31/12/2023
*2023 లో పారిశ్రామిక అభివృద్ధికి దిక్సూచిగా శ్రీసిటీ ప్రగతి ప్రస్థానం 🛰️🚀🚋
*-రూ.9 వేల కోట్ల కొత్త పెట్టుబడులు, 21,500 ఉద్యోగాల సృష్టి🎡🏭
📝📝
🔹 దేశంలో ప్రముఖ సమీకృత వ్యాపార కేంద్రంగా కీర్తి గడించిన శ్రీసిటీ, 2023 లో పారిశ్రామిక అభివృద్ధికి దిక్సూచి గా తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించింది.
🔹 ప్రపంచవ్యాప్త పెట్టుబడులను ఆకర్షించే ప్రధాన ఆర్థిక వృద్ధి కేంద్రంగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. పలు నూతన పరిశ్రమల శంకుస్థాపన, ప్రారంభోత్సవ వేడుకలు, ప్రముఖులు, ఉన్నతస్థాయి వ్యాపార ప్రతినిధుల సందర్శనలతో సహా అనేక వినూత్న కార్యక్రమాలతో ఏడాదంతా బిజీ బిజీగా గడిపింది.
🔹శ్రీసిటీ ప్రస్థానంలో 2023 మరో ముఖ్యమైన సంవత్సరంగా అభివర్ణించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, పారిశ్రామిక ప్రగతి పట్ల ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ఇందులో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
✍️ *ముఖ్య ఘటనలు
🔹జూలై 25న మోండెలెజ్ ప్లాంట్ విస్తరణ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ గౌరవ ముఖ్యమంత్రి వర్చువల్ మోడ్ లో పాల్గొన్నారు. దీని పెట్టుబడి విలువ రూ. 1,600 కోట్లు కాగా, 500 మందికి పైగా ఉపాధి అవకాశాలు, మరియు 18,000 మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
🔹మార్చి 3న విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS)-2023లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర ప్రముఖుల సమక్షంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శ్రీసిటీ స్టాల్‌ను ప్రారంభించారు.
🔹ఏప్రిల్ 25న, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జి.కిషన్ రెడ్డి శ్రీసిటీని సందర్శించారు. ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, పెట్టుబడిదారుల-స్నేహపూర్వక వాతావరణాన్ని కొనియాడారు.
🔹మే 30న పరిశ్రమలు, మౌళిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్య శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్, RSB ట్రాన్స్‌మిషన్ మరియు అడెలా ఎలక్ట్రికల్స్ సంస్థల కొత్త ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించారు.
🔹నవంబర్ 23న డైకిన్ ఇండియా తన రూ.1,000 కోట్ల నూతన ప్లాంట్‌ను ప్రారంభించింది. ఇది భారతదేశంలో సంస్థ మూడవ యూనిట్ మరియు ఆగ్నేయాసియాలో అతిపెద్దది. ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా', ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలకు అనుగుణంగా ఈ పరిశ్రమను నెలకొల్పింది.
✍️ *పెట్టుబడి, ఉద్యోగాల సృష్టిలో గణనీయమైన వృద్ధి
🔹 2023లో శ్రీసిటీ అనుసరించిన చురుకైన మార్కెటింగ్ వ్యూహాలతో పాటు ప్రతిష్టాత్మక పలు వాణిజ్య ప్రదర్శనలలో పాల్గొనడం ద్వారా గణనీయమైన దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జిఐఎస్)-2023లో జరిగిన పెట్టుబడి ఒప్పందాలతో సహా మొత్తంగా ఏడాదిలో రూ. 9,000 కోట్ల పెట్టుబడులు, 21,500 కొత్త ఉద్యోగాలకు మార్గం సుగమమైంది.
✍️ *భారతదేశపు 'కూల్ క్యాపిటల్' గా ఆవిర్భావం
🔹దేశంలో ఎయిర్ కండీషనర్ తయారీ కేంద్రంగా శ్రీసిటీ ఆవిర్భవించడం ఈ ఏడాదిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పరిణామం. డైకిన్, బ్లూ స్టార్, అంబర్, EPACK డ్యూరబుల్, హావెల్స్ వంటి ప్రముఖ కంపెనీలు తమ పరిశ్రమలను ఏర్పాటు చేశాయి. దేశీయ ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాయి. అదనంగా, ఈ కంపెనీలకు వివిధ ఉప పరికరాలు సరఫరా చేసే అనుబంధ కంపెనీల రాకతో ఎయిర్ కండీషనర్ ఉత్పత్తి కేంద్రంగా శ్రీసిటీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇది భారతదేశం యొక్క తయారీ నైపుణ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా దేశానికి చల్లని గాలిని అందించే కూల్ క్యాపిటల్ గా మారింది.
✍️ *విశిష్ట సందర్శకులు, ప్రతినిధులు
🔹రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శ్రీలంక, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, USA, మలేషియా కాన్సుల్ జనరల్స్, ఉన్నత స్థాయి అధికారుల సందర్శనలతో భవిష్యత్తులో పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా శ్రీసిటీకి ఉన్న ప్రాధాన్యత మరోసారి స్పష్టమైంది.
