RBK News

RBK News RBK News Brings you the best 24/7 News platform for People of Andhra Pradesh and Telangana. Our Motiv

ఏటీఎం నగదు నింపే వ్యాన్‌లో 66 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లి మర్రిచెట్టులో దాచారు.ఒంగోలు పట్టణంలో గురువారం ఏటీఎంలో నగ...
20/04/2024

ఏటీఎం నగదు నింపే వ్యాన్‌లో 66 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లి మర్రిచెట్టులో దాచారు.

ఒంగోలు పట్టణంలో గురువారం ఏటీఎంలో నగదు నింపే వ్యాన్‌లోంచి రూ.66 లక్షలు దోచుకెళ్లిన నిందితులను ప్రకాశం పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన డబ్బు మొత్తం మర్రి కుహరంలో పడి ఉంది.

ఒంగోలులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితులను సిఎంఎస్‌ మాజీ ఉద్యోగి సన్నమూరు మహేష్‌బాబు (22), రాచర్ల రాజశేఖర్‌ (19), ఒంగోలు సిఎంఎస్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ గుజ్జుల వెంకట కొండారెడ్డి (40)గా గుర్తించారు.

వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు సీఎంఎస్ సెక్యూరిటీ కంపెనీ సిబ్బంది తమ శాఖ నుంచి ₹68 లక్షలు తీసుకున్నారని ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ అనీల్ తెలిపారు. కర్నూలు రోడ్డులోని వర్మ హోటల్ దగ్గర వాహనం ఆపి భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి రూ.66 లక్షల చోరీ జరిగినట్లు గుర్తించారు.

టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, పోలీసులు మహేష్ బాబును పేర్నమిట్ట నుండి పట్టుకున్నారు. విచారించగా, వారు డబ్బును మర్రి చెట్టు కుహరంలో దాచారని చెప్పాడు. లింగారెడ్డి కాలనీలోని సిఎంఎస్‌ కార్యాలయం వద్ద రాజశేఖర్‌, కొండారెడ్డిని అనుచరులుగా అరెస్టు చేశారు.

• 10 Lakhs donation From Harrisburg Jana Sainiks, Pennsylvania, USA.
20/04/2024

• 10 Lakhs donation From Harrisburg Jana Sainiks, Pennsylvania, USA.

*సెల్ ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి.ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ స్నాచింగ్ అనేది సర్వసాధారణంగా మా...
20/04/2024

*సెల్ ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి.
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ స్నాచింగ్ అనేది సర్వసాధారణంగా మారింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే వెనుక నుంచి ఎవరైనా వచ్చి ఎప్పుడు ఫోన్‌ లాక్కుంటారో చెప్పాల్సిన పనిలేదు.

ఇలాంటి సంఘటన మీకు తెలిసిన వారికైనా లేదా మీకు ఎప్పుడైనా జరిగితే మీరు ఏమి చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఫోన్ దొంగిలించబడిన వెంటనే, మొదటగా పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అందరికీ తెలుసు.
ఇందులో కొత్తదనం ఏముంది?

అయితే పోలీసు స్టేషన్‌కు వెళ్లే ముందు మీరు కొన్ని ముఖ్యమైన పనిని పూర్తి చేయాలి.

మీ ఫోన్‌ను దొంగిలించిన వెంటనే మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటో తెలుసుకుందాం.

టెలికాం ఆపరేటర్‌కు కాల్ చేయండి

మీ మొబైల్ నంబర్ ఉన్న ఏదైనా టెలికాం కంపెనీ కస్టమర్ కేర్‌కు మీరు వెంటనే కాల్ చేయాలి. మీ ఫోన్ దొంగిలించబడినట్లయితే, అదే కంపెనీ నంబర్ ఉన్న మరొకరి నుండి ఫోన్ కోసం అడగండి. ఉదాహరణకు, మీ ఫోన్‌లో రిలయన్స్ జియో నంబర్ ఉంటే మీ ఫోన్‌ దొంగతనానికి గురైన తర్వాత జియో సిమ్‌ కలిగిన ఇతరుల ఫోన్‌ను తీసుకుని కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, ఆపై మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను వారికి చెప్పి, మీ మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయాలనుకుంటున్నారని చెప్పండి.

కస్టమర్ కేర్ వ్యక్తి మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతాడు. మీరు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వెంటనే, మీ నంబర్ బ్లాక్ చేస్తారు. నంబర్‌ను బ్లాక్ చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, దొంగ మీ సిమ్‌ను దుర్వినియోగం చేయలేరు.

పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయండి

అన్నింటిలో మొదటిది మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయడం మంచిది. ఈ పనిని పూర్తి చేసిన తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మీకు జరిగిన సంఘటన గురించి తెలియజేయండి. మీ ఫిర్యాదును విన్న తర్వాత పోలీసు అధికారి మీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. మీరు ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా మీ వద్ద ఉంచుకోవాలి. ఈ నివేదికలో మీ మొబైల్ ఫోన్ మోడల్ నంబర్, IMEI నంబర్, మీ ఫోన్ ఏ రంగులో ఉందో వంటి ముఖ్యమైన సమాచారం రాసి ఉటుంది.

IMEI నంబర్ బ్లాక్ చేయండి

ఫోన్ దొంగిలించబడిన తర్వాత మొబైల్ నంబర్ బ్లాక్ చేయించండి. కానీ IMEI నంబర్ గురించి ఏమిటి? ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేకమైన IMEI నంబర్ ఉంటుందని మీరు తెలుసుకోవాలి. IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం వల్ల ప్రయోజనం కూడా ఉంది. ఆ ప్రయోజనం ఏమిటంటే మీరు నంబర్‌ను బ్లాక్ చేసినప్పుడు, ఆ తర్వాత ఫోన్ కేవలం బాక్స్‌గా మిగిలిపోతుంది. ఎందుకంటే IMEI నంబర్ బ్లాక్ అయిన వెంటనే మీ ఫోన్‌లో ఇతర కంపెనీల సిమ్ పనిచేయదు.

ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది IMEI నంబర్‌ను ఎలా బ్లాక్ చేయాలి? అని. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం సాధారణ ప్రజల సౌకర్యార్థం ఒక వెబ్‌సైట్‌ను సిద్ధం చేసింది. దీని ద్వారా మీరు ఈ పనిని చాలా సులభంగా చేయవచ్చు.

IMEI నంబర్‌ను బ్లాక్ చేయడానికి, మీరు https://www.ceir.gov.in/Home/index.jspకి వెళ్లాలి. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత, సైట్ హోమ్‌పేజీకి ఎడమ వైపున బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం కోసం ceir.gov.in ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా, కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. దీనిలో మీరు దొంగిలించబడిన ఫోన్‌ను బ్లాక్ చేయడానికి అభ్యర్థనను సమర్పిస్తున్నారని తెలుపండి. ఈ పేజీలో మీ నుండి కొన్ని ముఖ్యమైన సమాచారం అడుగుతుంది. ముందుగా ఫోన్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఆపై మీ ఫోన్ ఎక్కడ చోరీకి గురైంది? ఏ రాష్ట్రంలో దొంగిలించారు మొదలైన దొంగతనం గురించి సమాచారాన్ని ఇవ్వాలి.

దీని తర్వాత, మీరు పేజీలో అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత, మీరు డిక్లరేషన్‌పై టిక్ చేసి, ఆపై కింద చూపిన సబ్‌మిట్ బటన్‌ను నొక్కాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ బ్లాక్ చేయబడుతుంది.

20/04/2024

తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు 62.37 శాతం పోలింగ్‌

19వ రోజుకు చేరుకున్న జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

YCPపై సోషల్‌ మీడియాలో పోస్టులు, TDPకి ఈసీ నోటీసులు

ఆగస్ట్ 15లోగా కచ్చితంగా రూ.2 లక్షల రుణమాఫీ-రేవంత్‌

తెలంగాణలో చేనేతలకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల

వేసవి దృష్ట్యా 9,111 అదనపు ట్రిప్పులు-ద.మ.రైల్వే

గతేడాదిలో ఐటీ దిగ్గజ కంపెనీల నుంచి 64 వేల మంది ఔట్

ఐపీఎల్‌లో చెన్నైపై 8 వికెట్ల తేడాతో లక్నో విజయం

తెలంగాణలో స్వల్పంగా తగ్గిన ఎండలు, ఏపీలో భగభగలు

19/04/2024

కృష్ణ నగర్ హైవే రోడ్డు మరవతలను వెంటనే పూర్తి చేయాలని కర్నూలు నగరవాసులు NH వారికి విజ్ఞప్తి చేస్తున్నారు

*వైఎస్ షర్మిలా రెడ్డి*APCC చీఫ్అమ్మకు జన్మదిన శుభాకాంక్షలునాకు జన్మనిచ్చి, ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా...
19/04/2024

*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్

అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

నాకు జన్మనిచ్చి, ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి

నాకు అండగా, చీకటిలో వెలుగుగా,

వేదనలో సాంత్వనగా,

విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు.

నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను,

మనః శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ, హ్యాపీ బర్త్డే మా.

*నారా భువనేశ్వరి స్పీచ్....*• కుప్పం ప్రజలకు, టీడీపీ బిడ్డలకు నా నమస్కారాలు.• కుప్పం గడ్డ ... టీడీపీ అడ్డా...• కుప్పంలో ...
19/04/2024

*నారా భువనేశ్వరి స్పీచ్....*

• కుప్పం ప్రజలకు, టీడీపీ బిడ్డలకు నా నమస్కారాలు.

• కుప్పం గడ్డ ... టీడీపీ అడ్డా...

• కుప్పంలో పసుపు జెండా తప్ప మరో జెండాకు తావులేదు...

• చంద్రబాబు ను అరెస్టు చేసినప్పుడు నేను నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేశాను.

• నా పార్టీ బిడ్డల కుటుంబాలను నేరుగా కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

• నిజం గెలవాలి కార్యక్రమం సమయంలో పార్టీ బిడ్డలే నాకు అండగా నిలిచారు.

• నేడు కుప్పంలో అంతకు మించి అన్నట్టు మీ ఉత్సాహం, ఆనందం చూస్తుంటే లక్ష మెజార్టీ ఖాయం అనిపిస్తోంది.

• నామినేషన్ కు బయలుదేరినప్పుడు యువత, నిరుద్యోగులు, మహిళలు, వికలాంగులు, రైతులు వచ్చి నామినేషన్ ఫీజు ఇచ్చారు.

• చంద్రబాబు సీఎం అయితేనే తమ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు.. వారు ఇచ్చిన డబ్బులతోనే నామినేషన్ వేస్తున్నాను.

• చంద్రబాబు ఏపీ ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని చూశారు.

• వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచేశారు.

• వైసీపీ నేతల దోపిడీకి అడ్డుపడిన టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపేశారు.

• వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు.

• రాష్ట్రంలో ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే.

• రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైసీపీ పాలనలో నలిగిపోయారు.

• వైసీపీ దుర్మార్గపు పాలనను రానున్న ఎన్నికల్లో ఓడించాలి.

• ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను గద్దె దించాలి.

• టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు జెండాలు వేరైనా అజెండాలు ఒక్కటే... అది ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం.

• మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

*21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్* ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేం...
19/04/2024

*21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్*

ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.

ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవిత వ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్‌ కోసం లక్షా 87వేల పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

తొలి దశలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 మంది మహిళలు, 11,371 ఇతరు లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1వ తేదీన ముగియ నుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రి య సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరిం చింది

లోక్ సభ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడులో 39 సీట్లు, ఉత్తరాఖండ్ లో 5 సీట్లు ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణి పూర్ లో 2 సీట్ల చొప్పున ఉన్నాయి.

అండమాన్ అండ్ నికోబార్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్ లో ఒక్కో సీటు చొప్పున ఉన్నాయి.ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ఫేజ్ లోనే ఎన్నికలు ముగియను న్నాయి...

ఏపీ శాసనమండలి ఛైర్మన్ కుమారుడికి సివిల్స్ ర్యాంక్..సివిల్స్‌ ఫలితాల్లో శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేనురాజు కుమారుడు ర్య...
18/04/2024

ఏపీ శాసనమండలి ఛైర్మన్ కుమారుడికి సివిల్స్ ర్యాంక్..

సివిల్స్‌ ఫలితాల్లో శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేనురాజు కుమారుడు ర్యాంకు సాధించారు. మోసేను రాజు కుమారుడు చిట్టిరాజు 833వ ర్యాంకు సాధించారు..

18/04/2024

*జగన్‌పై దాడికేసులో నిందితుల అరెస్ట్‌‼️*

కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు..‼️

జగన్‌పై సతీష్ దాడిచేసినట్టు పోలీసుల నిర్ధారణ..‼️

సతీష్‌కు సహకరించిన దుర్గారావు, మరో ఐదుగురు యువకులను విచారించిన పోలీసులు...‼️

వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్‌2 Full stop ఆన్‌లైన్‌లో ఉన్న వారి లిస్ట్‌ ఒకేచోట!WhatsApp : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్...
17/04/2024

వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్‌2 Full stop ఆన్‌లైన్‌లో ఉన్న వారి లిస్ట్‌ ఒకేచోట!

