Rayachoti News

Rayachoti News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rayachoti News, Media/News Company, Rayachoty, Kadapa.

వడ్డీ డబ్బులు మాత్రమే కట్టించుకుని  పంట రుణాలను రెన్యువల్ చేసుకునేలా చూడాలి...  కలెక్టర్ ను కోరిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డ...
21/04/2022

వడ్డీ డబ్బులు మాత్రమే కట్టించుకుని పంట రుణాలను రెన్యువల్ చేసుకునేలా చూడాలి...

కలెక్టర్ ను కోరిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి.

పంటల సాగుకోసం రైతులు బ్యాంకుల యందు తీసుకున్న రుణాల రెన్యువల్ లలో వడ్డీ డబ్బులు మాత్రమే కట్టించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గిరీషాను ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి కోరారు.బ్యాంకుల యందు పంట రుణాల రెన్యువల్స్ పై కలెక్టర్ తో శ్రీకాంత్ రెడ్డి ఫోన్లో చర్చించారు. కొన్ని ఆంధ్రపగతి గ్రామీణ బ్యాంక్ కొన్ని శాఖలు మరియు ఇతర బ్యాంకులు పంట రుణాల రెన్యువల్స్ లలో అసలు మరియు వడ్డీ డబ్బులు తీసుకుంటుండడం వల్ల రైతులు కష్ట, నష్టాలను ఎదుర్కొంటున్నారని, అసలు డబ్బు కోసం దళారుల దగ్గర రూ 5, రూ 10 వడ్డీలు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు.రైతుల ఇబ్బందుల దృష్ట్యా రైతుల దగ్గర వడ్డీలు మాత్రమే తీసుకుని వ్యవసాయ రుణాలును రెన్యువల్ చేసేలా చూడాలని కోరగా ఇందుకు స్పందించిన కలెక్టర్ గిరీష బ్యాంకు అధికారులుతో మాట్లాడి వడ్డీ డబ్బులుతోనే పంట రుణాలను రెన్యువల్ చేసుకునేలా తక్షణమే ఆదేశాలు ఇస్తామన్నారు.బ్యాంకు అధికారులు కూడా వడ్డీ డబ్బులుతోనే పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కోరారు.

02/11/2021

బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘనవిజయం.

వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందేలా చర్యలు చేపట్టండి...వ్యవసాయ అధికారులుకు సూచించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.   ...
02/11/2021

వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందేలా చర్యలు చేపట్టండి...

వ్యవసాయ అధికారులుకు సూచించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
అధిక వర్షాలతో నియోజక వర్గంలో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులును చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత వర్షాల వల్ల నియోజక వర్గ పరిధిలో వరి పంట దెబ్బతినిందన్నారు.అధిక వర్షాలుతో పంట నష్టం జరిగిందన్నారు. అధిక వర్షాల వల్ల పంటలకు అధికంగా రోగాలు సోకి కూడా పంటలు దెబ్బతిన్నాయన్నారు.వర్షంతో దెబ్బతిన్న పంటలను, రోగాలు తో దెబ్బతిన్న పంటలుపై ప్రతి గ్రామంలోనూ జరిగిన పంటనష్టాలను వ్యవసాయ శాఖ సిబ్బంది,ఏ ఓ లు,డివిజన్ పరిధిలో ఏ డి లు క్షేత్ర పర్యటనలు చేసి పంట నష్టాలను నమోదు చేసి నివేదికలను ఉన్నతాధికారులుకు సమర్పించాలని ఆదేశించారు.ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ తో కూడా మాట్లాడడం జరిగిందన్నారు.నష్టపోయిన రైతుకు ఇన్ ఫుట్ సబ్సిడీ పంటకు ఇన్సూరెన్స్ అందేలా చర్యలు చేపట్టి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన సూచించారు. అదేరకంగా చెరువులు, కుంటలు, వాగుల దగ్గరికి పిల్లలు, వృద్ధులు వెళ్లకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఈ వారంలో కార్తీక మాసం రాబోతున్నందున వ్యవసాయ అధికారులును రైతులు సంప్రదించి అదును ప్రకారం పెట్టుకోవాలని ఆయన కోరారు.రైతులకు సంబంధించి ఏ విషయంలోనైనా కూడా పూర్తిగా రైతుకు వెన్నంటి ఉంటామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

03/10/2021

నీ డ్రామాలు పనికిరావు MP Mithun Reddy Fires On Pawan kalyan | Janasena TDP Alliance | Sakshi TV

రాయచోటి మున్సిపల్ పరిధిలో 4 వ వార్డు డా"దాదాసాహెబ్ వీధిలో వర్షం పడినప్పుడు వర్షపు నీరు నిలబడి ప్రజలు ఇబ్బంది పడుతుండడం త...
30/09/2021

రాయచోటి మున్సిపల్ పరిధిలో 4 వ వార్డు డా"దాదాసాహెబ్ వీధిలో వర్షం పడినప్పుడు వర్షపు నీరు నిలబడి ప్రజలు ఇబ్బంది పడుతుండడం తో కల్వర్టు ఏర్పాటు కు పరిశీలన చేసిన మున్సిపల్ కమీషనర్ (FAC)గారు, AE , రెవెన్యూ ఇన్స్పెక్టర్ సచివాలయ సిబ్బంది.

