Madhira RachaBanda మధిర రచ్చబండ

Madhira RachaBanda మధిర రచ్చబండ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhira RachaBanda మధిర రచ్చబండ, News & Media Website, Madhira.

People Pulse................ Revant Reddy👍 Bhatti 👎
30/05/2023

People Pulse................ Revant Reddy👍 Bhatti 👎

*క‌మ‌ల‌మా… హ‌స్త‌మా… మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌న్న పొంగులేటి, జూప‌ల్లి* తెలంగాణ రాజకీయాల్లో ఈటల, పొంగులేటి, జూపల్లి రహస్య...
30/05/2023

*క‌మ‌ల‌మా… హ‌స్త‌మా… మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌న్న పొంగులేటి, జూప‌ల్లి*
తెలంగాణ రాజకీయాల్లో ఈటల, పొంగులేటి, జూపల్లి రహస్య భేటీ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గన్‌మెన్లకు కూడా అనుమతి లేకుండా ఈటల జూపల్లి, పొంగులేటితో ఏం చర్చించా రనన్న అంశంపై ఉత్కంఠ రేపుతోంది. మ‌రో వైపు కాంగ్రెస్ కూడా ఈ ఇద్ద‌రిని హ‌స్తం గూటికి చేర్చేందుకు త‌మ వంతు ప్ర‌యత్నాల‌ను ముమ్మ‌రం చేసింది.. దీంతో ఏ పార్టీలో చేరాల‌నే విష‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌లు మ‌ల్ల‌గుల్ల‌లు ప‌డుతున్నారు.. కాగా రానున్న అసెంబ్లి ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వం ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో అసం తృప్తి నేతలే టార్గెట్‌గా ఆ పార్టీ ప్రయ త్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో బలమైన నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని, మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీ యాల్లో కీలక నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఎలాగైనా బీజేపీలోకి తీసుకు రావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అయితే బీజేపీలో చేరే విషయమై పొంగులేటి, జూపల్లి తేల్చకపో వడంతో సస్పెన్స్‌ కొనసాగుతోంది. వారిని ఎలాగైనా తమ వైపు తిప్పుకునేలా బీజేపీ పావులు కదుపుతుంది.

30/05/2023
🔁మూలమలుపుల తో  ఎన్నో ప్రమాదాలు🚷కనిపించని హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, ఆర్ అండ్ బి నిర్లక్ష్యానికి బలవుతున్న ప్రజ...
30/05/2023

🔁మూలమలుపుల తో ఎన్నో ప్రమాదాలు
🚷కనిపించని హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, ఆర్ అండ్ బి నిర్లక్ష్యానికి బలవుతున్న ప్రజలు
🚫ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని ఆర్ అండ్ బి , సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు
🚦🚧రోడ్డు ప్రమాదాలను నివారించుటకు అవసరమైన ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డ్ లను ఏర్పాటు , వెంటనే మరమ్మతులతో తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజల డిమాండ్
👉మధిర మండల పరిధిలోని మధిర నుండి దేశినేనిపాలెం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే మధిర ఆర్ అండ్ బి పరిధి. పరిధి పరిమితమైన ప్రమాదాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. దీనికి ముఖ్య కారణం ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యమే అంటున్న ప్రజలు. అనేక మూలమలుపులు జంక్షన్ లో ఎటువంటి హెచ్చరిక బోర్డులు స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుని అనేకమంది క్షతగాత్రులు కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్య ద్వారా లేదని అలానే ప్రజాప్రతినిధులు కూడా ఏమి పట్టినట్టు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రాయపట్నం గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్ లో ఎన్నో ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఈ మలుపుల వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్ అండ్ బి రోడ్డుకి ఆనుకొని డ్రైనేజీ ఉండడం వల్ల మూలమలుపు ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన వాహనాలు తప్పుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్ అండ్ బి కి సంబంధించిన అధికారులు ఎటువంటి హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయలేదు దీనివల్ల కొత్తగా వచ్చే వాహనదారులు ప్రమాద మలుపును గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇదే కోవాలో నేడు మధిర బైపాస్ మధిర సిటీ నుండి వెళ్ళు "Y" జంక్షన్ ప్రదేశంలో ప్రమాదం చోటుచేసుకుని ఒక యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మధిర- రాయపట్నం ఆర్ అండ్ బి రోడ్ బ్రిడ్జి తర్వాత "Y" జంక్షన్ లో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. Y జంక్షన్ ప్రాంతంలో ఎటువంటి హెచ్చరిక బోర్డులను కానీ, స్పీడ్ బేకర్స్ ను కాని ఏర్పాటు చేయకపోవడం వల్ల వాహనదారులు అయోమయంలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు , సంబంధిత ఉన్నత అధికారులు ,ఆర్ అండ్ బి అధికారులు మరిన్ని ప్రమాదాలు జరగకముందే సమస్యను గుర్తించి పరిష్కరించవలసిందిగా *మీడియా* ద్వారా తెలియజేస్తున్నారు.