WhatsApp : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమైంది. , పిన్‌ చాట్‌, ఏఐ ఫీచర్లను తీసుకొచ్చిన యాప్‌2 Full stop ఇప్పుడు చాట్‌ లిస్ట్‌లో ప్రత్యేక ఆప్షన్‌ తీసుకురానుంది. , ఆన్‌లైన్‌లో ఉండేవారి లిస్ట్‌ ఒకేచోట దర్శనమివ్వనుంది. , దీంతో కమ్యూనికేషన్‌ అనుభవం మరింత మెరుగుకానుందని వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది.

సాధారణంగా వాట్సప్‌ కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో ఓపెన్‌ చేయగానే చాట్‌ లిస్ట్‌ దర్శనమిస్తుంది. , అందులో ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారు? , ఆఫ్‌లైన్‌లో ఎవరు ఉన్నారు? , అనే వివరాలు తెలియాలంటే చాట్‌ లిస్ట్‌ ఓపెన్‌ చేయాల్సిందే. , అలాకాకుండా కాసేపటి వరకు ఆన్‌లైన్‌లో ఉన్న వారి జాబితాను చూపిస్తే బాగుంటుంది కదూ! , అదే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు వాట్సప్‌ సన్నద్ధమవుతోంది. , వాట్సప్‌ ఓపెన్‌ చేయగానే యాక్టివ్‌ చాట్‌ లిస్ట్‌ కనిపించేలా కొత్త ఆప్షన్‌ను త్వరలోనే వాట్సప్‌ తీసుకురానున్నట్లు తెలిపింది.

అంటే ఇకపై చాట్‌ బాక్స్‌ ఓపెన్‌ చేయగానే యాక్టివ్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ ఆప్షన్‌ కనిపించనుంది. , కొన్ని ఎంపిక చేసిన కాంటాక్ట్‌లు మాత్రమే ఈ లిస్ట్‌లో దర్శనమిస్తాయని సమాచారం. , అలాగని ఈ జాబితాలోని వ్యక్తుల ‘లాస్ట్‌ సీన్‌’, ‘ఆన్‌లైన్‌ స్టేటస్‌’లు కూడా కనిపించబోవని తెలిపింది. , వినియోగదారుల గోప్యతను దృష్టిలోఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది. , రీసెంట్‌ ఆన్‌లైన్‌ కాంటాక్ట్స్‌ ఆప్షన్‌ ఇప్పటికే కొందరు బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిందని, రానున్న రోజుల్లో అందరికీ అందుబాటులో రానుందని వెల్లడించింది. , దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను కూడా వాబీటా ఇన్ఫో పంచుకుంది.

*తెలంగాణ హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తులు*న్యూఢిల్లీ:తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూ ర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీన...
17/04/2024

*తెలంగాణ హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తులు*

న్యూఢిల్లీ:
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూ ర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావులను శాశ్వత న్యాయ మూర్తులుగా నియమించ డానికి సుప్రీంకోర్టు కొలీజి యం సిఫార్సు చేసింది.

ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తు లుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తు లుగా జస్టిస్‌ శ్రీనివాసరావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావులకు తగిన అర్హతలు కలిగి ఉన్నా రని నిర్ణయించినట్టు వెల్లడించింది.

తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయ మూర్తుల తీర్పులు పరిశీ లించాలని ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీం కోర్టు కమిటీని సీజేఐ ఆదే శించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరిం చింది.

*TMC మేనిఫెస్టో.. ఫ్రీగా ఏడాదికి 10 సిలిండర్లు*బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎన్నికల మే...
17/04/2024

*TMC మేనిఫెస్టో.. ఫ్రీగా ఏడాదికి 10 సిలిండర్లు*

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది.

పౌరసత్వ సవరణ చట్టం (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC), ఉమ్మడి పౌరస్మృతి (UCC)ని బెంగాల్లో అమలు చేయబోమని అందులో పేర్కొంది.

అలాగే పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు, ఇళ్లు, ఫ్రీ రేషన్ డెలివరీ తదితర 10 హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చింది.

*తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..* 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం *రూ.74,140*.. 22 క్యారెట్ల 1...
17/04/2024

*తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..*

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం *రూ.74,140*..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం *రూ.67,960*..

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి *రూ.90,600*.

