Vizag Local Digital

  • Home
  • Vizag Local Digital

Vizag Local Digital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vizag Local Digital, Media/News Company, .

Watch vizaglocalnews News,the No 1 Telugu local news channel in VISAKHAPATNAM,VIJAYANAGARAM, SRIKAKULAM UTTHARANDHRA AP ,A 24 hour Telugu News Broadcaster, dedicated to report news across UTTHARANDHRA, Andhra Pradesh.

31/03/2022

జివిఎంసి 90వ వార్డు సెయింట్ ఆన్స్ స్కూల్
యాజమాన్యం యొక్క ఒంటెద్దు తీరు తారా స్థాయికి చేరింది.సహనం కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

30/03/2022

విశాఖ జిల్లా లో ఓ సర్పంచి అమ్మాయితో అశ్లీల నృత్యం.. వీడియో సామాజిక మాధ్యమాల్లో
చక్కర్లు...

25/03/2022

మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ థియేటర్లలో ఫ్యాన్స్‌ సందడి చేస్తుండగా ఓ వ్యక్తి మాత్రం గన్‌తో హల్చల్‌ చేశాడు...

WANTED POST READ FULL TEXT THEN CONTACTన్యూస్ రీడర్స్ & యాంకర్స్ కావలెను... Experience or freshers ఉత్తరాంధ్ర లో ప్రసారమ...
23/03/2022

WANTED POST READ FULL TEXT THEN CONTACT

న్యూస్ రీడర్స్ & యాంకర్స్ కావలెను...
Experience or freshers

ఉత్తరాంధ్ర లో ప్రసారమవుతున్న వైజాగ్ లోకల్ న్యూస్ తెలుగు టీవీ ఛానల్ లో పనిచేయుటకు మేల్ అండ్ ఫిమేల్ న్యూస్ రీడర్స్ యాంకర్స్ కావలెను..

ముఖ్య గమనిక... కొత్తగా పట్టుదలతో క్రమశిక్షణతో నేర్చుకోవాలని ఆసక్తిగలవారు తెలుగు స్పష్టంగా చదవడం, పలకడం వచ్చినవారికి మా సంస్థ నుండి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మా సంస్థలో అవకాశం కల్పిస్తాం...
శిక్షణ తరగతులు సింహాచలం విశాఖపట్నంలో నిర్వహించబడుతుంది... ఆసక్తిగలవారు వాట్సప్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు నెంబర్ 91+ 7075545558 ...

FOR MORE DETAILS CLICK LINK https://play.google.com/store/apps/details?id=com.minnu.streamplay.vlnews..........

జూన్ 22 నాటికి కోవిడ్ నాలుగో వేవ్.. ఐఐటీ కాన్పూర్ నిపుణుల అంచనాకరోనా పని ఇక అయిపోయింది, ఎండెమిక్ (సాధారణ, స్వల్ప లక్షణాల...
27/02/2022

జూన్ 22 నాటికి కోవిడ్ నాలుగో వేవ్.. ఐఐటీ కాన్పూర్ నిపుణుల అంచనా
కరోనా పని ఇక అయిపోయింది, ఎండెమిక్ (సాధారణ, స్వల్ప లక్షణాలతో కూడిన ఫ్లూ)గా మారిపోయిందన్న అంచనాలతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటడగా.. ఐఐటీ కాన్పూర్ నిపుణులు కాస్త రుచించని అంశాన్ని ప్రకటించారు. కరోనా నాలుగో విడత జూన్ 22 నాటికి విరుచుకుపడుతుందన్న అంచనాను వ్యక్తం చేశారు. ఇది అక్టోబర్ 24 వరకు కొనసాగుతుందన్నది వారి విశ్లేషణ.

ఎంత మంది టీకాలు తీసుకున్నారు, బూస్టర్ డోస్, కొత్త కరోనా మ్యుటెంట్ల (రకాలు)పై నాలుగో విడత కరోనా తీవ్రత ఆధారపడి ఉంటుందని ఐఐటీ కాన్పూర్ కు చెందిన పరిశోధకులు తాజాగా ప్రకటించారు. వీరి అంచనాలు మెడిరిక్స్ లో ప్రచురితమయ్యాయి. కరోనా నాలుగో విడత వస్తే కనీసం నాలుగు నెలల పాటు ఉంటుందని.. ఆగస్ట్ 15 నుంచి 31 మధ్య కేసుల సంఖ్య తారా స్థాయికి చేరుకోవచ్చని వీరు అంచనా వేశారు.