మధిర సిపిఎస్ స్కూల్లో సీసీ కెమెరాల ఏర్పాటు.              మన ఊరు మనబడి పథకంలో భాగంగా ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఎంపిక చేస...
26/05/2023

మధిర సిపిఎస్ స్కూల్లో సీసీ కెమెరాల ఏర్పాటు.
మన ఊరు మనబడి పథకంలో భాగంగా ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి మౌలిక వసతులను కల్పిస్తుంది. ఈ మేరకు MADHIRA GHS CPS పాఠశాలకు వేసవిలో రక్షణగా సీసీ కెమెరాలను నేడు అమర్చడమైనది. ఈ సీసీ కెమెరాలు జిల్లా కేంద్రానికి, రాష్ట్ర కేంద్రానికి అనుసంధానంగా పనిచేస్తాయి.

*చాకచక్యం  వ్యవహరించి  ప్రాణాలు కాపాడిన ఏర్రుపాలెం బ్లూకోల్ట్ కానిస్టేబుల్ ఉపేందర్.* కుటుంబ కలహాలతో చనిపోదం అని ఏర్రుపాల...
26/05/2023

*చాకచక్యం వ్యవహరించి ప్రాణాలు కాపాడిన ఏర్రుపాలెం బ్లూకోల్ట్ కానిస్టేబుల్ ఉపేందర్.*
కుటుంబ కలహాలతో చనిపోదం అని ఏర్రుపాలెం రైల్వే ట్రాక్ పై చనిపోవడానికి జుజ్జురు గ్రామానికి చెందిన యువకుడు ప్రయత్నించినడాని 100 డయల్ కాల్ కి సకాలంలో స్పందించి, గూగుల్ లొకేషన్ ద్వారా యవకుడు వద్దకు సాహసోపేతంగా గా చేరుకొని యువకుడు రక్షించడం జరిగింది. అట్టి యువకుడిని కౌన్సిలింగ్ చేసి తన కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.

*💥బ్రేకింగ్ న్యూస్**అక్రమo గా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పట్టుకున్న ఎస్ఐ**దళిత బంధు ట్రాక్టర్లతో ఇసుక తరలింపు*అక్...
26/05/2023

*💥బ్రేకింగ్ న్యూస్*
*అక్రమo గా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పట్టుకున్న ఎస్ఐ*
*దళిత బంధు ట్రాక్టర్లతో ఇసుక తరలింపు*
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పది ట్రాక్టర్లను మధిర పట్టణ అదనపు ఎస్సై స్వప్న అదుపులోకి తీసుకున్నారు ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని రాయపట్నం శివారులో వైరా ఏరు నుండి గత కొంతకాలంగా అర్ధరాత్రిలు అపరాత్రులు అనకుండా ఇసుక మాఫియా ఇసుకను తరలించే చర్యలను కొనసాగిస్తూ వస్తుంది ఈ విషయమై గ్రామ సర్పంచ్ మండల రెవెన్యూ అధికారులకు పోలీసులకు లిఖితపూర్వక సమాచారాన్ని ఫిర్యాదును అందజేసింది. ఈ మేరకు కొద్ది రోజులు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టని ఇసుక మాఫియా గడిచిన మూడు రోజులుగా విచ్చలవిడిగా తోలకాలకు సిద్ధమైంది సమాచారం అందుకున్న మధిర పట్టణ ఎస్సై స్వప్న మాటువేసి ఇసుకను తరలించేందుకు వచ్చిన పది ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ట్రాక్టర్లలో మధిర పట్టణ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్లతో పాటు రాయపట్నం గ్రామానికి చెందిన ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. ఈ ట్రాక్టర్లలో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్లను ఈ అక్రమ ఇసుక రవాణాకు కొంతమంది వ్యక్తులు అద్దె ప్రాతిపదికగా తీసుకొని ఈ దందాను కొనసాగిస్తున్నారని సమాచారం. గ్రామ సర్పంచ్ పూర్తి ఆధారాలతో పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు పోలీస్ లు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. పట్టణ అదనపు ఎస్ఐ స్వప్న ట్రాక్టర్ల యజమానులు డ్రైవర్ల పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

*పొంగులేటి , జూపల్లి తో ఈ రోజు ఉదయం భేటీ అయినBJP  చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్**హైదరాబాద్ లో శివారు లోని ఫాంహౌస్ ల...
26/05/2023

*పొంగులేటి , జూపల్లి తో ఈ రోజు ఉదయం భేటీ అయినBJP చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్*
*హైదరాబాద్ లో శివారు లోని ఫాంహౌస్ లో*రహస్య సమావేశం*
*సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఈ సమావేశం జరుగుతున్నట్లుప్రచారం*

