ArunaReport

ArunaReport we Covering the uncovered.. subscribe cheyandi aruna report. Adarinchandi alterative journalism ni
(4)

28/12/2023
17/09/2023
14/03/2023

Ayyappa Devotees Attack on Bairi Naresh Full Interview With Aruna | |

https://youtu.be/JGJSGw5bD2cపవన్ కళ్యాణ్ కి ఫెవరేట్ నాయకుడు ఎవరు... Covering The Uncovered |WORKING CLASS STORIES |Aruna...
09/02/2023

https://youtu.be/JGJSGw5bD2c

పవన్ కళ్యాణ్ కి ఫెవరేట్ నాయకుడు ఎవరు... Covering The Uncovered |WORKING CLASS STORIES |ArunaReport

పవన్ కళ్యాణ్ కి ఫెవరేట్ నాయకుడు ఎవరు..జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు ..... *We Cover the uncovered**We are here to do alternative journalism*WORKING CLASS ST...

https://youtu.be/TuVusX9iqp0మనం సాధించిన అభివృద్ధి ఏ పాటిదో తెలిపే స్టోరీ ఇది... పారిశుద్ధ కార్మికుల బ్రతుకు పోరాటం తెలి...
07/11/2022

https://youtu.be/TuVusX9iqp0

మనం సాధించిన అభివృద్ధి ఏ పాటిదో తెలిపే స్టోరీ ఇది... పారిశుద్ధ కార్మికుల బ్రతుకు పోరాటం తెలిపే స్టోరీ ఇది...

పేదరికాన్ని ఆస్తిగా ఇవ్వొచ్చా | Life of GVMC Municipal Workers | WORKING CLASS STORIES |ARUNAREPORT Today in vizag Nights, We show you the Life of GVMC Munic...

https://youtu.be/eUj8HeuYPswరోబో చేయాల్సిన పని మనిషి చేస్తే ఏం జరుగుతుందో తెలిపే స్టోరీ త్వరలో మీ.కోసం రానుంది...so like...
31/10/2022

https://youtu.be/eUj8HeuYPsw
రోబో చేయాల్సిన పని మనిషి చేస్తే ఏం జరుగుతుందో తెలిపే స్టోరీ త్వరలో మీ.కోసం రానుంది...so like share and subscribe...

*We Cover the uncovered**We are here to do alternative journalism*WORKING CLASS STORIESARUNA REPORT ... Covering the uncovered....Adarinchandi "alterative jo...

ఫిల్మ్ స్టార్ సమంతను చూస్తే ఈమె ఒక ఫైటర్ గా కనిపించటం షరా మాములు...ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద so called sta...
30/10/2022

ఫిల్మ్ స్టార్ సమంతను చూస్తే ఈమె ఒక ఫైటర్ గా కనిపించటం షరా మాములు...

ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద so called stars ఇళ్లలో నుంచి మగవాళ్ళు ఎంత చిన్న చిన్న అడపిల్లలతో అయినా రొమాన్స్ చేస్తూ కుప్పి గంతులు వేయొచ్చు...అదే ఇళ్ల నుంచి వచ్చిన కూతుర్లు...కోడళ్ళు... మాత్రం తమకు నచ్చినట్టు తాము ఉండకూడదు...తమకి నచ్చిన వర్క్ చేయకూడదు అనే కండిషన్ ను ఫిల్మ్ స్టార్ సమంత చాలా వరకు చాలెంజ్ చేశారు...ఈ లక్షణం ఫైటర్ లక్షణమే...ఇది లేకపోతే మనిషి జీవించినట్టు కాదు...

అయితే జీవించిన జీవితంలో దేన్ని చంపి పార దొబ్బేయాలి అనుకుంటున్నాం అనేది most importent question అవుతుంది...ఈ ప్రశ్న సమంత వేసుకుని ఉంటే మగవారికి సరుకుగా కనిపించి కనువిందు చేసే పాట అయిన "ఉం అంటావా మామ...ఉం ఉం అంటావా మామాలో" అనే పిచ్చి పాటలో ఐటమ్ గర్ల్ గా పని చేసి డబ్బుకు డబ్బు జీతంగా పొందవచ్చు తన ఫైటింగ్ చేసే లక్షణాన్ని చాటుకోవచ్చు అన్నట్టు ప్రవర్తించే వారు కాదేమో...

In fact సినిమాల్లో మోడలింగ్ లో పని చేసే నా లాంటి వర్కింగ్ వుమన్ "ఫలానా శరీర ఆకృతిలో ఉండాలి అనే కండిషన్ ఎందుకు ఉంది...?" అంతే కాదు ఒంటిలో బాలేకుండా ఇలా ఉన్న కండిషన్ లో మీ యశోద సినిమాకి డబ్బింగ్ చెప్పాలా...మీ సంస్థలో పని చేసే వర్కర్ కి మీరిచ్చే విలువ ఇదా...? అని అడిగే వారు తద్వారా తన ఫైటింగ్ లక్షణాన్ని revolutionize చేసుకుని తన ఫైట్ ను next లెవెల్ కి తీసుకుపోయే వారు సమంత...

కేరళ అమ్మాయి కూడా అయిన సమంత కొద్దిగా మార్క్సిజం చదివి ఉంటే సూపర్ గా revolutionized fighterగా కనిపించి అందరితో విజిల్ కొట్టేంచే వాళ్ళు...

Get well soon fighter సమంత గారు...after coming home hope you will be exposed to best social science...That is Marxism...

25/10/2022

Vasti sewing workers who provide rice to the hungry farmer
*We Cover the uncovered*
*We are here to do alternative journalism*
WORKING CLASS STORIES
ARUNA REPORT ... Covering the uncovered....
Adarinchandi "alterative journalism" ni
please subscribe to ARUNA REPORT for
latest news, videos, and more stories.
Thank you.

https://youtu.be/GDe9IwD7YQsరైతులను మనం అన్నదాతలు అని పిలుస్తాం కదా...ఆకలితో అలమటించే అన్నదాత రైతుకి అన్నం పెడుతున్నది ఎ...
23/10/2022

https://youtu.be/GDe9IwD7YQs

రైతులను మనం అన్నదాతలు అని పిలుస్తాం కదా...ఆకలితో అలమటించే అన్నదాత రైతుకి అన్నం పెడుతున్నది ఎవరో తెలుసా...? విస్తరి ఆకులు అమ్ముకునే ఫ్యాక్టరీలో పని చేసే మహిళలు. తమ కూలి డబ్బులతో అన్నదాత అని పేరు పడ్డ రైతులకి ఇంత అన్నం పెడుతున్నారు. రైతుకి...ఓ కూలి అన్నం పెట్టడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా... అయితే ఈ స్టోరీ పూర్తిగా చూడటానికి subscribe చేసి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ వస్తుంది...

రైతులకు ఇంత కూడు పెడుతున్నది ఎవరో తెలుసా Do you know who is contributing so much to the farmers?*We Cover the uncovered**We are here to do alternative journ...

22/10/2022

వైజాగ్ సమస్యల మీద చర్చ ఎప్పుడు.
We Cover the uncovered
We are here to do alternative journalism
WORKING CLASS STORIES
ARUNA REPORT ... Covering the uncovered....
Adarinchandi "alterative journalism" ni
please subscribe to ARUNA REPORT for
latest news, videos, and more stories. , , ,


Thank you.

https://youtu.be/eCpYHlVR2pgసామాన్యులను ఇంత ఘోరంగా ట్రీట్ చేసే రాజ్యం... ఏం రాజ్యం...?
21/10/2022

https://youtu.be/eCpYHlVR2pg

సామాన్యులను ఇంత ఘోరంగా ట్రీట్ చేసే రాజ్యం...