కరోనా మూడో విడత గురించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. కొద్ది రోజుల పాటే ఉంటుందని వారు ముందుగా అంచనా వేసినట్టుగానే ఒమిక్రాన్ రెండు నెలల్లోనే ముగిసిపోయింది. కరోనా తొలిసారి 2020 జనవరి 30న వెలుగు చూడగా, అక్కడి నుంచి 936 రోజులకు నాలుగో విడత మొదలవుతుందని వారి గణంకాల ప్రక్రియ తెలియజేస్తోంది. బూట్ స్ట్రాప్ మెథడాలజీ ఆధారంగా ఈ అంచనాలు వేశారు. నిజానికి నాలుగో విడత ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా మొదలు కాలేదు.

కీవ్ అణుధార్మిక వ్యర్థాల ప్లాంట్ పై రష్యా రాకెట్ దాడి.. అణుధార్మికత అనుమానాలు!కీవ్ పై దాడులను రష్యా మరింత తీవ్రం చేస్తోం...
27/02/2022

కీవ్ అణుధార్మిక వ్యర్థాల ప్లాంట్ పై రష్యా రాకెట్ దాడి.. అణుధార్మికత అనుమానాలు!


కీవ్ పై దాడులను రష్యా మరింత తీవ్రం చేస్తోంది. వందలాది క్షిపణులు, రాకెట్లను ప్రయోగిస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. అయితే, ఆ దాడులకు అంతే దీటుగా ఉక్రెయిన్ కూడా బదులిస్తోంది. కాగా, ఇవాళ ఉదయం కీవ్ కు ఆవల ఉన్న అణు ధార్మిక వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే కేంద్రంపై రష్యా రాకెట్ దాడికి పాల్పడింది. ప్రభుత్వ అధీనంలోని ‘రేడాన్’ అనే రేడియో యాక్టివ్ డిస్పోజల్ సైట్ ను ధ్వంసం చేసింది.

దాడి ఘటనను రేడాన్ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫోన్ల ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం వారంతా షెల్టర్లలో ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కాల్పులు, ప్రతిదాడులతో దద్దరిల్లిపోతోంది. దీంతో అక్కడ నష్టమెంత అన్నదానిపై అధికారులు తేల్చలేకపోతున్నారు. అణుధార్మికతను గుర్తించే ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేయకుండా ఆగిపోయింది. క్షిపణులు పడుతున్న దానిని అక్కడి సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేశాయి. దాడులు, ప్రతిదాడులు ముగిసిన తర్వాత పోర్టబుల్ పరికరాల ద్వారా అక్కడి అణుధార్మికతను గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎస్ఎన్ఆర్ఐయూ అంచనాల ప్రకారం.. రేడాన్ కు ఆవల ఉన్న ప్రాంతంలోని ప్రజలకు రేడియేషన్ ముప్పు లేదని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

ఉక్రెయిన్-రష్యా సంక్షోభం.. భారత్ సాయాన్ని కోరిన అమెరికాఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి భారత్ సాయాన్న...
27/02/2022

ఉక్రెయిన్-రష్యా సంక్షోభం.. భారత్ సాయాన్ని కోరిన అమెరికా
ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి భారత్ సాయాన్ని అమెరికా కోరింది. అంతర్జాతీయ ఒడంబడికలకు కట్టుబడి రష్యా నడుచుకునేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని భారత్ కు సూచించింది. ఉక్రెయిన్ అంశంలో పాశ్చాత్య సమాజం అభిప్రాయాలకు భారత్ మద్దతుగా నిలవకపోవడం పట్ల అమెరికా అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సంక్షోభం భారత్, అమెరికా సంబంధాలపై ప్రభావం చూపిస్తుందా? అంటూ మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.

దీనికి అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ స్పందించారు. ‘‘భారత్-రష్యా మధ్య ఉన్న బంధం.. భారత్-అమెరికాతో ఉన్న బంధం కంటే భిన్నమైనదని మా అభిప్రాయం. అయితే అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా అనుసరించేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురాగలిగిన దేశాలు తమవంతు కృషి చేయాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అభిప్రాయం’’ అని నెడ్ ప్రైజ్ చెప్పారు.