*గంజాయితో మిల్క్‌షేక్.. తాగితే ఏడు గంటలు మత్తులోనే!*రూటుమార్చిన గంజాయి స్మగ్లర్లుపాలు, హార్లిక్స్, బూస్ట్‌లో గంజాయి పౌడర...
17/04/2024

*గంజాయితో మిల్క్‌షేక్.. తాగితే ఏడు గంటలు మత్తులోనే!*

రూటుమార్చిన గంజాయి స్మగ్లర్లు

పాలు, హార్లిక్స్, బూస్ట్‌లో గంజాయి పౌడర్ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం

జగద్గిరిగుట్టలో కిరాణాషాపు యజమాని అరెస్ట్

గంజాయి అక్రమ రవాణాకు ఎన్ని మార్గాలు అన్వేషిస్తున్నా పోలీసులకు పట్టుబడిపోతుండడంతో స్మగ్లర్లు ఈసారి రూటుమార్చారు. ఇప్పటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా తమ దందాను మిల్క్ షేక్ రూపంలోకి మార్చారు. పాలు, హార్లిక్స్, బూస్టులో గంజాయి పొడి కలుపుకొని మిల్క్‌షేక్ రూపంలో తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ గంజాయి స్మగ్లర్లు యువతకు నూరిపోస్తున్నారు. ఈ మిల్క్ షేక్ తాగినవారు ఏడు గంటలపాటు మత్తులో జోగుతున్నారు.

రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్‌వోటీ) పోలీసులు దాడులు చేసి కిరాణ దుకాణం యజమాని మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సప్లయ్ చేసిన మోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గంజాయి పొడిని కిలో రూ. 2,500 చొప్పున విక్రయిస్తున్నారు. గంజాయి పొడితో చేసిన చాక్లెట్‌ ఒక్కో దానిని రూ. 40కి విక్రయిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన మోహన్ జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిత్యం గంజాయి పౌడర్, చాక్లెట్లను ఇక్కడి యువతకు సప్లై చేస్తున్నట్టు గుర్తించారు.

*రామాయణం సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో!. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*---...
17/04/2024

*రామాయణం సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో!. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
సంపూర్ణ వాల్మీకి రామాయణం(వచన) www.freegurukul.org/g/Ramayanam-1

వాల్మీకి సంపూర్ణ రామాయణం(పద్య+తాత్పర్యం) www.freegurukul.org/g/Ramayanam-2

వాల్మీకి రామాయణం-బాల,అయోధ్య,సుందర,ఉత్తర కాండ-అంతరార్ధం www.freegurukul.org/g/Ramayanam-3

చిత్ర రూపంలో సంపూర్ణ వాల్మీకి రామాయణం www.freegurukul.org/g/Ramayanam-4

రామ కథాసుధ-1,2 భాగాలు www.freegurukul.org/g/Ramayanam-5

రామచరిత మానసము www.freegurukul.org/g/Ramayanam-6

సుందర కాండ-పారాయణము www.freegurukul.org/g/Ramayanam-7

సంపూర్ణ ఆంధ్ర శ్రీ మద్రామాయణము www.freegurukul.org/g/Ramayanam-8

రామచరిత మానస్-తులసీ రామాయణం www.freegurukul.org/g/Ramayanam-9

రామాయణం www.freegurukul.org/g/Ramayanam-10

తులసీ రామాయణము www.freegurukul.org/g/Ramayanam-11

యోగ వాసిష్ఠ సారము www.freegurukul.org/g/Ramayanam-12

యోగ వాశిష్ఠ సంగ్రహము www.freegurukul.org/g/Ramayanam-13

రామాయణ రహస్య రత్నావళి www.freegurukul.org/g/Ramayanam-14

రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-15

బాలల బొమ్మల సంపూర్ణ రామాయణం www.freegurukul.org/g/Ramayanam-16

రామాయణం పాత్రల ఆదర్శం www.freegurukul.org/g/Ramayanam-17

రామాయణంలో విశిష్ట పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-18

బాలానంద బొమ్మల రామాయణం www.freegurukul.org/g/Ramayanam-19

వాల్మీకి రామాయణం-సంబంధాలు www.freegurukul.org/g/Ramayanam-20

రామాయణ పరమార్ధం www.freegurukul.org/g/Ramayanam-21

శ్రీ రామాయణ రహస్యం www.freegurukul.org/g/Ramayanam-22

రామాయణ తరంగిణి-1 www.freegurukul.org/g/Ramayanam-23

రామాయణ తరంగిణి-2 www.freegurukul.org/g/Ramayanam-24

శ్రీరామాయణ కథా సుధ www.freegurukul.org/g/Ramayanam-25

వాల్మీకి రామాయణము-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-26

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-27

చిత్రరూపంలో రామాయణం www.freegurukul.org/g/Ramayanam-28

వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ www.freegurukul.org/g/Ramayanam-29