30/09/2021

*స్కూటరిస్టుని కాపాడిన కానిస్టేబుల్ నరేంద్ర....*

రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా కడప జిల్లా రాయచోటి పట్టణ శివారు ప్రాంతంలోని ఇనాథ్ ఖాన్ చెరువు అలుగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఈ క్రమంలో పట్టణ సిఐ రాజు ముందస్తు చర్యలు లో భాగంగా అక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో ఒక స్కూటరిస్తూ రోడ్డు దాటుతుండగా ప్రమాదం శాత్తు క్రింద పడిపోవడం జరిగింది.ఇది గమనించిన కానిస్టేబుల్ నరేంద్ర అప్రమత్తమై స్థానికుల సహాయం తీసుకొని అతనిని కాపాడడం జరిగింది.కానిస్టేబుల్ నరేంద్ర అప్రమత్తమై కాపడక పొయ్యి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పలువురు చర్చించుకొంటున్నారు.స్కూటరిస్టును కాపాడిన కానిస్టేబుల్ నరేంద్రను పలువురు అభినందనలు తెలుపరు.

*త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవచూపాలి...**మున్సిపల్ సాధారణ సర్వసభ్య  సమావేశంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి...
24/09/2021

*త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవచూపాలి...*

*మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.*
మున్సిపాలిటీలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా కౌన్సిలర్లు, అధికారులు చూడాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎం ఎల్ సి జకీయా ఖానం , మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్ లతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణానికి రోజుకు 80 లక్షల లీటర్ల నీటిని పంప్ చేయడం జరుగుతోందన్నారు.అధికారులు ,సిబ్బంది సమన్వయం లేకపోవడం వల్లనే త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వార్డుల వారీగా ఆయన త్రాగునీటి సమస్యలసై ఆరా తీశారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. రూ 20 లక్షలు ను నెలకు విద్యుత్ బిల్లులకు వ్యయం చేయడం జరుగుతోందన్నారు. 84 మంది సిబ్బంది త్రాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్నారని ఏ ఈ కృష్ణారెడ్డి తెలిపారు.సిబ్బంది వున్నా సక్రమంగా వినియోగించుకోవడం లేదని చీఫ్ విప్ తెలిపారు.కౌన్సిలర్లు కూడా త్రాగునీటి సమస్యలు, వాటి పరిష్కారాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. రైతు బజార్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు. వీరభద్ర స్వామి ఆలయ సమీపంలోని కూరగాయల మార్కెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. రహదారిపై వ్యాపారాలు జరగకుండా చూసి ఆలయానికి వచ్చే భక్తులకు, పాఠశాల విద్యార్థులుకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

*కడప జిల్లా.......* *సోషియల్ మీడియా కథనానికి స్పందించి,వికలాంగ వృద్ధురాలిని  నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించిన పట్టణ సిఐ...
23/09/2021

*కడప జిల్లా.......*

*సోషియల్ మీడియా కథనానికి స్పందించి,వికలాంగ వృద్ధురాలిని నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించిన పట్టణ సిఐ రాజు,మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున....*

రాయచోటి పట్టణం మాసాపేట మార్కెట్ యార్డు నందు అనాధగా ఉన్న సుబ్బమ్మ అనే వృద్ధురాలును నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించిన పట్టణ సిఐ రాజు,మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున......

సుబ్బమ్మ అనే వృద్ధురాలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉండగా, ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో సుబ్బమ్మ కూతురు పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్ళడం తో ఆ వృద్ధురాలకు మార్కెట్ యార్డే దిక్కయ్యింది....

గతంలో బాడుగ ఇంట్లో నివాసం ఉండగా వైకల్యం, వృధ్యాప్యం దృష్ట్యా ఇల్లు ఖాళీ చేయించిన యజమానులు....

అధికారులు, వెంటనే స్పందించడం పట్ల అధికారులను అభినందిస్తున్న పట్టణ ప్రజలు....

