MS8NEWS

MS8NEWS RAISE UR HAND TO CHANGE THE SOCIETY

|:: కార్మికుల పిల్లలకు ఉచిత శిక్షణ ::||తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో కార్మికుల పిల్లలకు ఉచిత ఇవ్వ...
02/04/2024

|:: కార్మికుల పిల్లలకు ఉచిత శిక్షణ ::||
తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో కార్మికుల పిల్లలకు ఉచిత ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎన్ఎసి ఇన్స్ట్రక్టర్ గోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషన్, హౌస్ వైరింగ్ లో శిక్షణ ఉంటుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7989247723 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

||:: సికింద్రాబాద్ తనిఖీలలో రూ.37.50 లక్షల నగదు సీజ్ ::||సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్ఫీ, ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్...
02/04/2024

||:: సికింద్రాబాద్ తనిఖీలలో రూ.37.50 లక్షల నగదు సీజ్ ::||
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్ఫీ, ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సోమవారం చేపట్టిన తనిఖీల్లో రూ. 37. 50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో నగదు గుర్తించిన పోలీసులు సరైన పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఆదాయ శాఖాదికారులకు నగదు అప్పజెప్పినట్లు జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.

||:: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ::||నాటి అధికార పార్టీకి సంబంధించిన డబ్బులు క్షేత్రస్థాయిలో పంపిణీ చేసేందుకు ఏకంగా...
02/04/2024

||:: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ::||

నాటి అధికార పార్టీకి సంబంధించిన డబ్బులు క్షేత్రస్థాయిలో పంపిణీ చేసేందుకు ఏకంగా టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి డబ్బును తరలించేందుకు నాటి ప్రభు త్వ పెద్దలతో కలిసి టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బుల ను తరలించారు.

ఇందులోనూ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేసే పలువురు ఎస్సైలను రాధా కిషన్ రావు పావుగా వాడుకున్నారు. ఆయన చెప్పినట్టు చేసిన సిబ్బంది వాంగ్మూలాల ఆధారంగా రాధా కిషన్ రావును కస్టడీకి తీసుకొని విచారణ జరపనున్నారు పోలీసులు.

ట్యాపింగ్ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచేం దుకు ఒకే సామాజిక వర్గాని కి సంబంధించిన పోలీసుల ను తమ టీం సభ్యులుగా చేసుకున్నారు

నిందితులు. ఇందులో భాగంగా తిరుప తన్న, భుజంగరావు, రాధా కిషన్ రావు, వేణుగోపాల రావు, ప్రణీత్ రావు… తదితరులకు ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ శాఖల్లో కీలక పోస్టింగులు కల్పించారు.

అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి ఫోన్ల ను, రెబల్స్‌గా ఉన్న నేతల ఫోన్లను, ఇతర పార్టీల నుంచి అధికార పార్టీకి రావాలనుకుంటున్న నేతల ఫోన్ లను, సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా నిఘా పెట్టించి ఫోన్లను ట్యాప్‌ చేయించారు.

మొత్తం పొలిటికల్ వ్యవస్థ ను టెక్నికల్ గా తమ గుప్పె ట్లో పెట్టుకున్నారు ట్యాపింగ్ బ్యాచ్‌. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లను ట్యాప్‌ చేశారని అనేకమంది నేతలు ఆరోపించారు.

ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు స్పెషల్ టీం పోలీసులు. ప్రణీత్ రావ్, భుజంగరావు, తిరుపతన్న, రాధా కిషన్ రావు లను నిందితులుగా చేర్చారు. తాజా పరిణా మాల నేపథ్యంలో త్వరలో రిటైర్డ్ ఐజీ కూడా పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారు.

వీరిచ్చే వాంగ్మూలాల ఆధారంగా బీఆర్‌ఎస్‌ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమౌతున్నారు...

