17/11/2023
శ్రీ కోనేరు రాజేంద్రప్రసాద్ గారు..
నా జీవన యానంలో కోనేరు వారి ప్రస్థానం నా ఊపిరి ఉన్నంత వరకు మరువలేనిది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన తత్వం చరితార్ధం. నేను ఆయన వెంట ఉన్న కొద్దిరోజులు కూడా నా గుండెల్లో చెరగని ముద్ర వేసాయి. మొన్నామధ్య సెప్టెంబర్27న ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన క్షణాలు మరువకముందే ఆయన నేడు లేరన్న విషాద వార్త మింగుడు పడడం లేదు.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
శ్రీకాకుళం జిల్లాకు ఈయన ఎంతో సుపరిచితులు.. జిల్లాలోని పురాతన దేవాలయాల్లో అభివృద్ధికి, రైతాంగానికి, మత్స్యకారులకు, మహిళలకు చేయూత, విద్యాభివృద్ధికి, వైద్య సేవలు అందించేందుకు.. ఇలా ఈ జిల్లా ప్రగతికి.. కోనేరు వారు ఎంతగానో కృషి చేసి తనదైన ముద్ర వేసుకున్నారు.
కోనేరు వారి అంత్యక్రియలు చెన్నైలో 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రీ కోనేరు రాజేంద్రప్రసాద్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ...
మీ
హితుడు..
చంద్రశేఖర్ @ శ్రీకాకుళం.