*మధిర*//ది: 01.05.2023▪️ *శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు.*▪️ *శ్రామికుల భాగస్వామ్యం తోనే అభివృద్ధి సాధ్యం.*▪️ *కేసీఆర...
01/05/2023

*మధిర*//ది: 01.05.2023
▪️ *శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు.*
▪️ *శ్రామికుల భాగస్వామ్యం తోనే అభివృద్ధి సాధ్యం.*
▪️ *కేసీఆర్ గారి పాలనలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు.*
▪️ *కార్మికలోకానికి మేడే శుభాకాంక్షలు*
➖ మధిర లో జరిగిన మేడే వేడుకల్లో జడ్పీ చైర్మన్ *లింగాల కమల్ రాజు గారు*
_________________________________
శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదని శ్రామికుల భాగస్వామ్యం తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు. సోమవారం నాడు మేడే సందర్భంగా మధిర నియోజకవర్గ కేంద్రం మధిర పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ముందుగా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి కార్మిక సంఘం మధిర నియోజకవర్గ ఇంచార్జ్ జిల్లేపల్లి బాబూరావు గారు RWS కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను లింగాల కమల్ రాజు గారు ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు అలానే అంబేద్కర్ సెంటర్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడే పెయింటర్స్ అసోసియేషన్ గద్దల ఏసు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే స్పూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని కార్మికుల కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు అలానే ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా పారిశ్రామిక విధానం రూపొందించడం వినూత్న పారిశ్రామిక విధానాలతో సంపద సృష్టించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. కార్మిక శాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్లైన్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక జాతీయ అవార్డులను కైవసం చేసుకుందని, కార్మికులు ఎక్కడి నుంచైనా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావడం వల్ల అంతర్జాతీయంగా పేరు పొందిన పలు కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయన్నారు తద్వారా కార్మికులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఉపాధి, వేతనం లభిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రామికులు, కార్మికుల పక్షపాతి అని వారి భద్రతకు, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. తన రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక లోకానికి ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్మిక సోదరులు పాల్గొన్నారు

*▪️చిన్న కష్టం వచ్చినా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, అదైర్య పడొద్దు.**♻️ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.**...
18/04/2023

*▪️చిన్న కష్టం వచ్చినా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, అదైర్య పడొద్దు.*
*♻️ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.*
*♻️ సర్పంచ్ అబ్బూరి సంధ్య రాణి గారు*
▪️మధిర మండలం అత్కూరు గ్రామ వాసులకు కూలి పనులకు వెళ్తుండగా ఖాజిపురం వద్ద 11 మంది కూలీలకు రోడ్ ప్రమాదం జరగడం జరిగింది,గాయపడిన వారిని గ్రామ సర్పంచ్ అబ్బూరి సంధ్య రాణి గారితో కలిసి పరామర్శించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు,గ్రామ సర్పంచ్ అబ్బూరి సంధ్య రాణి గారు గాయపడిన వారికి ఒక్కొ కుటుంబానికి 25కేజీల బియ్యాన్ని అందజేయడం జరిగింది.
👉 ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.

*భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్ కమల్ రాజు గారు*మధిర అంబే...
14/04/2023

*భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్ కమల్ రాజు గారు*
మధిర అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్మన్ విద్యాలత గార్లతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళుర్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేళ..యావత్ భారతజాతి గర్వపడే విధంగా..హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆ మహోన్నత మూర్తికి సమున్నత నివాళి అర్పిస్తోంది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. పీడిత వర్గాల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, పీడిత ప్రజల బాగు కోసం,బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం డా.బి.ఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో వారిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు అదే బాటలో సాగుతున్నారన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలోనే మనమందరం కూడా నడిచి పేదవారి ఆకలి తీర్చడం కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే వారికి నిజమైన నివాళి అన్నారు.భారతదేశంలో 90శాతం ఉన్న బడుగుబలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే, డా.బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి నిజమైన గౌరవం ఇచ్చిన వారమవుతామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నందు రాజ్యాంగ నిర్మాత dr. B.R అంబేద్కర్ గారి 125అడుగుల గారి విగ్రహ ఆవిష్కరణకు మధిర నుండి హైదరాబాద్  కు బయలుదేర...
14/04/2023