🔹భారతీయ ఉక్కు వ్యాపారవేత్త, JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్ర రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు డా. సతీష్ రెడ్డి, AP ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక మంది ఉన్నత స్థాయి అధికారులు, వివిధ పరిశ్రమల CEOలు/CXOలు శ్రీసిటీని సందర్శించారు.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ గోట్టింగెన్, జాగృతి యాత్ర ప్రతినిధులు సందర్శనకు విచ్చేసి మేక్ ఇన్ ఇండియా, ఉద్యోగ కల్పన లక్ష్యాలలో శ్రీసిటీ పాత్రను ప్రశంసించారు.
✍️ *సుస్థిరతకు పెద్దపీట
🔹పర్యావరణ నిర్వహణలో శ్రీసిటీ నిబద్ధత, అమలు విధానాలు అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఈ చర్యల్లో భాగంగా చేపట్టిన మౌళిక సదుపాయాల అభివృద్ధి, పలు వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా 'ఇండియాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్' అనే ప్రతిష్టాత్మక బిరుదును సంపాదించింది.
🔹ఈ గుర్తింపు పర్యావరణ వృద్ధి, స్థిరమైన అభివృద్ధిలో ప్రపంచ లీడర్ గా శ్రీసిటీ స్థానాన్ని సుస్థిరం చేసింది.
✍️ *నాయకత్వ ప్రతిభ
శ్రీసిటీ లోపల కాకుండా, బయట కూడా పలు కార్యక్రమాల ద్వారా శ్రీసిటీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.రవీంద్ర సన్నారెడ్డి నాయకత్వంలో, భారతదేశం-జపాన్ వ్యాపార సహకార కమిటీ, ఇతర అంతర్జాతీయ వేదికలపై స్థిరమైన అభివృద్ధి, సమతుల్య భవిష్యత్తు కోసం శ్రీసిటీ తన నిబద్ధతను చాటుకుంది. చెన్నైలో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2023 సదస్సు నిర్వహణలోనూ స్పాన్సర్ గా కీలక పాత్ర పోషించింది, దీని ద్వారా హరిత కార్యక్రమాల ఛాంపియన్‌గా తన ఖ్యాతిని మరింత పటిష్టం చేసింది.
✍️ *ప్రశంసలు, గుర్తింపులు
🔹వ్యాపార ప్రపంచంలో తన విజయాలకు గుర్తింపుగా పలు ప్రశంసలు, అవార్డులు అందుకుంది. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి దక్కిన ఎకనామిక్ టైమ్స్ యొక్క 'మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆఫ్ ఆసియా' అవార్డు, ఎకనామిక్ టైమ్స్ ఎడ్జ్ యొక్క 'ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా-2023' అవార్డు, fDi ఇంటెలిజెన్స్ వారి 'టాప్-పెర్ఫార్మింగ్ గ్లోబల్ ఫ్రీ జోన్ ఆఫ్ ది ఇయర్ (GFZ)' అవార్డు, బిజినెస్ వరల్డ్ ఇండియా 'మోస్ట్ ఇన్నోవేటివ్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్' గుర్తింపు ఇందులో ముఖ్యమైనవి. వీటితో పాటు సిద్ధార్థ లాజిస్టిక్స్ FTWZ, బ్లూ స్టార్, ఇసుజు మోటార్స్, BeRolleX, VRV ఆసియా పసిఫిక్, రోటోలోక్, వాల్-మెట్ ఇంజనీరింగ్, నోవాఎయిర్, హంటర్ డగ్లస్ మొదలైన పరిశ్రమలకు వారి 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు పలు రకాల గుర్తింపు దక్కాయి.
✍️ *కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)
🔹శ్రీసిటీ జపనీస్ కంపెనీస్ అసోసియేషన్ (SJCA), THK, హంటర్ డగ్లస్, IMOP, డైకి అల్యూమినియం, కెల్లాగ్స్, IFF, Mondelez, ISUZU, NS ఇన్‌స్ట్రుమెంట్స్, బెర్గెన్ పైప్ సపోర్ట్స్, ఎవర్టన్ మొదలైన పరిశ్రమలు రూ.3.6 కోట్లకు పైగా CSR ప్రాజెక్ట్‌లు చేపట్టి, విద్య, ఆరోగ్య సంరక్షణ, సమాజ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాయి. శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరాలు, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు నిర్వహించారు.
✍️ *ఆధ్యాత్మిక, సాంస్కృతిక నగరంగా ..
🔹పారిశ్రామిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యకలాపాలతో ఈ ప్రాంతం సరికొత్త పరిమళాలతో విరాజిల్లింది. శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ద్వారా నిర్వహించిన భజనలు, కళా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, దైవీక కార్యక్రమాలు శ్రీసిటీ పరిసర ప్రజల ప్రశాంత జీవనానికి బాటలు వేశాయి.
🔹 డా. సాయికృష్ణ యాచేంద్ర రచించిన 'సంగీత గేయధార', అన్నమయ్యను సంఘ సంస్కర్తగా చిత్రించే సాహిత్య-సంగీత కార్యక్రమం, ఉగాది పురస్కారాలు, శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షికోత్సవం, కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబపై సాహిత్య-సంగీత కార్యక్రమం, వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవాణి నిర్వహించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.
✍️మొత్తంగా .. 2023లో శ్రీసిటీ ప్రయాణం వేగవంతమైన వృద్ధి, ప్రపంచస్థాయి గుర్తింపు, స్థిరమైన అభివృద్ధిని సాధించింది.చురుకైన పనితీరుతో పలు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, నూతన ఆవిష్కరణలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి చిరునామాగా భారతదేశం, ప్రపంచ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషించింది.