We5news

We5news WE5 News brings the best of the telugu news content that serves the interests of the viewers of ANDHRAPRADESH in most receptive formats.

WE5 News reports, entertainment

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...
17/04/2024

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్ట...
16/04/2024

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందగా..ఓ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలు తెలుస్తోంది. కాంకేర్‌ జిల్లా కల్పర్ అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనాస్థలంలో ఏకే 47, రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్‌ జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ధృవీకరించారు.

We5news

Hyd News: హైదరాబాద్‌ ఉప్పల్‌లో అంతర్‌రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్స్‌ అరెస్ట్డ్రగ్స్‌ నియంత్రణపై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ పోలీసు...
16/04/2024

Hyd News: హైదరాబాద్‌ ఉప్పల్‌లో అంతర్‌రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్స్‌ అరెస్ట్

డ్రగ్స్‌ నియంత్రణపై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు..విస్తృతంగా తనిఖీలు చేస్తూ మత్తు పదార్థాలను విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే..ఉప్పల్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్స్‌‌ను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు M**A, ఓపీఎం డ్రగ్స్‌ తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 100 గ్రాముల M**A 500 గ్రాముల నల్లమందు, 4 మొబైల్స్‌ సీజ్‌ చేసి.. NDPS యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. గత కొన్నేళ్లుగా రాజస్థాన్ నుండి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజస్థాన్ లో గ్రామ్ M**A 5వేలకు, గ్రామ్ ఓపియం 2 వేలకు కొని.. హైదరాబాద్ లో 10 నుంచి 12 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

We5news

CM Revanth Reddy: గల్ఫ్‌ కార్మిక సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డిగల్ఫ్‌ బాధితుల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక బోర్డు ...
16/04/2024

CM Revanth Reddy: గల్ఫ్‌ కార్మిక సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్‌ బాధితుల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న కార్మికుల కోసం ప్రజాభవన్‌‌లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ‍హామీ ఇచ్చారు. తాజ్‌ డెక్కన్‌లో గల్ఫ్‌ కార్మిక సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికే ప్రభుత్వం తరపున పాలసీ రూపొందించామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత మరోసారి సమావేశం ఏర్పాటు చేసి పాలసీపై చర్చిస్తామన్నారు.

We5news

Sekhar Master: శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం..ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్ లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు....
16/04/2024

Sekhar Master: శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం..

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్ లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో పని చేసి ఎప్పటికప్పుడు తన డాన్స్ కొరియోగ్రఫీ తో బ్లాక్ బస్టర్ లు అందుకుంటూనే ఉంటారు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఇతడి ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. తన వదిన చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.

ఆమె మరణానికి గల కారణాలను మాత్రం మాస్టర్ వెల్లడించలేదు. ‘వదిన మిస్ యూ.. నువ్వు ఎంతో బాధను అనుభవించావ్.. అయినా ఎంత ధైర్యంగా నిలబడ్డావ్.. నువ్వే నాకు ధైర్యాన్న నూరిపోసావ్.. జీవితంపై సానుకూల దృక్పథాన్ని అందించావ్. ఇక నువ్వు లేవనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను. ఇప్పుడైనా మంచి ప్రదేశంలో (స్వర్గం)లో చేరి ఉంటావ్ అని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడూ మాతోనే ఉంటావ్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు శేఖర్ మాస్టర్.

We5news

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి రహదారిపై డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తాఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ప...
16/04/2024

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి రహదారిపై డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ప్రధాన రహదారిపై అదుపుతప్పి డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. ఖమ్మం నుంచి అశ్వరావుపేట వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి పట్టణంలోని ప్రధాన రహదారిపై బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి భారీగా డీజిల్ బయటకు పోవడంతో ఆందోళన నెలకొంది. ట్యాంకర్ బోల్తా పడిన స్థలానికి కొద్దిపాటి దూరంలో భోజన హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఉన్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. డీజిల్ భారీగా పోతుండటం గమనించి.. చుట్టుపక్కల హోటళ్లను మూసివేయించారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని.. డీజిల్‌ ట్యాంకర్‌ నుంచి మంటలు చెలరేగకుండా ప్రత్యేక ద్రావణాన్ని స్ప్రే చేశారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కు మంటున్నారు.

