Ts29 Telugu News

  • Home
  • Ts29 Telugu News

Ts29 Telugu News ts29.in official page

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించతలపెట్టిన ఇఫ్తార్ విందుకు ఖమ్మంలో అనూహ్య పరిణామం ఎదురైంది. వచ్చే సార్...
16/04/2023

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించతలపెట్టిన ఇఫ్తార్ విందుకు ఖమ్మంలో అనూహ్య పరిణామం ఎదురైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేట్ తాకనివ్వనని పదేపదే శపథం చేస్తున్న పొంగులేటి ఇఫ్తార్ విందుకు తక్లీబ్ (ఇబ్బంది) ఏర్పడినట్లు ఆయన క్యాంపు కార్యాలయమే స్వయంగా ప్రకటించడం గమనార్హం. దీంతో ఈ సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించాల్సిన ఇఫ్తార్ విందును పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాయిదా వేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందనే అంశంపై పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుంబూరి దయాకర్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనను దిగువన చదివితే క్లారిటీ వస్తుంది....

April 16, 2023 ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించతలపెట్టిన ఇఫ్తార్ విందుకు ఖమ్మంలో అనూహ్య పరిణామం ఎద....

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి...
14/04/2023

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. ఈమేరకు ఆయా ఛానల్ ఓ ప్రోమోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆర్కే అడిగిన పలు ప్రశ్నలకు పొంగులేటి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు....

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ....

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఖమ్మం మాజీ ఎంపీ ...
12/04/2023

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన శపథంపై మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవితలతో కలిసి హైదారాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అంశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శపథంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…...

April 12, 2023 వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని...

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అలియాస...
11/04/2023

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి రాజకీయ సూచన చేశారు. పొంగులేటి ఏ పార్టీలో చేరినా ప్రయోజనం ఉండదని, మళ్లీ అక్కడ కూడా ఆయా పార్టీ నాయకులను ఓడిస్తారని చెప్పారు. అందువల్ల పొంగులేటి సొంతంగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం లభిస్తుందని వెటకరించారు. సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై గాయత్రి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతహాగా సౌమ్యుడైన గాయత్రి రవి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేసిన పరుష వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి....

April 11, 2023 బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజ...

రాబోయే ఎన్నికల్లో గెలిచేదంతా పొంగులేటి టీమే పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు కృతజ్ఞతలు రావణాసురుడి చెర నుంచి విముక్తి లభ...
10/04/2023

రాబోయే ఎన్నికల్లో గెలిచేదంతా పొంగులేటి టీమే పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు కృతజ్ఞతలు రావణాసురుడి చెర నుంచి విముక్తి లభించింది పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా బతిలాడి చేర్పించుకున్నారు ఎన్నోసార్లు మాయమాటలు చెప్పి మోసం చేశారు ఎన్నో ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేశా ప్రజా బలం ఉన్న నన్ను ఏమీ చేయలేరు భవిష్యత్తులో నేనేంటో చూపిస్తా అతి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి...

April 10, 2023 ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క .....

◆ మార్చి 14న రిలే నిరాహార దీక్ష◆ ఆర్యవైశ్య మహాసభ గౌరవ సలహాదారు మేళ్లచెరువు వెంకటేశ్వరావు, జిల్లా అధ్యక్షుడు వనమా వేణుగోప...
11/03/2023

◆ మార్చి 14న రిలే నిరాహార దీక్ష◆ ఆర్యవైశ్య మహాసభ గౌరవ సలహాదారు మేళ్లచెరువు వెంకటేశ్వరావు, జిల్లా అధ్యక్షుడు వనమా వేణుగోపాల్ వెల్లడి ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన తమ ధ్యేయమని ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ సలహాదారు మేళ్లచెరువు వెంకటేశ్వరావు, జిల్లా అధ్యక్షుడు వనమా వేణుగోపాల్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ఆర్యవైశ్యులకు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయల నిధులను కూడా హామీ మేరకు కేటాయించాలని వారు కోరారు....

March 11, 2023 ◆ మార్చి 14న రిలే నిరాహార దీక్ష◆ ఆర్యవైశ్య మహాసభ గౌరవ సలహాదారు మేళ్లచెరువు వెంకటేశ్వరావు, జిల్లా అధ్యక్షు.....