ఈ తరహా అంతర్జాతీయ ఒప్పందాలే భారత్ కు, అమెరికాకు, ఐరోపా భాగస్వామ్య దేశాలకు, రష్యాకు సైతం గత 70 ఏళ్ల కాలంలో ప్రయోజం చేకూర్చినట్టు ప్రైజ్ తెలిపారు. అంగీకరించిన నిబంధనలు, ఒప్పందాలకు ప్రపంచ దేశాలు కట్టుబడి ఉండడం, వాటి పరిధిలో నడుచుకోవడమే అంతర్జాతీయ నడవడిక. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో భారత ప్రధాని మోదీ ఇప్పటికే టెలిఫోన్ లో సంభాషించడం తెలిసిందే. రష్యాతో దశాబ్దాలుగా భారత్ కు బలమైన బంధం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ సహకారాన్ని అమెరికా కోరడం వ్యూహాత్మకంగా భావించాలి.

నాలుగో రోజు కొన‌సాగుతోన్న యుద్ధం.. చ‌మురు డిపోపై క్షిపణులు.. గాలి విష‌పూరితంగా మారే ముప్పుర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య నాలుగో ...
27/02/2022

నాలుగో రోజు కొన‌సాగుతోన్న యుద్ధం.. చ‌మురు డిపోపై క్షిపణులు.. గాలి విష‌పూరితంగా మారే ముప్పు
ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య నాలుగో రోజు యుద్ధం కొన‌సాగుతోంది. వాసిల్కివ్ లోని ఓ చ‌మురు డిపోపై ర‌ష్యా క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో గాలి విష‌పూరితంగా మారే ముప్పు ఉంద‌ని అధికారులు హెచ్చ‌రించారు. అలాగే, ఈశాన్య న‌గ‌రం ఓఖ్టిర్కాలోనూ ర‌ష్యా దాడులు జ‌ర‌ప‌డంతో ఓ ఏడేళ్ల బాలిక స‌హా ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌టించారు.

ఇక కీవ్‌లో బాంబుల మోత విన‌ప‌డుతూనే ఉంది. క్షిప‌ణుల‌తోనూ ర‌ష్యా దాడులు జ‌రుపుతోంది. కీవ్ లోని అపార్ట్‌మెంట్ వ‌ద్ద కూడా బాంబులతో ర‌ష్యా దాడులు జ‌రుపుతుండ‌డంతో అమాయ‌క ప్ర‌జ‌లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కీవ్‌ను అధీనంలో తెచ్చుకుంటే ర‌ష్యా ల‌క్ష్యం పూర్త‌యిన‌ట్లుగానే భావించాలి.

ర‌ష్యా ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా ఉక్రెయిన్‌పై చ‌ర్య‌లు కొన‌సాగిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నేతృత్వంలో ఆ దేశ సైన్యం ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. అయితే, తాము ఆయుధాలను వీడబోమ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు స్ప‌ష్టం చేశారు. కీవ్‌లో సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను కూడా యుద్ధానికి సిద్ధం చేశారు. ఉక్రెయిన్‌కు ప‌లు దేశాలు ఆయుధాలు అందిస్తూ సాయ‌ప‌డుతున్నాయి.

వేల మంది వాలంటీర్ల‌కు ఆయుధాలు ఇచ్చారు. యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్‌లోని విదేశీయులు భయం గుప్పిట్లో ఆ దేశాన్ని వీడి ప్ర‌త్యేక విమానాల్లో సొంత దేశాల‌కు వెళ్లే ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. భార‌తీయ విద్యార్థుల‌ను తీసుకురావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ర‌ష్యా దాడి భ‌యంతో బంక‌ర్లు, మెట్రో స్టేష‌న్ల‌లోని అండ‌ర్‌గ్రౌండ్ల‌లో త‌లదాచుకున్న ప్ర‌జ‌లు ఆహారం దొర‌క‌క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉక్రెయిన్ యుద్ధాన్నీ వదలని వ్యాపారులు.. వంటనూనెల ధరలను అమాంతం పెంచేసిన వైనంస్థానిక వ్యాపారులకు ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ య...
27/02/2022