హనుమకొండ: రేవంత్‌రెడ్డిపై గతంలో కడియం శ్రీహరి ఎన్నో విమర్శలు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అ...
01/04/2024

హనుమకొండ: రేవంత్‌రెడ్డిపై గతంలో కడియం శ్రీహరి ఎన్నో విమర్శలు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డితోనే కండువా కప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. హన్మకొండలో నిర్వహించిన భారాస లోక్‌సభ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇంత దిగజారడం అవసరమా అని కడియం శ్రీహరి ఆలోచించాలి. కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ భారాస అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువని కడియం శ్రీహరే అన్నారు. ఇప్పుడు అందులోకే వెళ్లారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి.. అధైర్యపడాల్సిన అవసరం లేదు. వరంగల్‌ జిల్లా ఉద్యమాల ప్రాంతం.. ఇక్కడి కార్యకర్తలు భయపడరు. ఈ జిల్లాకు భారాస ప్రభుత్వం ఐదు మెడికల్‌ కళాశాలలు ఇచ్చింది. కాకతీయ తోరణాన్ని తీసేస్తామని రేవంత్‌రెడ్డి అంటున్నారు. దాన్ని ముట్టుకుంటే ఈ ప్రాంతం అగ్నిగుండం అవుతుంది. ఉద్దెర మాటలు తప్ప కాంగ్రెస్‌ ఉద్ధరించేది లేదు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.. ఏం చేశారు?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ...

కాంగ్రెస్ కు ఇచ్చిన 3500 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసులపై ఆ పార్టీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను ...
01/04/2024

కాంగ్రెస్ కు ఇచ్చిన 3500 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసులపై ఆ పార్టీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది.

తుది తీర్పు వెలువడే వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చింది.

||:: హోటళ్లు, రెస్టారంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వంటగ్యాస్‌ ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించాయి ::||దేశ ...
01/04/2024

||:: హోటళ్లు, రెస్టారంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వంటగ్యాస్‌ ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించాయి ::||

దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.30.50 తగ్గి రూ.1,764.50కు చేరింది.

రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది.

పట్నాలో గరిష్ఠంగా ఒక్కో సిలిండర్‌పై రూ.33 వరకు తగ్గింది.

హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గి రూ.1,994.50కు, విశాఖపట్నంలో రూ.32 తగ్గి రూ.1,826.50కు చేరింది.

కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

మరోవైపు ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్‌ ఎల్‌పీజీ ధరను సైతం రూ.7.50 తగ్గించారు.

దిల్లీ: మద్యం విధానానికి  సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్‌ అవెన్యూకోర్టు 1...
01/04/2024

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్‌ అవెన్యూకోర్టు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తిహాడ్‌ జైలుకు తరలించనున్నారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు కొన్ని అభ్యర్థనలు చేశారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది అప్లికేషన్ సమర్పించారు.
జైలులో చదివేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని కేజ్రీవాల్ కోరారు. రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా ఛౌదరీ రాసిన హౌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ డిసైడ్‌ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్స్‌, డైట్‌ ప్రకారం ఆహారం అందించాలని అడిగారు. ఇప్పటికే ధరిస్తోన్న లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.
మద్యం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో సీఎంను కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ క్రమంలోనే కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.....

||:: వాహనదారులకు గుడ్ న్యూస్ ::||దేశవ్యాప్తంగా వాహన దారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ అందించింది...
01/04/2024

||:: వాహనదారులకు గుడ్ న్యూస్ ::||

దేశవ్యాప్తంగా వాహన దారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ అందించింది.

సోమవారం నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ ఛార్జీలు పెంచనున్నట్లు NHAI గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనిపై లారీల యజమానులు, వాహనదారులు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని NHAI వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న టోల్ గేట్ రేట్లు కొనసాగుతాయని NHAI అధికారులు వెల్లడించారు.

||:: ఎన్నికల బాండ్ల రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు ::||ఎన్నికల బాండ్ల రద్దు తమకు ఎదురుదెబ్బ కాదన్న ప్రధాని మోదీబాండ...
01/04/2024

||:: ఎన్నికల బాండ్ల రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు ::||

ఎన్నికల బాండ్ల రద్దు తమకు ఎదురుదెబ్బ కాదన్న ప్రధాని మోదీ

బాండ్ల రద్దు చూసి సంతోషిస్తున్న వారు భవిష్యత్తులో పశ్చాత్తాపం చెందుతారని వ్యాఖ్య

ఎన్నికల బాండ్ల వల్లనే దర్యాప్తు ఏజెన్సీలు నిధుల మూలాల్ని సులభంగా గుర్తించగలిగాయని వెల్లడి