We5news

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. తారాస్థాయికి చేరిన బంగారం, వెండి ధరలుదేశంలో రోజురోజుకి బంగారం ధరలు భారీగా పెరిగిపోతున...
16/04/2024

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. తారాస్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు

దేశంలో రోజురోజుకి బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అస్సలు తగ్గేదేలే అనే రీతిగా ప్రతిరోజూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ రోజు ఒక తులం గోల్డ్ రేటు రూ. 900 నుంచి రూ. 980 వరకు పెరిగింది. హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు 22 క్యారెట్ల అయితే రూ.67950, 24 క్యారెట్ల బంగారం ధర రూ.74130 వద్ద ఉన్నాయి. నిన్న రూ. 550 నుంచి రూ. 600 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ. 900, రూ. 980 పెరిగి.. ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 68100 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 74280 రూపాయలకు చేరింది. నిన్న రూ.550, రూ.600 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ.900 నుంచి రూ.980 వరకు పెరిగింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో పసిడి ధరలు కొంత తక్కువగానే ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 800 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 880 రూపాయలు పెరిగింది. బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు వెండి ధర రూ. 1000 పెరిగి కేజీ రూ. 87000కు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

We5news

Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి కేసు అప్‌డేట్..ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందిత...
16/04/2024

Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి కేసు అప్‌డేట్..

ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను గుర్తించేందుకు ప్రజల సహకారం కోరిన ఖాకీలు, సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు సీఎం జగన్‌పై దాడి చేసిన వ్యక్తిని గుర్తించినట్లు తెలుస్తోంది. గంగానమ్మ నది వద్ద ఉన్న ప్రజలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ వ్యక్తిని గుర్తించారు పోలీసులు. అయితే ఆ రాయి విసిరింది మైనర్‌గా భావిస్తున్నారు పోలీసులు. స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

We5news

Jagtial: విషాదం.. స్కూల్ బస్సుకింద పడి చిన్నారి మృతిజగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో విషాదం చోటు చేసుకుంది. స్కూల...
16/04/2024

Jagtial: విషాదం.. స్కూల్ బస్సుకింద పడి చిన్నారి మృతి

జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి, ఏడాదిన్నర వయసు గల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అన్నను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి తల్లితో పాటు చిన్నారి వెళ్లింది. ప్రమాదవశాత్తు స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. అప్పటివరకు తల్లి వెనకాల తిరిగిన చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

We5news

Jammu and Kashmir: జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతిజమ్ముకశ్మీర్‌లోని జీలం నదిలో ప్యాసింజర్ బోటు బోల్తా పడింది. ఈ ప్ర...
16/04/2024

Jammu and Kashmir: జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

జమ్ముకశ్మీర్‌లోని జీలం నదిలో ప్యాసింజర్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. గుండ్‌బాల్ బట్వారా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గల్లంతైన వారి మృతదేహాల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి. మరో వైపు కశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీలం నది ‎ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.

అయితే గుండ్‌బాల్‌ను శ్రీనగర్‌ను కలిపే బ్రిడ్జి గత దశాబ్ద కాలంగా నిర్మాణంలో ఉందని, దీంతో స్థానిక ప్రజలు నదిని దాటాలంటే పడవలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు వాపోతున్నారు.

We5news

MLC Kavitha: ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...
16/04/2024

MLC Kavitha: ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ ఆమె తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే సీబీఐ కోర్టు కవితకు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించింది. ఈ మేరకు సాధారణ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు నిన్న ఎమ్మెల్సీ కవితకు కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆమె తీహార్ జైలులో ఉన్నారు.

We5news

Sangareddy: బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ.. హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సంగారె...
16/04/2024

Sangareddy: బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ.. హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద నిర్వహించనుంది బీఆర్ఎస్. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.