ఏం రాజ్యం...?

లేబర్ బ్రతుకులు మావి మా మీద దయచూపండి .ఎమ్మెల్యే సార్.| WORKING CLASS STORIES | ARUNAREPORT*We Cover the uncovered**We are here to do alternative journalism*W...

20/10/2022

వైస్సార్...ఎన్టీఆర్ కాలనీలంటే సిట్టింగ్ MLA శిల్పకి భయం. Sitting MLA Shilpa is afraid of Vissar...NTR colonies.
*We Cover the uncovered*
*We are here to do alternative journalism*
WORKING CLASS STORIES
ARUNA REPORT ... Covering the uncovered....
Adarinchandi "alterative journalism" ni
please subscribe to ARUNA REPORT for
latest news, videos, and more stories.
Thank you.
subscrbe to : ARUNA REPORT
, , ,
For more latest updates on the news :
► Subscribe to ARUNAREPORT News
❣ Thank's For Watching 🙏

19/10/2022

గుజరాత్ firms, ఓటు వేయని కార్మికులను name, shame చేయటానికి ఎన్నికల కమిషన్‌తో MoU కుదుర్చుకున్నాయి. Individual unitsతో పాటు industry bodies ఈ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకి ముందు ఈ Memorandum of Understanding ఉనికిలోకి వచ్చింది. దీన్నే dictatorship of the bourgeoisie అంటారా...?

https://youtu.be/2IyBzWxA5Ikపెద్ద పెద్ద institutionsకి జగన్ అధికారంలో ఉంటే వైస్సార్ పేరు పెట్టడం...బాబు అధికారంలో ఉంటే ఎ...
19/10/2022

https://youtu.be/2IyBzWxA5Ik

పెద్ద పెద్ద institutionsకి జగన్ అధికారంలో ఉంటే వైస్సార్ పేరు పెట్టడం...బాబు అధికారంలో ఉంటే ఎన్టీఆర్ పేరు పెట్టడం...అధికారం మారుతుంటే పేర్లు తారుమారు కావటం...ఈ విషయం మీద వైస్సార్ టీడీపీ జంతువుల లాగా పొట్లాడుకోటం టీవీలలో చూస్తూనే ఉంటారు...

For change వైస్సార్ అంటే వైసీపీకి ఎంత గౌరవం ఉంది...ఎన్టీఆర్ అంటే టీడీపీకి ఎంత గౌరవం ఉంది తెలిపే ఈ స్టోరీ చూసి మీ ఓపిన్ చెప్పండి...

వైస్సార్...ఎన్టీఆర్ కాలనీలంటే సిట్టింగ్ MLA శిల్పకి భయం. Sitting MLA Shilpa is afraid of Vissar...NTR colonies.*We Cover the uncovered**We are here to do alt...

https://youtu.be/jH7DNc1nlvM
06/10/2022

https://youtu.be/jH7DNc1nlvM

*We Cover the uncovered**We are here to do alternative journalism*WORKING CLASS STORIESARUNA REPORT ... Covering the uncovered....Adarinchandi "alterative jo...

https://youtu.be/wB7zsN3JOq0
05/10/2022

https://youtu.be/wB7zsN3JOq0

ARUNA REPORT ... Covering the uncovered....Adarinchandi "alterative journalism" ni please subscribe to ARUNA REPORT for latest news, videos, and more sto...

https://youtu.be/V99ANMDir2E
05/10/2022

https://youtu.be/V99ANMDir2E

ARUNA REPORT ... Covering the uncovered....Adarinchandi "alterative journalism" ni please subscribe to ARUNA REPORT for latest news, videos, and more sto...

మనలో చాలా మందికి పుస్తకాలు రాసినందుకో.. టీవీలో బాగా యాంకరింగ్ చేసినందుకు.. ఓ మంచి రిపోర్ట్ రాసినందుకో..లేదా చూపినందుకో.....
22/02/2021

మనలో చాలా మందికి పుస్తకాలు రాసినందుకో.. టీవీలో బాగా యాంకరింగ్ చేసినందుకు.. ఓ మంచి రిపోర్ట్ రాసినందుకో..లేదా చూపినందుకో.. మన పాలక వ్యవస్థ ఓ అవార్డు మోహన పడేస్తుంది దాన్ని మనం మనకు దొరికిన అరుదైన గౌరవం అని భవిస్తూ FB వాల్ మీద వాట్స్ అప్ స్టేటస్ లో మన సొంత పేరు కింద అవార్డులు పేర్లు రాసి ప్రదర్శిస్తాము అంతేనా ఇంటిలోకి ఎవరైనా అడుగు పెట్టగానే వారి కన్ను పడేలాగా ఆ అవార్డులు షీల్డ్ లు పెట్టేసి ప్రదర్శిస్తూ గొప్పలు పోతామా.. అసలు ఈ వ్యవస్థ ఇచ్చే అవార్డులు బహుమతులు కి ఉన్న విలువ ఎంతో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి

నేడో రేపో పద్మశ్రీ అవార్డు మొహమ్మద్ షరీఫ్ అందుకోనున్నారు. ఎవరు ఈ మొహమ్మద్ షరీఫ్ అనే మీ ప్రశ్నకి సమాధానం అయోధ్య బీజేపీ ఎంపీ లల్లు సింగ్ ఇలా చెబుతారు.. మొహమ్మద్ షరీఫ్ ఉరఫ్ షరీఫ్ చాచానా అతను "లావారీష్ లాశొంకా మాసిహ" గత 25 ఏళ్లలో 25 వేల అనాధ మృతదేహాలకు కర్మకాండలు చేశారు. అందుకే మొహమ్మద్ షరీఫ్ కు కేంద్రం పద్మా అవార్డు ఇవ్వాలి అని రికమండ్ కూడా చేసా. అయోధ్య బీజేపీ ఎంపీ లల్లు సింగ్ మేరకు పద్మా అవార్డు మొహమ్మద్ షరీఫ్ కు కేంద్రం ప్రకటించటం కూడా జరిగింది.

మొహమ్మద్ షరీఫ్ ను "లావారీష్ లాశొంకా మాసిహ" అని కూడా పిలుస్తారు కదా మరి ఈ మసీహ పరిస్థితి ఏంటో తెలుసా.. మొహమ్మద్ షరీఫ్ అయోధ్యలో మొహల్లా ఖిర్కి అలీ బేగ్‌లోని తన ఇంటి మంచం మీద అనారోగ్యంతో పడివున్నారు. ప్రస్తుతం మొహమ్మద్ షరీఫ్ తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతా పేదరికం కారణంగా చికిత్స పొందలేక పేదరికంతో మగ్గిపోతున్నారు. "లావారీష్ లాశొంకా మాసిహ"గా పద్మ అవార్డు సాధించుకున్న మొహమ్మద్ షరీఫ్ ఉరఫ్ 'షరీఫ్ చాచా' ఒక సాధారణ సైకిల్ మెకానిక్. ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ పరిసరాల్లో 25 వేలకు అనాధ మృతదేహాలకు ఇతను గత 25 సంవత్సరాలుగా దిక్కులేని వేలాది అనాధ శవాలకు కర్మకాండలు చేశారు. ఫలితంగా 2020 లో మొహమ్మద్ షరీఫ్ కు పద్మ అవార్డు భారత ప్రభుత్వం ప్రకటిస్తూ చేసిన ప్రకటన ఏమనగా మొహమ్మద్ షరీఫ్ మతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ అనాధ శవం కనిపించినా కర్మకాండలు జరిపించారు.

