తపస్వి మనోహరం పబ్లికేషన్స్

  • Home
  • తపస్వి మనోహరం పబ్లికేషన్స్

తపస్వి మనోహరం పబ్లికేషన్స్ అతి తక్కువ ఖర్చులో మీరు కోరుకున్న విధంగా పుస్తకాల ముద్రణ చేసి ఇవ్వటం మా ప్రత్యేకత.

*తపస్వి మనోహరం రచయితలకు, పాఠకులకు, శ్రేయోభిలాషులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ..💐 ఉగాది కథల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కర...
09/04/2024

*తపస్వి మనోహరం రచయితలకు, పాఠకులకు, శ్రేయోభిలాషులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ..💐 ఉగాది కథల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మా హృదయ పూర్వక ధన్యవాదములు.*💐🙏.
విజేతలకు అభినందనలు...

మిత్రులు అందరికి ఉగాది శుభాకాంక్షలు 💐💐💐.తపస్వి మనోహరం సంస్థ ద్వారా మొదటి సారి జరిగిన కార్టూన్ పోటి ఫలితాలు. Congratulati...
09/04/2024

మిత్రులు అందరికి ఉగాది శుభాకాంక్షలు 💐💐💐.

తపస్వి మనోహరం సంస్థ ద్వారా మొదటి సారి జరిగిన కార్టూన్ పోటి ఫలితాలు. Congratulations to the winners 💐💐💐.

పోటీకి వచ్చిన కార్టూన్స్ నుండి మంచి వాటిని ఎన్నుకుని త్వరలోనే పుస్తకం విడుదల చేయబడుతుంది.
పోటీలో పాల్గొన్న వారందరికీ అభినందనలు.

31/03/2024

కంప్యూటర్ అనుభవం ఉండి, తెలుగు కంటెంట్ ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్ చేయగల వారి కోసం చూస్తున్నాం. తపస్వి మనోహరం సంస్థ ఆఫీస్ కొండాపూర్ (హైదరాబాద్)లో పని చేయాల్సి ఉంటుంది.
ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చు.
7893467516.

వర్కింగ్ టీం :: తపస్వి మనోహరం. 💐💐💐
08/03/2024

వర్కింగ్ టీం :: తపస్వి మనోహరం. 💐💐💐

08/03/2024
శుభోదయం మిత్రులారా..ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తపస్వి మనోహరం సంస్థ (అంతర్జాల పత్రికలు) మొదలు పెట్టి మూడు సంవత్సరాలు పూర...
06/03/2024