ఉక్రెయిన్ యుద్ధాన్నీ వదలని వ్యాపారులు.. వంటనూనెల ధరలను అమాంతం పెంచేసిన వైనం
స్థానిక వ్యాపారులకు ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భలేగా కలిసొచ్చింది. ఎప్పుడు సందు దొరుకుతుందా? రేట్లు పెంచేద్దామా అని చూస్తున్న వ్యాపారాలకు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం లాభాలు ఆర్జించి పెడుతోంది. యుద్ధంతో భారత్‌కు ఎలాంటి సంబంధాలు లేకున్నా.. నూనె మిల్లులన్నీ భారత్‌లోనే ఉన్నా వాటి ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నూనె ధరలు గంటల వ్యవధిలోనే కిలోకు రూ. 20 వరకు పెరిగిపోయాయి.

శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో పామాయిల్ లీటర్ ధర రూ. 128 ఉండగా, మధ్యాహ్నం 12 గంటలకు ఏకంగా రూ. 149 అయింది. రెండు గంటల్లోనే ఏకంగా రూ. 21 పెరిగిపోవడం వినియోగాదారులను నివ్వెరపరిచింది. ఎందుకిలా అని ప్రశ్నించిన వినియోగదారులకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చెబుతున్నారు. యుద్ధం కారణంగా వంటనూనెల ధరలు పెరిగాయిని చెబుతుండడంతో వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు, కరోనా సమయానికి మించి ధరల పెరుగుదల ఉండే అవకాశం ఉందని భయపెడుతున్నారు. అక్కడే కాదు, విజయవాడ వ్యాప్తంగానూ ధరలు ఇలానే ఉన్నాయి. ఆయా దుకాణాల ముందు ధరలు పెరిగినట్టు బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న దానికి, ఏమాత్రం పొంతన లేకుండా ఉండడం గమనార్హం. నూనెల ధరల పెరుగుదలతో చిల్లర వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెర్నోబిల్‌లో ఒక్కసారిగా పెరిగిన రేడియేషన్ స్థాయులు.. 20 రెట్లు అధికంగా రేడియేషన్ విడుదలఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన...
27/02/2022

చెర్నోబిల్‌లో ఒక్కసారిగా పెరిగిన రేడియేషన్ స్థాయులు.. 20 రెట్లు అధికంగా రేడియేషన్ విడుదల
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా ఇప్పటికే అక్కడి చెర్నోబిల్ అణువిద్యుత్ కర్మాగారాన్ని ఆక్రమించుకుంది. ఇప్పుడా విద్యుత్ కేంద్రం నుంచి రేడియేషన్ స్థాయులు ప్రమాదకరంగా విడుదలవుతున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. సాధారణం కంటే ఏకంగా 20 రెట్లు అధికంగా రేడియేషన్ విడుదలవుతున్నట్టు పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడిన కొన్ని గంటల వ్యవధిలోనే దాని రాజధాని కీవ్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని తన అధీనంలోకి తీసుకుంది.

సాధారణంగా చెర్నోబిల్ చుట్టూ 4 వేల చదరపు కిలోమీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ వాహన సంచారం ఉండదు. రేడియేషన్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో రేడియేషన్ ప్రభావం అంతగా ఉండదు. అయితే, ఇప్పుడా ప్రాంతాన్ని రష్యా సైన్యం ఆక్రమించుకోవడంతో వాహన సంచారం ఎక్కువైంది. ఫలితంగా అణువ్యర్థాలు యాక్టివేట్ అయి ఒక్కసారిగా రేడియేషన్ స్థాయులు పెరిగాయి.

వాహన సంచారం తగ్గితే రేడియేషన్ మళ్లీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, సైనిక చర్య జరిగితే మాత్రం పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని షెఫీల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్లెయిర్ కార్క్‌హిల్ తెలిపారు. కాగా, 1986లో చెర్నోబిల్ నుంచి వెలువడిన రేడియేషన్ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ప్రపంచంలోనే దీనిని అత్యంత ఘోరమైన ప్రమాదంగా చెబుతారు. ఈ ఘటన తర్వాత 2000వ సంవత్సరంలో ఇక్కడ అణుకార్యక్రమాన్ని పూర్తిగా మూసివేశారు.

