30/12/2020
కోరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను తమ తమ ఇండ్లలోనే జరుపుకోవాలని, ఉరేగింపులు, ర్యాలీలు, గుంపులు గుంపులుగా గుమిగూడడం, వాహనాలపై తిరగడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని. కరోనా కట్టడికి ప్రభుత్వం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని, హోటళ్లు, అపార్ట్మెంట్లు, కాలనీల ప్రధాన రోడ్లతో సహ అన్ని ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు లేవని. ముఖ్యంగా వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు, ఇందుకోసం టికెట్లను విక్రయించడం లాంటివాటికి ఎలాంటి అనుమతులు లేవని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ప్రజల భద్రత దృష్యా డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించబడుతుందని. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులను కట్టడి చేసేందంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఇందుకోసం వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మొబైల్ పోలీస్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ విభాగాలతో వందకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలతో తనిఖీలు నిర్వహించడంతో పాటు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకుగాను అన్ని ప్రధాన రోడ్డు మార్గాల్లో రోడ్లపై బారీకేడ్లను ఏర్పాటు చేయబడుతాయని.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడిపినట్లుగా గుర్తించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనదారులను కోర్టులో హజర్ పర్చడం ద్వారా వాహనదారుడికి జరిమానా లేదా జైలు శిక్షను విధించడంతో పాటు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మీ ప్రాణ రక్షణతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం వుంది కాబట్టి వాహనంను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ద్విచక్ర వాహనాలపై ఇద్దరుకు మించి ఎక్కువ మంది ప్రయాణించడంతో పాటు రోడ్లపై కాలినడకన, వాహనాలపై వెళ్ళేవారిని ఇబ్బందులకు గురిచేసే విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై పోలీస్ చర్యలు తప్పవని, మధ్యం విక్రయ కేంద్రాలు నిర్ణీత సమయం దాటిన అనంతరం ఎవరుకూడ అమ్మకాలు నిర్వహించవద్దని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.