Top10NewsAp

18/02/2024

*తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా*
********

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.

తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.

క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.

పిల్లలకి బడిలో భయంలేదు.
ఇంట్లో భయం లేదు.
అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.
వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు.
అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.
ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.

*గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.*
ఇది నిజం.

*గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది*?

*కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు*!

*5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి*.

*దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లి దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు*.

*ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు*.

పెన్ను ఉంటే పుస్తకం ఉండదు,
పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు.
భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం.
ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.

కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...?

*భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!*
*అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం*.

స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట.
ఇదెలా సాధ్యమ్?

మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?

మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.

తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.

90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు.
ఇది యదార్ధం.

ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.

మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు.

అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు.
మా బాగు కోసమే అని అనుకునేవారు.

ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.

తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..

*పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..!🙏*

*పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు.*

*ఇప్పుటి తరం 70% పిల్లలు..*

👉తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం మంటే తుడవరు.

👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.

👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.

👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.

👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు.

👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు.

👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు.

👉 మైనర్ పిల్లలకి బైక్లు ఇవ్వడం
వారు ఆక్సిడెంట్లకు చేయడం
కేసులలో ఇరుక్కోవడం

👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.

👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి.

👉అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు.

👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు.

👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.

👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు.

👉వారిస్తే వెర్రి పనులు.

👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు.

పై వాటికి కారణం మనమే. ఎందుకంటే మనకు అహం,పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి.*

*కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.*

*ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ - దోమ అనటం,సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.*

మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..

అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లి దండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.

👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు.

గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు.

05వ తరగతి వారికి అల్సర్, బీపీలు.

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచక పోవడమే. అందుకే తల్లి దండ్రులు మారాలి.

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?

కేవలం గుడికి , దర్గా లకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు.

సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..
పిల్లలకు..👇
👉 బాధ్యత
👉 మర్యాద
👉 గౌరవం
👉 కష్టం
👉 నష్టం
👉 ఓర్పు
👉 సహనం
👉 దాతృత్వం
👉 ప్రేమ
👉 అనురాగం
👉 సహాయం
👉 సహకారం
👉 నాయకత్వం
👉 మానసిక ద్రృఢత్వం
👉 కుటుంబ బంధాలు
👉 అనుబంధాలు
👉 దైవ భక్తి
👉 దేశ భక్తి

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..

మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, మన ఆనందం కోసం బ్రతుకుదాం.

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..

భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.

🙏చదివిన వారందరి విన్నపం...
దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి

*ఈ మేసేజ్ చదివి అందరూ మారిపోతారు అని నేను అనుకోవడం లేదు....*

*కనీసం ఒక్కరు అయిన మారుతారని ఉద్దేశంతో ఈ మేసేజ్ పెడుతున్నాను*

28/01/2024

https://youtu.be/3SPDktNh3UEతిరుపతి లో *కాకరేపుతున్నటీడీపీ వైస్సార్సీపీ యాదవ కురుబ ఆత్మీయ సమ్మేళన సభలు* FIRST || BEST || ALWAYS ...

10/01/2024

https://youtu.be/DardqeqoMtsపాకాల మండలంలో టిడిపికి భారీ షాక్ || అభివృద్ధికి జై కొడుతున్న టిడిపి శ్రేణులు || కండువాలు కప్పి స్వాగతి.....

https://youtu.be/NNB2VtleEKUపులిచెర్ల మండలం పాపిరెడ్డి గారి పల్లెలో అప్పుడే మొదలైన సంక్రాంతి సంబరాలు   FIRST || BEST || ...
25/12/2023

https://youtu.be/NNB2VtleEKU
పులిచెర్ల మండలం పాపిరెడ్డి గారి పల్లెలో అప్పుడే మొదలైన సంక్రాంతి సంబరాలు
FIRST || BEST || ALWAYS

Please Share and Subscribe. Click on the Bell Icon for Regular Updates & Live Notifications.

https://youtu.be/NNB2VtleEKUపులిచెర్ల మండలం పాపిరెడ్డి గారి పల్లెలో అప్పుడే మొదలైన సంక్రాంతి సంబరాలు FIRST || BEST || ALWAYS ...