2014కు ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదని వ్యాఖ్య

ఆదివారం తంతి టీవీకి మోదీ ఇంటర్వ్యూ

ఎన్నికల బాండ్ల రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీకి ఎదురుదెబ్బగా తాము భావించట్లేదని స్పష్టం చేశారు. ఏ వ్యవస్థ కూడా పూర్తిగా స్థాయిలో పకడ్బందీగా ఉండదని ఆయన చెప్పారు. లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘అసలేం జరిగిందని మేము దీన్ని ఎదురుదెబ్బగా భావించాలో చెప్పండి? ఎలక్బోరల్ బాండ్‌ల రద్దు చూసి సంబరపడుతూ చిందులేస్తున్న వారు భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు. అసలు ఈ రోజు నిధులు రాకడ గురించి ఇంత సులభంగా తెలిసిందంటే అది ఎన్నికల బాండ్ల వల్లే. 2014కు ముందు ఏ దర్యాప్తు ఏజెన్సీ అయినా ఈ వివరాలను సేకరించగలిగేదా? లోపాలే లేని వ్యవస్థ ఉండదు. అయితే, ఎప్పటికప్పుడు వ్యవస్థలను మెరుగుపరుచుకుంటూ వెళ్లాలి’’ అని మోదీ అన్నారు.

ఎన్నికల బాండ్లు ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందంటూ సుప్రీం కోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు మేరకు స్టేట్‌బ్యాంక్ ఇండియా బాండ్ల వివరాలను ఈసీకి సమర్పించింది. ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని బహిర్గతం చేసింది. దీని ఆధారంగా కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. క్రిమినల్ కేసులున్న అనేక సంస్థలు ఎన్నికల బాండ్లు కొన్నాయని ఆరోపించింది.

కాగా, తాను చేసే ప్రతిపనిలోనూ రాజకీయం చూడొద్దని ప్రధాని మోదీ అన్నారు. తాను దేశం కోసం పనిచేస్తానని, తనకున్న అతిపెద్ద బలం తమిళనాడేనని కూడా వ్యాఖ్యానించారు. ఓట్లే తన ప్రాధాన్యత అయ్యి ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు ఇంత చేసి ఉండేవారం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు ఆ ప్రాంతాన్ని దాదాపు 150 సార్లు సందర్శించారని, గత ప్రధానులకంటే ఎక్కువగా తాను మూడు సార్లు ఈశాన్య రాష్ట్రాల పర్యటన చేపట్టానని మోదీ తెలిపారు. ‘‘నేను రాజకీయ నాయకుడిని అయినంత మాత్రాన నాకు ఎన్నికల్లో గెలుపే పరమావధి కాదు’’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు ఎంతో సామర్థ్యం ఉందని, అది వృథాకాకూడదని అభిప్రాయపడ్డారు. గత పదేళ్లల్లో తన కృషిని ప్రజలు చూశారని, తమిళనాడులో ఈసారి బీజేపీ-ఎన్డీఏయేనని వారు నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు.

తమిళభాషను రాజకీయం చేయడంపై కూడా ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ తీరు తమిళనాడుకే కాకుండా యావత్ దేశానికి నష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. తమళభాషను ప్రోత్సహించాలని వ్యాఖ్యానించారు.

||:: GST Records : రికార్డు స్థాయిలో జీఎస్టీ లను వసూలు చేసిన భారత్ ::||GST Records : వస్తువులు మరియు సేవల పన్ను (GST) అన...
01/04/2024

||:: GST Records : రికార్డు స్థాయిలో జీఎస్టీ లను వసూలు చేసిన భారత్ ::||

GST Records : వస్తువులు మరియు సేవల పన్ను (GST) అనేది ఏకీకృత పన్ను విధానంతో ఒక దేశం విధిస్తుంది మరియు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తుంది. దేశీయ విక్రయాలు మరియు దిగుమతుల కారణంగా మార్చిలో GST ఆదాయం 11.5% పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుంది. ట్రెజరీ శాఖ సోమవారం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు) మొత్తం GST వసూళ్లు రూ. 20.14 లక్షల కోట్లు వచ్చింది.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 11.7% అధికం. FY24కి సగటు నెలవారీ స్థూల సేకరణ రూ.1.68 లక్షల కోట్లు. FY23 ప్రారంభం నాటికి, రికవరీ మొత్తం రూ. 1.5 లక్షల కోట్లు మాత్రమే. “GST రాబడి 11.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో మార్చి 2024లో రూ. 1.78 లక్షల కోట్లతో రెండవ అత్యధిక సేకరణను నమోదు చేసింది.

