24/12/2024
తెలంగాణా ఒక విఫల ప్రయోగం కావాలన్నది తెలంగాణా వ్యతిరేకుల స్వప్నం
అదే నిజమని జనాన్ని బ్రమింపజేసేలా దరిద్రపు ఆలోచనలతో తెలంగాణను ఫేల్యూర్ స్టేట్ అని చెప్పేలా రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నై
2014 లో తెలంగాణా ఏర్పాటు, తెలంగాణా రాష్ట్రమే ఏకైక ఎజెండాగా పనిచేసిన టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక్కడ సెటిలైన వారిలోనే కాకుండా, తెలంగాణా వస్తే మన వ్యాపారాలు దెబ్బతింటాయి ఏమో అనే అపోహలున్న తెలంగాణా చిన్న పెద్ద వ్యాపార వెత్తల్లో కూడా ఒక రకమైన బయం ఉండేది.
ఉద్యమకాలం లో ఉద్యమం కోసం, తెలంగాణా సాధన కోసం మాట్లాడిన మాటలు దాన్ని వక్రీకరించి చేసిన అతి ప్రచారాలు ఈ బయాలకు కారణం, ఉదాహరణకు భూమూలు లాక్కుంటారు, ఇక్కడినుండి వెలగొడతారు, బిజినెస్సుల్లో వాటలడుగుతారు, స్టుడియోలు పడగొడతారు అని ప్రత్యర్థులు చేసిన విషప్రచారాలు చాలామందిలో భయాన్ని నెలకొల్పాయి.
ఆ బయం పోగొట్టేందుకు, ఎలక్షన్ ఎజెండా ప్రకటించేందుకు ముందే కెసిఆర్ TRS ని ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించి తెలంగాణా పునర్నిర్మాణమే మా ఎజెండా అని ఎన్నికలకు వెళ్ళాడు.
కానీ ప్రజల్లో నెలకొని ఉన్న అపోహలు, ప్రత్యర్థులు ఉద్యమ నేపథ్యం పై టిఆర్ఎస్ నాయకత్వం పై చేసిన దుష్ప్రచారం ప్రజల్ని మరింత భయపెట్టి GHMC పరిధిలో TDP+BJP (TDP-10, 5 BJP - 5) అత్యదిక సీట్లు గెలిచేలా చేసింది. TRS గెలిచింది కేవలం 4 సీట్లే మేడ్చల్ , మల్కాజిగిరి, సికింద్రాబాద్ & పటాన్చెరు మాత్రమే.
అంతకు ముందు ఉద్యమం చూసిన ప్రజల్లో బయం, పరిశ్రమల అధినేతల అపోహలు, మీడియా హౌజ్ల విషప్రచారాలు పటాపంచలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ సాగిన కెసిఆర్ పరిపాలనలో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది మీ రాష్ట్రం, ఇక్కడ మీరు మేం, అందరం సమానమే, అందరం రాష్ట్రాభివృద్దికి చోదకులం అనే భరోసాతో కూడిన బాధ్యతను కల్పించడంలో కెసిఆర్ సూపర్ సక్సెస్ అయ్యారు. అదే కాకుండా బయటనుండి పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టొచ్చు వీల్లకు లాంగ్ విజన్ డెవలప్మెంట్ ఎజెండాస్ ఉన్నాయని ప్రూవ్ చేశారు.
ఇంత శ్రమ ఫలితమే అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2 ఏండ్లలో GHMC లో 99 సీట్లు సాధించడం.
తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పై ఉమ్మడి రాజధాని కత్తి వేలాడుతున్నా, సెక్షన్ 8 అని ప్రతిపక్షాలు కాలు దువ్వుతున్నా, కేంద్ర ప్రభుత్వం వయా గవర్నర్ రాజకీయ ఆటలాడినా స్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతూ, లా అండ్ ఆర్డర్ సమర్థవంతంగా నడుపుతూ ప్రజల విశ్వాసాన్ని గడిస్తూ ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ తెలంగాణాను దేశంలో అభివృద్ధికి దిక్సూచిగా మార్చింది కేసిఆర్ ప్రభుత్వం.
తెలంగాణా పై శీతకన్ను చూపే కేంద్ర ప్రభుత్వమే పలుసార్లు పార్లమెంట్ వేదికగా తెలంగాణా అభివృద్ధిని పొగిడాల్సిన అవసరం కలిపించింది అభివృద్ది డేటా, అత్యదిక కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం మరో గీటురాయి.
ఇట్లా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న రాష్ట్రాన్ని,
హ్యాపెనింగ్ హైదరాబాద్ అంటూ దేశం మొత్తం పొగుడుతున్న రాష్ట్రాన్ని , బిజెపి కుయుక్తులతో కాంగ్రెస్ కుమ్మక్కుతో, అసత్య దుర్మార్గ ప్రచారాల మీద గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతగాక చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణాను ఒక విఫలంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడనే అనుమానం రోజు రోజుకు బలపడుతోంది.
