Vaarthalokam

Vaarthalokam Vaarthalokam is a digital news platform for reporting and writing on various issues, producing videos with specific focus on the Telangana and Andhra Pradesh.

(స్పెక్ట్రా రియల్ దందా కథనం 1) బాక్స్‌లో వేయాలి...స్పెక్ట్రా రియల్ దందా   (headline)దినదినం పెరుగుతున్న స్పెక్ట్రా మోసాల...
02/12/2022

(స్పెక్ట్రా రియల్ దందా కథనం 1) బాక్స్‌లో వేయాలి...

స్పెక్ట్రా రియల్ దందా (headline)

దినదినం పెరుగుతున్న స్పెక్ట్రా మోసాలు
వేలాది కస్టమర్లకు మొండిచెయ్యి
మార్కెట్ టీంను అడ్డుపెట్టుకుని మోసాలు
ఏ వెంచర్‌లోనూ డెవలప్ మెంట్‌ ఉండదు..
మాటలు మాత్రం కోటలు దాటుతాయి..
చేతలు మాత్రం గేటు కూడా దాటవ్‌..
పనులు వేగవంతమంటూ మాయమాటలు
మాటలతోనే బురిడీ కొట్టిస్తున్న వైనం
ఆలస్యంగా వెలుగులోకి మోసాలు
రియల్‌దందాపై వరుస కథనాలు

వార్తాలోకం ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌, డిసెంబర్‌ 2:

స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ మోసాలు మాములుగా లేవు. పేదలను దారుణాతిదారుణంగా ముంచేస్తున్నారు. యాదగిరిగుట్ట, షాద్ నగర్ లో రియల్ వెంచర్లు వేసి పేద, మధ్యతరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి ప్లాట్లను విక్రయించారు. ఆర్థిక స్థోమత లేని వారికి ఈఎంఐల రూపంలో వల విసిరింది యాజమాన్యం. తమ పిల్లల భవిష్యత్తు కోసం రేయింబవళ్లు కష్టపడి... అర్థాకలితో జీవితాన్ని గడుపుతూ రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన డబ్బును నెల నెలా ఈఎంఐల రూపంలో స్పెక్ట్రా మార్కెట్‌ టీమ్‌ సభ్యులకు తూ.చ.క్రమం తప్పకుండా డబ్బులు కట్టారు. తీరా మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత కస్టమర్లకు చూపించిన వెంచర్ లోని ప్లాట్ కాకుండా వేరే ప్లాట్‌ను అంటగడుతున్నారు. ఇదేంటని అడిగితే మళ్లీ మాయమాటలు చెబుతున్నారు స్పెక్ట్రా మార్కెట్‌ టీమ్‌ సభ్యులు. ఆరుగాలం కష్టించి సంపాదించిన డబ్బును అమాంతం బొక్కేసి ఎగనామం పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రేపు మాపు అంటూ రోజుల తరబడి, నెలల తరబడి మార్కెట్‌ టీమ్‌ సభ్యులు తమ చుట్టూ తిప్పించుకుంటున్నారు.

స్పెక్ట్రా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చేసిన మోసం తల్చుకుని కొందరు ఆఫీసుకు వెళ్లి లబోదిబోమంటూ మొత్తుకున్నా వినిపించుకోవడం లేదు. ఇదేంటని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బుతో అంగబలం, అర్థబలం సమకూర్చుకున్న స్పెక్ట్రా యాజమాన్యం తమను నానా బూతులు తిడుతోందని ఆవేదన చెందుతున్నారు కస్టమర్లు. తమ కనుసనల్లో జిల్లా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఉన్నారంటూ బెదిరింపులకు పాల్పడుతోందని వారంటున్నారు.

