DSB FILMS

DSB FILMS Telugu Short Films https://youtube.com/c/DSBFilms

DSB FILMS
05/04/2024

DSB FILMS

32 సంవత్సరాలు వెనక్కి వెళితే, మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్...
04/05/2023

32 సంవత్సరాలు వెనక్కి వెళితే,
మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.
థడ్...థడ్...అని తలుపు చప్పుడు.
తెరిస్తే ఒక వ్యక్తి. 'ఎవరు మీరు?' అంటే, బదులుగా 'మీ అభిమానిని అమ్మా!' అని సమాధానం. లోపలికి తీసుకువచ్చి అన్నం పెట్టి కష్టసుఖాలు అడిగింది ఆ మహానుభావురాలు. తనది కిళ్ళీకొట్టు వ్యాపారం అనీ, ఇప్పుడంతా నష్టపోయానని చెప్పాడు ఆ అభిమాని.
తన దగ్గిర సమాయానికి డబ్బులు లేవు. ఒకప్పుడు బాగా బ్రతికి, పది మందిని బ్రతికించిన ఆమెకి ఊరికే పంపడమంటే ఏంటో తెలియదు. ఆలోచించింది. తన బీరువా గుర్తుకువచ్చింది. తనకి ఎంతో ఇష్టమైన రెండో మూడో పట్టుచీరెలని అందులో దాచుకుంది. ఇప్పుడే వస్తాను బాబూ అని వెళ్ళి ఒక చీరె తీసుకొని చేతులు వెనకపెట్టుకుని అతనికి కనపడకుండా బయటకి వచ్చింది. వీధి చివర తనకి తెలిసినవాడికి ఇచ్చి "అన్నయ్యా, దీన్ని అమ్మి ఎంత వస్తే అంత పట్టుకురా" అని చెప్పింది. తిరిగి లోపలికి వెళ్ళి అభిమానికి భోజనం వడ్డించింది. అరగంటకి ఆ 'అన్నయ్య' వచ్చి ఒక 5000 చేతిలో పెట్టాడు. ఆమె నవ్వుతూ అవి తీసుకొని లోపలకి వెళ్ళింది. కానీ ఆ చీరె విలువ ఆ రోజుల్లోనే 30,000. మిగతా పాతికవేలు ఆ అన్నయ జేబులోకి వెళ్ళాయి. ఆ విషయం తనకి తెలీదు. అంతెందుకు? తన జీవితంలో అసలు డబ్బులు ఎప్పుడూ లెక్కపెట్టలేదు అంటే నమ్ముతారా? ఇలా లెక్కలేనన్ని ఆర్ధిక అవకాశ రాబందులు తన జీవితంలో.
ఇలా ఎన్నున్నా, నటననే ప్రేమించింది కానీ ప్రేమని మాత్రం నటించలేదు.
ఆమె కనురెప్పలే కోటి భావాలు పలికేవి.
మహానటులుకు సైతం ఆమె పక్కన నటించడానికి చెమటలు పట్టేవి.
తెలుగువారు సగర్వంగా చెప్పుకునే 'ఆడతనం' ఆమెది.
30 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో మామూలు నటులు ఎప్పటికీ మోయలేని కిరీటాలని తను చిటికనవేలుతో ఆడించి చూపించింది.
పాత్రలే తనకోసం ఎదురుచూసేవి.
'దేవదాసు' లో విరహాన్ని పొంగించే ఆ కళ్ళు 'మాయాబజార్' లో ఠీవిని పలికించాయి. ఆ కళ్ళే దక్షిణభారతాన్ని అందంగా మోసం చేశాయి. అది నటన కాదు, జీవం అని మనల్ని మరిపించి మురిపించాయి.
ఆ కళ్ళే SVR, MGR, Sivaji Ganeshan, NTR, ANR, Amitabh, Rajnikanth, Kamal haasan లాంటి వారు కూడా ఆమె నటనకి పాదాభివందనం చేసేట్టు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'నీలం సంజీవరెడ్డి' మంత్రులతో సహా ఆమె ముందు రోడ్డు మీద నడుస్తూ ఆమెను ఏనుగు మీద రవీంద్ర భారతి వరకు 'గాజారోహణం' చేయించారు. భారతదేశ సినిమా చరిత్రలో 'ఎవరికీ దక్కని' అరుదైన గౌరవం ఇది.
'ఇప్పటికీ' 'ఎప్పటికీ' తెలుగువారి ఖ్యాతిని అఖండజ్యోతిలా వెలిగించేవాళ్ళలో ముందు వరుసలో వుంటుంది ఆమె నటనా జీవితం.
ఆమే 'సావిత్రి'.
సావిత్రి గారు మనల్ని పొగడమనో, గుర్తుంచుకోమనో ఏ రోజూ అడగలేదు. గాంధీ కూడా ఆయన బొమ్మని నోటు మీద వేయమని అడగలేదు. గొప్పవాళ్ళు ఎవరూ అడగరు. వాళ్ళ సేవని గుర్తుంచుకొని మనమే ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి.
ఒక scene లో మెట్ల మీద నుండి కిందకి దిగాల్సివుంది. తాను చేయాల్సిన scene ఎప్పుడో చేసేసింది. అయినా shooting gap లో expressions లో వ్యత్యాసం అర్ధం చేసుకోవడం కోసం సావిత్రి గారు కొన్ని వందల సార్లు ఆ మెట్లు ఎక్కి దిగారు. ఒక్కో సారి ఒక్కో expression తో. ఏడుస్తున్నప్పుడు ఇలా, కోపంతో ఇలా, నవ్వుతూ ఇలా, గర్వం తో ఇలా దిగాలి అని. అలాంటి సావిత్రి గారి dedication గురించి "అ ఆ ఇ ఈ" లు కూడా తెలియని ఈ కాలపు నటీమణులు తమ అభిమాన నటి సావిత్రి అని చెప్తున్నారు. ఆ మాట నిజంగా వాళ్ళ మనసులోనుండి వస్తే అంత కంటే ఆనందం లేదు. అలా కాకుండా వాళ్ళు సావిత్రి పేరుని impression కోసం వాడుకుంటే, అంతకంటే అవమానం లేదు.
జయంతికి, వర్ధంతికి మాత్రమే గుర్తుచేసుకోవాల్సిన మనిషి కాదు సావిత్రి గారు. తెలుగు సినిమా గాలి వున్నన్ని రోజులు అందులోని పరిమళం లా వుంటుంది ఆమే.