We5news

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయంతిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 4 కంపార్టుమ...
16/04/2024

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీవారిని నిన్న 77వేల 511 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక రేపు శ్రీవారి ఆలయంలో ‌శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు. ఈ నేఫథ్యంలో శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

We5news

Jagan: నేడు 16వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజుకు చేరుకుంది. బస్సుయా...
16/04/2024

Jagan: నేడు 16వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర

ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజుకు చేరుకుంది. బస్సుయాత్ర ఇవాళ ఏలూరు జిల్లాలో కొనసాగనుంది. కాసేపట్లో నారాయణపురం నుంచి యాత్ర ప్రారంభంకానుంది. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండికి చేరుకుంటారు సీఎం జగన్. అనంతరం ఉండి శివారు నుంచి భీమవరం బైపాస్ మీదుగా కొనసాగుతుంది. తర్వాత గ్రంధి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ దగ్గర జరిగే సభలో పాల్గొంటారు. పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు చేరుకుంటారు సీఎం జగన్.

We5news

Odisha: ఫ్లై ఓవర్ నుంచి అదుపుతప్పి కిందపడ్డ బస్సు.. ఐదుగురు మృతిఒడిశాలోని జాజ్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్...
16/04/2024

Odisha: ఫ్లై ఓవర్ నుంచి అదుపుతప్పి కిందపడ్డ బస్సు.. ఐదుగురు మృతి

ఒడిశాలోని జాజ్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు ఫ్లై ఓవర్ నుంచి అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 38 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వెస్ట్ బెంగాల్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

We5news

Salman Khan: సల్మాన్‌ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటనలో ఇద్దరు అరెస్ట్బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులకు పాల్ప...
16/04/2024

Salman Khan: సల్మాన్‌ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటనలో ఇద్దరు అరెస్ట్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులకు పాల్పడిన ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని భుజ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిపిన తర్వాత ముంబయి నుంచి నిందితులు గుజరాత్‌లోకి భుజ్‌కు పారిపోయారని చెప్పారు. తదుపరి విచారణ కోసం వారిని ముంబయికి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఇటీవల సల్మాన్ ఉంటోన్న ముంబయిలోని బంద్రా గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట బైక్‌వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. తమను ఎవరూ గుర్తుపట్టకుండా హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు.. దాడికి ప్రయత్నించినట్టు ప్రాథమిక విచారణంలో నిర్దారించారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరపగా.. ఓ బుల్లెట్ సల్మాన్ ఇంటి బాల్కనీలోకి దూసుకెళ్లింది. ఇటీవల కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ ఇద్దరు వ్యక్తులను విచారణకు పిలిచింది.

We5news

KTR: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారంపార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని పార్టీలు వేగవంతం చేశాయి....
16/04/2024

KTR: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని పార్టీలు వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్‌ బహిరంగసభలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.

We5news

Rahul Gandhi: కేరళలోని వాయ్‌నాడ్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీదేశంలో ఒకే నాయకుడు అనే ఆలోచనను కేంద్రంలోని బీజేపీ అమలు చే...
15/04/2024

Rahul Gandhi: కేరళలోని వాయ్‌నాడ్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ

దేశంలో ఒకే నాయకుడు అనే ఆలోచనను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వాయ్‌నాడ్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందని రాహుల్ ఆరోపించారు. నాగాపూర్‌ నిర్ణయాలను కేరళ వ్యతిరేకించిందన్నారు. నాగాపూర్‌కు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు నిలబడ్డారని తెలిపారు.

డబ్బుల విషయంలో గొడవ.. 4కోట్ల విలువైన లగ్జరీ కారుకు నిప్పుతీసుకున్న అప్పు కట్టలేదని ఖరీదైన కారును తగులపెట్టిన ఘటన హైదరాబా...
15/04/2024