అటు రాజకీయనాయకులు, ఇటు ప్రజాప్రతినిధుల అండ చూసుకుని నిరుపేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలకు తూట్లు పొడుస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు, తమకు అన్యాయం జరిగిందని ఎక్కడో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో కూడా తెలియని అమాయకులు, స్పెక్ట్రా రియల్‌ మోసాలకు గురై విలవిల్లాడిపోతున్నారు. తాము కష్టాలు పడినా సరే, తమ పిల్లల భవిష్యత్‌ బాగుండాలని, రేయింబవళ్లు శ్రమటోడ్చి సంపాదించిన ప్రతిరూపాయిని స్పెక్ట్రా వెంచర్‌లోని ప్లాట్‌ కోసం ఈఎంఐలు కట్టామని, మూడేళ్లు పూర్తిగా డబ్బులు కట్టిన తర్వాత తమకు చూపించిన ప్లాట్‌ ఇవ్వకుండా, ఆ ప్లాట్‌ వేరే వాళ్లకు అమ్ముకుని తమకు మొండిచేయి చూపుతున్నారని ఆందోళన చెందుతున్నారు కస్టమర్లు.

మరికొందరు తమకు నచ్చిన ప్లాట్‌ ఇవ్వకుండా వేరే ప్లాట్లు ఇవ్వడం అన్యాయమని, అడిగితే పట్టించుకునేనాధుడే లేడు. తొలుత కస్టమరే దేవుడంటూ, అన్ని వసతులు కల్పించి, నమ్మకం కలిగేలా తేనెపూసిన మాటలతో మాయమాటలు చెప్పి, ప్లాట్లను అంటగట్టారని కస్టమర్లు లబోదిబోమంటున్నారు.

ఇంకొందరు తమకు నచ్చిన ప్లాట్ ఇవ్వకపోవడంతో తిరిగి డబ్బులు చెల్లించాలని అడిగితే దౌర్జన్యాలకు దిగుతున్నారని మదనపడుతున్నారు. రేపు ఇస్తాం..ఎల్లుండి ఇస్తామంటూ కాలం వెల్లదీస్తూ ఆరు నెలలు, ఏడాది వరకు తప్పించుకు తిరుగుతున్నారు. స్పెక్ట్రా మార్కెట్‌ టీమ్‌ సభ్యులను పట్టుకుని ప్లాట్ల సమాచారం తెలుసుకోవడానికి మళ్లీ వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక అదే పనిగా వెంటబడి తిరిగే వారికి కొన్ని చెల్లని చెక్కులు రాసి ఇస్తున్నారు. మరికొందరు కస్టమర్లు కాళ్లకు చెప్పులు అరిగేలా స్పెక్ట్రా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు స్పెక్ట్రా యాజమాన్యం. నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్లుగా యాజమాన్యం ప్రవర్తిస్తోందని ఆవేదనభరిత గద్గద స్వరంతో చెప్పుకోవడం కస్టమర్ల వంతయింది.

అసలు స్పెక్ట్రా ఓనర్ ఎవరు ?

సంవత్సరాలుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నప్పటికీ, అసలు స్పెక్ట్రా ఓనరు ఎవరు? ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. తెలియనివ్వరు కూడా..! అంతా మార్కెటింగ్‌ టీమ్‌ మాయజాలమే. మాటలే పెట్టుబడిగా, అమాయకులను నిలువెల్లా మోసం చేస్తూ, లాభాల పంట పండిస్తున్నారు. భూమిపై పెట్టుబడి పెట్టండి.. బంగారు భవిష్యత్‌ మీ పిల్లలకు ఇవ్వండి అంటూ స్లోగన్లతో అందమైన రంగు రంగుల బ్రోచర్లు వేసి పేదలను బురిడీ కొట్టించడంలో మార్కెటింగ్‌ టీమ్‌ సభ్యులది అందె వేసిన చెయ్యి. తమకు వచ్చిన విద్యకు పదును పెట్టి, తేనెపూసిన మాటల కత్తితో పేదల బతుకులను బలి తీసుకుంటున్నారు. నిరుపేదలకు, పేదలకు మాయమాటలు చెప్పి ప్లాట్లను కొనుగోలు చేసేలా ఉసిగొల్పుతున్నారు.