దేశీయ ఎక్సైజ్ ఆదాయం లావాదేవీలలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. రేటు 17.6%, ”అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2023లో అత్యధికంగా రూ. 1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. మార్చి 2024 నాటికి, వాపసుల ద్వారా GST ఆదాయం నికరంగా రూ. 1.65 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 18.4% అధికం. జీఎస్టీ వసూళ్లు పెరగడం వినియోగంలో పెరుగుదలను ప్రతిబింబిస్తోందని పరిశీలకులు అంటున్నారు. దాదాపు ప్రతి రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయంలో 8-21 శాతం పెరుగుదల నమోదు చేసినట్లు చెబుతున్నారు.

RFCL అనేది దేశంలో వ్యవసాయోత్పత్తిని పెంచడం కోసం రైతులకు సరసమైన ధరలకు తగినంత మరియు సకాలంలో యూరియాను అందించడానికి ''మేక్ ఇ...
01/04/2024

RFCL అనేది దేశంలో వ్యవసాయోత్పత్తిని పెంచడం కోసం రైతులకు సరసమైన ధరలకు తగినంత మరియు సకాలంలో యూరియాను అందించడానికి ''మేక్ ఇన్ ఇండియా'' చొరవతో భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మరియు ఇది పౌరులందరికీ ఆహార భద్రత కల్పించే దిశగా భారతదేశాన్ని తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

RFCL తన వాణిజ్య ఉత్పత్తిని 22 మార్చి 2021 న ప్రారంభించింది మరియు 12 నవంబర్ 2022న గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి ద్వారా దేశానికి అంకితం చేయబడింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-2024లో RFCL తెలంగాణ మరియు పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 11.19 లక్షల మెట్రిక్ టన్నుల వేప పూతతో కూడిన యూరియాను పంపింది. ఇందులో తెలంగాణకు 445861.89 MT, ఆంధ్రప్రదేశ్‌కు 153383.94 MT, కర్ణాటకకు 183070.44 MT, మహారాష్ట్రకు 78745.23 MT, ఛత్తీస్‌గఢ్‌కు 85862.07 MT, తమిళనాడుకు 99006.03 MT, మధ్యప్రదేశ్‌కు 74093.94 MT యూరియా సరఫరా చేసాము

RFCL శక్తి వినియోగo 5.0 G Cal/MT రూపొందించబడింది, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 4.933 G Cal/MT యూరియా యొక్క ఉత్తమ శక్తి వినియోగ గణాంకాలను కూడా సాధించింది.

ఈ సందర్భంగా, సంస్థ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరియు 1119753.54 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించటంలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు RFCL ముఖ్య కార్య నిర్వహణ అధికారి Sudhir Kumar Jha అభినందనలు తెలిపారు. అలాగే సంస్థకు మద్దతుగా ఉన్న రాష్ట్ర, జిల్లా యంత్రాంగానికి, కేంద్ర ఎరువులు, రసాయానాలు మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

||:: వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తా: బాబు మోహన్ ::||  బీజెపి పార్టీ త‌న‌కు టికెట్ ఇస్తాను అన...
01/04/2024

||:: వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తా: బాబు మోహన్ ::||

బీజెపి పార్టీ త‌న‌కు టికెట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలే దని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హన్మకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. వరంగల్ కి ఎప్పడు వచ్చిన కరుణ పురం నా అడ్డా అని అన్నారు.

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మొదటి సారిగా కరుణ పురం చర్చికి వెళ్లడం జరిగిందన్నారు. వరంగల్ కి నాకు చిన్నప్పటినుండి అనుభవం ఉందన్నారు. తాను పుట్టింది వరంగల్ జిల్లాలోనే అని తెలిపారు.

తాను వరంగల్ ఎంపీ అభ్యర్థి గా ప్రజా శాంతి పార్టీ నుంచే పోటీ చేస్తా అని అన్నారు. తాను వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు.