శుభోదయం మిత్రులారా..
ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తపస్వి మనోహరం సంస్థ (అంతర్జాల పత్రికలు) మొదలు పెట్టి మూడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి.
ప్రత్యేకంగా అంతర్జాల పత్రిక అని ఎందుకు అన్నాను అంటే, తపస్వి మనోహరం సంస్థ మూడు విభాగాల్లో ఉంది.
ఒకటి పత్రికలు అయితే..
రెండు pablications
మూడు త్వరలో లాంచ్ అవ్వబోతున్న app.
మూడు సంవత్సరాలు క్రితం ఈ రోజే వార పత్రిక ను సంస్థ నుండి మొదలు పెట్టడం జరిగింది.
ఆ తరువాత ఆరునెలల కి వార పత్రిక తో పాటుగా మాస పత్రికను కూడా మొదలు పెట్టాం.
తరువాత మరో మూడు నెలలకి
సంస్థ నుండి పబ్లికేషన్స్ స్టార్ట్ చేశాం. తరువాతే మహిళలు కోసం అని మనోహరి, కళింగ, గోదావరి ప్రాంత రచయితలు కోసం అని మరో రెండు ప్రాంతీయ పత్రికలు మొదలు పెట్టడం జరిగింది.
మధ్యలో మేము e books ను కూడా విడుదల చేస్తూనే ఉన్నాం.
ఇన్నాళ్ళ మా ప్రయాణం లో ఎన్నో ఒడదుడుకులు. ఎన్నో రాజకీయాలు, అసూయ ద్వేషాలు. అన్నిటినీ తట్టుకుని నిలబడ్డాం. అందుకు పని చేసే మా టీమ్ మాత్రమే కాదు, మాతో కలిసి ప్రయాణిస్తున్న రైటర్స్ ది కూడా భాగస్వామ్యం ఉంది.
మేము ఏ రోజు ఎక్కడా మార్కెటింగ్ చేయలేదు. ఎవరిని కూడా మాకు వ్రాయండి అని అడగను లేదు, వ్రాయకపోతే బాధ పడను లేదు. చాలా మంది మమ్మల్ని అడిగే ఒక ప్రశ్న. మీరెందుకు పెద్ద రైటర్స్ దగ్గరకి వెళ్లి మీ పత్రికలో వ్రాయమని అడగరు అని, నేను నవ్వుతూ చెప్పే సమాధానం, ఇక్కడ మాకు పెద్ద రైటర్స్ ఎవరూ అనేది తెలీదు. రెండు మేము అందరినీ ఒకటిగా చూస్తాం. అలాగే పేరున్న వారి కోసం అన్ని వచ్చిన వారి కోసం ఎన్నో పత్రికలు ఉన్నాయి. కానీ కొత్త వారి కోసం మార్గం చూపించటం కోసం మా పత్రిక ఉండాలి అనుకుంటున్నాం, కాబట్టి ఇలాగే ఉండనివ్వండి అని.
అందుకే తపస్వి మనోహరం సంస్థ అనగానే కొత్త వారి కోసం అని పేరు పడింది. అందుకు మేము సంతోషంగానే ఉన్నాం. చాలా మంది రైటర్స్ ఇక్కడే మొదట తమ రచనను పత్రికలో చూసుకున్నాం అని చెప్పిన సమయంలో ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.
అలాగే మొదట ఇక్కడ వ్రాయటం మొదలు పెట్టి బయటకి వెళ్లి విజయాలు సాధించిన వారిని చూస్తే గర్వంగా అనిపిస్తుంది. మేమెప్పుడూ రైటర్స్ ను ఒక కుటుంబం లాగానే భావిస్తాం. అందుకే మేము వారికి వీలైనంత అనువుగా ఉండేలా చూసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు వచ్చిన మేం సరదాగానే తీసుకుంటాం.
మా లక్ష్యం ఒక్కటే తపస్వి మనోహరం ప్రతి ఒక్క రైటర్ తమ సొంతం అనుకోవాలి. సాహిత్య చరిత్ర తీసుకుంటే తపస్వి మనోహరం ముందు తరువాత అనేల ఉండాలి అనే..
అందుకే మేము కూడా writers కి ఏ విషయం లోనైనా సరే సహాయం చేయటానికి ప్రయత్నం చేస్తాం.
అలాగే చాలా మంది writters అభిమానంతో చందాలు ఇస్తాం అని ముందుకు వచ్చిన మేము తోసి పుచ్చుతాం. దానికి కారణం, రైటర్స్ వ్రాయాలి అనుకుంటే డబ్బులు కట్టి వ్రాయల్సిన పరిస్థితి రాకూడదు అనే. అందుకే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మేము ఈ రోజుకి subscription లాంటివి పత్రికల కోసం పెట్టలేదు.
ఈ రోజుకి మాతో కలిసి ప్రయాణిస్తున్న అందరికీ పేరుపేరునా మా టీమ్ అందరి తరుపున కృతజ్ఞతలు.
ఇక ముందు కూడా మన అందరి ప్రయాణం ఇలాగే కలిసి కొనసాగాలని కోరుకుంటున్నాము.
ధన్యవాదాలు.
మీ తపస్వి.

తపస్వి మనోహరం సంస్థ తరుపున తొలిసారి కార్టూన్ పోటి...
03/03/2024

తపస్వి మనోహరం సంస్థ తరుపున తొలిసారి కార్టూన్ పోటి...

 తపస్వి మనోహరం.. సంస్థ నిర్వహించిన కథల పోటీ ఫలితాలు. పోటీ ఫలితాలలో అనుకున్న వారి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ఎన్నుకుని...
01/02/2024



తపస్వి మనోహరం.. సంస్థ నిర్వహించిన కథల పోటీ ఫలితాలు.

పోటీ ఫలితాలలో అనుకున్న వారి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ఎన్నుకుని ప్రోత్సహిస్తున్న సంస్థలలో.. తపస్వి మనోహరం ఎప్పుడూ ముందే ఉంటుంది అని మరొక సారి నిరూపించుకున్నాము.