పట్టణాలు, పల్లెల్లోకి వారిని పంపించి కమీషన్లు ఇస్తామని చెప్పి పేద, మధ్య తరగతి ప్రజలను దారుణంగా మోసం చేశారు. తొలుత ప్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఒక టీం వస్తుంది. ఈఎంఐ డబ్బులు కట్టించుకునేటప్పుడు మరో టీం వస్తుంది. తీరా ప్లాట్ అలాట్ మ్మెంట్ చేసేటప్పుడు ఇంకో టీమ్‌ రంగంలోకి దిగుతోంది. అసలు యాజమాన్యం ఎవరనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంటుంది. ఆ రహస్యాన్ని ఛేదించడం సామాన్య నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు సాధ్యం కాని పరిస్థితి.

సినిమావాళ్లను తలతన్నేలా ఒకరికి మించి మరొకరు నటించి, కాదు కాదు జీవించి కస్టమర్లను తికమక పెట్టి, ఒట్టి చేతులతో వెనక్కి పంపించడం స్పెక్ట్రా యాజమాన్యానికి వెన్నెతో పెట్టిన విద్య. ఎంతలా అంటే వీరికి హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశమిస్తే ఆస్కార్ అవార్డు గ్యారంటీ. స్పెక్ట్రా లీలలు అన్నీ ఇన్నీ కాదయ్యా.. ఎందెందు చూసినా అందందె కలదు..

స్పెక్ట్రా ఓనర్ ఎవరో కనిపించరు..మాట్లాడరు..కస్టమర్లు వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేసినా కనిపించడు. పట్టించుకోడు. అతని చుట్టూ విచిత్రమైన, అంతుచిక్కని వలయం మాదిరిగా ఏర్పాటు చేసుకుని యధేచ్ఛగా మోసాలకు పాల్పడుతూ నిరుపేద ప్రజల సొమ్మును కాజేస్తున్నారు.

వెంచర్ కు అప్రూవల్ రాకముందే ప్లాట్ల విక్రయం
ప్రజలను మోసం చేయడంలో స్పెక్ట్రా యాజమాన్యంకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. యాదగిరిగుట్టలో స్పెక్ట్రా వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. మొదట చెప్పిన వెంచర్ ఒకచోట...ప్లాట్ కేటాయించే సమయంలో చూపించేది మరొక చోట. ఇదేంటని అడిగితే కస్టమర్లు బుక్ చేసుకున్న వెంచర్ కు అప్రూవల్ రాలేదని, అసలు అది వస్తదో రాదో కూడా తెలియదని చెబుతున్నారు. కొందరు తమ ఖర్మ అనుకుని సర్దుకుపోతుంటే, మరికొందరు డబ్బులు ఇవ్వాలని అడిగితే కాలయాపన చేస్తూ స్పెక్ట్రా ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నారు. వీరి మోసాలపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వారిని మేనేజ్ చేసుకుంటూ మళ్లీ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరి ఆగడాలు అరికట్టకపోతే రాబోయే రోజుల్లో పేదలు నిరుపేదలుగా, మధ్య తరగతి ప్రజలు పేదలుగా మారి రోడ్డున పడే పరిస్థితి తలెత్తక ముందే జాగ్రత్త వహించడం ఎంతైన అవసరం.

(రేపటి సంచికలో స్పెక్ట్రా రియల్‌ దందా కథనం 2 ఉంటది..)

03/10/2022
02/09/2022
https://youtu.be/qmU8xC2vAYw
09/07/2022

https://youtu.be/qmU8xC2vAYw

ఉస్మానియా యూనివర్శిటీ:తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పర...

10/06/2022

బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి ని అర్దరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులుఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో జిట్టాను అదు...

I am At HRC Date:26-03-2021
26/05/2022

I am At HRC Date:26-03-2021

Happy Sankranti
15/01/2022

Happy Sankranti

14/01/2022

Happy Bogi

17/12/2021

తెలంగాణలో 8 కి చేరిన ఒమిక్రాన్ కేసులు

09/12/2021

ఆ ముగ్గురిలో మనోడు...

భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్:

ఆధునిక కాలంలో లోకంలో అతి ఎక్కువ పుస్తకాలు చదివినవారు ముగ్గురు. 1 వాయుకారల్ మార్క్స్ [జర్మని]n
2. డా బి ఆర్ అంబేడ్కర్ [ఇండియా]
3. మజ్జిని [జెనివా]

ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంధాలయంగా పేరొందిన లండన్ మ్యూజియంలో అత్యధిక పుస్తకాలను చదివిన రీడర్స్ గాఈ ముగ్గురు గుర్తింపు నొందారు.

అంబేడ్కర్ 60 వేల పుస్తకాలకు పైగానే చదివారు.లక్ష పేజీలు రాసారు.

బౌద్దమతానికి సంబందించి 2000 పుస్తకాలను చదివారు.

ఆసియా ఖండంలోనే 2 దేశాలలో ఆర్దికశాస్త్రంలో 2 డాక్టరేట్ లు తీసుకున్న
ప్రప్రధముడు
ప్రపంచంలో అతిపెద్ద వ్యక్తిగత లైబ్రరి కల్గిన వ్యక్తులుగా ....

డా॥బిఆర్ అంబేడ్కర్ ( 1891 - 1956 )
ధామస్ జాఫర్సన్ ( 1743 -1826 )లు గుర్తింపు నొందారు.

అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అయితే... జాఫర్సన్ అమెరికా రాజ్యాంగం రూపకర్త.జాఫర్ సన్ యునైటెడ్ స్టేట్స్ కి మూడవ అధ్యక్షుడు కూడా

జాఫర్సన్ కు 7000 వేల గ్రంధాలతో పర్సనల్ లైబ్రరి వుండేది.బహుశ ప్రపంచంలొ అతిపెద్ద తొలి పర్సనల్ లైబ్రరి ఇదేకావచ్చు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ 60 వేల గ్రంధాలతో కూడిన లైబ్రరీ ని .. లండన్ మ్యూజియం , న్యూయర్క్ లైబ్రరి తరహాలో ఏర్పరచుకున్నారు.

ఒక వ్యక్తి లైబ్రరి కోసం బంగ్లాను నిర్మించడం అనేది ఆసియా ఖండంలోనే ప్రప్రదమం.

అమెరికా రాజ్యాంగ నిర్మాణంలొ బెంజిమెన్ ప్రాంక్లిన్,జాఫర్ సన్ ,మాడిసన్ అనె ముగ్గురు మేధావులు చేసిన కృషికి సమానంగా డా బి ఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసారు

రాజ్యాంగ నిపుణుడు సర్ జెన్నింగ్స్ కూడా ఏదైన సందేహముంటే అంబేడ్కర్ తో చర్చించి సలహాలను తీసుకుంటా
నన్నారు

నాకు నోబుల్ అవార్డ్ రావడానికి ఆర్దిక శాస్త్రంలో అంబేడ్కర్ సమర్పించిన ధీసెస్ కారణమని పేర్కొన్నారు.

అంబేడ్కర్ కి మహనీయుల చరిత్రలకు సంబందించిన పుస్తకాలను కొనడం అనేది తాను BA చదువుతున్నప్పడే అలవాటు అయింది.

ఆ సమయంలో తన తండ్రి వద్ద డబ్బులు లేకపోతే తన కూతురు పెళ్ళికి పెట్టిన చెవి కమ్మలను తాకట్టు పెట్టి అంబేడ్కర్ కోరుకున్న పుస్తకాలను తీసిచ్చారు.

తనకు పంపే స్కాలర్ షిప్ లో కొంత సొంత ఖర్చులకు ఇంటి ఖర్చులకు పోను మిగిల్చుకున్న డబ్బులతో పాత పస్తకాలను కొనేవారు.