రాయల్ ఎన్ ఫీల్డ్ కు బీఎస్ఏ పోటీ... భారత రోడ్లపై బ్రిటన్ బైకులు!బర్మింగ్ హామ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ లిమిటెడ్... సంక్షిప్త...
05/12/2021

రాయల్ ఎన్ ఫీల్డ్ కు బీఎస్ఏ పోటీ... భారత రోడ్లపై బ్రిటన్ బైకులు!
బర్మింగ్ హామ్ స్మాల్ ఆర్మ్స్ కంపెనీ లిమిటెడ్... సంక్షిప్తంగా బీఎస్ఏ. బ్రిటన్ కు చెందిన ఈ సంస్థ చాన్నాళ్లుగా భారత్ లో సైకిళ్ల వ్యాపారం చేస్తోంది. సైకిళ్లే కాదు బైకులు కూడా తయారు చేస్తుందీ సంస్థ. వందేళ్ల కిందట మోటార్ సైకిల్ రూపొందించిన ఘనత బీఎస్ఏ సొంతం. తాజాగా తన కొత్త మోడల్ బైకులను భారత్ లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇటీవలే బీఎస్ఏ తన లేటెస్ట్ మోడల్ గోల్డ్ స్టార్ 650ని ఆవిష్కరించింది. డిసెంబరు 4 నుంచి 12వ తేదీ వరకు బర్మింగ్ హామ్ లో జరిగే ఎక్స్ పోలో తన కొత్త మోడల్ ను ప్రదర్శించనుంది. బీఎస్ఏ గోల్డ్ స్టార్... భారత్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్, రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 మోడళ్లకు గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
గోల్డ్ స్టార్ బ్రాండ్ 1938-63 మధ్య కాలంలో అనేక దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. 350 సీసీ-500సీసీ రేంజ్ లో ఇది పేరెన్నికగన్న బైక్ గా మన్ననలు అందుకుంది. ఈ బ్రాండ్ ను బీఎస్ఏ చేజిక్కించుకుంది. పాత డిజైన్ లో పెద్దగా మార్పులు చేయకుండా, ఇంజిన్ ను మాత్రం 650 సీసీతో శక్తిమంతం చేసింది. ఈ కొత్త బైక్ లో 650 సీసీ సింగిల్ సిలిండర్ డీఓహెచ్ సీ ఇంజిన్ అమర్చారు. ఈ బైక్ ను బ్రిటన్ లో డిజైన్ చేశారు. ఉత్పత్తి కూడా బ్రిటన్ లోనే ఉంటుందని మార్కెట్ వర్గాలంటున్నాయి. బీఎస్ఏ బైకులను క్లాసిక్ లెజెండ్స్ సంస్థ మార్కెటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఏకే-47 రైఫిళ్ల కొత్త వెర్షన్ ఏకే-203... అమేథీలో తయారీకి కేంద్రం సన్నాహాలుఏకే-47... ఇదొక అస్సాల్ట్ రైఫిల్. దాదాపు ఏడు దశా...
05/12/2021

ఏకే-47 రైఫిళ్ల కొత్త వెర్షన్ ఏకే-203... అమేథీలో తయారీకి కేంద్రం సన్నాహాలు
ఏకే-47... ఇదొక అస్సాల్ట్ రైఫిల్. దాదాపు ఏడు దశాబ్దాల కిందట నాటి సోవియట్ యూనియన్ లో రూపుదిద్దుకున్న ఈ ఆయుధం నేడు ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పుడు దీనికి సరికొత్త వెర్షన్ వచ్చింది. దాన్ని ఏకే-203గా పిలుస్తున్నారు. ఇది ఏకే-47తో పోల్చితే అత్యాధునికమైనది. ఇది ఎంతో తేలికైనది, శక్తిమంతమైనది. 3.8 కేజీల బరువున్న ఈ తుపాకీతో 400 మీటర్ల నుంచి 800 మీటర్ల రేంజిలో కాల్పులు జరిపే వీలుంటుంది. 300 మీటర్ల వరకు గురితప్పకుండా కాల్చవచ్చు.