ప్రస్తుతం పద్మా అవార్డు త్వరలోనే అందుకోవాల్సిన షరీఫ్ చాచా మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటంతో, అతని కుటుంబ సభ్యులు దిక్కు తోచక కేంద్ర ప్రభుత్వం మొహమ్మద్ షరీఫ్ కు పద్మా అవార్డు సాధించుకున్న వ్యక్తిగా పరిగణించి, కొంత పెన్షన్ ఇస్తే బాగుణ్ణు అని ఆశిస్తున్నారు. కుటుంబ సభ్యుల దగ్గర తగినంత సొమ్ము లేక షరీఫ్ చాచా చికిత్స ఖర్చు భరించలేకపోతున్నారు. మహ్మద్ షరీఫ్ కొడుకు షాగీర్, గత సంవత్సరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన తండ్రిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలియజేసి తమకు లేఖ కూడా రాసింది అని చెబుతా. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా జనవరి 31, 2020 నాడు తమకు రాసిన లేఖలో షరీఫ్ చాచాకు అవార్డును ప్రదానం చేసే తేదీని త్వరలో తెలియజేస్తామని తెలిపారని అయితే ప్రస్తుతం నాన్నకి కొంచం పెన్షన్ దొరికితే బాగుణ్ణు అంటున్నారు.

ఇంటి ఖర్చులను భరించలేక షరీఫ్ చాచా కుటుంబం అల్లాడుతున్నది. కొడుకు ప్రైవేట్ డ్రైవర్‌గా నెలకు 7,000 రూపాయలు సంపాదిస్తాడు. అతను తన తండ్రి చికిత్సకు నెలకు అయ్యే 4,000 రూపాయల ఖర్చును భరించలేక పోతున్నాడు. మహ్మద్ షరీఫ్ కొడుకు షాగీర్ ఇలా వాపోతున్నాడు "మేము చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాము, మా దగ్గర ఇంటి ఖర్చులకు డబ్బులు లేవు. డబ్బు లేకపోవడం వల్ల, నా తండ్రికి సరైన చికిత్స కూడా అందించ లేకపోతున్నాను. ఇప్పటి వరకు నాన్నకి స్థానిక వైద్యుడి చికిత్స ఇప్పించాం. ఇప్పుడు డబ్బు లేకపోవడం వల్ల, కనీసం దానిని కూడా భరించలేక పోతున్నాం”.

ఫైజాబాద్‌కు (అయోధ్య) బిజెపి ఎంపి లల్లు సింగ్ సిఫారసు మేరకు పద్మా అవార్డు కోసం తన తండ్రిని ఎంపిక చేసినట్లు షగీర్ చెబుతున్నారు కదా..షరీఫ్ చాచాకి అవార్డు ఇచ్చే తేదీ మీకు అయినా తెలుసా..? అని బీజేపీ అయోధ్య ఎంపీ లల్లు సింగ్ ను అడిగితే..అయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ "షరీఫ్ చాచాకి ఇంకా అవార్డు అందలేదా?" అని ఎదురు ప్రశ్న అడుగుతున్నారు.

మనమున్న వ్యవస్థలో మనకు దొరికే అవార్డులు రివార్డులు బహుమతుల విలువ ఎంత అన్నది తెలిపే సజీవ ఉదాహరణ "షరీఫ్ చాచా"..

https://bit.ly/3aUKAaI*తెలుగు ప్రజలకు అందాల్సిన GST నిధులకి కేంద్రం పంగనామాలు పెడుతున్నా కిక్కురు మనని తెలుగు ఎంపీలు*
10/02/2021

https://bit.ly/3aUKAaI
*తెలుగు ప్రజలకు అందాల్సిన GST నిధులకి కేంద్రం పంగనామాలు పెడుతున్నా కిక్కురు మనని తెలుగు ఎంపీలు*

తెలుగు ప్రజలకు అందాల్సిన GST నిధులకి కేంద్రం పంగనామాలు పెడుతున్నా కిక్కురు మనని తెలుగు ఎంపీలు కేంద్రం నుంచి రావ....

ఏడాది క్రితం,ఢిల్లీ నుంచి నోయిడాను అనుసంధానించే రోడ్డులో సాధారణ ప్రజానీకం ముఖ్యంగా స్థానిక మహిళా పౌరులు..పౌర సవరణ చట్టాన...
06/01/2021

ఏడాది క్రితం,ఢిల్లీ నుంచి నోయిడాను అనుసంధానించే రోడ్డులో సాధారణ ప్రజానీకం ముఖ్యంగా స్థానిక మహిళా పౌరులు..పౌర సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తలపెడితే.. షాహీన్ బాగ్‌ రోడ్ నంబర్ 13ఎ, ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది.100 మంది స్థానిక నివాసిత బృందం సిట్-ఇన్ నిరసనగా ప్రారంభమై 101 రోజుల పాటు కొనసాగింది. స్వతంత్ర భారత దేశంలో ఓ చట్టానికి (పౌరసత్వం సవరణ) వ్యతిరేకంగా మహిళలను ప్రథమ స్థానంలో ఉంచి జరిపిన అతిపెద్ద మరియు ప్రముఖ నిరసనలలో ఒకటి అని చెప్పక తప్పదు. వంద మంది స్థానిక మహిళలతో మొదలు అయిన నిరసన దేశంలోని ఇతర ప్రాంతాల వందలాది CAA వ్యతిరేకులు తమ తమ ప్రాంతాలలో షహీన్ బాగ్ నిరసనలు ఏర్పాటు చేసేలాగా చేసింది. లక్నౌలో లాల్ చౌక్, బీహార్ షహీన్ బాగ్..ఇలా ఇతర ప్రాంతాలలో కూడా షాహిన్ బాగ్ జననం జరిగింది. ఓ రహదారి ధర్నా ప్రభుత్వ కొత్త చట్టానికి ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కి ఓ రోజు ముందు, మార్చి 24, 2020 ఉదయం షాహిన్ బాగ్ ధర్నాని రాజ్యం క్షణాల వ్యవధిలో ఎత్తి వేసి స్థానిక మహిళలను ఇళ్లకు పంపించింది. ఈ రోజు షాహిన్ బాగ్ రోడ్ నెంబర్ 13ఏ..షహీన్ బాగ్ మార్కెట్..స్థానిక ప్రజల దైనందిన జీవితం ఎలా వుంది..? షాహిన్ బాగ్ మన మనసులో ఉంటే ఈ ప్రశ్న తప్పక పుడుతుంది.

షాహీన్ బాగ్స్ రోడ్ 13A .. షాహిన్ బాగ్ కి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న బట్ల హౌస్ సమీపంలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం హింస యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా 15 డిసెంబర్ 2020 నాడు నిరసనకారుల బృందం సమావేశం అయింది. వెంటనే ఢిల్లీ పోలీసులు నిర్ధాక్షిన్యంగా నిరసనకారులను చెదర గొట్టారు. ప్రస్తుతం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో అనేక ఎంట్రీ పాయింట్ల వద్ద ఇదే విధమైన ధర్నా జరుగుతున్నది. నిరసనలో వేలాది మంది రైతులు కూర్చుని వున్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నడిబొడ్డులో ఓ ఆగ్రహ జ్వాల రగలకుండ తగినంత జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందుకే షాహిన్ బాగ్ లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దింపింది. షాహిన్ బాగ్ caa nrc నిరసనలు నిర్వహించిన వారిని ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఎలాంటి చిత్ర హింసాలు పెడుతున్నది.. సాఫురా జర్గర్.. ఉమర్ ఖాలిద్ వంటి వారికి ప్రభుత్వం ఇచ్చిన ట్రీట్మెంట్ చూసి అర్ధం చేసుకోవచ్చు. నిత్యం సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ మీద కనిపించే వారి పరిస్థితి ఇలా ఉంటే.షాహిన్ బాగ్ సామాన్య ప్రజల పరిస్థితి ఇంకేలా ఉంటుందో మీరు ఊహించ గలరు. అయినా మచ్చుకు కొన్ని అంశాలు..

