Vivid Rajamahendravaram

Vivid Rajamahendravaram The miniature version of "Vivid Bharat" dedicated to , Cultural Capital of Andhra

27/09/2024

డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 👌🏼

మిఠాయి కిళ్ళీ..!----------------------ఒకనాడు..!రాజమండ్రి కోటగుమ్మం సెంటరు..!గోదారిస్టేషను..అవతల అప్సరా హొటలుకి కాలి వంతె...
27/09/2024

మిఠాయి కిళ్ళీ..!
----------------------
ఒకనాడు..!
రాజమండ్రి కోటగుమ్మం సెంటరు..!
గోదారిస్టేషను..అవతల అప్సరా హొటలుకి కాలి వంతెన..!
ఇవతల..వెల్కమ్ హొటలు..జైహింద్ హొటలు..!

ఒకవైపు అప్పాజి పాన్ షాపు..దాని ఎదుటి వరుసలో పంచవటి..అంతకు బాగా ముందు కాలంలో ఇండియా కాఫీ హౌసు.
అప్పట్లో అక్కడ కాఫీ ఎంతో ఖరీదు.
పావలా అర్ధణా..!
అదే కూడలి లో కందకం రోడ్డు వాలులో..అజంతా మిలటరీ హొటలు.

కోటగుమ్మానికి..!
గోదావరి రైల్వేస్టేషను..అప్పాజి కిళ్ళీ..!వెల్కమ్..జైహింద్ హొటళ్ళు..!
బేండ్ బాక్స్..చెల్లారామ్స్ ఆభరణాలయితే..!
పూనమ్ స్వీట్స్..నోరుతీపి చేస్తుంది.
కోటగుమ్మానికే తలమానికం అజంతా హొటలు.
మాంసాహార ప్రియులకు అమృత పాత్ర..!
పలావు ఘుమఘుమలు..దారిన పోయేవారిని లాక్కుని వస్తాయి.
కోడి పలావు మూడున్నర..కోడివేపుడుతో భోజనం నాలుగున్నర..!
అప్పట్లో నాన్ వెజ్ హొటళ్ళను మిలటరీ హొటలనేవారు.
రాజమండ్రిలో మాత్రం అజంతా అనేవారు.
అంతగా ముద్రపడింది.
అజంతా లో పలావు తిని..అప్పాజి కిళ్ళీ నోటినిండా బిగిస్తే..అదొక ఉల్లాసం..!
కిళ్ళీ రకరకాల రుచులు..!
లేత తమలపాకులు..తడిగా మెరుస్తుంటాయి..!
సున్నం రాసి రకరకాల సుగంధ ద్రవ్యాలు సహా తీపి పదార్ధం వేసి చుట్టి పేపరు గొట్టం లో దూర్చి చేతికిచ్చేవారు.
నోటిలో కరుగుతూ మెల్లగా లోపలకి జారుకునేది.
ఇదంతా చరిత్ర..ఆనవాళ్ళు ఎన్నో చెరిగిపోయాయి.
అప్పాజి పాన్ షాపు అలాగే ఉన్నది.

రాజమండ్రి రుచులు..తీపి గుర్తులు.

Source: ADUSUMILLI SRINIVAS RAO

ఈరోజు రాజమహేంద్రవరం మోరంపూడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ...
09/09/2024

ఈరోజు రాజమహేంద్రవరం మోరంపూడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు, రాజమహేంద్రవరం సిటీ శాసనసభ సభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు

ఎంతో కాలంగా భక్తి, జ్యోతిష, వాస్తు, మంత్ర, తంత్ర, యంత్ర, ఆయుర్వేద, వేదాంత, స్మార్త, వైదిక, ధర్మశాస్త్రాది గ్రంథములకు మీ ...
27/08/2024

ఎంతో కాలంగా భక్తి, జ్యోతిష, వాస్తు, మంత్ర, తంత్ర, యంత్ర, ఆయుర్వేద, వేదాంత, స్మార్త, వైదిక, ధర్మశాస్త్రాది గ్రంథములకు మీ ఆధరాభిమానాలు పొందిన మోహన్ పబ్లికేషన్స్ వారి

Online Printed Book Stores
DEVULLU.COM

28-8-2024 బుధవారం ఉదయం 11.02 కు ప్రారంభోత్సవం

Venue: అజంతా హోటల్ దగ్గరలో, జండాపంజా రోడ్ డౌన్, రాజమండ్రి

-

“Wildlife and Nature Photography exhibition” conducted on the occasion of "World Photography Day-2024" started with a bl...
19/08/2024

“Wildlife and Nature Photography exhibition” conducted on the occasion of "World Photography Day-2024" started with a blast. Honourable Minister Sri Kandhula Durgesh garu inaugurated the event and was very impressed with our photographs. Rajamahendravaram City MLA Sri Adireddy Vasu garu and Rajanagaram MLA Sri Bathula Balarama Krishna garu honoured us with their gracious presence.

7 photographers from our Rajamahendravaram displayed nearly 180 photos in all wildlife and nature photography genres. Almost 200 people attended the exhibition today (Day 1).