హైదరాబాద్ నందు రాజ్యాంగ నిర్మాత dr. B.R అంబేద్కర్ గారి 125అడుగుల గారి విగ్రహ ఆవిష్కరణకు మధిర నుండి హైదరాబాద్ కు బయలుదేరిన BRS నాయకులు,జెండా ఊపి ప్రారంభించిన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు మరియు మధిర మునిసిపల్ చైర్మన్ మొండితోక లత గారు*
👉భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మధిర అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ గారి విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించిన అనంతరం 2 బస్సులలో 100మంది ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ కు బయలుదేరారు.
👉ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమీషనర్ రమాదేవి గారు,ఎంపీడీఓ విజయ్ భాస్కర్ గారు, మునిసిపల్ వైస్ చైర్మన్ విద్యా లత గారు,11వార్డ్ కౌన్సిలర్ మాధురి గారు,8వార్డ్ కౌన్సిలర్ అప్పారావు గారు,సొసైటీ చైర్మన్ బిక్కి ప్రసాద్ గారు, మధి
ర టౌన్ పార్టీ అధ్యక్షులు కనుమూరి వెంకటేశ్వరరావు గారు,BRS నాయకులు కరివేద సుధాకర్ గారు, BVR గారు, వెంకట్ రెడ్డి గారు, ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పొంగులేటి పై లింగాల కమల్ రాజ్ పరోక్ష విసుర్లు.కొంతమంది నాయకులు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒకరకంగా మాట్లాడుడు ఇప్పుడు కేసీఆర్...
10/04/2023

పొంగులేటి పై లింగాల కమల్ రాజ్ పరోక్ష విసుర్లు.
కొంతమంది నాయకులు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు
ఒకరకంగా మాట్లాడుడు ఇప్పుడు కేసీఆర్ విమర్శించటం ఆ నాయకుని దివాలా కోరుతనానికి నిదర్శనం అన్నారు.
కెసిఆర్ నీ ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి, నేడు కేసీఆర్ ను విమర్శించడం సిగ్గుచేటన్నారు.

*మధిరలో బిఆర్ఎస్ దే విజయం**జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు*👉 ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే రాను...
25/03/2023

*మధిరలో బిఆర్ఎస్ దే విజయం*
*జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు*
👉 ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. శనివారం మధిర టివియం పాఠశాలలో బిఆర్ యస్ సభలో ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలను, గుర్తించి,అవి పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మధిర నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేసిందిన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, అంతర్గత సిసి రహదారులు, నిర్మించటం జరిగిందన్నారు. మధిర నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘన విజయం సాధించిందన్నారు. మధిర గడ్డపై ఈసారి గులాబీ జెండా ఎగరవేయటం ఖాయం అన్నారు.

Lingala With KCR
25/03/2023

Lingala With KCR

*▪️నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా.. ఎకరానికి 10 వేలు సాయం..**▪️మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, సింగిరెడ్డి నిర...
24/03/2023

*▪️నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా.. ఎకరానికి 10 వేలు సాయం..*
*▪️మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు,MLC తాత మధుసూదన్ గారు,విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారు,గారితో మీడియా సమావేశం.*
▪️అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు.. గంటలో ఈ నిధులను విడుదల చేస్తామని తెలిపారు. వాస్తవానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని.. సహాయ పునరావాస చర్యలు అని అంటారని చెప్పారు.
రైతులకు అండగా ఉంటాం
‘గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 1,29,446, వరి 72,709 మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి.
దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారు. అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారు. వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. కానీ మేం గర్వంగా చెబుతున్నాం.. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో ఉంది.
జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్‌డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉంది. యావరేజ్‌గా 16 శాతం వరకు ఉంది. అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అద్భుతమైన వ్యవసాయం రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని.. ఇది మనకు చాలా గర్వకారణమని తెలిపారు.
రైతులు ఏవిధంగా నిరాశకు గురికావద్దు.. ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలిపారు. ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలని చెప్పారు.
*కేంద్రానికి నివేదిక పంపం.. వందశాతం మేమే ఆదుకుంటాం..*
ఈ దేశంలో ఓ పద్ధతి, పాడు లేదు. ఇన్సూరెన్స్‌ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప రైతులకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. పాత ప్రభుత్వాలు అంతే.. ఇప్పుడు కూడా అంతే.. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది.
వాళ్లకు చెప్పినా లాభం లేకుండా ఉంది. భారతదేశానికే కొత్త అగ్రికల్చర్‌ పాలసీ కావాలి. ఇప్పుడు ఒక డ్రామా నడుస్తోంది. మేం రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కమిటీ ఎప్పుడొస్తుందో.. రిపోర్టు ఎప్పుడిస్తుందో ఆ దేవుడికే ఎరుక. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా ఆర్నెల్ల దాకా రూపాయి రాదు.
ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉంది. వాళ్లకు రాజకీయాలు తప్ప ప్రజల్లేరు.. రైతులు లేరు. అందుకే కేంద్రానికి నివేదిక పంపాలని అనుకోవట్లేదు. గతంలో పంపిన దానికే రూపాయి ఇవ్వలేదు కాబట్టి నిరసనగా ఇప్పుడు నివేదిక పంపాలని అనుకోవడం లేదు.
భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చిండు కాబట్టి మా రైతులను మేమే కాపాడుకుంటాం. వంద శాతం మేమే ఆదుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మహాద్భాగ్యం.. మొక్కజొన్నకు అయితే ఎకరానికి రూ.3,333 ప్రకటించారు. వరి చేళ్లకు 5400, మామిడి తోటలకు 7200 ఇస్తామని స్కీంలో ఉంది.
ఇది ఏ మూలకు సరిపోదు. కాబట్టి రైతులను మేమే ఆదుకుంటాం. అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.
ఎకరానికి 10వేలు అందజేస్తాం
తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్‌, ఉచిత నీళ్లు, వాటర్‌ సెస్‌ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకోవడం వల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది.
ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదు కాబట్టి ఈ రంగాన్ని నిర్వీర్యం కానివ్వం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. తెల్వక దీన్ని చాలామంది నష్టపరిహారం అని అంటారు. కానీ వీటిని సహాయ పునరావాస చర్యలు అని పిలవాలి.
నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇయ్యలేరు. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలి. అందుకే ఎకరానికి 10వేలు ప్రకటిస్తున్నా. వెంటనే వీటిని అందజేస్తాం.
స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటాం. ఈ డబ్బును నేరుగా రైతులకు ఇవ్వకుండా.. ప్రతి రైతుతో పాటు కౌలు రైతులను కూడా పిలిపించి ఆదుకునేలా ఆదేశాలిస్తాం.
పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తాం. జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా.. రబ్బర్‌ బంతి తిరిగొచ్చినట్లుగా.. భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో రైతులు ముందుకు పోవాలి. ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దు. అని రైతుల్లో భరోసా నింపారు.