గత వారం, షాహీన్ బాగ్ వీధుల్లో కాపలాగా ఉండటానికి ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందిని షాహిన్ బాగ్ లో నిలిపింది. గత సంవత్సరం ఏమి జరిగిందో.. అది మళ్ళీ జరగకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.గత వారం మునుపు వరకు, 5 నుంచి 6 మంది స్థానిక పోలీసు సిబ్బంది పగటిపూట మార్కెట్లో పెట్రోలింగ్ చేసేవారు.రాత్రి వేళ పెట్రోలింగ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సాయుధ కమాండోలు షాహిన్ బాగ్ మొత్తాన్ని కాపలా కాస్తు వున్నారు. రైతుల నిరసనకు అనుకూలంగా షాహిన్ బాగ్ రహదారి కనుక నిలబడితే మతం కోణం పక్కకి పోయి పోరాట ఐక్యత బయట పడుతుంది. ఇది ప్రస్తుత ప్రభుత్వం యెంత మాత్రం కోరుకోదు. అందుకే షాహిన్ బాగ్ లో కాశ్మీర్ తరహా బోర్డర్ సెక్క్కురిటీ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అని షాహీన్ బాగ్ వద్ద స్థానిక మార్కెట్లో వస్త్ర దుకాణం నడుపుతున్న నలభై ఏళ్ళ సోలంకి అన్నారు. షాహిన్ బాగ్ మార్కెట్‌ లో నాలుగు రోజుల క్రితం ఓ బస్సు నిండే అంత మంది సాయుధ బిఎస్‌ఎఫ్ సిబ్బంది, మార్కెట్ అంతటా కవాతు చేసారు. వారిని కదిలిస్తే మాటాడటానికి నిరాకరిస్తారు. మేము ఇక్కడ ఎందుకు ఉన్నామో.. ఇక్కడ అందరికి తెలుసు ప్రతేకంగా చెప్పేది ఏం లేదు. అనే విదిలించుకుపోయే సమాధానం మాత్రమే వారి నుంచి వినిపిస్తుంది.

ఎకె -47 రైఫిల్స్‌ను పట్టుకుని, బిఎస్‌ఎఫ్ సిబ్బంది మార్కెట్ వెంట సందులలో గస్తీ తిరుగుతున్నారు. షాహీన్ బాగ్ నివాస ప్రాంతాల గల్లీలలో వీరు తిరుగుతున్నారు. సాయుధ కమాండోలు, స్థానిక పోలీసు అధికారులతో పాటు పోలీసు క్విక్ రియాక్షన్ టీం (క్యూఆర్‌టి) వాహనం రోడ్లపై నిలిపి గస్తీ కాస్తున్నారు.CAA, NRC మాత్రమే కాదు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నా పోరాటానికి అనుకూలంగా ఎవరైనా బ్యానర్లు పట్టుకున్నా..అసలు ఆ అవకాశం కూడా లేకుండా చేయటానికి బోర్డర్ సెక్యూర్టీ సిబ్బంది వీరితో పాటుగా ఢిల్లీ పోలీసులు షాహిన్ బాగ్ వీధుల్లో కవాతు నిర్వహిస్తూ కనిపిస్తున్నారు.

ప్రభుత్వ పెద్దల భయాన్ని అర్ధం చేసుకోవచ్చు షాహిన్ బాగ్ నిరసన మొదట ప్రారంభమైనప్పుడు, ఒక చిన్న కాలనీ అయిన షాహీన్ బాగ్ నిరసనగా నిలిచింది. రాజధాని వెలుపల ఎవరికీ షాహిన్ బాగ్ తెలియదు. అసలు రాజధాని నివాసితులు చాలా మందికి షాహిన్ బాగ్ తెలియదు. నిరసన పెరిగేకొద్దీ, ఢిల్లీ నలుమూలల నుండి ప్రజలు షాహీన్ బాగ్ వైపు వెళ్ళారు.ఇక్కడి ఇండియా గేట్ ప్రతిరూపాలను చూడటానికి ప్రజలు తరలి వచ్చారు. ధర్నా స్థలంలో దేశవ్యాప్తంగా CAA వ్యతిరేక నిరసనలలో మరణించిన వారి పేర్లు చెప్పేవారు. యువతీ యువకులు ఉద్వేగభరితమైన విప్లవాత్మక కవితలు చదవడం ఇక్కడ జరిగింది. షాహీన్ బాగ్ ముసలి వృద్ధ మహిళలు దేశానికి నానమ్మలు , అమ్మమ్మలు అయ్యారు. సెప్టెంబరులో, టైమ్ మ్యాగజైన్ 2020లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరుగా దేశ ప్రధాని మోడీతో పాటు షాహిన్ బాగ్ నానమ్మ 82 ఏళ్ళ బిల్కిస్ బాను కూడా ఎంపిక అయ్యారు. ఈ ప్రాంతంలోని అనేక మంది నివాసితులు చెప్పే మాట "షాహీన్ బాగ్ అత్యంత విజయవంతమైన సిట్-ఇన్ నిరసన." ప్రత్యేకించి అది నుంచి అంతం వరకు హింస జరగలేదు అంటారు.

అయితే షాహిన్ బాగ్ చిన్న వ్యాపారులు విజయవంతమైన ఈ నిరసన మమల్ని ఆర్ధికంగా కుదేలు చేసింది అని చెప్పారు. సుమారు 200-దుకాణాలు ఉన్న మార్కెట్లో కనీసం 15 దుకాణాలు ఒక సంవత్సర కాలం శాశ్వతంగా మూసివేయబడ్డాయి. ముందు షాహిన్ బాగ్ నిరసన కోసం అటుపై కోవిడ్ వలన దుకాణాలకు తాళాలు పడి స్థానిక చిన్న వ్యాపారాలు కుదేలు అయ్యారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరవాత కూడా వైరస్ భయంతో మరో 60 దుకాణాలు తిరిగి తెరవబడలేదు.ఇక్కడ వ్యాపారం ప్రారంభించడం ప్రమాదకరమని ప్రజలు భావిస్తున్నారు. పోలీసులు నిరంతరం కాపలాగా ఉంటున్నారు. గత సంవత్సరం నిరసన తరవాత ఈ స్థలం ప్రభుత్వ సంస్థల రాడార్ కిందకు చేరిపోయింది. మాములు శాంతిభద్రతల సమస్య వచ్చినా కూడా మొత్తం మార్కెట్ మూసివేయవచ్చని ప్రజలు భావిస్తున్నారు. మరో చోట బట్ల హౌస్ లేదా సరితా విహార్లో దుకాణాన్ని పెట్టి వ్యాపారం చేయవచ్చు కానీ షాహిన్ బాగ్ లో కుదరదు అని ప్రజలు భావిస్తున్నారు అని ఇక్కడి షాపుల్లో పనిచేసే కార్మికులు చెబుతున్నారు. షాహీన్ బాగ్ మార్కెట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాసిర్ హుస్సేన్ ఇలా అన్నారు “చాలా మంది దుకాణదారులు మళ్ళీ తిరిగి రాలేదు. నిరసన సమయంలో రోడ్డు దిగ్బంధనం ఆ తరువాత లాక్డౌన్ కారణంగా ఇక్కడి చిన్న వ్యాపారస్తులు భారీ నష్టాలను చవిచూశారు.”

