మహారాష్ట్ర: ప్రపంచంలోనే అత్యంత చిన్న మహిళ జ్యోతి అమ్గే ఈరోజు నాగ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
#LokSabhaElections2024
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం ఉదయం నాగర్‌కర్నూల్‌లో గ్రానైట్ హమాలీలను ఆర్ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా హమాలీలతో కలిసి ఆర్ఎస్పీ గ్రానైట్ బండలను మోశారు.
ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఏప్రిల్ 23 వరకు కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.
కోర్టు ఆవరణలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అన్నారు. బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే సీబీఐ అడుగుతోందని అన్నారు. రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారని కవిత అసహనం వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పాల్సింది కోర్టులో చెప్పానని అన్నారు. జైలులో సీబీఐ తనను ప్రశ్నించినట్టు తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.
#Telangana - ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
#Kurnool జిల్లా ఆదోని మండలం సంతకుళ్లారు గ్రామంలో ఏటా #Holi రోజు ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. పురుషులు చీర కట్టుకుని, పువ్వులు, ఆభరణాలు ధరించి స్త్రీ వేషధారణలోకి మారిపోతారు. ఆపై గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి రతీమన్మథులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా పూజలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఇక్కడి వారి నమ్మకం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకు హాజరైన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇది మనీ లాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. అప్రూవర్‌గా మారను. తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు. మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు' అని కవిత పేర్కొన్నారు.
#Hyderabad - ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను పోలి ఉండే బాక్సుల్లో డ్రగ్స్ ప్యాక్ చేసి అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న 24 ఏళ్ల యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.3.81 లక్షలు.
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖాయమైంది. ఈ నెల 14వ తేదీన ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా తాను, తన కుమారుడు గిరి వైసీపీలో చేరుతున్నట్టు ముద్రగడ ప్రకటించారు.
పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో అయ్యేది ఏమీ లేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్తితో సహా వసూలు చేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు.
#Hyderabad - మాదన్న పేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీకి ట్రాలీ సైదాబాద్ మెయిన్ రోడ్డు పక్కన ఆపి సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో ఇది గమనించిన యువకులు ఇద్దరు ట్రాలీ వెనక కారు ఆపారు. ట్రాలీ దగ్గర ఎవరూ లేరని నిర్దారణ చేసుకొని.. సిలిండర్ తీసుకుని కారులో పారిపోయారు. ఈ దృష్యాలన్నీ సీసీ పుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.
జర్మనీ యువతి గానానికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానిని పల్లడంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్మన్, ఆమె తల్లి కలిశారు. ఈ సందర్భంగా కసాండ్రా 'అచ్యుతమ్ కేశవమ్' భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ తన చేతులతో దరువేస్తూ పాటను ఆస్వాదించారు. తర్వాత ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
#Vizag - గాజువాకలోని ఆకాశ్ బైజూస్ విద్యాసంస్థలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ నుంచి భారీగా పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు సమాచారం. కమర్షియల్ కాంప్లెక్స్‌లోని మూడు ఫ్లోర్లు దగ్ధమయ్యాయి.
#Siddipet :తిమ్మారెడ్డిపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కరీంనగర్ డెయిరీ అడ్వైజర్ హనుమంత రెడ్డి, శోభన్, ప్రశాంత్, మరొకరు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ మీదుగా పల్టీలు కొడుతూ అటువైపు మార్గంలో ఎదురుగా వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. అనంతరం రోడ్డు కిందకు వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అరేబియా సముద్ర తీరంలో నీట మునిగిన ద్వారక నగరాన్ని సందర్శించారు. ఆయన ఆక్సిజన్ మాస్కు సాయంతో సముద్రం అడుగుభాగానికి చేరుకున్నారు. అక్కడి పుణ్యభూమికి భక్తిప్రపత్తులతో ప్రత్యేక పూజలు చేశారు. తనతోపాటు తీసుకెళ్లిన నెమలి పింఛాలను వింజామరలా వీచారు. అనంతరం ఆ పింఛాలను అక్కడే ప్రతిష్ఠించారు. పద్మాసనం వేసుకుని శ్రీకృష్ణ భగవానుడ్ని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణుడు నడయాడినట్టుగా భావిస్తున్న ఆ దివ్య నగరాన్ని చూసి మోదీ ముగ్ధులయ్యారు.
#NarendraModi #Dwaraka #LordSriKrishna
#AndhraPradesh - రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం రాత్రి విజయవాడలోని పార్టీ కార్యాలయంలోనే నిద్రించారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడటానికి 'ఛలో సచివాలయం'కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కానీ ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే షర్మిలను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆమె పార్టీ ఆఫీసులోనే ఉండిపోయారు. రాత్రి అక్కడే బస చేశారు.
#Hyderabad - రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కూకట్‌పల్లిలోని కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. కారు ఇంజన్ లో నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో కారు పక్కకు ఆపి ప్రయాణికులు అందులోంచి బయటకు దిగిపోయారు. వెంటనే స్థానికులు కలగజేసుకుని కారు ఇంజన్ పైకి లేపి అందులో మట్టి పోసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
హైదరాబాద్‌కు బదిలీపై వచ్చిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొట్టె ఏడుకొండలుకు నాగర్‌కర్నూల్‌కు చెందిన యువకులు ఉద్వేగభరితంగా వీడ్కోలు పలికారు. ఏడుకొండలు మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు ఆరేళ్లపాటు సేవలందించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ I, గ్రూప్ II వంటి పోటీ పరీక్షల కోసం చాలా మంది అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందించాడు.
Follow us Newsmeter Telugu
తెలంగాణ అసెంబ్లీలో నిన్న కుల గణన తీర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. #Telangana #cmrevanthreddy
follow us Newsmeter Telugu
#AndhraPradesh - తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి చేసిన సింహాన్ని జంతుప్రదర్శనశాల అధికారులు బోన్లో బంధించారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్టు విచారణలో తేలింది.