లోకల్ న్యూస్ అప్డేట్స్;-*శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్...
16/02/2023

లోకల్ న్యూస్ అప్డేట్స్;-
*శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మధిర* మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు
బంజారా కాలనీలో బంజారాల కులదైవం పెద్దలతో ఘనంగా *శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్* 284 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్, కులదైవం పెద్దలు నాయకులు అనుబంధ సంఘాలు పాల్గొని *శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్* ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా నిర్వహించి, ఆశీర్వచనాలు పొందారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే శ్రీశ్రీశ్రీ స0త్ సేవాలాల్ మహారాజ్ 2 84వ జయంతి వేడుకలు బంజారా కాలనీ మా కులదమైన పెద్దలు కుటుంబాలతో అనుబంధ సంఘాలతో కలిసి జయంతి వేడుకలు జరుపుకోవడం శుభ దినంగా భావిస్తూ ఆయన అడుగుజాడల్లో మేమందరం ఆయన స్ఫూర్తితో మేము నడుస్తామని వారు తెలిపారు ఈ జయంతి వేడుకలకు సమావేశానికి మాకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మున్సిపల్ చైర్మన్ మొండితోకలత వైస్ చైర్మన్ విద్యార్థుల వెంకటరెడ్డి
ఎస్టీ సెల్ అధ్యక్షుడు *బాణావత్ వెంకటరమణ నాయక్*బిఆర్ఎస్ ఎస్టి సెల్ కృష్ణ నాయక్ *తేజవత్ బాలు నాయక్, , ధీరవత్ కోటియా నాయక్* *బంజారా కాలనీ కుల పెద్దలు *రమవత్ బాబ్ల నాయక్*కృష్ణ ప్రసాద్ వార్డు కౌన్సిలర్ మాధవి శ్రీనివాస్ అప్పారావు కళ్యాణి కిరణ్ పలువురు వార్డు కౌన్సిలర్లు మొదలగు వారు పాల్గొన్నారు*

మధిర//ది: 15.02.2023▪️ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలోనే మధిర పట్టణాభివృద్ధి.▪️మునుపెన్నడూ లేని విధంగా నేరుగా ప్రజలకు అభ...
15/02/2023

మధిర//ది: 15.02.2023

▪️ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలోనే మధిర పట్టణాభివృద్ధి.

▪️మునుపెన్నడూ లేని విధంగా నేరుగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరుతున్నాయి.

▪️ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించిన రూ. 30కోట్ల రూపాయల తో మరింత అభివృద్ధి చేసుకుందాం.

▪️ ప్రజలందరి అభిప్రాయాలు, సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు గుడ్ మార్నింగ్ మధిర

▪️ గతంలో వేసవి కాలం వస్తుందంటే నీళ్ల కోసం భయపడే పరిస్థితి ఉండేది...నేడు పట్టణంలో అలాంటి పరిస్థితులను దూరం చేసిన ఘనత BRS పార్టీ ప్రభుత్వానిది.

▪️ పార్కులు ఏర్పాటు సహా త్వరలో పూర్తి కానున్న ట్యాంక్ బండ్ తో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పట్టణ ప్రజలకు అందిస్తున్నాం.