షాహిన్ బాగ్ ఓ నివాసి మాట్లాడుతూ చాలా మంది స్థానిక వ్యాపారులు మళ్ళీ షాహిన్ బాగ్ తరహా నీరసన ప్రదర్శనను ఇక్కడ జరగాలి అని కోరుకోరు. షాహీన్ బాగ్‌లో ఖచ్చితంగా మళ్ళీ ఆ తహ నిరసన నిలబడటం అసాధ్యం. ఢిల్లీ నిరసనలకు ప్రసిద్ది చెందింది, అయితే ఈసారి షాహిన్ బాగ్ తరహా నిరసన ఇక్కడ జరగదు. మహిళలు, పిల్లలు అధికారంతో నిజం మాట్లాడటానికి ధైర్యం చేసిన ఓ ఆకస్మిక పోరాటం ఢిల్లీలోని ఇతర ప్రాంతాలలో జరిగే అవకాశం వుంది.ఇక్కడ షాహీ బాగ్ లో జరిగే అవకాశం తక్కువ. కారణం షాహిన్ బాగ్ నిరంతరం నిఘాలో ఉంది, అని చెప్పారు. షాహిన్ బాగ్ పోరాటం సిట్ నిరసనకు చుక్కానిగా నిలిచినందుకు ప్రభుత్వ దమనాన్ని చవిచూస్తున్నది. కాశ్మీర్ తరహా భద్రతా ఏర్పాట్లు గతవారం రోజులు షాహిన్ బాగ్ లో నెలకొని వున్నాయి.

ఢిల్లీ సింగు బోర్డర్, టికిరి బోర్డర్ మరో మూల కిసాన్ సంఘర్ష మాజ్దుర్ కమిటీ..మూడింటిలో ఎవరు మన అన్న దాత..? ఈ ప్రశ్నకి సమాధ...
30/12/2020

ఢిల్లీ సింగు బోర్డర్, టికిరి బోర్డర్ మరో మూల కిసాన్ సంఘర్ష మాజ్దుర్ కమిటీ..మూడింటిలో ఎవరు మన అన్న దాత..? ఈ ప్రశ్నకి సమాధానం దొరికితే రైతు ఉద్యమంలో మన మద్దత్తు ఎవరికి ఉండాలి అనేది స్పష్టం అవుతుంది. సింగు బోర్డర్ లో 31 రైతు సంఘాల మద్దత్తు దారులు ఒక్కచోట చేరగా ఏర్పడిన ధర్నా వేదిక. ఇక్కడ ప్రధాన వేదికకి కొద్ది దూరంలో కిసాన్ సంఘర్ష మాజ్దుర్ కమిటీ వేదిక.. టికిరి బోర్డర్ లో భారతీయ కిషన్ యూనియన్(ఉగ్రహాన్) మద్దతుదారులు ఏర్పరుచుకున్న వేదిక. మూడు యూనియన్లు రైతుల కోసం పనిచేస్తున్నాయి మరి మూడు ఒకటి కాదు ఎందుకు..? చూద్దాం.

31 రైతు సంఘాల తరుపున డాక్టర్ దర్శన్ పాల్ మాట్లాడుతూ చలో ఢిల్లీ కార్యక్రమం కోసం,సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పాటు జరిగింది. 31 రైతు యూనియన్లతో పాటు,అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ, అనేక ఇతర జాతీయ కిసాన్ సంస్థల మద్దతు మాకు వుంది. బికేయు (ఉగ్రహాన్) ఈ ఉమ్మడి మోర్చాలో భాగం కాదు, అని తెలిపారు. సింగు బోర్డర్ లో సంయుక్త కిసాన్ మోర్చా వేదిక నిరసనకు ప్రధాన కేంద్రంగా ఉండగా అన్ని ప్రసంగాలు, ప్రకటనలు ఇక్కడి నుండి జరుగుతున్నాయి. ఈ వేదికకు కొంచెం దూరంలో భూమిలేని వ్యవసాయ కూలీలు అధిక సభ్యులుగా ఉన్న పంజాబ్‌కు చెందిన మరో రైతు సంస్థ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సొంత వేదిక ఉంది. ఈ కమిటీ 31రైతు సంఘాల యూనియన్ల సమ్మేళనంలో భాగం కాదు అనేది గమనించాల్సిన విషయం. భూమి లేని వారు రైతులే కాదు అని వీరిని 31 రైతు సంఘాలు పట్టించుకో లేదు.. BKU (రాజేవాల్), BKU (లఖోవాల్) వంటి పాతవి, క్రొత్త BKU(డకూండా) వంటి యూనియన్లు సింగు బోర్డర్ 31 రైతు సంఘాలలో ఉన్నాయి.

ఇక టికిరి సరిహద్దు వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) అనేక కిలోమీటర్ల విస్తీర్ణంలో తమ మద్దత్తుదారులను కూర్చోబెట్టి వేదికను ఏర్పాటు చేసింది. భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) నాయకుడు మాజీ సైనికుడు 75 ఏళ్ల జోగిందర్ సింగ్. ఇతను బికేయు (ఉగ్రహాన్) గురించి ఇలా చెబుతారు. "భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) మందను అనుసరించదు. దీనికంటూ ఎజెండా ఉంది. మా పోరాటం రైతు పోరాటం" మాల్వా వ్యవసాయ బెల్ట్ అంతటా భారీ మద్దత్తు కలిగి ఉన్న భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) మద్దత్తు లేకుండా ప్రస్తుత ఉద్యమానికి బలం చేకూరదు. ఎందుకంటే దక్షిణ పంజాబ్‌లోని కనీసం 20 జిల్లాల్లో భారతీయ కిసాన్ యూనియన్ కి బలమైన పట్టు వుంది. మరి ఈ యూనియన్ న 31 రైతు సంఘాలు పడదు అందుకే అవి ఒకదానితో మరోటి దూరంగా ఉంటాయి.. బికెయూ(ఉగ్రహన్) ని 31 రైతు సంఘాలు ఎందుకు వెలి వేసాయి చూద్దాం..

బికెయు (ఉగ్రహాన్) నాయకత్వం డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం జైలులో ఉన్న పౌర సమాజ కార్యకర్తలు వరవర రావు,సుధా భరద్వాజ్,ఆనంద్ తెల్టుంబడే,ఉమర్ ఖాలిద్ వంటి పౌర సమాజ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తన యూనియన్ సభ్యులను ఉద్దేశించి బికెయు (ఉగ్రహాన్) నాయకత్వం ప్రసంగించింది. తమ మదత్తుదారుల చేతుల్లో ఈ పౌర సమాజ కార్యకర్తల ఫోటోలు ప్రదర్శింప జేసి వీరి విడుదలకి డిమాండ్ చేసింది.