పార్టీ మారుతున్న‌ట్లు లీకులు ఇస్తూ చీప్ రాజ కీయలు చేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పుట్టిన వరంగల్ లో శెభాష్ అనిపించుకునేలాగా ప్రజలకు సేవ చెస్తా అన్నారు.

వరంగల్ ప్రజలు త‌న‌న్ను గెలిపించాలని, మంచి చేయాలనీ ఉద్దెశంతో పోటీ చేస్తున్న అన్నారు. కేసీఆర్ లాగా కే.ఎల్. పాల్ కూడా అబద్ధాలు చెప్పరని అన్నారు.

ఉచిత విద్యా, ఉచిత వైద్యం తాను గెలిచాక ఇప్పిస్తా అన్నారు. పేద వారికి అందరికీ ఉచిత పింఛన్లు అందిస్తాన‌న్నారు.

||:: బెజ్జంకి యువతికి మిస్‌ టీన్‌ టైటిల్‌ ::||సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతు...
01/04/2024

||:: బెజ్జంకి యువతికి మిస్‌ టీన్‌ టైటిల్‌ ::||

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌ కైవసం చేసుకుంది..

యూకేలోని వారింగ్‌టన్‌ పార్‌ హాల్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నలుమూలల నుంచి 25 మంది యువ తులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది.

వచ్చే ఆగస్టులో యూఎస్‌ ఏలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనున్నది...

01/04/2024

||:: నేటి నుంచి పెరగనున్న మెడికల్ ధరలు ::||

పెయిన్‌ కిల్లర్లు, యాంటి బయోటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్టివ్స్‌ సహా పలు అత్యవసర ఔషధాల ధరలు ఈరోజు ఏప్రిల్‌ 1నుంచి పెరగనున్నాయి.

ఈ లిస్టులో దాదాపు 923 రకాల ఫార్ములాలతో కూడి న అత్యవసర ఔషధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు అంతక్రితం సంవత్స రంతో పోలిస్తే 0.0055 శాతం మేర పెరుగుతాయని జాతీయ ఔషధాల ధరల సంస్థ ఎన్​పీపీఏ వెల్లడించింది..

ఈ మేరకు ఎన్​పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్​లో మందుల ‘టోకు ధరల సూచీ’లో వార్షిక మార్పును ప్రకటించింది.పెయిన్‌కిల్లర్ డైక్లోఫెనాక్ ఒక్కో టాబ్లెట్ ధర రూ. 2.05కి చేరింది. ఇబుప్రోఫెన్ టాబ్లెట్‌ల ధర రూ.71(200 Mg)కి, రూ.1.20 (400 Mg)కి పెరిగింది.

WPIలో సూచించిన ధర లకు అనుగుణంగా షెడ్యూ ల్​ చేసిన ఫార్ములాల మందు లపై ఎమ్మార్పీ రేటును కూడా పెంచొచ్చు.

ఈవిధంగా ధరలు పెరిగిన లిస్టులో యాంటీ బయో టిక్స్, యాంటీ మలేరియ ల్స్, టైప్ 2 డయాబెటిస్‌కు రోగులు వాడే మందులు కూడా ఉన్నాయని సమాచారం.

CREDITS : VADDEPALLI VENKATESH
01/04/2024

CREDITS : VADDEPALLI VENKATESH

||:; వాత పెట్టిన వాగ్దానం మారలేదు ::||ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిచేందుకు అనేక హామీలు ఇస్తుండ‌టం స‌హ‌జం .. అయితే ఓ క్య...
01/04/2024

||:; వాత పెట్టిన వాగ్దానం మారలేదు ::||

ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిచేందుకు అనేక హామీలు ఇస్తుండ‌టం స‌హ‌జం .. అయితే ఓ క్యాండిడేట్ ఎన్నిక‌ల వాగ్ధానాల‌లో కాస్త కిక్కు ఇచ్చింది

మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్య ర్థిగా పోటీ చేస్తున్న వ‌నితా రౌత్ పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని హామీలు ఇచ్చేసింది.

ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్‌ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది. ముందుగా ఈ షాపుల‌లో ప్రీగా మందు అందిస్తానని వాగ్దానం చేసేసింది.

ఇండియ‌న్ లిక్క‌ర్ కాకుండా విదేశీ మద్యం అందుబాటు లో ఉంచుతాన‌ని ఘంటా ప‌ధంగా చెపుతున్న‌ది.. దీంతో ఆమె ప్రచారానికి జ‌నాలు పోటేత్తుతున్నారు.