26/03/2023
04/03/2023

https://youtu.be/tb5yNy3hOn0Manchu Manoj Marriage: మంచు మనోజ్, మౌనికల పెళ్లి సందడి FIRST || BEST || ALWAYS MIRROR Share ...

02/03/2023

https://youtu.be/SvjFQuUwL6Eపాపులకు ఆలా పుణ్యాత్ములకు ఇలా...! ఏది నిజం రాధా మనోహర్ దాస్ గారు ? టీటీడీ అన్నప్రసాదంపై వివాదాస్పదంFIRST || BE...

30/01/2023

https://youtu.be/uvRkKBRb_v4పెన్డ్రైవ్ ల గోల | రోజాపై రెచ్చి పోయిన జనసేన వీరమహిళ | జనసేన వీరమహిళ పై రెచ్చి పోయిన శ్రీరెడ్డి ...

https://youtu.be/rE3lPfcGEb4
18/11/2022

https://youtu.be/rE3lPfcGEb4

🔴LIVE -అయ్యప్ప స్వామి హారతి | తెరుచుకున్న శబరిమల ఆలయం కొండకు పోటెత్తిన అయ్యప్పలు FIRST || BEST || ALWAYS Share and Subsc...

09/09/2022

అన్నింట్లో రోజా కి అండ దండగా ఉండే సోదరుడు రాం ప్రసాద్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు 💐💐

18/05/2022

https://youtu.be/A4F3tb-vOe4
MISS ANDHRA ICON BHAVANA | మిస్ ఆంధ్ర ఐకాన్ గా భావన | మన చంద్రగిరి అమ్మాయి
FIRST || BEST || ALWAYS

Please like and subscribe for more interesting updates

⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇
https://onlinevideosdownloader.com/
యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ నుండి వీడియోలు అద్భుతమైన క్వాలిటీ లో … అత్యంత వేగంగా డౌన్లోడ్ చేస్కోవచ్చు….జస్ట్ లింక్ పేస్ట్ చేసి … డౌన్లోడ్ నొక్కితే … సెకండ్లలో డౌన్లోడ్ అయిపోతాయి…సూపర్ క్వాలిటీ లో
⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆

►Visit our Website: https://www.top10newsap.com/

For More Updates
►Subscribe to TOP10NEWS : https://www.youtube.com/c/TOP10NEWSAP
►Follow us on Facebook : https://www.facebook.com/TOP10NEWSAP

Top10 News Channel Is a 24/365 With Top news on the Digital platform,The Best Place for News in the Best Place on Earth With Breaking News, Politics Updates, Entertainment News, Health Updates, Mythology Stories, And Exclusive News.

Contact Us
Email: [email protected]

Thank You For Visiting.
Visit Again -Team Top10news

15/05/2022

యాక్టర్ విజయ్ తెలుగు స్పీచ్

12/05/2022

అన్నమయ్య జిల్లా - Reporter Hafiz

కలికిరి మండలం
👉*ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీ
*👉 పెళ్లి కార్యక్రమానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు

వివరాల్లోకి వెళితే కలికిరి చెందిన షేక్ మస్తాన్ 30 సంవత్సరాలు తన ద్విచక్రవాహనంపై సత్య పురం వెళ్లి తన బంధువుల సంబంధించిన పెళ్లి ఏర్పాట్లు చూసుకొని తన ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమై మైన మస్తాన్ ను పీలేరు డిపోకు చెందిన సోమల కలకడ బస్సు పీలేరు వైపు వస్తుండగా మార్గమధ్యమున నగిరి పల్లి వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనమును ఢీకొనడంతో మస్తాన్ అక్కడికక్కడే మృతి చెందాడు అతనితోపాటు వస్తున్న నూర్ మహమ్మద్ కు రక్త గాయాలు అయ్యాయి ఈ విషయం తెలుసుకున్న కలికిరి ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి క్షతగాత్రులను, మృతుడి ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

28/04/2022

యువ దర్శకులతో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ముచ్చట్లు..

Address

Tirupati
Tirupati
517501

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Top10NewsAp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Top10NewsAp:

Videos

Share


Other News & Media Websites in Tirupati

Show All