▪️ గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ కోతలతో ప్రజల పడిన ఇబ్బందులు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనకు లేకుండా చేసి నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు.

▪️ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం.

➖ 11,12,22 వార్డుల్లో జరిగిన గుడ్ మార్నింగ్ మధిర కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు
____________

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలోనే మధిర పట్టణాభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్మన్, బీ.ఆర్.ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు మధిర మున్సిపాలిటీ పరిధిలో పట్టణ పార్టీ ఆధ్వర్యం లో బుధవారం నాడు జరిగిన గుడ్ మార్నింగ్ మధిర కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత గారితో కలసి ఆయన పాల్గొన్నారు అందులో భాగంగా 11,12,22 వార్డుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఆయా వార్డుల్లో మొత్తం కలియ తిరిగారు. ఆ వార్డులో ఉన్న సమస్యల పరిష్కారం తో పాటుగా చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ప్రజల తో ఆయన నేరుగా చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర మున్సిపల్ అభివృద్ధి కోసం రూ.30 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రజలంతా మద్దతుగా ఉండాలని కోరారు ప్రజలందరి అభిప్రాయాలను భాగస్వామ్యం చేస్తూ వారి సహకారంతో మధిర పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని గుడ్ మార్నింగ్ మధిర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఇప్పటికే ప్రజలకు ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం సహా ట్యాంక్ బండ్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు పట్టణంలో పలు చోట్ల పార్కులు ఏర్పాటు చేసుకున్నామని సెంట్రల్ డివైడర్ తో పాటుగా లైటింగ్ సహా అంబేద్కర్ సెంటర్ ను సుందరికరణ చేశామని గుర్తు చేశారు 11,12,22 వ వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు పట్టణంలో ఉన్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ను కూడా సుందరికరణ తో తీర్చిదిద్దామని తెలిపారు మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నేరుగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరుతున్నాయని తెలిపారు గతంలో వేసవి కాలం వస్తుందంటే మంచి నీళ్ల కోసం మధిర పట్టణ ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని వాటర్ ట్యాంకర్స్ తో నీళ్ల తెప్పించున్నాం అని కానీ నేడు పట్టణంలో మంచి నీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి దూరం చేసిన ఘనత BRS ప్రభుత్వానిది అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ కోతలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పట్టణంలో వ్యాపారులు కూడా జనరేటర్లు పెట్టుకోని వ్యాపారులు చేసుకున్నారని గుర్తు చేశారు కానీ నేడు పోరాడి సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రం లో అలాంటి ఇబ్బందులు దూరం చేసి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక నాయకులు కేసీఆర్ గారని స్పష్టం చేశారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు ఎన్నికల సమయం రాగానే వచ్చి మాయ మాటలు చెప్పే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి కేసీఆర్ గారికి మద్దతుగా BRS పార్టీని ఆశీర్వదించాలని కోరారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇంత పెద్ద ఎత్తున నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారికి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి, పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

13/02/2023
*హైదరాబాద్*//ది: 13.02.2023▪️ మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించండి.▪️ రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి...
13/02/2023

*హైదరాబాద్*//ది: 13.02.2023
▪️ మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించండి.
▪️ రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కలసి కోరిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు
▪️ ఇటీవలే కళాశాల కు వెళ్లి అక్కడ సమస్యలను సిబ్బంది, విద్యార్థులను అడిగి తెలుసుకున్న లింగాల కమల్ రాజు గారు.
_______________________________
మధిర నియోజకవర్గ కేంద్రం మధిర పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభివృద్ధి మరియు విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని ఖమ్మం జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు గారు కోరారు. సోమవారం నాడు హైదరాబాద్ లోని బి ఆర్ కె భవన్ లో జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం నిధుల కేటాయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు అందుకు మంత్రి తన్నీరు హరీష్ రావు గారు సానుకూలంగా స్పందించారు కాగా ఇటీవలే మధిర పర్యటనలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లిన లింగాల కమల్ రాజు గారు అక్కడ ప్రిన్సిపాల్ తో పాటుగా సిబ్బంది మరియు విద్యార్థులతో మాట్లాడి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెంటనే విషయాన్ని స్వయంగా హైదరాబాద్ వెళ్లి కళాశాల ప్రాముఖ్యతను రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయాలని కోరారు

*PRTU సీనియర్ నాయకులు బూసా.కోటేశ్వరరావు గారి కుమారుడు,కోడలిని ఆశీర్వదించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ గారు*👉PR...
12/02/2023

*PRTU సీనియర్ నాయకులు బూసా.కోటేశ్వరరావు గారి కుమారుడు,కోడలిని ఆశీర్వదించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ గారు*
👉PRTU సీనియర్ నాయకులు మడుపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బూసా.కోటేశ్వరరావు గారి పెద్దకుమారుడు వినీల్ వివాహం ఈ నెల 10 న సామర్లకోటలో జరగగా ఈ రోజు మధిర లోని వారి స్వగృహం నందు జరుగుతున్న వ్రతం కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు హాజరై నూతన దంపతులు వినీల్, రాఘవి లను ఆశీర్వదించారు. ఆయన వెంట టి.ఆర్.యెస్ పార్టీ నాయకులు, PRTU బాధ్యులు హాజరవడం జరిగింది.

