ITDP Chandragiri

  • Home
  • ITDP Chandragiri

ITDP Chandragiri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITDP Chandragiri, News & Media Website, .

05/11/2024

పబ్లిసిటీ పిచ్చితో ఒక మైనర్ బాలికను, వాళ్ల కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగిన చెవిరెడ్డి.

05/11/2024

చెవిరెడ్డి నీచ రాజకీయాలు... మరో నిదర్శనం….



05/11/2024

ఒక తండ్రి ఆవేదన …..

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో జరిగిన ఒక సంఘటనపై ఏమి జరగలేదని నివేదికలు స్పష్టంగా ఉన్న చెవిరెడ్డి సొంత పార్టీని సైతం స్వలాభం మరియు రాజకీయ లబ్ధి కోసం వైసిపి పార్టీని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజకీయాల కోసం ఒక ఆడబిడ్డపై నింద వేయడం అన్యాయం. బ్లూ మీడియాలో, సోషల్ మీడియాలో దుష్ప్రచారం.


తిరుపతి రూరల్ మండలం రఘునాథ రిసార్ట్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మరియు టిడ...
04/11/2024

తిరుపతి రూరల్ మండలం రఘునాథ రిసార్ట్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మరియు టిడిపి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్చార్జిలు మరియు నాయకులతో కలసి సమావేశం నిర్వహించడం జరిగింది.



03/11/2024

స్వయంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు జిల్లా కలెక్టర్ గారితో కలిసి బుల్డోజర్ తోలుతూ రోడ్డు మరమ్మత్త కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.



02/11/2024

చంద్రగిరి నియోజకవర్గంలో దీపం -2.0లో భాగంగా లబ్ధిదారులకు ఉచిత సిలిండర్ లు పంపిణీ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

పాకాల మండలం మహిళల దయనిందిన జీవితాలలో వెలుగులు నింపటానికి దీపం...2 పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివ...
01/11/2024

పాకాల మండలం

మహిళల దయనిందిన జీవితాలలో వెలుగులు నింపటానికి దీపం...2 పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. పాకాల మండలం, దామలచెరువు పంచాయితీలో తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే నాని దీపం -2 మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గారికి నాయకులు, మహిళలు, యువత అపూర్వ స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో అడుగడుగున హారతులు పడుతూ సభా వేదికకు అతిధులను ఆహ్వానించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా వేదిక వద్ద ప్రజల నుండి ఎమ్మెల్యే నాని వినతులు స్వీకరించారు. అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉమ్మడి మేనిఫెస్టో "సూపర్ సిక్స్" పథకంలో పొందుపరిచిన విధంగా మహిళలకు మూడు ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడానికి పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టారని తెలిపారు. అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 66 వేల మంది లబ్ధిదారులకు దీపం పధకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస‌్తున‌్నట‌్టు వివరించారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అప్పుల కుంపటిని మిగిల్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందటానికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఇకేవైసి చేసుకోవాలన‌్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో విడతల వారీగా అమలు చేయడానికి పూనుకున్నదని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని నిత్యం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. పాకాల మండలంలో సుమారు 16 వేల 126 మంది లబ్ధిదారులకు దీపం పధకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ చేయడం జరిగుతున‌్నదని వివరించారు. సంవత్సరంలో మూడు విడతల్లో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుండి కుప్పం వరకు రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ నాడు దీపం పధకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ చేస‌్తున‌్నట‌్టు పేర‌్కొన‌్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పైన లబ్ధిదారుల నుండి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టరు తెలిపారు. కొంతమంది మహిళలకు ఉచిత సిలిండర్ లను ఎమ్మెల్యేతో కలిసి జాయింట్ కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం గ్యాస్ సరఫరా వాహనాలను జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, యువత, మహిళలు, ఉచిత సిలిండర్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.



చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు నింపాలని కోరుకు...
31/10/2024

చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.

ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ..

మీ పులివర్తి నాని,
చంద్రగిరి ఎమ్మెల్యే.

30/10/2024

చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి కాంతులతో మీ ఇంట వెలుగులు నిండాలని దీపం పథకంలో భాగంగా అర్హులందరికీ ఉచిత సిలిండర్ పంపిణీ.