తాగేందుకూ లైసెన్స్….
అయితే ఈ స్కీమ్‌ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్‌ ఉండాల్సిందే నన్న కండీషన్‌ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడ మని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్‌ వారికి అవసరమని సమర్థించు కుంటోంది.

పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది.

గ‌త ఎన్నిక‌లో ఇదే వాగ్ధానం… వాత‌పెట్టిన ఎన్నిక‌ల సంఘం…

వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్‌ సెగ్మెంట్‌ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎన్నికల కమిషన్‌ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం.

||:: తిహార్ జైలుకు CM కేజ్రివాల్ ::||లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన సీఎం కేజీవాల్ కు కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించ...
01/04/2024

||:: తిహార్ జైలుకు CM కేజ్రివాల్ ::||

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన సీఎం కేజీవాల్ కు కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో కేజీవాలు తిహార్ జైలుకు తరలించనున్నారు.

బతుకంతా ఫూలే..ఈ ఏప్రిల్ ఫూలొకటి..!______________________పసితనంలో ఆడిన ఆటల్లోఒకటి ఏప్రిల్ ఫూల్..రబ్బరుపై బ్లేడుతో అక్షరాల...
01/04/2024

బతుకంతా ఫూలే..
ఈ ఏప్రిల్ ఫూలొకటి..!
______________________
పసితనంలో ఆడిన ఆటల్లో
ఒకటి ఏప్రిల్ ఫూల్..
రబ్బరుపై బ్లేడుతో
అక్షరాలు చెక్కి
ఇంకులో ముంచి
స్నేహితుల చొక్కాలపై
వీపు భాగాన ముద్దరేసి
సాధించిన విజయ గర్వం
అదో ఆనందాల పర్వం...
వచ్చిందంటే ఏప్రిల్
అయిపోయినట్టే పరీక్షలు
ఇంతకుముందు మూడేళ్లు మహమ్మారి దెబ్బతో జీవనానికే పరీక్ష
కరోనా ఎప్పుడు
పోతుందా అని
ఎడతెగని ప్రతీక్ష..?

పెద్దోళ్ళకు మార్చి
ఎండింగ్ టెన్షన్..
ఏప్రిల్ ఒకటి నుంచి
సరికొత్త ఆర్థిక
సంవత్సరంపై అటెన్షన్..
పూర్తి చేసి
లాభనష్టాల బేరీజు
కొనుగోళ్లు అమ్మకాలు
మళ్లీ మొదలెట్టడం రివాజు!
కేంద్రమైనా,రాష్ట్రమైనా
మార్చి బడ్జెట్లో పెంచే రేట్లు
ఎన్నెన్నో రెట్లు..
అవన్నీ ఏప్రిల్ ఒకటి
నుంచి అమలు..
ఏది ఎంత పెరిగిందంటూ కనుక్కుంటూ కొనుక్కోవడం షరామామూలు..!

మార్చి ఎండింగ్ నాటికి సిద్ధమయ్యే బాలెన్స్ షీట్..
మొదలయ్యే వేసవి హీట్..
పెద్దోడికి ఏసి చల్లదనం
పేదోడికి ఆ అవకాశం లేక
ఆకాశం సీలింగ్ కింద నిదర..
కాలువ ఎదర..
చుట్టూ తనే పారేసిన
చెత్త చీదర
చుక్కలనంటిన ధరలను తలచుకుంటూ..
ఆ ధరలను పెంచేసిన సర్కారును తిట్టుకుంటూ
చుక్కలు లెక్కెడుతూ
రాత్రంతా కలత నిదుర
చుట్టూ సమాజంలో
ఏం జరుగుతున్నా పట్టించుకోని
మొద్దు నిదర..!

మన డబ్బులు
మనకే పంచుతూ
ఫూల్ చేసే సర్కారు..
అలా ఇస్తూ ఇలా పన్నుల
రూపంలో దోచేసే నైజం..
అదిగో ఆధునిక నైజాం..!