తపస్వి మనోహరం పబ్లికేషన్స్ రెండవ వార్షికోత్సవము మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయ పూర్వక ధన్యవాదములు🙏💐

తపస్వి మనోహరం టీమ్..✍️

22/12/2023

తపస్వి మనోహరం: తపస్వి మనోహరం పబ్లికేషన్స్ సంస్థ స్థాపించి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ముందు నుండి మనోహరం పత్రిక తో ట్రావెల్ చేస్తున్న కొన్ని గ్రూప్స్ వారికి పుస్తక ముద్రణ లో ప్రత్యేక ఆఫర్స్ ఇవ్వటం జరిగింది.
చాలా గ్రూప్స్ వారు ఉపయోగించు కోవటం కూడా జరుగుతుంది.
అలాగే అదే ఆఫర్ మన గ్రూప్స్ లో ఉన్నవారికి కూడా ఇవ్వటం జరుగుతుంది.
ఆసక్తి ఉన్నవారు ఉపయోగించుకోవచ్చు.
మీ పుస్తకాన్ని మంచి క్వాలిటీ తో అందంగా ముద్రించి ఇచ్చే బాధ్యత మాది.
మీ పుస్తకానికి isbn కూడా మేమే ఇవ్వటం జరుగుతుంది.
ఈ ఆఫర్ jan 30 వరకు మన గ్రూప్ వారి కోసం మాత్రమే ఇవ్వబడుతుంది.

60 పేజెస్
50 బుక్స్ - 4000.
100 - 7500.
200 - 13000
300 - 18000

120 పేజెస్ -
50 బుక్స్ - 6500.
100 - 12000
200 - 17000
300- 21500

80 పేజెస్
50 బుక్స్ - 4500
100 - 8000
200 - 14000
300 - 19000
పైన తెలిపిన రేట్స్ ప్రకారం మీకు పుస్తకాలు ముద్రించి ఇవ్వటం జరుగుతుంది.
**(50, 100, 200, 300 అనేది బుక్స్ సంఖ్య గమనించగలరు🙏)*

10/12/2023

చాలా మంది మిత్రులు పాత పుస్తకాలు కొన్ని లభించటం లేదని, పునః ముద్రణ లేదని బాధపడటం గమనించాము.
కాపీ రైట్స్ ప్రాబ్లమ్స్ లేని నవలలు, కథలు (అనువాదాలు అయిన సరే) pdf లు అందుబాటులో ఉంటే, అవి మాకు అందిస్తే వాటిని మేము పునఃముద్రణ చేస్తాం.
తపస్వి మనోహరం పబ్లికేషన్స్

తపస్వి మనోహరం సంస్థ తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా ప్రతి నెల ఒక నవలను ముద్రిస్తు వస్తుంది... అందులో భాగంగా ప్రముఖ రచయ...
03/12/2023

తపస్వి మనోహరం సంస్థ తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా ప్రతి నెల ఒక నవలను ముద్రిస్తు వస్తుంది... అందులో భాగంగా ప్రముఖ రచయిత్రి శ్రీమతి తెలికిచర్ల విజయలక్ష్మి గారి నవల "ఇది కథ కాదు" ను ఈ నెల విడుదల చేయటం జరిగింది.
పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

*తపస్వి మనోహరం పబ్లికేషన్స్ రెండవ వార్షికోత్సవము మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కథల పోటీ.*ఈ పోటీ కొరకు మొత్తం పది అంశాల...
02/12/2023

*తపస్వి మనోహరం పబ్లికేషన్స్ రెండవ వార్షికోత్సవము మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కథల పోటీ.*

ఈ పోటీ కొరకు మొత్తం పది అంశాలను ఇస్తున్నాం.

*1. హాస్యం*
*2. హార్రర్*
*3. క్రైమ్/ సస్పెన్స్*
*4. రొమాన్స్/ ప్రేమ*
*5. జానపద కథలు*
*6. సైన్స్ ఫిక్షన్*
*7. బాలల కథలు*
*8. స్ఫూర్తి కథలు*
*9. కుటుంబ కథలు*
*10. కొసమెరుపు కథలు*
మేము ఇచ్చిన పై పది అంశముల నుండి రచయిత(త్రి)లు తాము వ్రాయగలము అనుకున్న ఏడు అంశాలను తీసుకుని, ఖచ్చితంగా ఏడు అంశాలలో.. ఒక్కో అంశానికి.. ఒక్కో కథను వ్రాయవలసి ఉంటుంది. అనగా ఏడు అంశాలకి ఏడు కథలు వ్రాయవలెను. ఇచ్చిన పది అంశాలలో.. ఏడు అంశాలను ఎన్నుకోవటం రచయిత(త్రి) ఇష్టం.