దీనితో కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్ గోయల్‌తో తక్షణం ప్రతిస్పందించి చట్ట వ్యతిరేకులు అయిన వామపక్ష మరియు మావోయిస్టు వాదులు రైతుల ఆందోళనను హైజాక్ చేశాయని అన్నారు. ఈ సంఘటన తర్వాత బికెయు (ఉగ్రహాన్) యూనియన్ ప్రభుత్వ వ్యతిరేఖను మాత్రమే కాదు.. నిరసనలో ఉన్న ఇతర 31 రైతు సంఘాల నుంచి కూడా వ్యతిరేకతను చవి చూసింది. భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) వలన ప్రస్తుత రైతు ఉద్యమానికి హాని అని 31 రైతు సంస్థలు ప్రకటించాయి.దానితో మాకు సంబంధం లేవు అన్నాయి.. అయితే రైతు భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) మాత్రం తాము చేసింది తప్పు అని భావించ లేదు."మేము ఏమి చేసినా రైతులకు అనుకూలంగా ఉండటం మా నిరసనలో ఒక భాగం, లక్షలాది మంది మాకు మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వం లేదా కార్పొరేట్ మీడియా మా రైతుల ఆందోళనను అరికట్టలేవు ”అని బికెయు (ఉగ్రహాన్) ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ కోక్రీ అన్నారు.

ఢిల్లీకి చేరుకోవడానికి ముందు వ్యవసాయ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రెండు నెలల నిరసన సందర్భంగా, ఉగ్రహాన్ తన సొంత అజెండాతో ఆందోళనను నిర్వహించింది. 31 ఇతర రైతు యూనియన్లు నవంబర్ 28న ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న స్సమయంలో అందరి కంటే చివరిగా భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) ఢిల్లీకి చేరింది. ప్రస్తుతం ఈ యూనియన్ వేలాది మంది మద్దతు దారులతో టికిరి సరిహద్దులో శిబిరాలు వేసుకుని ధర్నా చేస్తున్నది. ఈ యూనియన్ టికిరి బోర్డర్లో ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకుని ధర్నా నిర్వహిస్తోంది.దీనికి 31 రైతు సంఘాలకి మధ్య విభేదాలు చాల మెండుగా వున్నాయి.. సామజిక కార్యకర్తల అరెస్టు ఖండించి.వారి విడుదలను డిమాండ్ భారతీయ కిసాన్ (ఉగ్రహాన్) చేసినందుకు దీన్ని 31 రైతు సంఘాలు వెలివేసాయి.

భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్)కి 31 రైతుసంఘాలకి మధ్య అగాధం ఢిల్లీ బోర్డర్లలో ఏర్పడ లేదు. పంజాబ్ గడ్డ మీదే వీరికి అభిప్రాయ బేధాలు వున్నాయి. ఈ ఏడాది జూన్‌లో పంజాబ్‌లో మూడు (అప్పటి బిల్లులకు) నేటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైనప్పుడు, భారతీయ కిషన్ యూనియన్ (ఉగ్రహాన్) ఏ ఉమ్మడి ఫోరమ్‌లో భాగం కావడానికి లేదా ఇతర యూనియన్లతో జత కుడటానికి నిరాకరించింది. బికెయు (ఉగ్రహాన్) తన స్వతంత్ర పోరాటాన్ని నిలుపుకోవటానికి, అలాగే సొంత ఎజండా ,ప్రత్యేక నిరసన కార్యక్రమాలను కలిగి ఉండాలని నిర్ణయించుకుంది. అన్ని నిరసనలలో పాల్గొన్న సంస్థలలో ఒకటైన క్రాంతికారి కిసాన్ యూనియన్ పంజాబ్ అధ్యక్షుడు డాక్టర్ దర్శన్ పాల్ ఇలా తెలిపారు. "మొదట బారతీయ కిసాన్ యూనియన్ ఉగ్రహాన్ ఎవరితో జతకట్టలేదు. తర్వాత అది 31 యూనియన్లతో జత కట్టింది. 31 రైతు సంఘ సమ్మేళనాల సమావేశాలకు హాజరు కావాలి అని పంజాబ్‌లో ఆందోళనకి ప్రణాళిక వేసి అమలు చేస్తున్నా బికెయు (ఉగ్రహాన్) ఆఫీసు బేరర్లను ఆహ్వానించగా, వారు మా కార్యక్రమాలలో కొన్నిటిని అంగీకరించారు. కొన్నింటితో విభేదించారు. వారి స్వంత ఎజెండా లోంచి కొన్ని ఉమ్మడి పోరు ఎజండాలో జోడించారు.

మిగత రైతు సంఘాలకి భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) కి మధ్య తేడాలు వున్నాయి ఉదాహరణకు సెప్టెంబర్ మధ్యలో, మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ నివాసం వెలుపల, పాటియాలాలోని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాసం వెలుపల బికేయు (ఉగ్రహాన్) ఆరు రోజుల సిట్ నిరసనను ప్రారంభించింది. 31 రైతు సంఘాలు ఈ ఆరు రోజుల ఆందోళన చేసేందుకు ముందుకు రాలేదు. అంతే కాకుండా ఒక్క రోజు ధర్నా చేసి ఆపేయాలని కోరుకున్నాయి.

పంజాబ్‌లోని మాల్స్, పెట్రోల్ పంపులు మరియు పెద్ద కార్పొరేట్ గ్రూపుల ఆఫీసుల ముందు నిరసనలు ప్రారంభించాలనే ఆలోచన బికేయు (ఉగ్రహాన్) చేసింది. దీనిని 31 రైతు సంఘాలు ఒప్పుకుని అమలు చేసాయి. సీనియర్ బిజెపి కేంద్ర నాయకుల దిష్టిబొమ్మలను తగలబెట్టడం గురించి బికేయు (ఉగ్రహాన్) ఇచ్చిన పిలుపుకి 31 రైతు సమ్మేళనం మొదట ఒప్పుకోలేదు. తరువాత వారు బికేయు (ఉగ్రహాన్) తో కలసి పంజాబ్ బిజెపి నాయకుల ఇళ్ల ముందు గెరావ్ చేయటానికి 31 రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి.

31 రైతు సంఘాలు నవంబర్ 26-27 తేదీలలో తన చలో ఢిల్లీ నిరసనను ప్రకటించినప్పుడు, భారతీయ కిసాన్ (ఉగ్రహాన్) తన ఆఫీసు-బేరర్ల సమావేశాన్ని నిర్వహించి, తాము రోతక్ వైపు నుండి ఢిల్లీకి పోదాం అని..31 రైతు సంఘాలు అనుసరిస్తున్న జిటి రోడ్ మార్గం ద్వారా వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకుంది. బికేయు(ఉగ్రహాన్) మద్దతుదారులు పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరి వద్ద ఆగారు. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద 31 రైతు సంఘాలు ఆగిపోయాయి. బికేయు (ఉగ్రహాన్) మద్దతుదారులు ఖానౌరి వద్ద ఆగాలి అని నిర్ణయించుకోగా, 31 రైతు సంఘాలు అన్ని అడ్డంకులను అధిగమించి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఎప్పుడైతే ఢిల్లీ పోలీసులు రైతుల కోసం కందకాలు..ముళ్ల కంచెలు..బారికేడ్ల అడ్డంకి పెట్టిందో ఈ వార్త బికేయు ఉగ్రహాన్ గ్రూప్ కు చేరి ఖానౌరి సరిహద్దు వద్ద ఉన్న అడ్డంకులను తొలగించుకుని ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుని టికిరి సరిహద్దుకు చేరుకుంది.

