03/10/2021
Dr.Sivaprasad Reddy from Kadapa
నాది కడప జిల్లా,ఇంట్లో అందరి ప్రభావంతో వైఎస్సార్ ని మహానేతగా చూసా,2009లో ప్రజారాజ్యం ని నమ్మలేదు,లోకసత్తా ఎలాగూ గెలవదు, ఓట్ ఎందుకు వృధా అని,నా చుట్టూ ఉన్న కులం, ప్రాంతం,వీటి ప్రభావం వల్లనేమో,అప్పుడు కాంగ్రెస్ కి వేసాను, తరువాత అదే ప్రభావంతో బై ఎలక్షన్స్ లో నిలబడ్డా జగన్ కి వేసాను
క్రమేణా పరిస్థితులని గమనిస్తూ,ఆలోచించగా,నాకంటూ ఒక పొలిటికల్ స్టాండ్ లేకుండా,కేవలం కులమో,ప్రాంతం చూసి ఒక నాయకుడిని సపోర్ట్ చేయటం ఏంటని అనిపించింది.
2014 లో,పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానం నచ్చి జనసేన బలపరిచిన పార్టీకి ఓటు వేసాను.
మద్దతు ఇస్తున్నాం కదా,అప్పటి అధికార పార్టీ ఏం చేసినా సహిస్తారేమో అని సందేహపడ్డ ఎక్కడో,కానీ తను నమ్మిన ఆశయాల కోసం ఎంత దూరం అయినా వెళ్తారు అని నిరూపించారు ,అప్పటి ప్రభుత్వం తప్పులని ఎండగడుతూ.
2019 ఎన్నికల్లో,జగన్ కి ఓట్ వేస్తేనే ఊర్లోకి రా,లేదంటే ఓటింగ్ నాడు రావద్దు అని ఒకరకమైన వార్నింగ్ లాంటిదే ఇచ్చారు ఊరి పెద్దలు,కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ వింటూ,ఆయన భావజాలం అర్థం చేసుకున్న నాకూ మా ఊర్లో ఆ పెద్దలు ముందు ధైర్యంగా చెప్పగలిగిన నేను ఎందుకు జనసేనకి ఓట్ వేస్తున్నా అని
ఆ ఎన్నికల ఓటమి తరువాత,ఎక్కడ కనపడిన బంధువులు నా మీద జోకులేసేవారు, జనసేన ఓటమి గురించి,కానీ బాధ అనిపించేది కాదు,నేను నిజాయితీకి ఓట్ వేసాను అని,కానీ ఎక్కడో భయం ఉండేది ,ఈ ఓటమి నుండి పవన్ కళ్యాణ్ గారు మళ్ళా బయటకొచ్చి జనం మధ్య కి వస్తారా?
ఒక వేళ, రాకుంటే, ఇక భవిష్యత్తులో ఎవడైనా నిజాయితీగా పోరాడుతానని వచ్చినా వాళ్ళని ఎలా నమ్మాలి? అని ఒక రకమైన బాధ ,భయం. ఎందుకో ఒక్క జనసేన మాత్రమే రాజకీయంలో మార్పు తీసుకురాగలదు అని దృఢమైన నమ్మకం.కానీ ఈ పరాభవం తట్టుకుని మళ్ళ జనాసేనాని వస్తారా అన్న నా భయాన్ని పోగొడుతూ
పవన్ కల్యాణ్ గారు,ప్రజా సమస్యల గురించి జనం మధ్యలోకి వచ్చారు. ఓడిపోయాం కానీ ఆగిపోలేదు అని అర్థమైంది.చెప్పాలంటే 2019 ఓటమి తరువాతే ,జనసైనికులు ఇంకా బాధ్యతగా జనాల సమస్యల గురించి గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తూ ఆదర్శంగా నిలబడ్డారు.
ఎందరో యువత,బయట జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలని ఉన్నా,ధైర్యం లేక,ఒక బలమైన సపోర్ట్ లేక సైలెంట్ గా ఉన్నారు,వారందరికీ జనసేనా ఒక అండగా నిలబడుతుంది.ఇదంతా మీరు ఇచ్చిన స్ఫూర్తి సార్.
2019 లో మన మీద జోకులేసుకున్న వారే,ఇప్పుడు ఆలోచనలో పడ్డారు,మీరు కరెక్టే రా అనే దాకా వచ్చారు,కానీ ఇంకా ఆ కులం అడ్డుగోడగా ఉంది,మనం ఇలానే ప్రజా సమస్యల గురించి పోరాడుతూ ,జనాలని చైతన్య వంతులు గా ,చేయగల్గితే ఆ కులం అనే అడ్డుగోడలు పగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
కులరహిత రాజకీయం అంటే,కులాల గురించి బయటకి మాట్లాడకుండా గూడు గుఠాని చేస్తూ చేసే రాజకీయం కాదు, అన్నీ కులాలు కలుపుకుంటూ సమిష్టిగా సమస్యల మీద పోరాడటమే👍అది కేవలం మీ వల్లనే అవుతుంది సార్. ఈ పోరాటంలో మేము మాకు చేతనైన రీతిలో మీకు తోడుగా ఉంటాం.మీరే మా బలం.