పుస్తకాల కోసమని తక్కువ ఖర్చుతో కూడిన భోజనం, అద్దెకు గదిని కుదర్చుకున్నాడు. చాలినంత డబ్బులు లేక ఎన్నిసార్లు ఆకలితో పడుకున్నాడో తనకే తెలియదు.ఒక రొట్టె ముక్కతో, ఒక కప్పు ' టీ ' తో ఆకలి తీర్చుకున్న రోజులు కోకొల్లలు.

అలా...పస్తులుండి దాచిన డబ్బుతో న్యూయర్క్ నుండి 2000 పాత పుస్తకాలను ,లండన్ నుండి 8000 పుస్తకాలను తీసుకొచ్చారు.

( అందుకే నేడు ప్రపంచ మేధావులలో ప్రధముడు గా (2013 ) కేంబ్రిడ్జి యూనివర్సటి గుర్తించింది )

ఆ విదంగా 1934 నాటికి 45వేలు పుస్తకాలు అయినాయి.

షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ ని నిర్మిస్తే...బాబాసాహెబ్ అంబేడ్కర్ తన పుస్తకాల (జ్ఞానం) కోసం రాజగృహ అనే మూడంతస్తుల భవనాని నిర్మించారు.

ఇప్పుడు ఈ భవనం( లైబ్రరి ) పరిశోధకులకు సందర్శకులకు కేంద్రంగా మారింది.

న్యాయశాస్త్రానికి సంబందించి నా దగ్గర వున్న పుస్తకాలు బహుశ దేశంలో మరొకరి దగ్గర వుండక పోవచ్చునన్నారు.
అలా న్యాయశాస్త్ర పుస్తకాలతో తన అలమర నిండిపోయివుండేది.

తన 200 రూపాయల సంపాదిస్తే... అందులో 100 రూపాయలపైగానే పుస్తకాల కోసం ఖర్చు చేసేవారు.తన సంపాదనంతా పుస్తకాల కోసమే వ్యయం చేసారు

ఇంగ్లాడ్ నుండి తిరిగి వస్తున్నప్పుడు వెనిస్ నుండి బొంబాయి చేరుకోవాలంటే 6 రోజులు పడుతుంది. ఆసమయంలో
8000 పేజీలు చదివాను.
ప్రతి రోజు చదవడానికని తన బల్లపై 10 15 పుస్తకాలను వుంచుకునేవారు.
రోజుకు 18 గంటలు చదివేవారు.

అన్ని మత గ్రంధాలతో పాటుగా బౌద్ద గ్రంధాలను 2 000 దాకా చదివారు

ప్రయాణాలలో కాదు...ఎక్కడ సమయం దొరికితే అక్కడ చదవడంలో మునిగి పోయెవారు.ఆఖరికి బాత్రూంలో కూడా చదివేవారు.

లండన్ లైబ్రరికి ఉదయం 10 గంటలకు వెలితే సాయత్రం 5 గంటల వరకు లైబ్రేరియన్ వచ్చి గుర్తు చేసేవరకు లేచేవారుకాదు.అలా పుస్తకంలో నిమగ్నమై పోయేవారు.

1942 లో వైశ్రాయి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వున్నప్పుడు బొంబాయిలో రైల్వెేస్టేషన్ లో తన పుస్తకాల కోసం ఒక ప్రత్యేక రైల్వేగది ( రైల్వే సెలూన్ ) ను ఏర్పరుచుకున్నారు.
బెవర్లీ నికోలస్ అనె అమెరికా విధ్యావంతురాలు అంబేడ్కర్ తో కలసి మాట్లాడి తన జ్ఞానానికి ముగ్ధురాలై
తాను వ్రాసిన " వర్ధిక్ ఆఫ్ ఇండియా " (1944) అనే గ్రంధంలో...