డబ్బుల విషయంలో గొడవ.. 4కోట్ల విలువైన లగ్జరీ కారుకు నిప్పు

తీసుకున్న అప్పు కట్టలేదని ఖరీదైన కారును తగులపెట్టిన ఘటన హైదరాబాద్‌ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగికి చెందిన వ్యాపారి నీరజ్‎కు 4 కోట్ల విలువ చేసే స్పోర్ట్స్ కారు ఉంది. దాన్ని విక్రయిస్తానని మోఘల్‌పురా‌కు చెందిన అమన్‌కు చెప్పాడు. ఆ కారును కొంటానని తమ ఫామ్‌హౌజ్‌కు తీసుకురావాలని అహ్మద్ చెప్పాడు. నీరజ్ ఫ్రెండ్ అయాన్ కారును తీసుకెళ్లాడు. నీరజ్ తనకు 2కోట్లు అప్పు ఇవ్వాల్సిఉందని... అహ్మద్ కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

We5news

Rahul Gandhi: రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను సైతం వదలని ఈసీ అధికారులుకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్...
15/04/2024

Rahul Gandhi: రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను సైతం వదలని ఈసీ అధికారులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో తనిఖీలు చేశారు ఎన్నికల అధికారులు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో... వరుస సభలు, సమావేశాలతో రాహుల్ గాంధీ బిజీబీజీగా ఉంటున్నారు. తాను పోటీ చేస్తున్న వాయ్‌నాడ్‌తో పాటు తొలి దశలో ఎన్నికలు జరుగుతన్న తమిళనాడు సహా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో తమిళనాడులోని నీలగిరికి హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ వెళ్లారు. ల్యాండ్ అయిన వెంటనే ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు హెలికాప్టర్‌లో తనిఖీలు చేశారు.

We5news

Hyd News: సైబరాబాద్‌లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టురట్టుహైదరాబాద్‌ నగరంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టు...
15/04/2024

Hyd News: సైబరాబాద్‌లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టురట్టు

హైదరాబాద్‌ నగరంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టురట్టైంది. సైబరాబాద్‌ పరిధిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన బుకీ నరసారావుపేటకు చెందిన రామాంజనేయులుగా గుర్తించారు. రామాంజనేయులతో పాటు 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 3 కోట్ల 29 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులకు సంబంధించిన 57 బ్యాంక్ ఖాతాల్లోని 2 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు.

We5news

Phone Tapping Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లు విత్‌డ్రాఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చ...
15/04/2024

Phone Tapping Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లు విత్‌డ్రా

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి ఎసీఎంఎం కోర్టులో నిందితులు బెయిల్‌ పిటిషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఈ కేసులో ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 70 కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్ ప్రకారం.. పదేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశాలున్నాయి.. ఈ నేపథ్యంలోనే.. సెషన్స్‌ కోర్టుకు వెళ్లాలని నిందితుల తరపు లాయర్లకు నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో ఏసీఎంఎం కోర్టులో వేసిన పిటిషన్లను నిందితులు విత్‌డ్రా చేసుకున్నారు. రేపు నాంపల్లి సెషన్స్‌ కోర్టులో.. ఫ్రెష్‌గా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయనున్నారు.

We5news

Narendra Modi: కేరళ, తమిళనాడులో మోదీ ఎన్నికల ప్రచారంలోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ.. నాలుగు వందల స్థానాల్లో విజయం సాధించడమే ల...
15/04/2024

Narendra Modi: కేరళ, తమిళనాడులో మోదీ ఎన్నికల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ.. నాలుగు వందల స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవాళ కేరళ, తమిళనాడులో ఎన్నికల ప్రచారంతో ప్రధాని హోరెత్తించారు. విపక్ష కూటమి పార్టీలను టార్గెట్‌గా మోడీ ప్రచారం సాగింది. బీజేపీ మేనిఫెస్టో అంటే మోడీ గ్యారంటీ అని, వచ్చే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని జోస్యం చెప్పారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు భారత్ హబ్‌గా మారుతుందని, గగన్‌యాన్ వంటి ఘనమైన విజయాలు భారత్ సాధిస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

We5news

TS News: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలుసార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా...
15/04/2024

TS News: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు

సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. మెజారిటీ ఎంపీ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్‌ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాపురావ్‌తో పాటు నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు కాంగ్రెస్‌‌లో చేరారు.