#సేకరణ

02/04/2023

చంద్రబోస్ తో ఆస్కార్ ఆనందాన్ని పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి..🥰

కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన అపురూప దృశ్య కావ్యం..  #సిరివెన్నెల చిత్రం షూటింగ్ నాటి అరుదైన చిత్రాలు ఇవి.....
05/02/2023

కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన అపురూప దృశ్య కావ్యం.. #సిరివెన్నెల చిత్రం షూటింగ్ నాటి అరుదైన చిత్రాలు ఇవి.. ఆ మహనీయునికి అంజలి ఘటిస్తూ.. 🙏

ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన ప్రముఖ సినీ దర్శకుడు, కళా తపస్వి పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గారి మరణం తెలుగు చలన చ...
03/02/2023

ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన ప్రముఖ సినీ దర్శకుడు, కళా తపస్వి పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గారి మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటు, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని.... వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ .....ఓంశాంతి... - DSB Films 🙏

Congratulations to   Team..🎖️🏆  ఆస్కార్ అవార్డు సాధించాలని కోరుకుంటూ...
25/01/2023

Congratulations to Team..🎖️🏆
ఆస్కార్ అవార్డు సాధించాలని కోరుకుంటూ...

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో...సంక్రాంతి సందర్భంగా మొహమాటం అల్లుడు షార్ట్ ఫిల్మ్ విడుదల చేద్దాం అనుకున్నాం.. కానీ కొన...
16/01/2023

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో...