" అంబేడ్కర్ జీవించి వున్న జ్ఞానదేవత " అనికొనియాడిందిఅంబేడ్కర్ తన జీవితకాలంలో 4 సినిమాలను మాత్రమే చూసారు
పుస్తకాల పఠనం కోసం ఆకలిని సుఖాలను,విలాసాలను వదులు కున్నాడు.తనకు వున్న సమయాన్నంతా పుస్తకం పఠనం కోసమే దారబోసారు. సమయాని ఎప్పుడు వృదా చేయలేదు.
(సోషల్ మీడియా సౌజన్యంతో)

07/12/2021

జీవిత సత్యాలు

"పడిపోతామని కూర్చుంటే
నడవడం తెలియదు.
ఓడిపోతామని ప్రయత్నం మానేస్తే గెలవడం తెలియదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు.
నీ సంకల్పం నిర్ణయిస్తుంది.
"మనలో లోపాలు లేవని అనుకోవడం కన్నా
మించిన తప్పిదం లేదు.
"అందరూ బాగుండాలి అందులో నేనుండాలి..

03/12/2021

నడుస్తున్న చరిత్ర

ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో •
అమ్మ నాన్నలు అనాథాశ్రమంలో...

• *పిల్లలు అమెరికాలో ...

*స్నేహితులు ఫేస్ బుక్ లో...

•* పలకరింపులు వాట్సాప్ లో... • భార్య టీవీ లో...

*• భర్త స్మార్ట్ ఫోన్ లో. పిల్లలు వీడియో గేమ్ లో...

*• పెద్దలు క్యాండీ క్రష్ లో...

*రైతులు ఉరికంభంలో ... •* దళారి ఊరేగింపులలో....

*విద్యార్థులు విహారాలలో... • *గురువులు వ్యాపారాలలో...

*అప్పు తీసుకున్నవాడు అద్దాల మేడలో.

•*ఇచ్చినవాడుపిచ్చాసుపత్రులలో ...
*నీతిమంతుడు పుస్తకాలలో ... *నీతిలేని వాడు రాజకీయాలలో....
•* ఇదే కలియుగం పక్వానికి వచ్చిందనడానికి నాంది...

02/12/2021

Latest NewsTelangana రామంతపూర్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో మాల ధారణ చేసిన బాలికకు నో ఎంట్రీ December 2, 2021 0 21 రామంతపూర్ సెయింట్ జోసెఫ్ ....

We want reporters for telugu daily... please contact: 9848486184
02/12/2021

We want reporters for telugu daily... please contact: 9848486184

28/11/2021

అత్యవసర ప్రకటన;
భారత్ ని తాకిన థర్డ్ లైవ్

దయచేసి వెంటనే స్వీయ లాక్ డౌన్ చేయండి.
1. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు.
2. మీరు బయటకు వెళ్లినప్పుడు డబుల్ మాస్క్ వేయండి మరియు ఏ సమయంలోనైనా మాస్క్ తీయకూడదు.
3. మీ ఇంటి బయట భోజనం చేయకండి.
4. వ్యక్తులు బంధువులు లేదా సన్నిహితులు అయినా మీ ఇంట్లోకి రానివ్వకండి.
5. బంధువులు లేదా స్నేహితుల ఇళ్లకు వెళ్లవద్దు.
ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇండో-పాకిస్థాన్‌లో ప్రజలు దీన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే జనాభాలో గణనీయమైన భాగం తుడిచిపెట్టుకుపోతుంది. కోవిడ్ వివక్ష చూపదు. దయచేసి వినండి.
అందుకున్నట్లుగా ఫార్వార్డ్ చేయండి.
*కెనడా* విమానాలను లోపలికి మరియు బయటికి నిషేధించింది మరియు రోజువారీ మరణాల సంఖ్య 1,000 మించిపోయింది.
*సౌదీ అరేబియా* బ్లాక్ చేయబడింది మరియు ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ విమానాలు లేవు.
*కొలంబియా* పూర్తిగా నిరోధించబడింది.
ఈరోజు 4,100 కంటే ఎక్కువ మంది మరణించిన *బ్రెజిల్* దాని అత్యంత ఘోరమైన అధ్యాయంలో పడిపోయింది.
*స్పెయిన్* అత్యవసర పరిస్థితిని పొడిగించవచ్చని ప్రకటించింది.
*యునైటెడ్ కింగ్‌డమ్* ఒక నెల లాక్‌డౌన్‌ను ప్రకటించింది.
*ఫ్రాన్స్* 2 వారాల పాటు లాక్ చేయబడింది.
*జర్మనీ* 4 వారాల పాటు సీలు చేయబడింది.
*ఇటలీ* ఈరోజు దగ్గరగా అనుసరించింది.
*అన్ని* ఈ దేశాలు/ప్రాంతాలు *COVID19 యొక్క మూడవ తరంగం* మొదటి వేవ్ కంటే చాలా ఘోరమైనదని నిర్ధారించాయి. కాబట్టి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు *అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి*.
స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య హెచ్చరిక సంభాషణకర్త అవ్వండి. *అందరినీ మూడవ అల నుండి రక్షించండి*.
*రెండో తరంగ దిగ్బంధనాన్ని బట్టి అంచనా వేయకండి *ఏమీ జరగలేదు*...
*1917-1919 నాటి స్పానిష్ ఫ్లూ లాగా, మొదటి మరియు రెండవ తరంగాల కంటే మూడవ తరంగం చాలా ప్రమాదకరమని చరిత్ర చెబుతోంది.
*మిమ్మల్ని మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోండి
కుటుంబం*.
* జీవ భద్రత చర్యలను నిర్వహించడం, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం మొదలైనవి.