పూర్వ విద్యార్థి సంఘం వారి సేవలు అభినందనీయం.▪️ ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలిచిన తేళ్ల వసంతయ్య స్మారక పాఠశాల పూర్...
12/02/2023

పూర్వ విద్యార్థి సంఘం వారి సేవలు అభినందనీయం.
▪️ ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలిచిన తేళ్ల వసంతయ్య స్మారక పాఠశాల పూర్వ విద్యార్థులు
▪️ తేళ్ల వసంతయ్య స్మారక ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం వార్షిక సమ్మేళనంలో *జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు*
________________________________
మధిర పట్టణంలోని ప్రధాన వీధిలో ఉన్న తేళ్ల వసంతయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో చేసే సేవ కార్యక్రమాలు అభినందనీయం అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు ఆదివారం నాడు పాఠశాల ఆవరణలో జరిగిన పూర్వ విద్యార్థి సంఘం వార్షిక సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అందులో భాగంగా ముందుగా దివంగత తేళ్ల వసంతయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది పేద విద్యార్థులకు పూర్వ విద్యార్థి సంఘం వారు అండగా నిలిచారని గుర్తు చేశారు అలానే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారని వారి సేవలను కొనియాడారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, పూర్వ విద్యార్థి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

*నిలకడ లేని రాజకీయాలకు కేరాఫ్ డాక్టర్ కోట రాంబాబు..**రాజకీయ పదవుల కోసం పార్టీ మారే నీవు నీ స్థాయికి మించి జిల్లాస్థాయి న...
02/02/2023

*నిలకడ లేని రాజకీయాలకు కేరాఫ్ డాక్టర్ కోట రాంబాబు..*

*రాజకీయ పదవుల కోసం పార్టీ మారే నీవు నీ స్థాయికి మించి జిల్లాస్థాయి నాయకులను విమర్శించే అర్హత నీకెక్కడిది..?*

నిబద్ధతలేని రాజకీయాలు చేస్తూ పార్టీలు మారే నీవు తాతా మధు గారిని విమర్శించే స్థాయి నీకుందా..?

గతంలో నీవు ఎమ్మెల్యే సీటు కావాలని తాత మధు గారిని అడగలేదా..?

నీవు రాజకీయాల్లోకి రావటమే పదవి ఆశించి వచ్చిన సంగతి ప్రజలకు తెలియదా..?

కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.

గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటమికి నీవు కారణం కాదా..?

డాక్టర్ కోటా రాంబాబు నువ్వు స్థాయిని మరిచి మాట్లాడటం సరైనది కాదు..

రాజకీయాల్లో ఇస్తాను సారంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు.

టిఆర్ఎస్ పాలనలో మధిర మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తుంది.

రాజకీయాల్లో ఎవరికి అంత తేలిగ్గా పదవులు రావు. ఓ సిద్ధాంతం, నిబద్దత కష్టపడి పనిచేసిన వారే రాజకీయాల్లో రాణిస్తారు అన్న సంగతి రాంబాబు గుర్తుంచుకోవాలి..

బిఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డాక్టర్ కోటా రాంబాబు పై ఫైరైన బిఆర్ఎస్ జిల్లా నాయకులు మొండితోక జయాకర్.

మాటూరు గ్రామంలో సర్పంచ్ మెయిన్ శెట్టి లీలావతి తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లిం...
19/01/2023

మాటూరు గ్రామంలో సర్పంచ్ మెయిన్ శెట్టి లీలావతి తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, కార్యక్రమంలో మాటూరుపేట పిహెచ్సి డాక్టర్ వెంకటేష్, ఎంపీపీ మొండెం లలిత, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

 #19-1-2023 //మధిర//కంటి వెలుగు▪️కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి▪️కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్...
19/01/2023

#19-1-2023 //మధిర
//కంటి వెలుగు

▪️కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

▪️కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శం

▪️ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు.