దీనికి 30 రౌండ్, 50 రౌండ్ డిటాచబుల్ మ్యాగజైన్లను అమర్చుకోవచ్చు. నిమిషానికి 700 రౌండ్లు కాల్పులు జరపడం దీని ప్రత్యేకత.

ఈ ఆయుధంపై భారత్ అత్యంత ఆసక్తి చూపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో 5 లక్షల ఏకే-203 రైఫిళ్లను తయారుచేసేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా అత్యాధునిక రైఫిళ్లను దేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు భారత్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఏకే-203ల ఉత్పత్తికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ ఒప్పందం కుదిరితే రైఫిళ్ల తయారీకి సంబంధించిన డేటా అంతా రష్యా... భారత్ కు బదలాయిస్తుంది.

మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ నరమేధం... 31 మంది బలిఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో అల్ ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రదాడికి పాల్పడిం...
05/12/2021

మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ నరమేధం... 31 మంది బలిఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో అల్ ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘటనలో 31 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. బండియగర పట్టణం వద్ద రోడ్డుపై ట్రక్కు వెళుతుండగా, అల్ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన టెర్రరిస్టులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాంతో ఆ ట్రక్కు మంటల్లో చిక్కుకుంది.

ఆ సమయంలో ట్రక్కులో 50 మంది వరకు ఉన్నారని బండియగర నగర మేయర్ హుస్సేనీ సాయే వెల్లడించారు. ఈ ఘటనలో అత్యధికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారని తెలిపారు. పలువురు గాయపడ్డారని, ఇద్దరి జాడ తెలియడంలేదని హుస్సేనీ వివరించారు. ఈ దారుణానికి ఇంతవరకు ఎవరూ బాధ్యత ప్రకటించనప్పటికీ, ఇది అల్ ఖైదా అనుబంధ గ్రూపు పనేనని భావిస్తున్నారు.

ఇండోనేషియాలో 6.0 తీవ్రతతో భారీ భూంకంపంఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.0గా నమోదైంది...
05/12/2021

ఇండోనేషియాలో 6.0 తీవ్రతతో భారీ భూంకంపం
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. ఉదయం 5.17 గంటలకు భూమి కంపించిందని ఇండోనేషియా వర్గాలు వెల్లడించాయి. ఇండోనేషియాలోని టోబెలా ప్రాంతానికి 259 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జీఎస్ (యూఎస్ జియోలాజికల్ సర్వే) పేర్కొంది.

భూమి లోపల 174.3 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. ప్రాణ, ఆస్తి నష్టం, సునామీ హెచ్చరికల వంటి వివరాలు తెలియరాలేదు.

చిత్తూరు జిల్లాలో అంతుచిక్కని వింతశబ్దాలు...ప్రజల్లో భయాందోళనలుచిత్తూరు జిల్లాలోని కౌండిన్య అటవీప్రాంతం పరిధిలో కొంతకాలం...
05/12/2021

చిత్తూరు జిల్లాలో అంతుచిక్కని వింతశబ్దాలు...ప్రజల్లో భయాందోళనలు
చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అటవీప్రాంతం పరిధిలో కొంతకాలంగా వింత శబ్దాలు వినిపిస్తుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, బైరెడ్డిపల్లి మండలాలను ఆనుకుని కౌండిన్య అటవీప్రాంతం విస్తరించి ఉంది.

పలమనేరు మండలం నలగాంపల్లి, సంబార్ పూర్, కరిడిమొడుగు గ్రామాలతో పాటు నల్లగుట్టపల్లి, ఎస్సీ కాలనీ, ఓటేరుపాళెం, తిమ్మయ్యగారిపల్లి గ్రామాల్లో వింత శబ్దాలు వస్తున్నట్టు ప్రజలు చెబుతున్నారు. శబ్దాలు రావడం మాత్రమే కాదు, భూమి అదిరనట్టవుతోందని, గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని స్థానికులు తెలిపారు. అంతేకాదు, కళ్లు తిరిగినట్టవుతోందని అక్కడివారు వెల్లడించారు.

ఈ వింత శబ్దాలతో హడలిపోతున్న ప్రజలు ఇళ్లను వదిలి ఊరు బయట ఉన్న గుట్టలపైకి చేరుకుంటున్నారు. గత గురువారం రాత్రంతా వారు గుట్టలపైనే ఉన్నట్టు తెలిసింది.

కాగా, దీనిపై ఓ వాదన వినిపిస్తోంది. గతంలో అక్కడ భూగర్భజలాలు చాలా కిందికి వెళ్లిపోయాయని, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మళ్లీ భూగర్భ జలాలు పైకి ఉబికి వస్తున్నాయని, ఈ కారణంగానే భూమి పొరల్లోని ఖాళీల్లోకి నీరు ప్రవేశిస్తున్నందున శబ్దాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. దీనిపై నిపుణులు పరిశీలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

నాగాలాండ్‌లో భద్రతా దళాల పొరపాటు.. మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు.. 13 మంది మృతినాగాలాండ్‌లో భద్రతా దళాలు పొరపాట...
05/12/2021

నాగాలాండ్‌లో భద్రతా దళాల పొరపాటు.. మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు.. 13 మంది మృతి
నాగాలాండ్‌లో భద్రతా దళాలు పొరపాటు పడ్డాయి. మిలిటెంట్లుగా భావించి జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న సాయంత్రం మోన్ జిల్లా ఓటింగ్‌లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన వారందరూ బొగ్గు గని కార్మికులుగా గుర్తించారు. వారు విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

మిలిటెంట్ల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. అదే సమయంలో పనులు ముగించుకుని వస్తున్న కార్మికులను మిలిటెంట్లుగా పొరబడిన భద్రతా దళాలు ఒక్కసారిగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 11 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు భద్రతా దళాల వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పౌరుల మృతిపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయ్‌ప్యూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ‘సిట్‌’తో దర్యాప్తు చేయిస్తామన్నారు.

ప్రమాదకరంగా ఆర్కే బీచ్.. ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రంజవాద్ తుపాను కారణంగా విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే ...
05/12/2021

ప్రమాదకరంగా ఆర్కే బీచ్.. ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
జవాద్ తుపాను కారణంగా విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్ లో సముద్రం ముందుకొచ్చింది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్లు భూమి కోతకు గురైంది. పలు చోట్ల భూమి కుంగిపోయింది. దీంతో సమీపంలోని పిల్లల పార్కు ప్రహరీ గోడ కూలిపోయింది. బల్లలు విరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆర్కే బీచ్ లోకి పర్యాటకులను నిషేధించారు. ఎవరూ రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

కాగా, తుపాను ఇవాళ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరి తీరాన్ని తాకే అవకాశముంది. ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కాగా, దాని ప్రభావం వల్లే సముద్రం ముందుకొచ్చి ఉండొచ్చని అంటున్నారు.

భారత ప్రజల చిన్నచిన్న ఆశలు సైతం ఆవిరైపోతున్నాయి: నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీభారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ ఆర్...
05/12/2021

భారత ప్రజల చిన్నచిన్న ఆశలు సైతం ఆవిరైపోతున్నాయి: నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తూ.. భారత ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా 2019 స్థాయి కంటే కిందే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల చిన్నచిన్న ఆశలు సైతం చితికిపోతున్నాయని అన్నారు. అయితే, ఇందుకు తాను ఎవరినీ బాధ్యులను చేయాలనుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గమ్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలో ఈ సందర్భంగా వారికి సూచించారు.

ఢిల్లీలోని జేఎన్‌యూలో చదువుకుంటున్న సమయంలో తాను 10 రోజులు తీహార్ జైలులో గడిపినట్టు చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లాలనుకుంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనతో తన భవిష్యత్తు ఇక ముగిసినట్టేనని చాలామంది బెదిరించారని, కానీ అలా జరగలేదని గుర్తు చేసుకున్నారు. నచ్చిన రంగంలో రాణించేందుకు ధైర్యంగా ముందడుగు వేయాలని విద్యార్థులకు సూచించిన అభిజిత్.. దిగ్గజ దర్శకులు సత్యజిత్ రే, శ్యామ్ బెనగళ్ ఇద్దరూ ఎకనామిక్స్‌లో పట్టభద్రులని గుర్తు చేశారు. కానీ వారు భిన్నమైన రంగంలోకి ప్రవేశించి భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఒకే కరోనా వేరియంట్ లో 32 ఉత్పరివర్తనాలు... మూడు దేశాల్లో 'సూపర్ స్ట్రెయిన్'కరోనా వైరస్ రెండేళ్ల కిందట చైనాలో వెలుగు చూసి...
24/11/2021