చరిత్ర అబద్ధం చెప్పదు, వెనక్కి తిరిగి చూద్దాం.
____________
*ఈ సమాచారాన్ని మీ కోసం ఉంచుకోవద్దు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి.

*దయచేసి ఈ సమాచారాన్ని మీ కోసం ఉంచుకోకండి మరియు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో భాగస్వామ్యం చేయండి.

09/11/2021

ఎవరో రాశారో తెలియదు..
కాని
చాలా బాగా రాశారు..
అందుకే ఫార్వర్డ్ చేస్తున్నా..
తప్పక పూర్తిగా చదవండి...
👏

*విత్తనం తినాలని*
*చీమలు చూస్తాయ్*..

*మొలకలు తినాలని*
*పక్షులు చూస్తాయ్*..

*మొక్కని తినాలని*
*పశువులు చూస్తాయ్*

*అన్ని తప్పించుకుని*
*ఆ విత్తనం వృక్షమైనపుడు*..

*చీమలు, పక్షులు, పశువులు*..
*ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్*....

*జీవితం కూడా అంతే TIME*
*వచ్చే వరకు వేచివుండాల్సిందే*
*దానికి కావాల్సింది ఓపిక మాత్రమే*.....

*లైఫ్ లో వదిలి వెళ్ళిన*
*వాళ్ళ గురించి ఆలోచించకు*..

*జీవితంలో ఉన్న వాళ్ళు*
*శాశ్వతం అని భావించకు*..

*ఎవరో వచ్చి నీ బాధను అర్థం*
*చేసుకుంటారని ఊహించకు*...

*నీకు నీవే ధైర్యం కావాలి*.....
*నీకు నువ్వే తోడుగా నిలబడాలి*...

*లోకులు కాకులు,*
*మనిషిని చూడరు*,
*మనస్సును చూడరు,*
*వ్యక్తిత్వాన్ని చూడరు.*

*కనిపించింది,*
*వినిపించింది నమ్మేస్తారు*,
*మాట అనేస్తారు,*

*ఒక్కోసారి మన కళ్ళే*
*మనల్ని మోసం చేస్తాయి.*

*మరొకసారి చెప్పుడు మాటలు*
*జీవితాలను*
*తలకిందులు చేస్తాయి*

*అబద్దాలతో, మోసాలతో*
*కీర్తి, ప్రతిష్టలను*
*ఎంత గొప్పగా నిర్మించుకొన్నా*..
*అవి కుప్పకూలి పోవడానికి*
*ఒక్క "నిజం"చాలు*.
*అందుకే కష్టమైనా సరే*
*నీతిగా బ్రతకడమే మనిషికి*
*ఉత్తమ మార్గం.*