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండ www.freegurukul.org/g/Ramayanam-30

వాల్మీకి రామాయణము-అరణ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-31

వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ www.freegurukul.org/g/Ramayanam-32

వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-2 వ భాగము www.freegurukul.org/g/Ramayanam-33

వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ-2 వ భాగము www.freegurukul.org/g/Ramayanam-34

శత శ్లోకి వాల్మీకి రామాయణం www.freegurukul.org/g/Ramayanam-35

జాతి జీవనంపై రామాయణ ప్రభావం www.freegurukul.org/g/Ramayanam-36

రామాయణమంటే www.freegurukul.org/g/Ramayanam-37

రామాయణ సారస్వత దర్శనము www.freegurukul.org/g/Ramayanam-38

అంతరార్ధ రామాయణము www.freegurukul.org/g/Ramayanam-39

రామాయణ విశేషాలు www.freegurukul.org/g/Ramayanam-40

శ్రీమద్వాల్మీకి రామాయణోపన్యాసములు-అయోధ్య,అరణ్య,కిష్కింద కాండ www.freegurukul.org/g/Ramayanam-41

శ్రీరామ కథామృతము - సమగ్ర సమీక్ష www.freegurukul.org/g/Ramayanam-42

శ్రీరామ కథామృతము www.freegurukul.org/g/Ramayanam-43

జీవన చిత్రాలు-రామయణ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-44

రామాయణ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-45

లక్ష్మణుడు www.freegurukul.org/g/Ramayanam-46

లక్ష్మణుడు www.freegurukul.org/g/Ramayanam-47

భరతుడు www.freegurukul.org/g/Ramayanam-48

కళ్యాణ రాముడు www.freegurukul.org/g/Ramayanam-49

కాళిదాసు రామకథ www.freegurukul.org/g/Ramayanam-50

బాలానంద కుశలవుల కథ www.freegurukul.org/g/Ramayanam-51

రావణ రాజ్యము-రామ రాజ్యము www.freegurukul.org/g/Ramayanam-52

రామాయణోపన్యాస మంజరి www.freegurukul.org/g/Ramayanam-53

వాల్మీకి వచన రామాయణము-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-54

వాల్మీకి రామాయణోపన్యాసములు-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-55

రామాయణం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను ప్రతి రోజు పొందుటకు:
Telegram Channel లో join అగుటకు https://t.me/freegurukul
Whatsapp Group లో join అగుటకు www.freegurukul.org/join

మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Website: www.freegurukul.org
Android App: FreeGurukul
iOS App: Gurukul Education

*ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైనట్టే..*- ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల పర్వం- మరింతగా పెరగనున్న పొలిటికల్ హీట్- మ...
17/04/2024

*ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైనట్టే..*

- ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల పర్వం
- మరింతగా పెరగనున్న పొలిటికల్ హీట్
- మొత్తం ఏడు విడతల్లో జరగనున్న ఎన్నికలు
- నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు
- తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్
-

లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.
మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది.
తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది.

మే 13న పోలింగ్ జరుగుతుంది.

ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది.
అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి.
అయితే, బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి ఉంది.

- ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇదే

ఏప్రిల్ 18 - నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 25 - నామినేషన్లకు చివరి తేదీ
ఏప్రిల్ 26 - నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29 - నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
మే 13 - పోలింగ్ జూన్ 4న ఫలితాలు

కర్నూలు*కలెక్టరేట్ లోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సాధారణ ఎన్నికలు 2024  కు సంబంధించిన ఎన్నికల మీడియా సెం...
17/04/2024

కర్నూలు

*కలెక్టరేట్ లోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సాధారణ ఎన్నికలు 2024 కు సంబంధించిన ఎన్నికల మీడియా సెంటర్ ను ప్రారంభించిన అనంతరం నామినేషన్ ప్రక్రియ , ఎన్నికల సంసిద్ధతపై పాత్రికేయులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన.*

*పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు**తగ్గిన ధరలు నేటి నుంచే అమలు*ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేప...
17/04/2024

*పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు*

*తగ్గిన ధరలు నేటి నుంచే అమలు*

ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

అయితే తగ్గిన ధరలు ఈవాళ దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.