’గాడ్‌ఫాదర్‌’ గుర్తుందిగా.. మొన్నొచ్చిన మన చిరంజీవిది కాదు. పాతది. ఇంగ్లీషు సినిమా. చాలా క్రైం, థ్రిల్లర్లకు మూలం. అందు...
06/03/2023

’గాడ్‌ఫాదర్‌’ గుర్తుందిగా.. మొన్నొచ్చిన మన చిరంజీవిది కాదు. పాతది. ఇంగ్లీషు సినిమా. చాలా క్రైం, థ్రిల్లర్లకు మూలం. అందులో హీరో మైఖేల్‌ను చంపడానికి జరిగే సీన్‌ని ఎక్కడ తీశారో తెలుసా..ప్రపంచ వెండితెరను ఏలిన నటి ఎలిజబెత్‌ టేలర్‌. ఆమె, మోంట్‌ గోమేరి క్లిఫ్ట్‌ నటించిన ట్రాజిడీ ఎపిక్‌ ’ఎ ప్లేస్‌ ఇన్‌ ది సన్‌’ కోసం సెట్స్‌ వేసిందెక్కడనుకున్నారు?432 ఎపిసోడ్స్‌గా వచ్చిన తొలి అమెరికన్‌ సీరియల్‌ ’బొనాంజా’ మొదలు మొన్న మొన్న వచ్చిన ’లాస్ట్‌ వీకెండ్‌’ సినిమా వరకు తీసింది అక్కడే…...

March 6, 2023 ’గాడ్‌ఫాదర్‌’ గుర్తుందిగా.. మొన్నొచ్చిన మన చిరంజీవిది కాదు. పాతది. ఇంగ్లీషు సినిమా. చాలా క్రైం, థ్రిల్లర్.....

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడం, ఖమ్మం జిల్లాకు చెందిన...
05/03/2023

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడం, ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను ఓడించడమే తమ లక్ష్యంగా ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని తమ కుటుంబ సభ్యులైన ప్రజల ఆశీర్వాదంతో చేరుకుంటాననే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి పొంగులేటి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పొంగులేటి ఈ సందర్భంగా అన్నారు....

March 5, 2023 ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడం, ఖమ్మం జ...

రాబోయే ఎన్నికల్లో జెండా… ఎజెండా ఇదే పాలేరు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు...
05/03/2023

రాబోయే ఎన్నికల్లో జెండా… ఎజెండా ఇదే పాలేరు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు ఎప్పుడు కడుగుతారు? తెలంగాణ రాష్ట్రం లో ఐదు లక్షల కోట్లు అప్పులు ప్రాణ త్యాగాలు చేసిన విద్యార్థుల ఆత్మ గోషిస్తోంది. తెలంగాణలో కేసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడం, ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను ఓడించడమే తమ లక్ష్యంగా ప్రకటించారు....

March 5, 2023 ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడం, ఖమ్మం జ...

రాజకీయాల్లో ఒక్కోసారి గమ్మత్తు జరుగుతుంటుంది. కల గనని సీన్లు కూడా కళ్లముందు కనిపిస్తుంటాయి. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదన...
01/03/2023

రాజకీయాల్లో ఒక్కోసారి గమ్మత్తు జరుగుతుంటుంది. కల గనని సీన్లు కూడా కళ్లముందు కనిపిస్తుంటాయి. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదనే నానుడిని నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అనుమతి లేనిదే అడుగు మోపరాదని అల్టిమేటమ్ జారీ చేసిన పరిస్థితులకు భిన్నంగా, రండి.. రండి.. దయ చేయండి.. అంటూ ఆహ్వానం అందితే ఏ నాయకుడికైనా అంతకన్నా సంతోషం ఏముంటుంది..? ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామ నాగేశ్వర్ రావు సరిగ్గా ఇటువంటి సానుకూల వాతావరణాన్నే ప్రస్తుతం ఆస్వాదిస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే నాయకుడు, అందులోనూ లోక్ సభలో బీఆర్ఎస్ సభాపక్ష నాయకుడు ఇటువంటి చిత్ర, విచిత్ర ఫలితాన్ని ఎంజాయ్ చేయడమేంటీ అనుకుంటున్నారా.....

March 1, 2023 రాజకీయాల్లో ఒక్కోసారి గమ్మత్తు జరుగుతుంటుంది. కల గనని సీన్లు కూడా కళ్లముందు కనిపిస్తుంటాయి. రాజకీయాల్లో ...

