Tirupati Live

  • Home
  • Tirupati Live

Tirupati Live Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tirupati Live, News & Media Website, .

కేంద్ర ప్రభుత్వం నిర్మించిన బెంగుళూరు-తిరుపతి హైవే..Thank you Narendra Modi జీ
01/07/2023

కేంద్ర ప్రభుత్వం నిర్మించిన
బెంగుళూరు-తిరుపతి హైవే..
Thank you Narendra Modi జీ

Tirupati Tirumala, Andra Pradesh
30/06/2022

Tirupati Tirumala, Andra Pradesh

03/04/2021
13/03/2021
పోలీస్ నాన్న పోలీస్ కూతురికి "ప్రేమతో సెల్యూట్..."తిరుపతి: పోలీసు డిపార్ట్‌మెంట్ లో తన  ఉన్నతాధికారి కి సెల్యూట్ చెయ్యటం...
03/01/2021

పోలీస్ నాన్న పోలీస్ కూతురికి "ప్రేమతో సెల్యూట్..."

తిరుపతి: పోలీసు డిపార్ట్‌మెంట్ లో తన ఉన్నతాధికారి కి సెల్యూట్ చెయ్యటం మామూలు విషయం, కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన గారాలపట్టి అయితే? ఆ తండ్రి చేసే సెల్యూట్ లో ఆనందంతోపాటు ప్రేమ - గర్వం రెండూ కలగలిపి ఆ పోలీసు అధికారి కంట్లో కనిపించింది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపి పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతి లో‌ నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి "ఇగ్నైట్" అని పేరు పెట్టారు ఇలా కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యానికి "ఇగ్నైట్" వేదికయ్యింది.

2018 బ్యాచ్ కి చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతమ్ తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో "దిశ" విభాగం లో భాద్యతలు నిర్వహిస్తున్నారు జెస్సి ప్రశాంతి. తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు శామ్ సుందర్.

తిరుపతి లో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటిలో ఉన్న తన కూతురిని చూస్తూ మురిసిపోయారు శామ్. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు, తను కూడా వెంటనే సెల్యూట్ చేసి ఏంటి నాన్నా...అంటూ గట్టిగా నవ్వేశారు...పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరోకటి ఉండదు, నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని అన్నారు సిఐ శామ్ నుందర్. పోలీస్ తండ్రి పోలీస్ కూతురిని చూసి స్పందించిన తిరుపతి ఎస్పి రమేష్ రెడ్డి "ఇలాంటి సన్నివేశం సహజంగా నినిమాలో చూస్తుంటామ్ తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీ కూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతం గా చాలా ఘర్వంగా ఉంది ఆల్ ది బెస్ట్ ప్రశాంతి" అని డిఎస్పి ప్రశాంతిని అభినందించారు ఎస్పి.

Source :- Dhandhavolu S Giri, Zee News Reporter Thirupathi

26/12/2020

వైకుంఠ ఏకాదశి నాడు తప్పక చూడాల్సిన వీడియో
భక్తితో కన్నీళ్లు వచ్చేస్తాయి

తిరుమలకు పోతున్నారా..??మీ వాహనం 2010కి ముందు మోడల్ అయితే నో ఎంట్రీ..-------------------------------///కాలం చెల్లిన వాహనా...
06/11/2020

తిరుమలకు పోతున్నారా..??
మీ వాహనం 2010కి ముందు మోడల్ అయితే నో ఎంట్రీ..
-------------------------------///
కాలం చెల్లిన వాహనాలు ఇకపై తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లపై అనుమతి కోల్పోనున్నాయి. ఈ మేరకు గురువారం తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య పాత వాహనాల నిషేధాన్ని వెల్లడించారు. పది ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని తెలిపారు. పాతవి, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించమని ఆయన వెల్లడించారు.
రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆ ప్రదేశంలో భక్తులు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమల క్షేత్రం ‘నో హారన్’ జోన్ కావడంతో భక్తులు తమ వాహనాల హారన్ మోగించకూడదని సూచించారు. వాహనాల హారన్ మోగించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా విధిస్తామని ఏయస్పీ మునిరామయ్య తెలిపారు.

18/07/2020

నమో గోవిందాయ నమహః🙏🙏

16/07/2020

మెగాస్టార్ చిరంజీవి ,ఈషా రెబ్బా నటించిన వీడియో విడుదల.. కరోనా మాస్క్ అవగాహన కోసం...

22/04/2020

మనిషి అనుకుంటే కానిది ఏమున్నది !!!
An inspiration video to failed students
పేజీ ని Like follow చేయండి.

21/04/2020

తిరుమలలో #చిరుత #హల్_చల్ 🐆
🐆 In CC Cameras 📷.

తిరుమల : 18-04-2020 ,3:12am

తిరుమల బాలాజినగర్‌లో గత రెండు రోజులుగా చిరుతపులి సంచరిస్తోంది. రాత్రి సమయాలలో నివాసాలకు సమీపంలోకి వస్తున్న చిరుతపులి స్థానికుల కంట పడుతోంది. చిరుత పులి గాండ్రించడాన్ని కూడా స్థానికులు వింటున్నారు. తరచు చిరుత పులి వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. గురువారం రాత్రి నివాసాల సమీపానికి వచ్చిన చిరుత పులి దుప్పిని లాక్కుని వెళ్ళినట్లు గుర్తుల ద్వారా తెలుస్తోంది...! చిరుత పులి సంచరించిన ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం టిటిడి ఫారెస్ట్‌ అధికారులు పరిశీలించారు. చిరుత పులి కదలికలు గుర్తించేందుకు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత స్థానికులు వెలుపలకు రావద్దని, నివాసాల సమీపంలోకి వన్యప్రాణులు వచ్చినట్లు గుర్తిస్తే, తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. తమ సిబ్బంది వాటిని అడవిలోకి తరిమివేయడానికి చర్యలు తీసుకుంటారని ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. అయితే
కౌస్తుభం సమీపంలో రింగ్ రోడ్డు దాటుతూన్న చిరుతపులి దృశ్యాలు టిటిడి ఏర్పాటు చేసిన సిసి కెమరాలో రికార్డు అయ్యాయి.

20/12/2019
20/12/2019

Address


Alerts

Be the first to know and let us send you an email when Tirupati Live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tirupati Live:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share