పులివర్తి నాని,
చంద్రగిరి ఎమ్మెల్యే.



తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం 2024-26తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప...
29/10/2024

తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం 2024-26

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి.

క్రింది క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వంద రూపాయలు చెల్లించి మీ సభ్యత్వాన్ని పొందగలరు.

పులివర్తి నాని,
చంద్రగిరి ఎమ్మెల్యే.



28/10/2024

చంద్రగిరి నియోజకవర్గానికి త్వరలోనే ఉపాధి అవకాశాలు వస్తాయి

పులివర్తి నాని,
చంద్రగిరి ఎమ్మెల్యే.



27/10/2024

నిజం గెలవాలి...నిజమే గెలిచింది...

మన చంద్రగిరి చరిత్రలో ఆరోజు రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేసిన రోజు..

మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా "నిజం గెలవాలి" అనే కార్యక్రమంతో తమ సొంత ఊరిలో మొట్టమొదటి సారిగా రాజకీయ సభలో మన అమ్మ భువనేశ్వరమ్మ గారు పాల్గొన్న రోజు..

వేల సంఖ్యలో మహిళలతో సభా స్థలం ఉక్కిరిసిపోయేలా చంద్రగిరి మహిళ బలం దేశానికి తెలియజేసిన రోజు..

ఆనాటి చంద్రగిరి టిడిపి ఇంచార్జ్ నేటి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో వైసిపి పతనానికి అడుగులు పడిన రోజు

చరిత్ర మరిచిపోని ఆరోజుకు నేటికీ సరిగ్గా ఒక సంవత్సరం.

26/10/2024

"పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో" భాగంగా యర్రావారిపాలెం మండలం, నెరబైలు పంచాయతీ, చింటగుంట పంచాయతీలలో 2 కోట్ల 70 లక్షల 80 వేల రూపాయలతో గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజ్ కాలువలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పులివర్తి నాని గారు భూమి పూజ చేసి, శిలాఫలకాలకు ప్రారంభోత్సవం చేశారు



26/10/2024

పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ నందు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పులివర్తి సుధా రెడ్డి గారు ఈ కార్యక్రమంలో లక్ష రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు.


టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు...* కార్యకర్తలతో దగ్గరుండి ...
26/10/2024

టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు...

* కార్యకర్తలతో దగ్గరుండి స్వయంగా సభ్యత్వ నమోదు చేయించిన ఎమ్మెల్యే...

* లక్ష రూపాయలు కట్టి శాశ్వత సభ్యత్వ నమోదు చేసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని...

* 100 రూపాయలతో సభ్యత్వం 5 లక్షల రూపాయల ప్రమాద బీమా...

యర్రావారిపాలెం మండలం,

మా పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా లక్ష రూపాయలు చెల్లించి టిడిపి పార్టీ శాశ్వత సభ్యత్వ నమోదు చేసుకోవడం జరిగిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యర్రావారిపాలెం మండలం, నెరబైలు పంచాయతీకి చేరుకున్న ఎమ్మెల్యే గారికి శాలువా కప్పి గజమాలతో సత్కరించారు. మహిళలు మంగళ హారతులతో, యువకులు గుమ్మడికాయతో దిష్టి తీసి గ్రామంలోకి ఆహ్వానం పలికారు. టిడిపి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆదేశాల మేరకు అక్టోబర్ 26వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వం శ్రేణులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్తకి చేరవేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నూతన సభ్యత్వ విధానంలో సభ్యత్వం చేసుకున్న వారికి, 100 రూపాయలతో రెండు సంవత్సరాల సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమా రూ.5 లక్షలు రూపాయలు కుటుంబ సభ్యుల అవసరాల కోసం ప్రమాద బీమా వస్తుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలకు అభిమానులకు సానుభూతిపరులకు పార్టీ సభ్యత్వ నమోదు పై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. టిడిపి సభ్యుల సభ్యత్వంతో ప్రతి కార్యకర్తకు భరోసా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతరులు పాల్గొన్నారు.



25/10/2024

రేపటి నుండి టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం...

వాట్సాప్ ద్వారా సభ్యత్వం ఎలా పొందాలో ఈ వీడియోలో చూడగలరు.



Address


Alerts

Be the first to know and let us send you an email when ITDP Chandragiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share