయి.

జనసేన పార్టీ ఎల్లప్పుడు నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకుంటుంది.

పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజాహితంగా, చట్టానికి లోబడి ఉంటుంది.

వైసీపీ నాయకులకు వ్యక్తిగత విమర్శలు చేయటం అలవాటుగా మారిపోయింది.

వాళ్లకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చెప్పు చూపిస్తే భయపడ్డారు.

అది నిజాయతీకి ఉన్న దమ్ము.

పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది.

రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ కాస్త వైస్సార్సీపీ ఆర్టీసీగా మారిపోయింది.

పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ బస్సులు వాడుకోవడం సిగ్గుచేటు.

నిబంధనలు పట్టించుకోని వారు.. మాకు నిబంధనలు గురించి చెప్పే అర్హత ఉందా

వైసిపి నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రకటన ఇప్పిస్తున్నారు

08/12/2022

.నల్లరాతి క్వారీలో బ్లాస్టింగ్‌.. ఇద్దరు మృతి

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాల శివారు ప్రాంతంలోని నల్లరాతి క్వారీలో బ్లాస్టింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన భార్య భర్తలు పాలోజు వరాలు, దుర్గా భవాని క్వారీ సమీప ప్రాంతానికి బహీర్బూమికి వెళ్లారు.ఈ క్రమంలో ఒక్కసారిగా క్వారీ బ్లాస్టింగ్‌ జరగడంతో వారు రాళ్ల గుట్టల్లో ఇరుక్కుపోయి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రాళ్లల్లో ఇరుక్కున్న మృత దేహాలను వెలికి తీస్తున్నారు.ఒకరి మృతదేహం లభ్యం

08/12/2022

◼️ *|| ఎన్నికల ప్రచారానికి యుద్ద ట్యాంకర్ స్మారక రూపంలో పవన్ కల్యాణ్ ||* ◼️

హైదరాబాద్: ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతోన్న పవన్.

వారాహి పేరుతో పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వాహనం సిద్దం చేసిన జనసేన.

యుద్ద ట్యాంక్ లుక్ తో ఉన్న పవన్ ప్రత్యేక వాహనం వారాహి.

వారాహి విజువల్స్ వీడియోను స్వయంగా ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.

08/12/2022

కృష్ణాజిల్లా మచిలీపట్నం

మచిలీపట్నంలో 'కాలం రాసిన కథలు' చిత్ర తొలి పోస్టర్ రిలీజ్

తొలి పోస్టర్ ని రిలీజ్ చేసిన జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక రాము, వైసీపీ నాయకులు ఉప్పాల రాము, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ

చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్ పర్సన్ హారిక

కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరిన జడ్పీ చైర్ పర్సన్ హారిక

పెడన మండలం కట్లపల్లి గ్రామానికి చెందిన MNV సాగర్ నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'కాలం రాసిన కథలు'

కొత్త వారితో గ్రామీణ వాతావరణంతో చక్కటి కుటుంబ నేపథ్య కథతో సినిమాని తెరకెక్కించామన్న ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ MNV సాగర్

జవవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తామన్న డైరెక్టర్ MNV సాగర్

08/12/2022
08/12/2022

చిత్తూరు జిల్లా....

పూతలపట్టు నియోజకవర్గం.....

పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి 6 మంది దుర్మరణం

- ట్రాక్టర్ డ్రైవర్, తల్లి ఇద్దరు బిడ్డలు, ఇద్దరు మహిళలు మృతి

వివాహ శుభకార్యానికి వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఐరాల మండలం బలిజపల్లి, ముదిగోళం, మోటకంపల్లి గ్రామానికి చెందిన 26 మంది ట్రాక్టరు లో పూతలపట్టు మండలం జెట్టిపల్లి గ్రామానికి వివాహానికి వెళుతుండగా మార్గమధ్యంలోని లక్ష్మయ్య ఊరు సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న లోయ లాంటి ప్రదేశంలో బోల్తా పడింది. అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందగా, తల్లి ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. సంఘటన స్థలానికి పూతలపట్టు ఎస్సై హరిప్రసాద్, స్థానిక గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. రాత్రి సమయంలో జరిగిన సంఘటన కావడంతో చిమ్మ చీకట్లో అర్ధనాథాలు తప్ప పరిస్థితి అంచనా వేయలేక పోయారు. వెంటనే వాహనం వద్దకు చేరుకొని 21 మంది క్షతగాత్రులను బయటికి తీసారు. 108 అంబులెన్స్, ప్రైవేటు వాహనాల ద్వారా వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు డిఎస్పి శ్రీనివాసమూర్తి సంఘటన స్థలానికి చేరుకొని మరణించిన ఆరు మృతదేహాలను గట్టుకు చేర్చారు. అనంతరం జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా కలెక్టర్ హరి నారాయణ, జేసీ వెంకటేశ్వర్లు క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు.

మరణించిన వారి వివరాలు

ట్రాక్టర్ డ్రైవర్ సురేందర్ రెడ్డి ( మోటకం పల్లి,) వసంతమ్మ ( బలిజపల్లి ), ముది గోళంకు చెందిన రెడ్డెమ్మ, తేజ (తల్లి )చిన్నపిల్లలు దినేషా, దేషికలు గా ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

07/12/2022

ప్రజలకు చేరువయ్యేందుకు పవన్ కళ్యాణ్ కొత్త వాహనం | APREPUBLIC NEWS |

07/12/2022

స్లగ్: మూడు రాజధానుల అంశమై బిల్లు లేకుండానే ప్రజా ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ.

-- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్.

సెంటర్:విశాఖ.
తేది:7.12.22
హరి
రీజనల్ కో ఆర్డినేటర్

యాంకర్:
అసలు బిల్లు లేకుండానే మూడు రాజధానులు అంటూ పక్కదారి పట్టిస్తున్న వారిపై కేసులు పెట్టాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మంత్రులతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు మూడు రాజధానులు అంటూ ప్రచారం చేయడాన్ని రామ్ ఖండించారు.ఇదే విషయమై వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన తను ఢిల్లీ వెళ్ళబోతున్నానని ఇదే విషయమై కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. వాస్తవానికి గత డిసెంబర్ నెలలోనే మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో వెనుకకు తీసుకుందని ప్రస్తావించారు. బిల్లులో లోపాలను సవరించి పూర్తిస్థాయి బిల్లును మళ్ళీ ప్రవేశపెడతామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు 3 రాజధానుల బిల్లును ఎందుకు ప్రవేశ పెట్టలేకపోయిందని ప్రశ్నించారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టకుండానే.ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సబబని బి.వి.రామ్ సవాల్ చేశారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల కోసం ఎంతో చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ.బీసీలకు చేసింది ఏమీ లేదన్నారు. కీలకమైన అన్ని పదవులలోనూ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని. ప్రాధాన్యత లేని పోస్టులలో బీసీలు ఉన్నారు అని హెద్దేవా చేశారు.

Address


Telephone

+918247334137

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Regional News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AP Regional News:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share