సింగు బోర్డర్ వేదిక నియంత్రణ 31 రైతు సంఘాలు చేస్తుండగా.. టికిరి బోర్డర్ వేదిక నియంత్రణ భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) చేస్తున్నది.. ఈ రెంటిలో అధిక భూమి లేదా ఓ మోస్తరు భూమి ఉన్న రైతులు సభ్యులు.. భూమి లేని వ్యవసాయ కూలీలు అధిక సభ్యులుగా ఉన్న పంజాబ్‌కు చెందిన మరో రైతు సంస్థ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సొంత వేదిక గురించి వారి డిమాండ్స్ గురించిన చర్చ ఎక్కడ జరగటం లేదు. అనే విషయాన్ని మనం గమనించాలి. రైతులలో భూమి ఉన్నవారే అన్న దాతల..? రైతుల్లో పలు రకాల రైతులు వున్నారు. అందులో అధికం వ్యవసాయం మాత్రమే తెలిసి రెక్క కష్టం మాత్రమే కలిగి ఉన్న అసంఖ్యాక రైతు కార్మికులు వున్నారు. వీరు రైతులే ఇంకా చెప్పాలి అంటే భూమి లేని అన్నదాతలు. వీరి దగ్గర పనిచేయటానికి రెండు చేతులు మాత్రమే వున్నాయి..వీరిని మనం గుర్తించేది ఎప్పుడు..? వీరికి అండగా మనం నిలిచేది ఎప్పుడు..? ఈ ప్రస్తుత రైతు ఉద్యమం తరుణం అడుగుతున్న ప్రశ్నలు ఇవి..

మనకు ప్రస్తుతం సర్వత్రా కనిపిస్తున్నది  పంజాబ్ హర్యానా రైతులు దేశ రాజధాని చేరుకోటానికి ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ప్రభు...
30/11/2020

మనకు ప్రస్తుతం సర్వత్రా కనిపిస్తున్నది పంజాబ్ హర్యానా రైతులు దేశ రాజధాని చేరుకోటానికి ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం మొదట అడ్డుకుంది తరవాత వారిని అనుమతించింది..అటుపై రైతుల ప్రయాణం టియర్ గ్యాస్..ముళ్ల తీగలు..బారికేడ్స్ ఎత్తి పడేయటాలు.. ఈ అంశాలు అన్ని చాల భావోద్వేగాలతో మొత్తం మీడియాలో కవర్ అవుతున్నాయి. దీనితో మన సోషల్ మీడియా అకౌంట్లు అగ్రహం ఆవేశంతో నిండిపోతున్నాయి. అయితే భావావేశాలు.. ఆగ్రహం వలన మనం సాధించేది పరిమితం. ఈ సమయంలో మనకి కావలసింది సమస్యపై స్పష్టత. సమస్యపై స్పష్టత పంజాబ్ రైతులు ఇచ్చారు. అయితే అది అరా కొరగా మీడియా కవర్ చేసింది. పంజాబ్ రైతు ముందు తిరగబడింది రాజ్యం మీద కాదు. పంజాబ్ రైతు మొదటిగా తిరగబడింది అంబానీ అదాని మీద. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయం మనకి స్పష్టంగా అర్ధం అయితే మన దేశంలో వ్యవసాయం ఒక పరిశ్రమ అని మనకి స్పష్టం అవుతుంది.

పంజాబ్ లో అక్టోబర్ 1న, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ నిరసన తెలిపేందుకు రైతు సంఘాలు ఎన్నుకున్న మార్గం ఏంటి..? అనేది చూడాలి..ఈ మార్గం ఏమనగా.. పంజాబ్ లో రైతు సంఘాలు కార్పోరేట్ హౌస్‌లను ‘గెరావ్’ చేసి ‘బహిష్కరణ’ చేయాలి అని ప్రకటించాయి. ప్రధానంగా ముఖేష్ అంబానీ మరియు గౌతమ్ అదానీల కంపెనీలను రైతు సంఘాలు టార్గెట్ చేసాయి. పంజాబ్ రైతులు, కార్పొరేట్ సంస్థలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చాక, పంజాబ్ రైతుల ప్రతిఘటన పెద్ద పరిశ్రమ అధిపతులకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆర్థిక, సామాజిక ఉద్యమం అయ్యింది. రైతులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు జియో సిమ్ కార్డులను వాడటం నిలిపివేశారు.ఇదే కాదు రిలయన్స్ షాపింగ్ మాల్స్, మొగా,సంగ్రూర్ వద్ద అదానీ ప్రాజెక్టులు, గురు గోవింద్ సింగ్-హెచ్‌పిసిఎల్ రిఫైనరీలకు,వాల్‌మార్ట్, బెస్ట్ ప్రైస్ స్టోర్స్, టోల్ ప్లాజాలు ఎస్సార్ పెట్రోల్ పంపులకు వ్యతిరేకంగా నిరసనలు చేయటం అవి ఊపు అందుకోవటం పంజాబ్ లో కనిపించింది. పంజాబ్‌లో 85 రిలయన్స్ పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఒక వారంలో ఈ రిలయన్స్ పెట్రోల్ పంపుల అమ్మకాలు 50% పడిపోయాయి. భటిండాలోని రిలయన్స్ పెట్రోల్ పంప్ భాగస్వాములలో ఒకరైన పంకజ్ బన్సాల్ మాట్లాడుతూ పరిస్థితిని ఇలా వివరించారు.. “భారతీయ కిసాన్ యూనియన్ పిలుపు మేరకు రైతులు మా పెట్రోల్ పంప్ బయట అక్టోబర్1 నుండి నిరసనగా కూర్చున్నారు. మా అమ్మకాలు సున్నాకి పడిపోయాయి. ఉద్యోగులు పనిలేకుండా కూర్చున్నారు. రైతులు మా పెట్రోల్ పంపును బహిష్కరించినప్పటికీ, మేము మాత్రం వారికి మా మద్దతును ప్రకటించాము. ఇలా చేయటానికి కారణం మా 18 మంది ఉద్యోగులలో 15 మంది స్థానిక రైతుల కొడుకులు.." రైతుల నిరసనల తరువాత, రిలయన్స్ డీలర్లు, ఉద్యోగులు తమ మద్దతును తెలపటానికి ఏమాత్రం వెనుకాడటం లేదు సోషల్ మీడియా వాడుకుంటూ వీడియో సందేశాలు, ప్లకార్డ్స పట్టుకుని ఫోటోలను పంచుకుంటున్నారు. అదేసమయంలో తమను లక్ష్యంగా చేసుకోవద్దని రైతులను వేడుకుంటున్నారు. ఎందుకంటే పెట్రోల్ పంప్ పని ఆగిపోతే జీతం రాదు. అది లేకపోతే బతుకు గడవదు.

ఇక గోధుమలను నిల్వ చేయడానికి మోగా ప్రాంతంలో గౌతమ్ అదానీ ప్రాజెక్ట్ తో పాటుగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా దాడికి గురైంది. మోగా అదాని ప్లాంట్‌ గోడలపై, రైతులు ‘గో బ్యాక్ అదానీ’ అనే నినాదాలు రాశారు. అదానీ అగ్రి లాజిస్ట్స్ కంపెనీ ఏర్పాటుకు 2007 లో అప్పటి శిరోమణి అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగ్రూర్ జిల్లాను సందర్శించిన సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆహార ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి రౌసాహెబ్ పాటిల్ డాన్వే మాటాడుతూ ఆహార ధాన్యాల నిల్వ కోసం పంజాబ్‌లో 31 గోదాములను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ అదానీకి అనుకూలించేవి కానున్నాయి అని పంజాబ్ రైతులు గ్రహించారు. అందుకే ‘గో బ్యాక్ అదానీ’ అనే నినాదం పుట్టింది.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఇక్కడ తప్పకుండ చెప్పుకోవాలి. పంజాబ్ శ్రామిక ప్రజలు మైగ్రేషన్ ఎఫెక్ట్ తో కూడా బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఉత్తర ప్రదేశ్, బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో వలస కూలీలు పంజాబ్ పొలాల్లో కార్మికులుగా పనిచేయడానికి పంజాబ్ కి చేరుకుంటారు. ఈ రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ కూలీలు అధికం.అంచేత ఈ వ్యవసాయ కూలి కార్మికులు పంజాబ్ బాట పడతారు. పర్యవసానంగా పంజాబ్ లోకల్ వ్యవసాయ కార్మికులు తమ శ్రమను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. బీహార్ నుండి శ్రామికులు పంజాబ్ వస్తారు.మరి మేము ఎక్కడికి వెళ్ళాలి..? ఇది పంజాబ్ లో రెక్కాడితే కానీ డొక్కాడని సగటు శ్రామికుడి ప్రశ్న..
'ఈ మూడు వ్యవసాయ చట్టాలు మాత్రమే కాకుండా రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం 'విద్యుత్ సవరణ బిల్లు 2020'ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మా ఉనికి ప్రమాదంలో వుంది ప్రస్తుత పరిస్థితి చావో రేవో తేల్చుకునే పరిస్థితి' అని పంజాబ్ లోని 31 వ్యవసాయ సంఘాలు హుంకరిస్తున్నాయి.