NTR Statue on Godavari Bridge!
18/08/2024

NTR Statue on Godavari Bridge!

5 రూపాయలకే టిఫిన్, 10 రూపాయలకే భోజనం మన రాజమండ్రి G. S. L. హాస్పిటల్ వారు అందచేస్తున్నారు. హాస్పిటల్ లోని పేషెంట్స్ కు వ...
18/08/2024

5 రూపాయలకే టిఫిన్, 10 రూపాయలకే భోజనం మన రాజమండ్రి G. S. L. హాస్పిటల్ వారు అందచేస్తున్నారు. హాస్పిటల్ లోని పేషెంట్స్ కు వారి సహాయకులకు, ఇతరులకు కూడా ఈ సదుపాయం అందుబాటులో కి GSL యాజమాన్యం తీసుకుని వచ్చారు.

#రాజమహేంద్రవరం

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి సమీపంలోని అన్నక్యాంటీన్ ప్రారంభం రోజున మధ్యహ్నా భోజనాన్ని వడ్డించి ప్రజలతో కలిసి భోజనాన్ని రు...
16/08/2024

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి సమీపంలోని అన్నక్యాంటీన్ ప్రారంభం రోజున మధ్యహ్నా భోజనాన్ని వడ్డించి ప్రజలతో కలిసి భోజనాన్ని రుచి చూడడం జరిగింది. అక్షయపాత్ర వారి ద్వారా వచ్చిన భోజనం చాలా రుచిగా వుంది. దాదాపు అయిదుసంవత్సరాలు పైగా మూతబడిన అన్నక్యాంటీన్లు చంద్రన్న పాలనలో తిరిగి పునర్వైభవం సంతరించుకుని పేదలకు అన్నదాతగా నిలిచిన కార్యక్రమంలో పాలుపంచుకోవడం మహదానందాన్ని కలగజేసింది.

Courtesy: Krishna Ganni

కడియం పల్ల వెంకన్న గారి నర్సరీ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా మొక్కలతో ఏర్పాటు చేసిన కూర్పు విశేషంగా ఆకట్టుకుంటు...
15/08/2024

కడియం పల్ల వెంకన్న గారి నర్సరీ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా మొక్కలతో ఏర్పాటు చేసిన కూర్పు విశేషంగా ఆకట్టుకుంటుంది.

Courtesy: Srinivas Kondreddi

కుమారదేవం సినిమాచెట్టు పునరుద్దరణ పనులు ముమ్మరం చేశామని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ అధ్యక్షులు ఇమ్మని వెంకట్ తెల...
14/08/2024

కుమారదేవం సినిమాచెట్టు పునరుద్దరణ పనులు ముమ్మరం చేశామని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ అధ్యక్షులు ఇమ్మని వెంకట్ తెలిపారు. కుమారదేవం లో ఈ చెట్టు కొమ్మలను కత్తిరించే ప్రక్రియ మొదలుపెట్టామన్నారు.ఈ చెట్టు పునరుద్దరణ కార్యక్రమ ఇన్ ఛార్జి ఆర్. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ముందుగా బరువైన కొమ్మలు కత్తిరించి మాను కి ఏ విధమైన నష్టం జరగకుండా ప్రత్యేకం గా తయారు చేసిన లేపనాలు పూసి కవర్ చేస్తామన్నారు. ఈ ప్రక్రియకు ఒక వారం పడుతుందని, ఆ పై విడిపోయిన మాను రెండు ముక్కలను దగ్గర కు చేర్చే ప్రక్రియ మొదలు పెడతాం అన్నారు.

ఈ కార్యక్రమం చూసే సందర్శకుల తాకిడి పెరిగింది. వార్తల్లో కధనాలు, సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా కుమారదేవం సినిమా చెట్టు ఒక్కసారిగా వార్తల్లో ప్రముఖం గా చర్చకు వచ్చింది. ఇక్కడ షూట్ చేసిన చిత్రాల్లో హిట్ చిత్రాలు ఎక్కువ కనుక సినీ పరిశ్రమ కూడా ముందుకు వస్తే మరింత త్వరగా పనులు అవుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Courtesy: Jagannadharao Parasa

THE VAISHNAVI GRAND RESTAURANT Grand Opening on July 02, 2024at Airport Road, Konthamuru
01/07/2024

THE VAISHNAVI GRAND RESTAURANT

Grand Opening on July 02, 2024

at Airport Road, Konthamuru

Picture from 1920 on the eve of Havelock Bridge Inauguration-
26/08/2023

Picture from 1920 on the eve of Havelock Bridge Inauguration

-

Address

Rajamahendravaram

Website

Alerts

Be the first to know and let us send you an email when Vivid Rajamahendravaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Story of #Rajamahendravaram Live!

Rajamahendravaram Live is a dedicated miniature version of Citee Live. Even though Citee Live do the same for every city in Andhra Pradesh and Telangana, we wanted to continue a seperate page, Website and Mobile App for Rajamahendravaram as we all love our cultural capital of Andhra Pradesh.

Let's keep rocking #Rajamahendrians 👍


Other Media/News Companies in Rajamahendravaram

Show All