*ఒక చిన్న మొక్కనాటి*
*ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని*
*చూడకూడదు.*

*ఎందుకంటే అది పెరగాలి*
*మొక్క వృక్షం కావాలి*
*పుష్పించాలి, పిందెలు రావాలి*
*అవి కాయలై , పండితే తినగలం.*

*అలాగే నేను ఇది కావాలి*
*అనే కోరిక కూడా మొలకై*
*వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి*
*మసలుకోండి సన్నిహితులారా*🌹

*జీవితంలో కష్టము,*
*కన్నీళ్ళు, సంతోషము,*
*భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,

*కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*
*ఆనందం, ఆవేదన కూడా అంతే.*

*నవ్వులూ, కన్నీళ్ళూ*
*కలగలసినదే జీవితం*

*కష్టమూ శాశ్వతం కాదు,*
*సంతోషమూ శాశ్వతమూ కాదు.*

🌹🌹🌹🌹


*ఓడిపోతే*
*గెలవడం నేర్చుకోవాలి*,

*మోసపోతే*
*జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*

*చెడిపోతే ఎలా*
*బాగుపడలో నేర్చుకోవాలి,*

*గెలుపును ఎలా పట్టుకోవాలో*
*తెలిసిన వాడికంటే*
*ఓటమిని ఎలా*
*తట్టుకోవాలో తెలిసిన వారే*
*గొప్ప వారు నేస్తమా* !

*దెబ్బలు తిన్న రాయి*
*విగ్రహంగా మారుతుంది*

*కానీ దెబ్బలు కొట్టిన*
*సుత్తి మాత్రం ఎప్పటికీ*
*సుత్తిగానే మిగిలిపోతుంది*....

*ఎదురు దెబ్బలు తిన్నవాడు*,
*నొప్పి విలువ తెలిసిన వాడు*
*మహనీయుడు అవుతాడు*...

*ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు*
*ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...




*డబ్బుతో ఏమైనా*
*కొనగలమనుకుంటున్నారా*
*అయితే కొనలేనివి ఇవిగో*

*మంచం పరుపు కొనవచ్చు*
*కానీ నిద్ర కాదు*

*గడియారం కొనవచ్చు*
*కానీ కాలం కాదు*

*మందులు కొనవచ్చు*
*కానీ ఆరోగ్యం కాదు*

*భవంతులు కొనవచ్చు*
*కానీ ఆత్మేయిత కాదు*

*పుస్తకాలు కొనవచ్చు*
*కానీ జ్ఞానం కాదు*

*పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు*
*కానీ జీర్ణశక్తిని కాదు*
🌹🌹🌹🌹🌹


*ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే*
*అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు*
*కావాలి,*

*స్నానాలతోనే పాపాలు పోతే ముందు*
*చేపలే పాప విముక్తులు కావాలి,*

*తలక్రిందులుగా తపస్సు చేస్తేనే*
*పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు*
*గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,*

*ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది*
*నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ*
*పరుగులు పెడితే ప్రయోజనమే లేదు*,

*నీలో లేనిది బయటేమీ లేదు*
*బయటఉన్నదంతా నీలోనూ ఉంది*

*తెలిసి మసులుకో -- కలిసి జీవించు.....*
*సర్వే జనా సుఖినోభవంతు*

ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న సుప్రీంకోర్టు జ‌డ్జి  http://www.vaarthalokam.com/supreme-court-judge-visits-la...
06/11/2021

ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న సుప్రీంకోర్టు జ‌డ్జి

http://www.vaarthalokam.com/supreme-court-judge-visits-lakshminarasimha-swamy/

Latest NewsTelanganaYadadri ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న సుప్రీంకోర్టు జ‌డ్జి November 6, 2021 0 4 (వార్తాలోకం విలేక‌రి-యాద‌గ....

Address


Alerts

Be the first to know and let us send you an email when Vaarthalokam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vaarthalokam:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share