03/09/2021
"ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమావేశం"
10 అంశాలపై ప్రధానికి లేఖలు అందజేసిన సీఎం కేసీఆర్*
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది.
దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఇవాళ ప్రధాని మోదీతో దాదాపు 50 నిమిషాల పాటు సమావేశమై..
రాష్ట్రానికి సంబంధించిన 10 అంశాలపై లేఖలు అందజేశారు.
సీఎంఓ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని,
కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ,
హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు.
ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేసి.. అవకాశం ఉన్నమేరకు రాష్ట్రానికి కొత్త ఐపీఎస్‌లను కేటాయించాలని విన్నవించారు.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని,
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు జౌళి పార్కు ఏర్పాటు చేయాలని కోరారు.
హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని,
కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని..
, పీఎంజీఎస్‌వైకు అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖలు అందజేసినట్టు సీఎంఓ వెల్లడించింది.