*ఇచ్చిన ప్రతి అంశం నుండి ఒక్క కథను మాత్రమే వ్రాయవలెను. ఆ విధంగా ఏడు అంశాలకు ఏడు కథలను వ్రాసిన రచయితలను పోటీకి అర్హులుగా భావించి వారి కథలను పోటీకి తీసుకోవటం జరుగుతుంది.*

ఆసక్తి ఉన్న రచయితలు ఎవరైనా పది అంశాలను తీసుకుని పది కథలు కూడా వ్రాయవచ్చు.
ఇక *పోటీకి అర్హత సాధించిన రచయిత/త్రి కథలను పరిశీలించి వాటిలో ఉత్తమమైన 5 కథలు వ్రాసిన వారిలో.. మొదటి ముగ్గురు విజేతలకు తపస్వి మనోహరం తరుపున ఆ రచయిత/త్రి కథలతో(వారి ఇతర రచనలతో) పుస్తకములు (100 పేజీలు) ఉచితంగా ముద్రించి విడుదల చేయబడును.*

అలాగే *పోటీకి అర్హత సాధించిన మరో ఐదుగురు ఉత్తమ రచయిత/త్రి కథలను సేకరించి వారందరి కథలతో (ఒక్కొక్కరివి 5 కథలు ఐదుగురివి.. 25 కథలు కలిపి) ఒక ముద్రిత సంకలనం విడుదల చేయటం జరుగుతుంది.*

*చివరిగా "ఈ పోటీలో పాల్గొన్న ప్రతి రచయిత/త్రిల రచనలలో ఒక ఉత్తమ రచన తీసుకుని e-book విడుదల చేయటం జరుగుతుంది.*

రచయిత(త్రి)లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొగలరు.
*పోటీ మొదలు తేది: 04-12-2023.*
*పోటీ ముగింపు తేది: 05-01-2024*
*ఫలితాలు ప్రకటన - 15-01-2024.*

*కథ పద పరిమితి:* 500-1500 పదాలు వరకు ఉండవచ్చు.

*షరతులు:* మీరు పంపే రచన ఇంతకు ముందు ఏ ప్రింట్, వెబ్ పత్రికలలో గానీ, పర్సనల్ బ్లాగ్స్, సోషల్ మీడియా, సెల్ఫ్ పబ్లికేషన్ వంటి ఇతర ఏ ప్లాట్ఫామ్ లలో ప్రచురితం కాలేదని, రచన అనుకరణ, అనుసరణ, అనువాదం కాదని, ఏ పోటీ పరిశీలనలో లేదని, సొంత రచన అని.. రచన క్రింద హామీ వ్రాయవలెను.
*ఒకవేళ మీరు వ్రాసిన కథలు కొత్తగా ఈ పోటీ కొరకు వ్రాసినవి కాదని తెలిసిన యెడల మిమ్మల్ని ఈ పోటీ నుండి తొలగించడం జరుగుతుంది.*

మీ కథలు ఖచ్చితంగా ఇచ్చిన గడువు లోపల ఈ గ్రూప్ నందు సబ్మిట్ చేయవలెను.

*విజేతల కథలు కాకుండా పోటీ కోసం వచ్చిన ఇతర కథలను పరిశీలించి కొన్నిటిని e-books లేదా తపస్వి మనోహరం అంతర్జాల వార, మాస పత్రికలలో ప్రచురించే అధికారం తపస్వి మనోహరం సంస్థకు ఉంటుంది.*

************************************
పై పోటీకి వ్రాయాలి అనుకున్న వారు *"తపస్వి" e-book కొరకు కథలు* గ్రూప్ లో జాయిన్ అయి మాత్రమే పోటీ కథలు పంపగలరు.

గ్రూప్ లింక్..

https://chat.whatsapp.com/EkdqE0SqLJcKdqkF70sqFU
************************************

*తపస్వి మనోహరం పబ్లికేషన్స్ రెండవ వార్షికోత్సవము మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కథల పోటీ.*

*కథ నంబర్:*

*కథ అంశం:*

*కథ శీర్షిక:*

*రచయిత/రచయిత్రి పేరు:*

కథ:....