సంక్రాంతి సందర్భంగా మొహమాటం అల్లుడు షార్ట్ ఫిల్మ్ విడుదల చేద్దాం అనుకున్నాం.. కానీ కొన్ని కారణాల వల్ల పూర్తి కాలేదు.. త్వరలోనే పూర్తి చేస్తాం.. అందాకా మిమ్మల్ని నిరుత్సాహ పరచకుండా సంక్రాంతి రోజున ఈ చిన్న టీజర్ విడుదల చేస్తున్నాం.. చూసి ఆనందించండి.. మమ్మల్ని ఆశీర్వదించండి.. 📽️🎞️☺️🙏

MOHAMATAM ALLUDU Teaser | Latest Telugu short film | Directed by SUBBU.R | DSB Films

https://youtu.be/I2EK7U0P9lI"మొహమాటం అల్లుడు" షార్ట్ ఫిల్మ్ టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది..Pleas watch & like & share & su...
03/01/2023

https://youtu.be/I2EK7U0P9lI
"మొహమాటం అల్లుడు" షార్ట్ ఫిల్మ్
టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది..
Pleas watch & like & share & subacribe on DSB FILMS YouTube channel.... 👍🤝

Mohamatam Alludu | Latest Telugu short film | Sankranthi Special 2023 | DSB Films

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో.. సుబ్బు దర్శకత్వంలో సంక్రాంతికి రాబోతున్న  #మొహమాటం_అల్లుడు పోస్టర్..📽️🎞️
02/01/2023

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో.. సుబ్బు దర్శకత్వంలో సంక్రాంతికి రాబోతున్న #మొహమాటం_అల్లుడు పోస్టర్..📽️🎞️

డి.ఎస్.బి ఫిలింస్ పతాకంపై మరో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం- డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో నవ్వుల చిత్రానికి శ్రీకారం డి...
20/12/2022

డి.ఎస్.బి ఫిలింస్ పతాకంపై మరో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం
- డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో నవ్వుల చిత్రానికి శ్రీకారం

డి.ఎస్.బి ఫిలింస్ పతాకంపై సుబ్బు.ఆర్ దర్శకత్వంలో ప్రొడక్షన్ 2 గా రూపొందనున్న నూతన షార్ట్ ఫిల్మ్ షూటింగ్ మంగళవారం సాయంత్రం కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ప్రారంభమైంది. స్థానిక శ్రీ వినాయక ఆలయంలో దర్శకుడు సుబ్బు సిద్దం చేసిన స్క్రిప్ట్ ను స్వామి వారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ స్క్రిప్టును ఆలయ కమిటీ ఛైర్మన్ కర్రి శ్రీనివాసరెడ్డి, అర్చకులు యూనిట్ సభ్యులకు అందజేసారు. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ కామెడీ ప్రధానంగా ఒక చక్కటి సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. వచ్చే సంక్రాంతికి డి.ఎస్.బి ఫిలింస్ (DSB Films) యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. షార్ట్ ఫిల్మ్ టైటిల్ ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. నవీన్ కళ్యాణ్, హనీ వీనస్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుబ్బు.ఆర్ డైరెక్టర్ కాగా డిఓపి, ఎడిటింగ్ నాగ భగవాన్, డైలాగ్స్ సాంగత్య, కో డైరెక్టర్ భైరిశెట్టి శ్రీకాంత్. ఇంకా ఇతర పాత్రల్లో పలివెల త్రిమూర్తులు, దాసరి సత్తిబాబు, పర్ణిక, పవన్ కుమార్, టి. కృష్ణవంశీ, ఆర్.రవితేజ, ఎం. పవన్ పోషిస్తున్నారు.

https://youtu.be/1kc-Vu8HaGY
27/06/2022

https://youtu.be/1kc-Vu8HaGY

Dream Stone ProductionsKonaseema kaburlu PresentsDirected byDasari SathibabuCast:-Dasari SathibabuKovvuri Ganapathi ReddyVenkat Urlankala

https://youtu.be/JQWIrvjnmJk
14/06/2022

https://youtu.be/JQWIrvjnmJk

రావులపాలెంలో సర్కారు వారి పాట సందడి | svp Venkateswara Theatre Ravulapalem | Films

https://youtu.be/yIfgmN-2kocకొత్త షార్ట్ ఫిల్మ్ షూటింగ్...పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లిముక్కామలలో...🎥🎞️📽️
18/05/2022

https://youtu.be/yIfgmN-2koc
కొత్త షార్ట్ ఫిల్మ్ షూటింగ్...
పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి
ముక్కామలలో...🎥🎞️📽️

09/05/2022

Acharya Latest Telugu movie Public talk in Ravulapalem | Films

Address

Ravulapalem
533238

Alerts

Be the first to know and let us send you an email when DSB FILMS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DSB FILMS:

Videos

Share


Other Ravulapalem media companies

Show All