Godavari Times

Godavari Times లైక్‌ చేయండి పొందండి నిరంతర సమాచారం
(1)

02/12/2023
21/11/2023

మనం సేఫ్

19/11/2023

హామీలే హామీలు!

17/11/2023
17/11/2023

మళ్లీ వందేళ్లు వెనక్కి

17/11/2023

05/11/2023

ఉమ్మడి ఆశయం

31/10/2023

కలిసేనా?

30/10/2023

30/10/2023

తప్పవు కష్టాలు!

30/10/2023

రైలు ప్రమాదం

17/06/2023

ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ లాబుస్‌చాగ్నే తొలిసారి గోల్డెన్ డక్‌కి ఔటయ్యాడు

టెస్టు బ్యాటర్‌లో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లాబుస్‌చాగ్నే టెస్టుల్లో తొలిసారి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మొదటి యాషెస్ 2023 టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో లాబుస్‌చాగ్నేను స్టువర్ట్ బ్రాడ్ అవుట్ చేశాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌లో లాబుస్‌చాగ్నే డకౌట్ కావడం ఇది నాలుగోసారి.

27/12/2022

డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ.. ఆసీస్ ఓపెనర్ అరుదైన రికార్డ్.. సఫారీలపై భారీ ఆధిక్యం.... మెల్‌బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం వేసవి కావడంతో.. ఎండ వేడిమితోపాటు, కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడిన వార్నర్.. ద్విశతకం నమోదు చేసిన అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దాదాపు మూడేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ చేసిన ఆసీస్ ఓపెనర్ దాన్ని డబుల్ సెంచరీగా మలవడం గమనార్హం. ఈ క్రమంలోనే టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని వార్నర్ అందుకున్నాడు.

14/01/2022
06/01/2022

మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 26 వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో శర వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడాపెరుగుతుంది.
కరోనా విరుచుకుపడుతుంది. మొన్నటి వరకూ వందల్లో కేసులు నమోదు కాగా ఇప్పుడు వేలాది సంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 26,538 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 15,166 కేసులు ముంబైకి చెందినవి. రాష్ట్రంలో 797 ఒమిక్రాన్ కేసులు ఉండగా 330 మంది కోలుకున్నారు. ఇక ఢిల్లీలో కొత్తగా 10,665 కేసులు నమోదయ్యాయి. అక్కడ పాజిటివిటీ రేటు 11.88 శాతంగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 14,022 మంది వైరస్ బారినపడ్డారు. అందులో17 మంది చనిపోయారు. కేరళలో 4,801 కోవిడ్ కేసులు, కర్ణాటకలో కొత్తగా 4246 కేసులు రిజిస్టర్ అయ్యాయి. బెంగళూరులో 3605, బీహార్‌లో 1659 కేసులు బయటపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కొత్తగా 374 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గుజరాత్లో కొత్తగా 3,350 మందికి కరోనా నిర్థారణ అయింది. వారిలో 50 మంది ఒమిక్రాన్ సోకినవారు ఉన్నారు.

06/01/2022

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పాటూ ప్రధానితో పాటూ కేంద్రమంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల్ని ప్రస్తావించారు. సీఎం హస్తిన నుంచి వచ్చిన రెండు రోజులకే డబ్బులు విడుదలయ్యాయి.
ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.320 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను 2021–22 బడ్జెట్‌లో కేంద్ర జల్‌ శక్తి శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి విడుదల చేయాలని ఆదేశించారు. గురువారం పీపీఏ ఖాతాలో చేరతాయి. శుక్రవారం రాష్ట్ర ఖజానాలో జమకానున్నాయి.

27/11/2021

చర్చిలకు ఎంపీల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక ఏదీ?: కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చర్చిలకు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరోసారి ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ రమ్య ఏపీ సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ పంపారు. ఎంపీలకు ఏటా ఇచ్చే నిధుల్లో రూ.40లక్షలకు పైగా నిధుల్ని ఎంపీ నందిగామ సురేశ్‌ చర్చిలకు వినియోగించినట్టుగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రెండు నెలల క్రితం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు పీఎంవోకు లేఖ రాశారు.

ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన ఈ నిధుల్ని నిధుల్ని మత సంబంధ కార్యక్రమాలకు, మతపరమైన భవనాల నిర్మాణాలకు ఖర్చుచేస్తున్నట్టుగా వచ్చిన కథనాలను ఆయన పీఎంవోకు నివేదించారు. దీంతో పాటు రాష్ట్రంలో మతమార్పిడులకు కూడా ఈ నిధులు వినియోగిస్తున్నట్టు ఆయన లేఖ రాశారు. ఈ లేఖపై రెండు నెలల క్రితమే నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించినా.. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక పంపాలని తాజాగా కేంద్రం లేఖ రాసింది. ఇప్పటికే నివేదిక కోరినా పంపించలేదని, అందుకే మరోసారి గుర్తు చేస్తున్నట్టు పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి నివేదిక పంపాలని లేఖలో డైరెక్టర్‌ రమ్య కోరారు.

Address

Kakinada

Website

Alerts

Be the first to know and let us send you an email when Godavari Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Media/News Companies in Kakinada

Show All