*హామీ:*
************************************
పై క్రమం ఖచ్చితంగా పాటిస్తూ మీరు పంపే కథలు ఎన్ని అనేది నంబర్ వేస్తూ.. మీ రచనలు *"తపస్వి" e-book కొరకు కథలు* గ్రూప్ లో మాత్రమే పోస్ట్ చేయగలరు. పర్సనల్ గా మెయిల్ ద్వారా పంపవద్దని మనవి.
************************************
ఆల్ ది బెస్ట్
*తపస్వి మనోహరం టీమ్..✍️*

WhatsApp Group Invite

13/07/2023

తపస్వి మనోహరం సంస్థ తరుపున విడుదల అయిన మరో నవల... నాగమంజితం.
మాధురి ఇంగువ గారు - తపస్వి మనోహరం సంస్థ భాగస్వామ్యంలో నిర్వహించిన నవలల పోటీ లో మొదటి బహుమతి పొందిన ఈ నవలను
తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా ప్రచురణ చేయటం జరిగింది.
మనోహరం సంస్థ ఉత్తమ రచయిత శ్రీమతి Manjeetha Kumar గారు వ్రాసిన మొదటి నవల ఇదే కావటం గమనార్హం.

https://www.amazon.in/gp/product/B0CBSKX6C5/ref=cx_skuctr_share?smid=A3IN4TMI45BCME

అందరికీ పుస్తక దినోత్సవ శుభకాంక్షలు...మన మనోహరం సంస్థ తరుపున నిర్వహించిన నవలల పోటీలో బహుమతి సాధించిన నవలలను పుస్తక రూపంల...
23/04/2023

అందరికీ పుస్తక దినోత్సవ శుభకాంక్షలు...
మన మనోహరం సంస్థ తరుపున నిర్వహించిన నవలల పోటీలో బహుమతి సాధించిన నవలలను పుస్తక రూపంలో తీసుకు రావటం జరిగింది.
వాటిలో మూడు
1) వజ్రసంకల్పం (సింహప్రసాద్)
2) ప్రేమను ప్రేమించు (సుజల గంటి)
3) ముగ్గురమ్మాయిల సవాల్ (నామని సుజన దేవి)
ఈ మూడు పుస్తకాలు ప్రస్తుతం Amazon లో లభ్యం అవుతున్నాయి.
అలాగే ఆ మూడు పుస్తకాలు కావాలనుకునే వారు మన సంస్థ ద్వారా నేరుగా కొనవచ్చు.
మూడు నవలలు పోస్టల్ చార్జెస్ తో కలిపి 500/- మాత్రమే.
మూడు కలిపి పది సెట్స్ మాత్రమే అందుబాటులో ఉంచుతున్నాము..
పుస్తకాభిమానులు... ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.

పుస్తకాలు కావల్సిన వారు
7893467516 ఫోన్ నంబర్ లో కాంటాక్ట్ అవ్వవచ్చు.

13/01/2023

తపస్వి మనోహరం తరుపున విడుదల అయిన మరో పుస్తకం.

"  నవ్వుల పువ్వుల చంద్రహాసం"చంద్రప్రతాప్ కంతేటి... తెలుగు సాహిత్యం లో పరిచయం అవసరం లేని పేరు, విపుల, చతుర పత్రికలు తెలిస...
25/12/2022

" నవ్వుల పువ్వుల చంద్రహాసం"

చంద్రప్రతాప్ కంతేటి... తెలుగు సాహిత్యం లో పరిచయం అవసరం లేని పేరు, విపుల, చతుర పత్రికలు తెలిసిన వారందరికీ ఆయన పేరు పరిచయమే, విపుల, చతుర పత్రికలు సంపాదకునిగా వ్యవహరించిన ప్రతాప్ గారు ఒక మంచి రచయిత కూడా. విపుల లోనే "చంద్ర హాసం" అనే పేరుతో దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు నిరాటంకంగా హాస్య కథలు సిరీస్ గా ప్రచురణ చేశారు. ఒక విషయం ఏమిటంటే విపుల ను కొన్ని సంవత్సరాలు పాటు రెగ్యులర్ గా చదివిన నేను, చంద్ర హాసం ను రెగ్యులర్ గా చదివే వాడిని. అవి చదివి హాస్యం ఎలా వ్రాయవచ్చు అని నేర్చుకున్నాను. నేను చంద్రహాసం సిరీస్ కి ఫ్యాన్ ను కూడా. అలాంటి నేను ఈ సంవత్సరం మన మనోహరం పబ్లికేషన్ తరుపున చంద్రహాసం పుస్తకం విడుదల చేయటం ఒక అద్భుతమైన విషయం.
ఇక ఈ పుస్తకం గురించి చెప్పాలి అంటే, సున్నితం అయిన హాస్యం తో కూడిన కథల సుముహారం. హాస్య కథలని ఇష్టపడే వారే కాదు... హాస్య కథలు వ్రాయటం నేర్చుకోవాలి అనుకునే వారు కూడా ఈ పుస్తకం చదవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం..
మీరు ఈ పుస్తకం కొనాలి అంటే తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ఫోన్ నంబర్ ను సంప్రదించవచ్చు.
పుస్తకం పేరు : నవ్వుల పువ్వుల చంద్ర హాసం.
రచయిత :: చంద్ర ప్రతాప్ కంతేటి
ధర : 200/- ( పోస్టల్ చార్జెస్ తో కలిపి).
పేజెస్: 160.
ఫోన్ నంబర్ :: 7893467516.