We5news

జగన్‌పై దాడి కేసు.. వివరాలు తెలిపినవారికి రివార్డు ప్రకటనఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున...
15/04/2024

జగన్‌పై దాడి కేసు.. వివరాలు తెలిపినవారికి రివార్డు ప్రకటన

ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాడి చేసిన వివరాలు తెలిపిన వారి తెలియజేయాలంటూ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్. దాడి చేసినవారి సమాచారం తెలిపితే 2 లక్షల రూపాయల నగదు బహుమతి అందిస్తామంటూ ప్రకటన చేశారు. ఇక సమాచారం ఇచ్చిన వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు పోలీసులు. నిందితులను పట్టుకునేందు దోహదపడే అంశాలను తెలియజేయాలని కోరారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారం ఇవ్వొచ్చని సూచించారు.

We5news

CBI: కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదుఎమ్మెల్సీ కవిత సీబీఐ రిమాండ్ పిటిషన్‌లో కీలక విషయాలు వెల్లడించారు అధికారులు. కస్ట...
15/04/2024

CBI: కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదు

ఎమ్మెల్సీ కవిత సీబీఐ రిమాండ్ పిటిషన్‌లో కీలక విషయాలు వెల్లడించారు అధికారులు. కస్టడీలో ఎమ్మెల్సీ కవిత తమ విచారణకు సహకరించలేదని తెలిపారు. శరత్‌చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల రూపాయల వ్యవహారంపై కవితను ప్రశ్నించినట్లు రిమాండ్ పిటిషన్‌లో తెలిపారు. లేని భూమిని ఉన్నట్లుగా చూపి అమ్మడానికి పాల్పడిన విషయంపై కవిత ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు అధికారులు.

ఉద్దేశపూర్వకంగానే తమను తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు ఇస్తున్నారని తమ రిమాండ్ పిటిషన్‌లో తెలిపారు సీబీఐ అధికారులు. మాగుంట శ్రీనివాసులు, గోరంట్ల బుచ్చిబాబు, శరత్‌చంద్రారెడ్డి, విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించినట్లు తెలిపారు. విచారణను, సాక్షులను ఎమ్మెల్సీ కవిత ప్రభావితం చేయగలరంటూ సీబీఐ తెలిపింది.

We5news

Jagan: ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసు విచారణ వేగవంతంఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటికే ...
15/04/2024

Jagan: ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసు విచారణ వేగవంతం

ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటికే ఆరు బృందాలను ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తాజాగా మరో 16 టీమ్‌లను ఏర్పాటు చేసి విచారిస్తున్నారు బెజవాడ పోలీసులు. ఒక్కొక్క టీమ్‌లో డీసీపీ, ఏడీసీపీ, డీఎస్పీ ర్యాంక్ అధికారులను నియమించారు బెజవాడ సీపీ.

ఒక్కో టీమ్‌కు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక్కో టీమ్ సిటీలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను విచారించారు పోలీసులు. కాగా జగన్‌పై దాడి కేసును డీజీపీ, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి.

We5news

Uttar Pradesh: కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతిఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ...
15/04/2024

Uttar Pradesh: కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలింది. పై కప్పు కూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో 17 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న మొత్తం 19 మంది కార్మికులను రక్షించారు. గాయపడిన వారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

We5news

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపుఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నేడు ఐదు రాష్ట్రాల బంద్...
15/04/2024

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపు

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నేడు ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురంలో సెర్చ్ చేశారు. కాంట్రాక్టర్లను అప్రమత్తం చేసి జేసీబీలు, లారీలు, టిప్పర్లను పోలీస్ స్టేషన్లకు తరలించారు.

We5news

Phone Tapping: తెలంగాణలో సంచలన సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో సోమవారం ...
15/04/2024

Phone Tapping: తెలంగాణలో సంచలన సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జనగర్జన సభ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

హెలికాప్టర్‌ ద్వారా నారాయణపేట చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి... రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. సొంత జిల్లా కావడం, కొడంగల్‌ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌ పరిధిలో ఉండడంతో.. ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్గిలో నిర్వహించిన సభలోనే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డి పేరును స్వయంగా రేవంతే ప్రకటించారు.

We5news

Address


Telephone

+917388104108

Website

Alerts

Be the first to know and let us send you an email when We5news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to We5news:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share