▪️ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిన్న కలెక్టర్ గారి కార్యాలయం ప్రారంభోత్సవంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మధిర మున్సిపాలిటీలోని రెండవ వార్డులు కౌన్సిలర్ సయ్యద్ ఇక్బాల్ గారు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు గ్రామీణ ప్రాంతాల వారు పేదవారు కంటి చూపు లేక ఆసుపత్రికి వెళ్లి చూయించుకునే ఆర్థిక స్తోమత లేక బాధపడుతున్నటువంటి వారికి కోసం వైద్యులు గ్రామానికి వెళ్లి కళ్ళు పరీక్ష చేసి సమస్యకు సంబంధించిన కళ్ళజోడు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ప్రతి పేదవాడి బాధను అర్థం చేసుకొని వారికి ఎంత సంక్షేమ పథకాలు అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అండగా ఉండాలని అన్నారు.

👉 ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, వైద్యులు అధికారులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.

ఖమ్మం సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతం..కేసీఆర్.జిల్లాకు సంబదించిన ముఖ్యాంశాలు👉బహిరంగ సభలో సీఎం కేసీఆర్  మాట్లాడుతూ..👉5...
18/01/2023

ఖమ్మం సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతం..కేసీఆర్.
జిల్లాకు సంబదించిన ముఖ్యాంశాలు
👉బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
👉589 గ్రామ పంచాయితీలకు రూ.10లక్షల చొప్పున కేటాయిస్తున్నామన్నారు.
👉మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10కోట్లు.
👉ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు.
👍మధిర, వైరా,సత్తుపల్లి..ఇతర మున్సిపాలిటీకి రూ.30కోట్లు కేటాయిస్తున్నామన్నారు.
👉ఖమ్మంకు గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నామన్నారు.
👉ఖమ్మం కాలవొడ్డు మున్నేరు పై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో మంజూరు.
👉జర్నలిస్టులకు నెల రోజుల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా కృషి.

బ్రేకింగ్ న్యూస్జిల్లా పరిషత్ చైర్మన్ మధుర నియోజకవర్గ BRS పార్టీ ఇన్చార్జి లింగాల కమల్ రాజు గారి విజ్ఞప్తి మేరకు మధిర ము...
18/01/2023

బ్రేకింగ్ న్యూస్
జిల్లా పరిషత్ చైర్మన్ మధుర నియోజకవర్గ BRS పార్టీ ఇన్చార్జి లింగాల కమల్ రాజు గారి విజ్ఞప్తి మేరకు మధిర మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి నిధి నుండి 30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.
ఒక్క గ్రామ పంచాయతీకి పది లక్షలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.

*రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కంచ ఫిలిప్ పార్థివ దేహానికి  నివాళులర్పించిన ఖమ్మం జిల్లా ZPP చైర్మన్  లింగాల కమల్ రాజ్   & BRS...
14/01/2023

*రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కంచ ఫిలిప్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఖమ్మం జిల్లా ZPP చైర్మన్ లింగాల కమల్ రాజ్ & BRS నాయకులు*
✝️ మధిర 21వ వార్డులోని RCM చర్చి దగ్గర లో నివాసం ఉంటున్న *కంచ ఫిలిప్* పట్ల ఖమ్మం జిల్లా ZPP ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ , ఆ వార్డ్ BRS అధ్యక్షుడు *వేల్పుల శివ*, BRS నాయకులు తుమ్మల జీవన్, నీలం రమేష్ , టీచర్ జంగం వీరయ్య, మరియు రమేష్ తదితరులు కంచ ఫిలిప్ గారి మృతి పట్ల సంతాపం వారి కుటుంబానికి తెలిపారు.. .

ముగ్గుల పోటీలను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు జిలుగుమాడు గ్రామం నందు రాజీవ్ ...
14/01/2023

ముగ్గుల పోటీలను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్
మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు జిలుగుమాడు గ్రామం నందు రాజీవ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సంక్రాంతి పండుగను ఆనంద ఉత్సాహాలతో నిర్వహించుకోవాలని ప్రజలు సుఖ సంతోషాలతో పాడిపంటలతో జీవించాలని ఆయన కోరుకున్నారు అనంతరం కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపాలిటీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ యనంశెట్టి వెంకట అప్పారావు మున్సిపాలిటీ కో ఆప్షన్స్ సభ్యులు కోటారి రాఘవరావు బుచ్చిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ మునగ వెంకట్రావమ్మ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దేవినేని శ్రీనివాసరావు గ్రామ పెద్దలు దోర్నాల చిన్న వెంకటేశ్వర్లు దోర్నాల కోటేశ్వరరావు నాగేశ్వరరావు వేల్పుల కొండ టిఆర్ఎస్ నాయకులు మునగ వీరబాబు రాజీవ్ యూత్ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Address

Madhira
507203

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhira RachaBanda మధిర రచ్చబండ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other News & Media Websites in Madhira

  • J9 TopStories

    J9 TopStories

    A***n Media House House Number 1-31 Main Road Vadlagudem Bhadradri Kothagudem District Telangana
Show All