04/12/2022
పత్రిక ప్రకటణ, మంచిర్యాల జిల్లా
తేది: 04-12-2022
తేది: 04-12-2022 నాడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల రక్త నిధి కేంద్ర 14 వ వార్షికోత్సవ దినోత్సవం
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అనేది అంతర్జాతీయ సేవ సంస్థ, ఈ సంస్థ ద్వారా అనేక పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు తెలిసిన విషయమే, ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి రక్త నిధి కేంద్ర 14 వ వార్షికోత్సవ దినోత్సవం.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖా అదర్యంలో జిల్లా పాలనాధికారి అధ్యక్షతన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, ఈ కార్యక్రమాలలో బాగంగా 4 వ డిసెంబర్ 2008 లో రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవటం జరిగింది, మన రక్త నిధి కేంద్రాన్ని దిగ్విజయంగా నిరంతర సేవలు అందించడంలో మాకు సహకరిస్తున్న సింగరేణి సంస్థ లోని శ్రీరాంపుర్ ఏరియా, మందమర్రి ఏరియా మరియు సింగరేణి పవర్ ప్రాజెక్టు వారు అనేక వైధ్య పరికరాలు, 33 లక్షల విలువ గల అంబులెన్స్ మరియు అనేక రక్త దాన శిబిరాల ద్వారా ఈరోజు వరకు బ్లడ్ యూనిట్లు అందిస్తూ వస్తున్నారు.
అదేవిదంగా NTPC రామగుండం, ఓరియంట్ సిమెంట్ కంపనీ దేవాపూర్, మంచిర్యాల సిమెంట్ కంపని, ప్రాజెక్టు అఫ్ఫిసర్ ITDA ఉట్నూర్ గారు లక్షల రూపాయల విలువ గల వైధ్య పరికరాలను రక్త నిధి కేంద్రానికి అందించడం జరిగింది.
మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోలికేరి గారు ఎన్నో రక్త దాన శిబిరాలను తన హోదా ద్వారా ఇప్పించడంతో పాటు DMFT ఫండ్స్ నుండి డీప్ ఫ్రీజెర్స్ మరియు ఫ్యుజిఫిల్మ్ బయో కెమెష్ట్రి మిషిన్ ను సమకూర్చడం జరిగింది వారికి ఈ సందర్బంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.
అదేవిదంగా జిల్లా పోలీసు శాఖ, పోలీసు భేటాలియన్, CISF, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, వైద్య శాఖ, TRASMA, రవాణా శాఖ (RTA), ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు, స్వచ్ఛంద సేవ సంస్థలు, స్వచ్ఛంద రక్త దాతల ద్వారా నిర్వహించిన 1089 క్యాంపుల ద్వారా 88,783 యూనిట్లు రక్తాన్ని, 618 ప్లేట్లెట్స్ (SDP) లను సేకరించడం జరిగింది, తద్వారా 89,076 యూనిట్ల రక్తాన్ని, FFP (ప్లాస్మా) 2531 యూనిట్ల సరఫరా చేసి అందులో మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 20,960 యూనిట్లు, సబ్ సెంటర్ కు 4025 యూనిట్లు, తలస్సేమియా సికిల్ సెల్ పిల్లలకు 17,893 యూనిట్లు ను ఉచితంగా అందించడం జరిగింది.
రక్త దాన శిబిరాలు నిర్వహించి వెలకట్టలేని సేవలు అందిస్తున్న శిబిరాల దాతలందరికి హృదయపూర్వక దాన్యవాదాలు.
దాదాపు రక్త నిధి కేంద్ర నిర్వహణకు నెలకు సిబ్బంది జీతాలు, కిట్ల కొనుగోలు, బిల్డింగ్ మరం మత్తులకు రూ. 7,40,000/- వరకు రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది.
అదే విదంగా 2012 వ సంవత్సరం నుండి తలస్సేమియా మరియు సికిల్ సెల్ వ్యాదిగ్రస్తులకు ఉచితంగా హిమోగ్లోబిన్ పరిక్షలు చేస్తూ వ్యాది తీవ్రతను బట్టి రక్తాన్ని ఎక్కించడం జరుగుతుంది
వారి తల్లి తండ్రులకు తలస్సేమియా, సికిల్ సెల్ వ్యాది పట్ల అవగాహనా కల్పించడం తో పాటు DNA క్యాంప్స్ ద్వారా 202 మందికి ఆరోగ్యశ్రీ లబ్ది పొందడం జరిగింది, ప్రతి 3 నెలలకు ఒక్కసారి నిపుణులైన హిమోటాలజిస్ట్ హైదరాబాద్ వైద్యునిచే మెరుగైన వైద్యం మరియు అవగాహణ కల్పించడం అందించడం జరుగుతుంది,
తలస్సేమియా, సికిల్ సెల్ వ్యాది నివారణలో బాగంగా మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంత కళాశాలలు, MVTC ట్రైనింగ్ డిపార్ట్మెంట్స్ లలో, ఇంజినీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు మరియు వివిద ప్రాంతాలలో తలస్సేమియా, సికిల్ సెల్ వ్యాది నివారణ కొరకు పెళ్ళికి ముందే HBA 2 టెస్టు చేయించుకోవాలని అవగాహన కల్పించడం తో పాటు ఉన్నత అధికారులకు ప్రతి ప్రాతమిక పాటశాలలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో మ్యారేజి కేర్టిఫికేట్ ఇచ్చే సమయాలలో HBA 2 టెస్టును తప్పని సరి చేసినట్లయితే తలస్సెమియా సికిల్ సెల్ వ్యాది నివారణకు చర్యలు తీసుకొని ఈ వ్యాది ని బావి తరాలకు శోకకుండ నిర్మూలించ వచ్కని ఉన్నత అధికారులకు వినతి పాత్రలు అందించడం జరిగింది.