22/12/2022

తపస్వి మనోహరం సంస్థ తరుపున నిర్వహించిన నవలల పోటీలో మొదటి స్థానం కైవసం చేసుకున్న వజ్ర సంకల్పం. ప్రముఖ రచయిత అయిన సింహ ప్రసాద్ గారి కలం నుండి వచ్చిన మరో అద్భుత రచన.
తపస్వి మనోహరం పబ్లికేషన్స్ తరుపున విడుదల చేయటం జరిగింది.
అతి తక్కువ ఖర్చులో అత్యంత నాణ్యత గల పుస్తకాలు ముద్రించి ఇవ్వడం మా సంస్థ ప్రత్యేకత.
50 పుస్తకాలు కావాలి అన్న ముద్రించి ఇవ్వటం జరుగుతుంది.

18/12/2022

తపస్వి మనోహరం సంస్థ తరుపున ముద్రించిన 175 వ పుస్తకం. అతి తక్కువ ఖర్చులో పుస్తకాలు ముద్రించి ఇవ్వాలన్న మా ఆశయం కి అండగా నిలబడిన రైటర్స్ కి మా ధన్యవాదాలు.
ఒక సంవత్సర కాలం లో మేము సాధించిన ప్రగతి రైటర్స్ అభిమానం వల్లే సాధ్యం.

మన తపస్వి మనోహరం పబ్లికేషన్స్ తరుపున ప్రముఖ కవి dr అడి గొప్పుల సదయ్య గారి నూతన ప్రక్రియ సంకలనం ప్రచురణ చేయటం జరిగింది......
24/12/2021

మన తపస్వి మనోహరం పబ్లికేషన్స్ తరుపున ప్రముఖ కవి dr అడి గొప్పుల సదయ్య గారి నూతన ప్రక్రియ సంకలనం ప్రచురణ చేయటం జరిగింది...
ధన్యవాదాలు సర్...పుస్తకాలు కావల్సిన వారు సర్ ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు..

తిరుప్పావై కవితల పుస్తకం విడుదల వేడుక..🥳🥳🥳💐💐💐.
13/12/2021

తిరుప్పావై కవితల పుస్తకం విడుదల వేడుక..🥳🥳🥳💐💐💐.

తమ రచనలను ఒక పుస్తక రూపం లోకి తీసుకురావాలి అంటే రచయితలు పడే కష్టం అర్థం చేసుకుని ఆ సమస్యలకి పరిష్కారం గా మన తపస్వి మనోహర...
13/12/2021

తమ రచనలను ఒక పుస్తక రూపం లోకి తీసుకురావాలి అంటే రచయితలు పడే కష్టం అర్థం చేసుకుని ఆ సమస్యలకి పరిష్కారం గా మన తపస్వి మనోహరం పత్రిక తరుపున ఈ పబ్లికేషన్స్ స్టార్ట్ చేయటం జరిగింది...
తక్కువ కాస్ట్ లోనే డీ టీ. పీ.. ప్రూఫ్ రీడింగ్..ఎడిటింగ్.. డిజైన్..ప్రింటింగ్ అన్ని సర్వీసెస్ అందిస్తాము....

తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక
సంప్రదించవలసిన చిరునామా::
ఫోన్ నంబర్:: +91 7893467516

మెయిల్ ఐడి::
[email protected]

తపస్వి మనోహరం వెబ్సైట్:: https://thapasvimanoharam.com/..

తెలుగు సాహిత్య రంగంలో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న కొందరు స్నేహితులతో కలిసి, ఒక సమూహంగా ఏర్పడి, మా రచన.....

Address


Alerts

Be the first to know and let us send you an email when తపస్వి మనోహరం పబ్లికేషన్స్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to తపస్వి మనోహరం పబ్లికేషన్స్:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share