ఒకే కరోనా వేరియంట్ లో 32 ఉత్పరివర్తనాలు... మూడు దేశాల్లో 'సూపర్ స్ట్రెయిన్'

కరోనా వైరస్ రెండేళ్ల కిందట చైనాలో వెలుగు చూసినప్పటికీ ఇప్పటికీ అనేక వేరియంట్లుగా విస్తరించింది. కొన్ని వేరియంట్లలో ఒకట్రెండు ఉత్పరివర్తనాలు చోటుచేసుకోవడం సాధారణమైన విషయం. తాజాగా దక్షిణ ఆఫ్రికా, బోట్సువానా, హాంకాంగ్ లో వెలుగు చూసిన ఓ కొత్త వేరియంట్ లో ఏకంగా 32 ఉత్పరివర్తనాలను గుర్తించారు. ఇన్ని మ్యుటేషన్లు ఉన్న ఈ సూపర్ స్ట్రెయిన్ ను ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఏమేరకు అడ్డుకుంటాయన్నది శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.

గతంలో పలు దేశాల్లో విస్తృతంగా వ్యాపించిన బి.1.1 కరోనా వేరియంట్ నుంచి ఈ కొత్త వేరియంట్ రూపాంతరం చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు కొత్త వేరియంట్ కారణంగా నమోదైన కేసులు 10 మాత్రమే. కానీ దీంట్లో భీతిగొలిపే రీతిలో ఉన్న జన్యు ఉత్పరివర్తనాల రీత్యా మున్ముందు మరిన్ని కేసులు వెల్లడవుతాయని, ఇప్పటికే వెలుగులోకి రాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా హాంకాంగ్ లో ఈ వేరియంట్ ఆనవాళ్లు బయటపడ్డాయి. తద్వారా ఈ వేరియంట్ ఏ ప్రాంతంలో అయినా మనుగడ సాగించగలదని అర్థమవుతోంది. దీనిపై లండన్ ఇంపీరియల్ కాలేజ్ కి చెందిన వైరాలజీ నిపుణుడు డాక్టర్ టామ్ పీకాక్ స్పందిస్తూ, ఒకే వేరియంట్ లో రెండు ప్రధాన ఉత్పరివర్తనాలు కనిపించడం తాను మొదటిసారి చూస్తున్నానని వెల్లడించారు. ఈ కొత్త కరోనా రకంలో కనిపస్తున్న జన్యు ఉత్పరివర్తన క్రమం నిజంగా బీభత్సకరంగా ఉందని పేర్కొన్నారు.

ఆసియా దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించడం అంటే ఆయా దేశాల జనాభా రీత్యా మరింతగా విస్తరిస్తుందని అంచనా వేశారు. దీంట్లోని స్పైక్ మ్యుటేషన్ల అమరికను పరిశీలిస్తే ఇది మానవదేహంలోని మోనోక్లోనల్ యాంటీబాడీలను సులభంగా ఏమార్చగలదని డాక్టర్ టామ్ పీకాక్ వివరించారు.

13/11/2021

నీ బైక్‌ స్టంట్‌ అదిరింది ..! Vizaglocalnews Cha Nnel www.vizaglocalnews.in

13/11/2021

Perni Nani vs Nara Lokesh || Perni Nani comments on Nara Lokesh

12/11/2021

జాతరను తలపిస్తున్న..
అమరావతి రైతుల పాదయాత్ర..

12/11/2021

వర్షంలో కోణార్క్ టెంపుల్ ...ఎంత అందంగా ఉందో చూడండి..

12/11/2021

NAMASTHEE

12/11/2021

భారీ వర్షాలు..
చెన్నైలో ఇదీ పరిస్థితి..

12/11/2021

వందేందిరా.. చీప్ గా.. ఒక బండికి వందైతే ఆరు బండ్లుకి ఎంతైంది.. ? పోలీస్ దబాయింపు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Vizag Local Digital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vizag Local Digital:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share