అదే విదంగా అనాద పిల్లల కోసం 2009 వ ఆనంద నిలయంను స్టాపించి అప్పటి నుండి 249 మంది పిల్లలకు నివాసం, విధ్య, వైద్యం మరియు ఇతర సదుపాయాలను అందచేయడం జరిగింది. ప్రస్తుతం 18 మంది పిల్లలకు ఆశ్రయం పొందుతున్నారు. అలాగే 2014 వ సంవత్సరం నుండి అబాగ్యులైన వృద్దులు మరియు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా వచ్చిన ఆనాద వృద్దులకు ఆశ్రయం, భోజన, వైద్య మొదలగు సేవలు కల్పించడం జరుగుతుంది. దాదాపు 189 మంది వృద్దులైన స్త్రీ పురుషులకు ఆశ్రయం అందించడం జరిగింది. ప్రస్తుతం 15 మంది స్రీలు మరియు 12 మంది పురుషులకు ఆశ్రయం పొందుతున్నారు.
దాదాపు నెలకు రూ. 1,16,400/- వరకు ఖర్చు అవుతుంది అందుకు సహకరిస్తున్న దాతలకు దాన్యవాదాలు.
మంచిర్యాల జిల్లా లో ఉన్న 344 ఉన్నత పాఠశాల నుండి 42,292 మంది విధ్యార్థులను జూనియర్ రెడ్ క్రాస్ సభ్యులుగా మరియు 89 ఇంటర్, డిగ్రీ కళాశాలల నుండి 27,841 మంది విధ్యార్థులను యూత్ రెడ్ క్రాస్ సభ్యులుగా నమోదు చేసుకోవడం జరిగింది.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుండి 6 మంది Patrons, 1 Vice-Patrons మరియు 3846 మంది Life Members గా మొత్తం 3853 మంది శాశ్వత సబ్యులుగా నమోదు అవడం జరిగింది.
విపత్తూలు సంబవించినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడుట కొరకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ (Social Emergency Response Volunteer) క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది.
నిరంతరం అందించే పై సేవలే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల కొరకు హెల్త్ కంప్స్ ద్వారా 5073 మంది బాదితులు లబ్ది పొందడం జరిగింది.
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో లాక్ డౌన్ విదించిన సందర్బంగా వివిద ప్రాంతాలలో నిరుపేదలు, వలస కూలీలు, నిరాశ్రయులైన వారికి భోజన సదుపాయం, నిత్యవసర సరుకులు అందించడం తో పాటు , కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసు సిబ్బందికి, పురపాలక సిబ్బందికి, వైధ్య సిబ్బందికి మాస్క్ లు, సానిటైజర్ లు , గ్లౌస్ల్ లు, హైజినిక్ కిట్లు అందించడం మరియు కోవిడ్ 19 వ్యాది సోకిన వారికి కోవిడ్ కిట్ల తో పాటు ఆక్సిజన్ కన్సన్ ట్రేటర్ లను అందించడం జరుగుతూ ఉంది.
అతిబారి వర్షాల వల్ల గోదావరి నీరు పొంగి వరద ముంపుకు గురైన మాతాశిశు ఆసుపత్రి బాదితుల తరలింపులో యూత్ రెడ్ క్రాస్ సబ్యులు ఆసుపత్రిలో ఉన్న గర్బిని స్త్రీలను మరియు శిశువులను జనరల్ ఆసుపత్రికి తరలించడంలో తమవంతు పాత్ర పోసించడం జరిగింది, అలాగే లోతట్టు ప్రాంతాలలో ఇండ్లు మునిగిపోయి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారికి బోజనం, నిత్యవసర సరుకులు, తార్పాలిన్ షీట్లు, దుప్పట్లు, హైజినిక్ కిట్లు, వంట పాత్రలు అందించడం జరిగింది.
2023 సంవత్సరంలో చేయవలసిన లక్షాలు:-
జూనియర్ రెడ్ క్రాస్ & యూత్ రెడ్ క్రాస్ ను విధ్యా సంస్థలలో విస్తృత పరచడం. వారికి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ (Social Emergency Response Volunteer) పై అవగాహణ కల్పించడం.
మండల స్తాయి కమిటీలను ఏర్పాటు చేయడం.
HBA2 టెస్టు క్యాంపులు విధ్యా సంస్థలలో నిర్వహించడం.
సెల్ఫ్ ఎంప్లోయీమెంట్ (స్వయం ఉపాది పతకం) క్రింద కుట్టు మిషిన్ శిక్షణ కేంద్రాలు నిర్వహించడం.
జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి గారు, జిల్లా వైస్ ఛైర్మన్ చందూరి మహేంధర్, జిల్లా కోశాధికారి పడాల రవీంధర్ గారు, స్టేట్ మేనేజింగ్ కమిటి సబ్యులు వి. రాధా క్రిష్ణ గారు, జిల్లా కమిటి సబ్యులు వి. మధుసూదన్ రెడ్డి గారు, కాసర్ల శ్రీనివాస్ గారు, కె. సత్యపాల్ రెడ్డి గారు, S. నాగేంధర్ గారు, ఎడ్ల కిషన్ గారు పాల్గొన్నారు