*హైదరాబాద్:*
లీటర్ పెట్రోల్ ధర- రూ.107.66
లీటర్ డీజిల్ ధర- రూ.95.82
*విశాఖపట్నం:*
లీటర్ పెట్రోల్ ధర- రూ.108.48
లీటర్ డీజిల్ ధర- రూ.96.82
*విజయవాడ:*
లీటర్ పెట్రోల్ ధర- రూ.109.76
లీటర్ డీజిల్ ధర- రూ.97.51

*రేపు కూటమి అభ్యర్థిగా మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్*
17/04/2024

*రేపు కూటమి అభ్యర్థిగా మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్*

ఏపీఈఏపీ సెట్‌కు 3,54,235 దరఖాస్తులుఏపీఈఏపీ సెట్‌కు మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్‌ ఛైర్మన్‌ జీవీఆర్‌ ప...
17/04/2024

ఏపీఈఏపీ సెట్‌కు 3,54,235 దరఖాస్తులు

ఏపీఈఏపీ సెట్‌కు మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్‌ ఛైర్మన్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు వెల్ల‌డించారు. ఇంజినీరింగ్‌కు 2,68,309 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీకి 84,791 మంది, రెండు విభాగాలకు 1135 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రూ.500 పెనాల్టీతో ఈ నెల 30 వరకు, రూ.1000తో మే 5 వరకు, రూ.5 వేలతో మే 10 వరకు, రూ.10 వేలతో మే 12 వరకు ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు

మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫాంలు అందించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ *
17/04/2024

మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫాంలు అందించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ *

*రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల*తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఏపీలో 25 లోక్సభ, 175 ...
17/04/2024

*రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల*

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది.

ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది.

29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

అదేరోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.

అమరావతి: ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతోన్న 40 మందికి ...
17/04/2024

అమరావతి: ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతోన్న 40 మందికి కోడ్‌ వర్తిస్తుందని తెలిపింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఈసీ గుర్తించింది. కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది....

16/04/2024

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదల
1,016 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ
సివిల్స్‌ ఫలితాల్లో ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంకు
మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్యరెడ్డికి మూడో ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో పి.కె.సిద్దార్థ రామ్‌కుమార్‌కు నాలుగో ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో రుహాణికి ఐదో ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో శ్రిష్టి దబాసకు ఆరో ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో అన్మోల్‌ రాథోడ్‌కు ఏడో ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో ఆశిష్‌ కుమార్‌కు ఎనిమిదో ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో నౌషీన్‌కు తొమ్మిదో ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో ఐశ్వర్యం ప్రజాపతికి పదో ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో నందల సాయికిరణ్‌కు 27వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో మేరుగు కౌశిక్‌కు 22వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో పెంకీసు ధీరజ్‌రెడ్డికి 173వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో జి.అక్షయ్‌ దీపక్‌కు 196వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో గనసేన భానుశ్రీకి 198వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో నిమ్మనపల్లి ప్రదీప్‌రెడ్డికి 382వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో బన్న వెంకటేష్‌కు 467వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో పూల ధనుష్‌కు 480వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో కె.శ్రీనివాసులుకు 526వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో నెల్లూరు సాయితేజకు 558వ ర్యాంకు
వరంగల్‌కు చెందిన సయింపు కిరణ్‌కు 568వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో పి.భార్గవ్‌కు 590వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో కె.అర్పితకు 639వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో ఐశ్వర్య నెల్లి శ్యామలకు 649వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో సాక్షి కుమారికి 679వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో చౌహన్‌ రాజ్‌కుమార్‌కు 703వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో జి.శ్వేతకు 711వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో వి.ధనుంజయకుమార్‌కు 810వ ర్యాంకు
సివిల్స్‌ ఫలితాల్లో లక్ష్మీ బానోతుకు 828వ ర్యాంకు

16/04/2024

*ABP C-VOTER సర్వే: ఏపీలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లంటే?*

ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లపై ఏబీపీ సీ-వోటర్ ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది.

ఎన్డీయే (టీడీపీ+బీజేపీ + జనసేన)కు 20 సీట్లు,

వైసీపీకి 5 సీట్లు వస్తాయని ఆ సర్వే పేర్కొంది.

NDAకు 47%, వైసీపీకి 40%, కాంగ్రెస్ పార్టీకి 2%, ఇతరులకు 11% ఓట్లు వస్తాయని తెలిపింది.

కాగా, ఏపీలో మొత్తం 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయి.