అభివృద్ధి, సంక్షేమం జగన్ ప్రభుత్వానికి రెండు కళ్లు...* ముఖ్యమంత్రి జగన్ ఆలోచనా విధానాలకను గుణంగా జిల్లా అభివృద్ధికి పాటు...
23/09/2021

అభివృద్ధి, సంక్షేమం జగన్ ప్రభుత్వానికి రెండు కళ్లు...*

ముఖ్యమంత్రి జగన్ ఆలోచనా విధానాలకను గుణంగా జిల్లా అభివృద్ధికి పాటుపడదాం...*

కడప కలెక్టరేట్ సభా భవనం నందు వైస్సార్ జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా , రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ,ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి లు.

సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం ఆలోచన, ప్రభుత్వ ఉద్దేశాలను అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిగించుకొని వాటిని ఏవిధంగా పరిష్కరిస్తే ప్రజలకు మేలు చేయ గలుగుతాం.. అన్న విధానంలో ముందుకు వెళ్లాలని, కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాల్సి ఉందన్నారు. కడప జిల్లా గుండె చప్పుడుగా పరిగణించే గండికోట ప్రాజెక్టు.. ఈ రోజు జలకళ సంతరించుకుందంటే.. అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారి కృషి పట్టుదల ఫలితమే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కల.. నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాకారం అయిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ శాశ్విత కరువు నివారణ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయ రామరాజు, ఎం ఎల్ సి లు జకీయా ఖానం, శివనాధ రెడ్డి,మేయర్ సురేష్ బాబు, కమలాపురం, మైదుకూరు, రాజంపేట, జమ్మలమడుగు శాసన సభ్యులు రవీంద్రనాధ రెడ్డి,రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, డా సుధీర్ రెడ్డి,జె సి లు గౌతమి(రెవెన్యూ), సాయికాంత్ వర్మ (అభివృద్ది), ధ్యాన్ చంద్ర (హౌసింగ్), ధర్మచంద్రారెడ్డి (సంక్షేమం), డి ఆర్వో మలోలా , అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

రాయచోటి అభివృద్ధికి మరో ముందడుగు...క్యాబినెట్ సమావేశంలో రాయచోటికి పిజి కేంద్ర నిర్మాణం కోసం 54 ఎకరాల భూమి కేటాయింపు..  వ...
17/09/2021

రాయచోటి అభివృద్ధికి మరో ముందడుగు...

క్యాబినెట్ సమావేశంలో రాయచోటికి పిజి కేంద్ర నిర్మాణం కోసం 54 ఎకరాల భూమి కేటాయింపు..

వీరభద్ర స్వామి ఆలయ మాడ వీధుల ఏర్పాటుకు అక్కడున్న వారి ప్రయివేట్ స్థలాలకు బదులుగా స్థలాల కేటాయింపుల ఆమోదంపై హర్షం...

రాయచోటి అభివృద్ధిలో అనునిత్యం పాలుపంచు కుంటున్న సీఎం జగన్ ,ఎంపి మిథున్ లకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు.

పిజి కేంద్రానికి భూ కేటాయింపులుతో రాయచోటి అభివృద్ధికి మరో ముందడుగు పడిందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటిలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాయచోటికి పిజి కేంద్రం, వీరభద్ర స్వామి ఆలయ మాడ వీధుల ఏర్పాటుకు అక్కడున్న వారికి ప్రయివేట్ స్థలాలకు బదులుగా మరో చోట స్థలాలను కేటాయింపులకు ఆమోదం తెలపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.పిజి కేంద్రం నిర్మాణంకోసం 54 ఎకరాలు యోగివేమన యూనివర్సిటీకి కేటాయించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్, ఎంపి మిథున్ లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి క్యాబినెట్ సమావేశంలోనూ రాయచోటి నియోజక వర్గానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుండడంపై ప్రజల తరపున ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుచున్నా మన్నారు.ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి డిఎస్పీ కార్యాలయం,ట్రాఫిక్ పోలీసు స్టేషన్, పి జి సెంటర్ కు భూ కేటాయింపు, టి టి డి కళ్యాణమండపం తదితర ఎన్నో అభివృద్ధి,ఉపయోగకరమైన పనులు రావడం జరిగిందన్నారు.పి జి కేంద్రానికి సంబంధించి త్వరలో యోగివేమన యూనివర్సిటీ అధికారులుతో సమావేశం నిర్వహించి ఏరకమైన కోర్సులు మరియు అమలు సంబంధించిన చర్యలుపై చర్చిస్తామన్నారు.పిజి కేంద్రాన్ని భవిష్యత్తులో యూనివర్సిటీగా అభివృద్ధి చేసితీరుతామని ఆయన స్పష్టం చేశారు.రాయచోటిలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు కోసం ఎంపిమిథున్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.రాయచోటిని విద్యాలయాలకు నిలయంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Address

Rayachoty
Kadapa

Website

Alerts

Be the first to know and let us send you an email when Rayachoti News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share