ప్రభుత్వాల చలవతో
చిరిగిన వలువలతో
ఏడాదంతా ఇలా గడిపేసి
ఎన్నికల కోసం
ఎదురు చూడ్డమే..
అప్పుడూ కక్కుర్తి పడి
నోటుకు ఓటు అమ్ముకుని
మళ్లీ ముంచేటి సర్కారును
ఎన్నుకుని మనల్ని మనమే
చేసుకుంటూ ఫూల్..
కూల్ కూల్ అనుకుంటూ..
ఇంకో ఐదేళ్లు ఎడదిడ్డమే..
మొత్తానికి బతుకంతా
అడ్డదిడ్డమే..!?

||:: ఏప్రిల్‌ 1 నుంచి SBI వినియోగదారులకు షాక్ ::||దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ వి...
01/04/2024

||:: ఏప్రిల్‌ 1 నుంచి SBI వినియోగదారులకు షాక్ ::||

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకో వాలి. ఎందుకుంటే ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారుతున్నాయి.

ఎస్పీఐకి చెందిన ఒక సేవను వినియోగించుకు నేందుకు గతంలో కంటే రూ.75 అదనం గా చెల్లిం చాల్సి ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎంపిక చేసిన కొన్ని ఏటీఎమ్‌ డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలు మునుపటి కంటే రూ. 75 ఎక్కువగా ఉంటాయని ప్రకటించింది...

||:: ఏప్రిల్ 5 న కరీంనగర్‌ జిల్లాలో పొలాల బాట పట్టనున్న  కేసీఆర్ ::||తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌‌ఎస్ అధినేత...
01/04/2024

||:: ఏప్రిల్ 5 న కరీంనగర్‌ జిల్లాలో పొలాల బాట పట్టనున్న కేసీఆర్ ::||

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌‌ఎస్ అధినేత కేసీఆర్ ఏప్రిల్ 5న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు.

కరీంనగర్ రూరల్, వేముల వాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్నారు.

రైతులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెబుతామన్నారు. గులాబీ బాస్ కరీంనగర్‌ పర్యటన ఖరారు కావడంతో బారాస నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

||:: వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను రీఎంట్రీ ::||భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి ...
01/04/2024

||:: వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను రీఎంట్రీ ::||

భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను గతేడాది ఆసియా క్రీడల్లో తుంటి గాయం బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు నెలల తర్వాత ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది.

ఆమె థాయిలాండ్‌లో ఆది వారం ప్రారంభమైన ఇంటర్నే షనల్ వెయిట్‌ లిఫ్టింగ్ ఫెడ రేషన్ వరల్డ్ కప్‌ బరిలో నిలిచింది. సోమవారం మహిళల 49 కేజీల కేట గిరీలో మీరాబాయిచాను పోటీపడనుంది.

ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఆమె ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకో నుంది. ఒలింపిక్ క్వాలి ఫికేషన్ ర్యాంకింగ్స్‌లో మీరాబాయి తన విభా గంలో 2వ ర్యాంక్‌లో ఉండ టం బెర్త్‌కు ఢోకా లేదు.

అయితే, ఒలింపిక్స్‌కు ఈ టోర్నీనే చివరి క్వాలిఫ యింగ్ ఈవెంట్. అలాగే, ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చాలంటే ఈ టోర్నీలో పాల్గొ నడం తప్పనిసరి. నిబంధ నల ప్రకారం..

వరల్డ్ కప్ ముగిసిన తర్వా త ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నిలిచిన వారు తమ విభా గాల్లో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

||:: కోల్ ఇండియా కబడ్డీ పోటీలకు ఆర్జీ1 క్రీడాకారులు ::||కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు ఏప్రిల్ 4, 5, 6న ఉత్తరప్రదేశ్ ల...
31/03/2024

||:: కోల్ ఇండియా కబడ్డీ పోటీలకు ఆర్జీ1 క్రీడాకారులు ::||

కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు ఏప్రిల్ 4, 5, 6న ఉత్తరప్రదేశ్ లో జరుగనున్నాయి. సింగరేణి జట్టు కు ఆర్జీ1 కు చెందిన క్రీడాకారులు బేబీ శ్రీనివాస్, సాయికుమార్, బుద్ధ శ్రీనివాస్, మీస హరీష్ లు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ లు క్రీడాకారులను అభినందించారు. కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీల్లో సింగరేణి కి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