మున్నూరుకాపు మహిళ మ్యాక్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ల సమావేశంలో ఆకుల లలిత, సర్దార్ పుటం పురుషోత్తం పటేల్‌ పిలుపు మహిళలు మేల...
28/02/2023

మున్నూరుకాపు మహిళ మ్యాక్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ల సమావేశంలో ఆకుల లలిత, సర్దార్ పుటం పురుషోత్తం పటేల్‌ పిలుపు మహిళలు మేలుకొని ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌ పర్సన్ ఆకుల లలిత పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్‌లో జరిగిన మున్నూరుకాపు మహిళ మ్యాక్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ల సమావేశం సొసైటీ వ్యవస్థాపకుడు, తెలంగాణ మున్నూరుకాపు అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సర్దార్‌ పుటం పురుషోత్తం పటేల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం విధి విధానాలు రూపొందించి కార్యాచరణ ప్రకటించారు....

February 28, 2023 మున్నూరుకాపు మహిళ మ్యాక్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ల సమావేశంలో ఆకుల లలిత, సర్దార్ పుటం పురుషోత్తం పటేల్‌ ....

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలవండి. కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ లేఖ నామ లేఖకు సానుకూలంగా స్పంది...
28/02/2023

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలవండి. కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ లేఖ నామ లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖమ్మం ఎంపీ, లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి విజృంభణతో, విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయ కుటుంబాల పట్ల కేంద్ర ప్రభుత్వం మానవీయంగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఇటీవల ఆయన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కి లేఖ రాయగా సానుకూలంగా స్పందన లభించింది....

February 28, 2023 జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖమ్మం ఎంపీ, లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ...

తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతున్నదా? బీఆర్ఎస్ పార్టీని, దాని చీఫ్, సీఎం కేసీఆర్ ను నేరుగానే...
28/02/2023

తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతున్నదా? బీఆర్ఎస్ పార్టీని, దాని చీఫ్, సీఎం కేసీఆర్ ను నేరుగానే టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఆయన బీజేపీలో చేరుతారా? కాంగ్రెస్ లో చేరుతారా? మరేదైనా వ్యూహం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం చేరువలోనే ఉందా? అంటే.. ఔననే సమాచారం వస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలన నిర్ణయం దిశగా పొంగులేటి అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఖమ్మంలోని తన నివాసంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలు అధికార బీఆర్ఎస్ పార్టీలో పెను సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే....

February 28, 2023 తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతున్నదా? బీఆర్ఎస్ పార్టీని, దాని చీఫ్, సీఎం కేస...

మార్చి 17 నుంచి కేంద్రం విధానాలపై ‘ప్రజాగర్జన.‘మూడు బృందాలుగా కొనసాగనున్న యాత్రలు బీజేపీ వ్యతిరేక శక్తుల సమీకరణ సీపీఎం ల...
27/02/2023

మార్చి 17 నుంచి కేంద్రం విధానాలపై ‘ప్రజాగర్జన.‘మూడు బృందాలుగా కొనసాగనున్న యాత్రలు బీజేపీ వ్యతిరేక శక్తుల సమీకరణ సీపీఎం లక్ష్యం రాజకీయ వైఖరి రీత్యా బీఆర్ఎస్ తో మైత్రి సీపీఎం ఖమ్మం జిల్లా విస్తృత సమావేశంలోరాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బీజేపీ ప్రమాదం ముంచుకొస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నూతన ఆర్థిక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటుకు ధారా దత్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ వ్యతిరేక శక్తుల సమీకరణే లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తోందన్నారు....

February 27, 2023 మార్చి 17 నుంచి కేంద్రం విధానాలపై ‘ప్రజాగర్జన.‘మూడు బృందాలుగా కొనసాగనున్న యాత్రలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమాంతరంగా మరో మంత్రి ఉన్నారా? ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖ మంత్రి పువ్...
26/02/2023

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమాంతరంగా మరో మంత్రి ఉన్నారా? ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సమాంతరంగా తుమ్మల రాజకీయ నెరపుతున్నారా? అదేమిటి..? ఇదేం ప్రశ్న..? అనుకుంటున్నారా? సెలవు రోజున... ముఖ్యంగా ఆదివారం పూట చోటు చేసుకున్న ఓ సమీక్ష ఘటన రాజకీయంగా అధికార పార్టీలో తీవ్ర కలకలానికి దారి తీసింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తన నివాసంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు....

February 26, 2023 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమాంతరంగా మరో మంత్రి ఉన్నారా? ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవా.....

