10/09/2022
👉ప్రవేట్ విద్యా సంస్థల్లో బోధనేతర సిబ్బందికి, డ్రైవర్స్, క్లినర్స్ కు కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలి.
👉సెప్టెంబర్ 20న జిల్లా కలెక్టర్ కు సామూహిక వినతిపత్రం ఇవ్వాలని పోస్టర్ ఆవిష్కరణ
👉ESI, PF, బోనస్, లీవ్ రూల్స్ ఇతర సౌకర్యాలు అమలు చేయాలి.
రాజమహేంద్రవరం:- ప్రవేట్ విద్యా సంస్థల్లో బోధనేతర సిబ్బందికి, విద్యాసంస్థల బస్సులపై పనిచేస్తున్న డ్రైవర్స్, క్లినర్స్ కు కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించి అమలు చేయించాలని సీఐటీయూ నాయకులు బి.పవన్ డిమాండ్ చేసారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర సెప్టెంబర్ 20న అన్ని జిల్లాల కలెక్టర్ లకు సామూహిక వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినదని తెలిపారు. స్థానిక ప్రకాష్ నగర్, లేడీస్ క్లబ్, రాజమహేంద్రవరంలో ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రవేట్ బస్ డ్రైవర్స్ తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీఐటీయూ నాయకులు కె.ఎస్.వి. రామచంద్రరావు, బి.పవన్ మాట్లాడుతూ కనీస వేతన చట్టాన్ని సవరించి 11సంవత్సరాలు అయినా ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చెయ్యకపోవడం కార్మిక ద్రోహమని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత జగన్ ప్రభుత్వం 3సంవత్సరాలు నుండి చట్ట సవరణ చెయ్యకుండా కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. నిత్యావసరం సరుకుల ధరలు, విద్యా, వైద్యం భారం తీవ్రంగా పెరిగినదని దీనిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాన్ని 26వేలకు పెంచి అమలు చెయ్యాలని డిమాండ్ చేసారు. ESI, PF, బోనస్, లీవ్ రూల్స్ ఇతర సౌకర్యాలు ప్రవేటు యాజమాన్యం అమలు చేసెల కార్మిక శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ నాయకులు సతీష్, దిలీప్, భాస్కర్, రవి, నరేష్, రాంబాబు, రామకృష్ణ, సురేంద్ర, రమేష్ తదితరులు పాల్గున్నారు.