ఏదో ముదిరి ఏదో అయ్యిందంటే ఇదే...
----------------------------------------------------
(అన్నమాచార్య మాటున కబ్జా కతలు Part - 12)
" కొనేది వంకాయ.. కోసేది గుమ్మడికాయ " అన్న చందాన 20 ఎకరాలు కొని 60 ఎకరాలు ఆక్రమించినోళ్లు ఏదో ఒక అక్రమంపై ప్రశ్నిస్తే, అది కూడా అన్నమాచార్య పార్కు స్థలాన్ని 22ఏలో నుంచి ఎందుకు తీయాల్సి వచ్చిందని అడిగినోడిపై క్రిమినల్ కేసులు పెడతారంట. పోలీస్ స్టేషన్లు ఏమైనా రెవెన్యూ, పంచాయతీ, ఏపీఐఐసీ కార్యాలయాలు అనుకున్నారా... మీ ఇష్టమొచ్చిన పేపర్లు పెట్టడానికి, చించి పడేయడానికీ... అక్కడ ప్రతిదీ సెక్షన్ల ప్రకారం జరగాలి. అసలు మీకు పోలీసులే సరైన మొగుళ్లు. ఆ విషయం ఎవరికి తెలిసినా, తెలియకున్నా నాకు చాలా బాగా తెలుసు. మీరు అక్కడికి రావడమే నాకూ కావాలి.
నేను కొన్ని విషయాలు చెబుతాను. వాటికి సమాధానాలు సిద్ధం చేసుకుని పెట్టుకోండి. మీరు పోలీసుల దగ్గరికి పోయినా, పోలీసులు మీ దగ్గరకొచ్
*ఒక 50 రూపాయలు పెట్టి కిలో కాకర కాయలు కొను. ఒక కిలో వేపాకు తెచ్చుకో. రెండింటిని కలిపి చట్నీ లాగా చెయ్యి. పై వీడియోలో చూపినట్లు ఒక పెద్ద పళ్ళెం లో పోసి, ఆ పళ్ళెంలో రెండు కాళ్ళు పెట్టి అడుసు తొక్కినట్లు ఒక 20 నిమిషాలు తొక్కు. కాళ్ళు ఆ చేదుని పీల్చుకుని శరీరంలో రక్తం ద్వారా పైకి జరుగుతూ వచ్చి నాలుక మీద రుచి కూడా చేదుగా మారుతుంది. ఒక మూడు నాలుగు రోజులు చేస్తే రక్త శుద్ధి, చక్కెర వ్యాధి, రక్త పోటు, కిడ్నీ ఇన్ఫెక్షన్ కి ఇది చక్కగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పబడింది. షుగర్ వ్యాధి బిళ్ళలు, ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకొనే అవసరం లేదు అని చెప్పబడినది. ట్ర్య్ చేస్తే పొయ్యేదేముంది షుగర్ వ్యాధి తప్ప. ఒక రూ.300 ఖర్చు. అంటే ఒక స్పెషల్ బిర్యానీ అంత ఖర్చే.
ప్రజా చైతన్యమా, సబ్ రిజిస్ట్రార్ల "నైపుణ్యమా"?
ప్రజా చైతన్యమా, సబ్ రిజిస్ట్రార్ల "నైపుణ్యమా"?
--------------------------------------------------------------
1950 జులై 18 మంగళవారం. నెల శూన్యమాసం. పైగా మాంచి వర్షాకాలం. అప్పట్లో రోడ్డు, రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు. అయినప్పటికీ ఆ రోజు వైఎస్సార్ కడప జిల్లా పుల్లంపేట రిజిస్ట్రార్ ఆఫీసులో ఏకంగా 17 రిజిస్టర్లు జరిగాయి. ఇవన్నీ మూడు రికార్డుల్లో రాసి ఉన్నారు. మొత్తంగా ఆ ఏడాదికి సంబంధించి ఈ మూడు రికార్డులూ ఎత్తి రాయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా చాలా రికార్డులు మొత్తంగా ఎత్తి రాసి అక్రమంగా ఆస్తులు కొల్లగొట్టారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చిత్తశుద్దిగా దృష్టి సారిస్తే 2005కన్నా ముందు రాష్ట్రంలో జరిగిన అత్యంత నికృష్టమైన మరో కుంభకోణాన్ని వెలికితీయవచ్చు.