||:: సీఎం సమీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే ::||హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి అధికార నివాసంలో ఆదివారం జరిగిన ...
31/03/2024

||:: సీఎం సమీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే ::||

హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి అధికార నివాసంలో ఆదివారం జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్, నారాయణ్ ఖడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు
షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

||:: ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్ ::||ఖరీదైన స్మార్ట్ ఫోన్ బుక్ చేసిన ఓ కస్టమర్ కు...
31/03/2024

||:: ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్ ::||

ఖరీదైన స్మార్ట్ ఫోన్ బుక్ చేసిన ఓ కస్టమర్ కు షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో రూ.22 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ ప్యాక్ ఇంటికి రాగానే ఓపెన్ చేయగా దాని లోపల రాయి కనిపించింది. అయితే దీనిపై కంపెనీకి ఫిర్యాదు చేయగా వారు సరిగా స్పందించలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతడికి ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది.

||:: 100 రోజుల్లోనే 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు: కేసీఆర్ ::||వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ...
31/03/2024

||:: 100 రోజుల్లోనే 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు: కేసీఆర్ ::||

వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 'మూడు జిల్లాలో ఎండిపోయిన పంటల్ని పరిశీలించాను. రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పినందుకే రైతులు పంట వేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. వంద రోజుల్లో ఇంత దుర్భర పరిస్థితి చూస్తాననుకోలేదు' అని వ్యాఖ్యానించారు.

||:: కేజ్రీవాల్, హేమంత్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ ::||ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన...
31/03/2024

||:: కేజ్రీవాల్, హేమంత్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ ::||

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన మెగా ర్యాలీలో ఆప్ నేతలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌లను వెంటనే విడుదల చేయాలని, ప్రతిపక్షాల ఆర్థిక బలహీనతను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈసీని కోరారు.

||:: ELECTION TIME: ఎన్నికల కమిషన్ కొత్త రూల్స్ ::||దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్...
31/03/2024

||:: ELECTION TIME: ఎన్నికల కమిషన్ కొత్త రూల్స్ ::||

దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్‌ ప్రవేశపెట్టింది. ఎన్నికలకు ప్రచారం నిర్వహించే అభ్యర్థులు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైనా ప్రచారాలకు సంబంధించి 48 గంటల ముందు సువిధ అనే యాప్‎లో అప్లై చేసుకోవాలని చెప్పింది. ఇలా అప్లై చేసుకున్న 24 గంటల్లోనే అనుమతి వస్తుందని పేర్కొంది.

||:: భానుడి భగభగలు.. 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు ::||తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో HYD వాతావరణ కేంద్రం ...
31/03/2024

||:: భానుడి భగభగలు.. 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు ::||

తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో HYD వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి సమయాల్లో సాధారణం కంటే వేడిగా ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది.

||:: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం ::||బ్యాంకింగ్ దిగ్గజం HDFC కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్ అండ...
31/03/2024

||:: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం ::||

బ్యాంకింగ్ దిగ్గజం HDFC కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 100% వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్ వాటా కొనుగోలు దారులను హెచ్‌డీఎఫ్‌సీ ఖరారు చేస్తుంది.

||:: ఎన్నికలలో ‘నోటా ‘కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా?ప్రతి భారతీయుడికి ఓటు అనేది అస్తిత్వానికి ప్రతీక. ఒక్కొకసారి ఓట్లు వేస...
31/03/2024

||:: ఎన్నికలలో ‘నోటా ‘కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా?

ప్రతి భారతీయుడికి ఓటు అనేది అస్తిత్వానికి ప్రతీక. ఒక్కొకసారి ఓట్లు వేసి ఎన్నుకున్న నేతలపైనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసేవారు నచ్చకుంటే ఆ విషయాన్ని వ్యక్తపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ ప్రవేశపెట్టింది. ఇక EVMలో గుర్తుతో పాటు నోటాను కూడా ఏర్పాటు చేసింది. ఈ బటన్ ఒత్తడం ద్వారా సదరు ఓటు ఎవరికి పడదు. కానీ ఓటర్ ఓటు హక్కుగా నోటాను వినియోగించుకున్నట్లే అవుతుంది.

Address


Alerts

Be the first to know and let us send you an email when MS8NEWS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MS8NEWS:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share