16/04/2024

/ subscribe /YOUTUBE

*నెలాఖరుకు పదోతరగతి ఫలితాలు*👉ఈ నెల 25-30లోపు పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల..👉ఇప్పటికే పూర్తయిన మూల్యాంఖనం..👉25వ తేదీన ఫ...
16/04/2024

*నెలాఖరుకు పదోతరగతి ఫలితాలు*

👉ఈ నెల 25-30లోపు పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల..

👉ఇప్పటికే పూర్తయిన మూల్యాంఖనం..

👉25వ తేదీన ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తున్న అధికారులు..

*ఎన్నికల కోడ్ తేదీ నుండి...పోలీసుల తనిఖీ లలో రోజుకు రూ. 100 కోట్లు పైగా స్వాధీనం.. చరిత్రలో నే రికార్డు దిశగా ఈసీ  రికవర...
15/04/2024

*ఎన్నికల కోడ్ తేదీ నుండి...పోలీసుల తనిఖీ లలో రోజుకు రూ. 100 కోట్లు పైగా స్వాధీనం.. చరిత్రలో నే రికార్డు దిశగా ఈసీ రికవరి చేసిన సొమ్ము మొత్తం రూ.4650 కోట్ల పై మాటే?*

ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ నుంచి మొదలుపెట్టి మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, ఖరీదైన బహుమతుల రూపంలో ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది.

దీన్ని అరికట్టేందుకు ఈసీ ప్రతి రాష్ట్రంలో జనరల్ అబ్జర్వర్లతో పాటు పోలీస్ అబ్జర్వర్లను పెట్టి, ప్రభుత్వ యంత్రాంగంతో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రతిరోజూ దేశంలో అనేక ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నగదు, మద్యం, మాదక ద్రవ్యాల రూపంలో రికవరీ జరుగుతోంది.

మార్చి 1 నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే మొత్తం రూ. 4,650 కోట్ల విలువైన రికవరీ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఇందులో నగదు రూపంలో రూ. 395.39 కోట్లు స్వాధీనం చేసుకోగా,

బంగారం – ఇతర విలువైన లోహాల రూపంలో రూ. 562.10 కోట్లు రికవరీ చేసినట్టు ఈసీ వెల్లడించింది.

అలాగే మద్యం రూపంలో రూ. 489.31 కోట్లు విలువచేసే 3.58 కోట్ల లీటర్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.

గంజాయి నుంచి మొదలుపెట్టి కొకైన్ వరకు వివిధ రూపాల్లో ఉన్న మాదకద్రవ్యాలను కూడా ఈసీ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం జరిగిన రికవరీల్లో రూ. 2,068.85 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

అంటే.. రికవరీల్లో సింహభాగం (45% ) వాటా మాదకద్రవ్యాలదే అని అర్థమవుతోంది.

ఇక టీవీలు, ఫ్రిడ్జిలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో రూ. 1,142.49 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నామని వివరించింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో (2019) మొత్తం కలిపి ఈసీ స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 3,475 కాగా, ఆ రికార్డును ఈసీ ఇప్పటికే అధిగమించి దూసుకెళ్తోంది. జూన్ 1తో ముగియనున్న 7 విడతల ఎన్నికల నాటికి ఈసీ ఇంకా ఎంత మొత్తంలో రికవరీ చేసుకుంటుంది అన్నది ఊహకే అందడం లేదు. సమగ్ర ప్రణాళిక, సంయుక్త కార్యాచరణ, దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాల మధ్య సమన్వయంతో పాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోగల్గుతున్నామని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

రికవరీల్లో రాజస్థాన్, గుజరాత్ టాప్..
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 4,658 కోట్లలో అత్యధికంగా రాజస్థాన్ నుంచి రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకోగా, ఆ తర్వాతి స్థానంలో రూ. 605 కోట్లతో గుజరాత్ ద్వితీయ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లద్దాక్, లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి.

*18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు* ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప...
15/04/2024

*18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు* ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్‌) రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు.

సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.550, ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి.

మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1240 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తమతమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. కాగా, మే 25 నుంచి జూన్‌ 1 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని, ఈ విషయం అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ గుర్తించాలని సౌరభ్‌ గౌర్‌ విజ్ఞప్తి చేశారు.

Address

64/43/L119-A, Lbs Nagar Kurnool
Kurnool

Telephone

+919494556621

Website

Alerts

Be the first to know and let us send you an email when RBK News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RBK News:

Videos

Share


Other News & Media Websites in Kurnool

Show All