పంజాబ్ రైతుల ప్రతిఘటనలో ఇమిడి ఉన్న కీలక అంశాలు ఇవి. పంజాబ్ రైతు ఎందుకు ఢిల్లీ బయలు దేరాడు అనేది చూస్తే.. పంజాబ్ రైతుల దగ్గర పెద్ద మడులు వున్నాయి. నెలకు వీరి ఆదాయం పద్నాలుగు వేలు వరకు ఉంటుంది. ఈ ఆదాయం సాధ్యం అయ్యింది అంటే దానికి కారణం పంజాబ్ రైతులు తమ పెద్ద మడులలో గోధుమ, వరి పండించి, ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దత్తు లాభాన్ని పొందుతున్నారు. రెండు పంటల వ్యవసాయం చేయటం వలన పంజాబ్ సారవంతమైన భూమి ఎనలేని డమేజీకి గురి అవుతున్నది అనేది ప్రత్యేక చర్చ. పెద్ద మడులు,వరి, గొడుమకి ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దత్తు ధర వలన ఈ రైతుల దగ్గర కొంత మిగులు అనే ఆస్తి సమకూరుతున్నది. ఈ విషయాన్ని రాజ్యం పసిగట్టింది. ఈ రైతు ఆస్తిని ఇకపై బడా కంపెనీల గల్లా పెట్టెలలో వేయాలి అనేది రాజ్యం ఆలోచన. దీన్ని పంజాబ్ రైతులు పసిగట్టారు. అందుకే తమ దగ్గరున్న మిగులులో కొంత ఖర్చుబెట్టి, అంటే ఆరునెల రేషన్ తీసుకుని ఢిల్లీకి పోరాటం కోసం పోవటం అనే ఆలోచన పంజాబ్ రైతులు చేశారు. ఈ ప్రతిఘటన చూపటం ద్వారా తమ దగ్గర ఉన్న చిన్న పాటి ఆస్తిని కాపాడుకోవటం తద్వారా తమ రైతు స్టేటస్ నుంచి రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుని బతుకుకి దిగజారిపోకుండా చూసుకోవటం అనే జాగ్రత్త పడుతున్నారు. ఈ పరిస్థితిని పంజాబ్ రైతులు "మా పోరాటం చావో రేవో తేల్చుకునే పోరాటం" అని చెబుతున్నారు. అయితే ఇది అప్పుడే చావో రేవో తేల్చుకునే పోరాటం కాదు. ఇలా ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే..

ఇక్కడ రాజ్యం వాదన గమనించాలి.. "ఒక్క పంజాబ్ రైతులు మాత్రమే ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు.. మిగతా వారు రైతులు కదా..?" అని రాజ్యం అడుగుతున్నది. బీహార్.. ఉత్తరప్రదేశ్.. మహారాష్ట్ర ఇలా ఇతర రాష్ట్రల రైతులు ఎందుకు పోరాటంలో లేరు అనే ప్రశ్న రాజ్యం అడుగుతున్నది. రాజ్యంకి తాను అడుగుతున్నా ప్రశ్నకి సమాధానం తెలుసు. తెలిసి కూడా అడుగుతున్నది. రాజ్యానికి తెలిసిన సమాధానం ఏమనగా..బీహార్.. ఉత్తరప్రదేశ్.. మహారాష్ట్ర చాల రాష్ట్రాల రైతుల మడులు చిన్నవి. వీరికి ఆరు నెల్ల రేషన్ చేతిలో పెట్టుకుని ఢిల్లీకి రాగలిగిన ఆర్ధిక స్థితి లేదు. వీరంతా స్వతంత్రం తరవాత దేశ పాలసీలు కార్పొరేట్ కంపెనీలకి అనుకూలంగా ఉండిన కాలగమనంలో రైతు హోదా కోల్పోయి రైతు కూలీలు అనే రెక్కాడితే గాని డొక్కాడాని శ్రామికులుగా ఉన్నారు. వీరి దగ్గర పేరుకి ఆస్తిగా ఉన్న చిన్న పొలం ఉంది. వీరు నామ మాత్ర రైతులు. తమ దగ్గర ఉన్న చిన్న పొలం ఆస్తి రూపంలో ఉన్న గుడి బండ అని గుర్తించక ఆ చిన్న పొలంలో వెట్టి చాకిరీ చేస్తున్న శ్రామికులుగా కొనసాగుతున్నా రైతులు అధిక సంఖ్యలో దేశ వ్యాపితంగా వున్నారు. వీరంతా ఢిల్లీకి పంజాబ్ రైతులుగా ఎందుకు రారు అని క్రూరంగా రాజ్యం అడుగుతున్నది. రాజ్యంకి సమాధానం దొరికే రోజు ఎప్పుడు అంటే.. తమ చిన్న పొలం ఆస్తి కాదు గుదిబండ అని ఈ రైతు రూపంలో ఉన్న శ్రామికులు గుర్తించే రోజు. ఈ రోజు తప్పక వస్తుంది. ఆ నాడు రాజ్యం నడిపేవారు..నడుపుతున్న వారు.. ఎవరు రైతు..? ఎవరు రైతు కాదు..? అని ప్రశ్నిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. రెక్కాడితే గని డొక్కాడని పోరాట బతుకు బతికే కార్మికులు తమ దగ్గర మిగిలిన ఆ కొద్ది భూమి రూపంలో ఉన్నది ఆస్తి కాదు గుదిబండ ఆని గుర్తించితే పుట్టే పోరాటం ఓ సునామి అవుతుంది.ఆ సునామీ ప్రశ్నిస్తే.. కనీసం జవాబు చెప్పటానికి మిగలని పరిస్థితి రాజ్యం ముందు ఉంటుంది. కనుక రైతు చేతి పంట తినే మనం కార్పోరేట్ మీడియా భావోద్వేగాల వార్తల కవరేజ్ ను మెదడుకి మెతగా పెట్టకుండా.. పంజాబ్ రైతులు మొదట పోరాటం ఎత్తుకుంది కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా అనేది గుర్తించి. మన స్టాండ్ ఏం కావాలి అని నిర్ణయించుకుని ఆనక మన సోషల్ మీడియా అకౌంట్లు నింపితే దేశంలో ఉన్న రైతుల రూపంలో కనిపిస్తున్న మన తోటి కార్మికులకు మనం ఉపయోగపడగలం.

Address

DELIHI

Telephone

+919810410727

Website

Alerts

Be the first to know and let us send you an email when ArunaReport posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share