తాతా మధు జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా ఎదిగిన తీరు మాకు తెలియదా..? పిల్లికి బిక్షం పెట్టని వాడు కూడా ఈ రోజు శీనన్న గు...
18/02/2023

తాతా మధు జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా ఎదిగిన తీరు మాకు తెలియదా..? పిల్లికి బిక్షం పెట్టని వాడు కూడా ఈ రోజు శీనన్న గురించి మాట్లాడుతున్నాడు హుజురాబాద్, మునుగోడులో ధన రాజకీయాలు చేసింది మీ నాయకుడు కాదా…? ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షునిపై పొంగులేటి వర్గీయుల ఫైర్ ప్రగతి భవన్ లో చెప్రాసీగిరి వల్లే ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుకు పదవి లభించిందని మాజీ ఎంపీ పొంగులేటి వర్గీయులు విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఉన్న ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గల్లంతవుతుందని పేర్కొన్నారు. పిల్లికి బిక్షం పెట్టని వాడు కూడా ఈ రోజు శీనన్న గురించి మాట్లాడుతున్నాడని… శీనన్నను విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మి వేసినట్టేనని పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వర్గీయులు పేర్కొన్నారు....

February 18, 2023 ప్రగతి భవన్ లో చెప్రాసీగిరి వల్లే ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుకు పదవి లభించిందని మాజీ ఎంపీ పొంగుల....

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ మేరకు ఖమ్మం జిల్లా జర్నలిస్టులందరికీ ఏకకాలంలో ఇళ్లస్థలాలు, పట్టాలు ఇవ్వాలని సీపీఐ (ఎం...
17/02/2023

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ మేరకు ఖమ్మం జిల్లా జర్నలిస్టులందరికీ ఏకకాలంలో ఇళ్లస్థలాలు, పట్టాలు ఇవ్వాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బ్యూరోలు, స్టాఫర్లు, రిపోర్టర్లు, డెస్క్, వీడియో, చిన్నపత్రికలు, స్వతంత్ర జర్నలిస్టులనే తేడా లేకుండా…గ్రామీణ, మున్సిపల్, నగర ప్రాంత వారనే వ్యత్యాసం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఏకకాలంలో ఇళ్ల స్థలాలు, పట్టాలతో పాటు ఇంటి నిర్మాణానికి తలా రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా మాట్లాడారు....

February 17, 2023 ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ మేరకు ఖమ్మం జిల్లా జర్నలిస్టులందరికీ ఏకకాలంలో ఇళ్లస్థలాలు, పట్టాలు .....

9 ఏళ్లుగా సాకారం కాని తెలంగాణ ప్రజల కలలు ఇంకా 15 ఏళ్లకైనా ఉమ్మడి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతారా… ప్రజా కోర్టులో మూల్యం చె...
15/02/2023

9 ఏళ్లుగా సాకారం కాని తెలంగాణ ప్రజల కలలు ఇంకా 15 ఏళ్లకైనా ఉమ్మడి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతారా… ప్రజా కోర్టులో మూల్యం చెల్లించక తప్పదు సమయం సందర్భం వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు శీనన్న గూటికి వస్తారు 15 నెలలు గడిచినా పరిష్కారం కాని ధరణి సమస్యలు వైరా ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శ “రాష్ట్రంలో కేవలం కేసీఆర్ నామస్మరణ జపం చేయాలనే తపన… ఆరాటం తప్ప అధికార పార్టీకి మరో ధ్యాస లేదు… తెలంగాణ సాధించిన తొమ్మిది ఏళ్లలో ప్రజల కలలు సాకారం కాలేదు… 15 నెలలు గడుస్తున్నా ధరణి వెబ్సైట్ లో నెలకొన్న వందల సంఖ్యలో సమస్యలను పరిష్కరించాలనే ధ్యాస ప్రభుత్వానికి లేదు… కరోనా కష్టకాలం వల్ల రైతుల రుణమాఫీ చేయలేదని చెబుతున్న ప్రభుత్వం వందల కోట్ల రూపాయల నిధులతో ఒక సచివాలయం ఉండగానే మరో సచివాలయాన్ని గొప్పల కోసం నిర్మిస్తోంది… విద్యా వైద్యం సాగునీటి రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది… ప్రభుత్వం మేకపోతు గాంభీర్యంతో నిజాలను నిజంగా ఒప్పుకోవటం లేదు” అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు....

February 15, 2023 “రాష్ట్రంలో కేవలం కేసీఆర్ నామస్మరణ జపం చేయాలనే తపన… ఆరాటం తప్ప అధికార పార్టీకి మరో ధ్యాస లేదు… తెలంగాణ స...

ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ గేమ్ ఛేంజ్ చేయనున్నారు. ఇందులో భాగంగ...
14/02/2023

ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ గేమ్ ఛేంజ్ చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇకనుంచి ఆయన వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేయనున్నట్ల అనుచరగణం చెబుతోంది. ప్రస్తుతం తానున్న పార్టీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను, భవిష్యత్ రాజకీయాల కోసం ఎంచుకున్న వేదికలను ప్రామాణికంగా తీసుకుని పొంగులేటి తన తాజా కదలికల్లో పలు మార్పులు చేసుకున్నట్లు సమాచారం. గత నెల 1వ తేదీన కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాలోనేగాక, రాష్ట్ర వ్యాప్తంగానూ తీవ్ర సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే....

February 14, 2023 ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ గేమ్ ఛేంజ్ చేయనున్.....

రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఖమ...
29/05/2022

రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు, టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావుతో కలసి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో నామ నాగేశ్వర్ రావు, గాయత్రి రవి ఈనెల ౩౦న ఉదయం 11:00 గంటలకు పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు గాయత్రి రవి చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఢిల్లీలో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. వీరంతా ఆదివారం ఉదయానికే ఢిల్లీ చేరడం విశేషం.

http://ts29.in/mp-gayatri-ravi-leaves-for-delhi/

May 29, 2022 రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయలుద....

ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశం జారీ చేశారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అంద‌రూ క‌లసి క‌ట...
25/05/2022

ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశం జారీ చేశారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అంద‌రూ క‌లసి క‌ట్టుగా ప‌ని చేయాల‌ని సూచించారు. ఖ‌మ్మం జిల్లాకు రెండు రాజ్య‌స‌భ స్థానాలు కేటాయించిన నేప‌థ్యంలో టీఆర్ఎస్ లోక్‌స‌భా ప‌క్ష నేత నామ నాగేశ్వ‌రరావు నేతృత్వంలో జిల్లా పార్టీ నేత‌లు సీఎం కేసీఆర్ ను బుధ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అశ్వారావుపేట మండలం కేంద్రం లో సెంట్రల్ డివైడర్, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు....

http://ts29.in/cm-kcr-key-directions-for-khammam-trs-leaders/

May 25, 2022 ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశం జారీ చేశారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అం....

ఎంపీ (రాజ్యసభ) గాయత్రి రవి బుధవారం సీఎం కేసీఆర్ ను కలిశారు. రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంగా, కుటుంబ సమే...
25/05/2022

ఎంపీ (రాజ్యసభ) గాయత్రి రవి బుధవారం సీఎం కేసీఆర్ ను కలిశారు. రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంగా, కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలిపారు. కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్ ను కలిసిన ఎంపీ గాయత్రి రవి కాగా నేడు రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ వేసిన అనంతరం దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథిరెడ్డి సిఎంను ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి, తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, ఖమ్మం జిల్లా ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యేలు విప్ రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్ రావు, ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర్ రావు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

http://ts29.in/mp-gayatri-ravi-thanked-cm-kcr/

May 25, 2022 ఎంపీ (రాజ్యసభ) గాయత్రి రవి బుధవారం సీఎం కేసీఆర్ ను కలిశారు. రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భం....

పార్లమెంట్ సభ్యుడు (రాజ్యసభ) గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) బుధవారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి...
25/05/2022

పార్లమెంట్ సభ్యుడు (రాజ్యసభ) గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) బుధవారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. స్వరూపానందస్వామితోపాటు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామిని కూడా హైదరాబాద్ లో కలుసుకుని రవి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా స్వాములకు రవిచంద్ర ఫల పుష్పాలను అందజేసి, ఆశీస్సులు పొందారు. అనంతరం రవిచంద్రను ఆయా స్వాములు శాలువాతో స‌త్క‌రించి, ప్రసాదాలు అందజేశారు. ఎంపీ గాయత్రి రవిని శాలువాతో సత్కరిస్తున్న స్వరూపానంద స్వామి

http://ts29.in/sharda-peethadhipathi-blessings-to-mp-gayatri-ravi/

May 25, 2022 పార్లమెంట్ సభ్యుడు (రాజ్యసభ) గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) బుధవారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానం....

Address


Alerts

Be the first to know and let us send you an email when Ts29 Telugu News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share