29/02/2024
❤️శ్రోతల కోరిక మేరకు_ "పంచతంత్ర కథలు"_పునః ప్రసారం చేస్తుంది మీ ఆకాశవాణి కడప కేంద్రం❤️
ఒక మంచి పుస్తకం జీవితానికి ప్రేరణగా నిలుస్తుంది. వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుతుంది. మనలో మనం మంచి,చెడులను గురించి తర్కించుకునెలా చేస్తుంది. అందుకే మనిషి జీవితంలో సాహిత్యానికి ఎప్పుడూ గొప్ప స్థానం ఉంటుంది. లోకంలో మన చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల అవగాహన పొందాలన్నా.. లౌక్యాన్ని పెంచుకోవాలన్నా.. వికాసాన్ని పెంపొందించు కోవాలన్నా ..నీతి గ్రంథాల పఠనం అత్యంత ఆవశ్యకం. అందుకే చిన్నప్పుడు మన స్కూళ్లలో *Moral Science* పేరుతో నీతి శాస్త్ర అధ్యయనాన్ని తప్పనిసరి చేశారు.
తెలియని విషయాన్ని పెద్దలకు శాస్త్రంగా బోధించవచ్చు. కానీ పిల్లలకు అలా కాదు. వారికి ఏ విషయమూ అంత వేగంగా అర్థం అయ్యే అవకాశం లేదు. అందుకే మన పూర్వకాలంలో గురువులు అందుకు ఏకైక మార్గంగా "కథలు చెప్పడాన్ని" ఎంచుకున్నారు.ఇటీవల పిల్లలు పెద్దలు తేడా లేకుండా అన్ని వయసుల వారు ఆసక్తి కనబరచేవి ఈ పంచతంత్ర కథలు .....
❤️మీకు నచ్చిన... మీరు మెచ్చిన కథలు... మళ్ళీ మీ ముందు తెస్తుంది మీ ఆకాశవాణి కడప కేంద్రం❤️