12/11/2021
కారుణ్య ట్రస్ట్ చైర్మన్ తుంగ నాగేశ్వరరావు..
కాపా సురేష్ కి రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు.
* విషయం ఏంటంటే.. నెల రోజుల క్రితం యలమంచిలి మండలం కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన కాపా సురేష్, ఉష దంపతుల ముగ్గురు పిల్లలు దొడ్లిపట్ల బ్యాంకు కెనాల్ లో సరదాగా ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. నిండుగా ప్రవహిస్తున్న ఈ కాల్వలో ఈ ముగ్గురిలో ఒకరు (రేణుక) మునిగిపోయి ప్రాణాపాయ స్థితికి వెళ్లింది. అటుగా వెళ్తున్న యలమంచిలి ఎస్సై ప్రసాద్ ఈ దృశ్యం చూసి తక్షణమే స్పందించారు. రేణుకను కాపాడే ప్రయత్నంలో తన జీపులో హుటాహుటిన ఎక్కించుకొని హస్పటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో రేణుక (10) మరణించింది. ఈ దురదృష్టకర సంఘటన నుండి బాదిత కుటుంబం కోలుకోలేకపోయింది. దీనికి తోడు ఆర్ధిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని మరింత కృంగదీశాయి. ఈనేపధ్యంలో కుమ్మరిపాలెంకి చెందిన పలువురు కాపా సురేష్ పరిస్థితిని కారుణ్య ట్రస్ట్ చైర్మన్ తుంగ నాగేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చారు. మానవతాదృక్పథంతో ఆయన స్పందించారు. కారుణ్య ట్రస్ట్ ద్వారా రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా తుంగ నాగేశ్వరరావుకి కాపా సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.