ప్రభుత్వం ఏర్పడిన రోజు మైదలైన విద్వంసం ఇంకా సాగుతూనే ఉంది
సియం అధికారిక నివాసం అయిన ప్రగతీభవన్ ముందున్న సెక్యురిటీ కంచెను తొలిగిస్తూ చేసిన ప్రచారంతో మొదలైంది విద్వంసం, నిజానికి అది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసింది సియం సెక్యురిటీ కోసం, ఇవ్వాళ ఆ ఇంట్లో రేవంత్ రెడ్డి ఉండట్లేడెందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నివాసం ఉన్న చోట 2 కిలొమీటర్ల పరిథిలో విపరీత ఆంక్షలు ఉన్నాయని కంచెలు బారీకేడ్లు ఉన్నాయని సిగ్నల్ టీవీ శివారెడ్డి వీడియోలతో సహా చెప్తున్నాడు.
ఒక సెక్యురిటీ కంచెను తొలగిస్తూ చేసిన ప్రజల సొమ్ము నాశనం చేస్తూ మొదలైన విద్వంస పాలన
హైడ్రా పేరిట పేదలను భయభ్రాంతులను చేస్తూ ఇండ్లు కూలగొడుతూ 2 ఆత్మహత్యలకు దారి తీసింది.
మూసీ పేరీట అన్ని అనుమతులున్నవారిని కబ్జాదారులు గా ఏడిపించింది.
రైతులకు పంటసహాయం ఎగ్గొట్టి, పంటకొనుగోల్లు ఆలస్యం చేసి రైతులగోసపుచ్చుకుని
అసంఘటిత రంగ కార్మికుల పొట్ట కొడుతూ ముందుచూపు లేకుండా ఉపాధిపై నీలి నీడలు కుమ్మి ఆత్మహత్యలవైపు పురికొల్పింది. అందులో ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, రైతులు ఉన్నారు.
గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలతో, విధ్యార్ధుల మరణాలతో , తల్లిదండ్రుల బయాందోళనతో గురుకుల పాఠశాలు నిర్వీర్యం దిశగా సాగుతోంది కాంగ్రెస్ పాలన
రాజకీయ హత్యలతో (శ్రీధర్ రెడ్డి ,గురువా రెడ్డి,సాయిరెడ్డి ), కక్షపూరిత రాజకీయ దాడులతో , సోషల్ మిడియా కేసులతో పూర్తిగా భయాందోళన రాజకీయ వాతావరణం కలుషితం చేసేలా సాగుతోంది కాంగ్రెస పాలన
ఆరు గ్యారెంటీలు అటకెక్కించి, రాష్ట్ర అప్పుల పై దుష్ప్రచారం చేస్తూ, రాష్ట్రాన్ని ఒక దివాలా తీసిన రాష్ట్రంగా చిత్రీకరిస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే భాగూండే అనేలా దుష్ప్రచారాలు చేస్తూ రాష్ట్రంపై బురద జల్లే లా సాగుతుంది కాంగ్రెస్ పాలన
ఉద్యమ ప్రతీకలను అవమానిస్తు, తెలంగాణా సంస్కృతిని కించపరుస్తూ బతుకమ్మను తీసేసి , అశ్లీల పాటలకు ప్రభుత్వ వేదికలిచ్చి, తెలంగాణ అస్థిత్వాలను అసహజంగా మార్చేస్తూ, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలుపై దాడి చేస్తూ తెలంగాణాను అవమానించేలా సాగుతుంది కాంగ్రెస్ పాలన
తెలంగాణా నీటి వనరులపై హక్కులను కేంద్రానికప్పగిస్తూ, గోదావరిలో , కృష్ణాలో ప్రాజెక్టులపై కుట్ర కోణంతో అనుమతులు రద్దైయ్యేలా నివేదికలిస్తూ తమాషా చూస్తూ తెలంగాణా గొంతెండబెట్టేలా సాగుతుంది కాంగ్రెస్ పాలన
తాజాగా సినీ ఇండస్ట్రీ పై కోర్టులో తేవాల్సిన , న్యాయపరమైన అంశాన్ని రాజకీయం చేస్తూ రోజు కొక కృత్రిమ వివాదంతో జాతియస్థాయిలో తెలంగాణాకూ ఏమైంది ఎందుకీ పిచ్చి వైఖరి అనేలా సాగూతుంది కాంగ్రెస్ పాలన
చూస్తుంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణా వ్యతిరేక ఆంద్రా నాయకులు,జాతియ నాయకుల మాటల నిజం చేయాలన్న దృడసంకల్పంతో కాంగ్రెస్ పార్టీ & చంద్రబాబు శిష్యుడు తెలంగాణా నాశనానికి విపరీతంగా కష్టనడుతున్నట్లు కనిపిస్తోంది కాంగ్రెస్ పాలన
గత పదేళ్ళుగా ఒక్కోరంగాన్ని ఎలా బలోపేతం చేసుకున్నమమో గత సంవత్సరకాలంగా ఒక్కో రంగాన్ని అలా విద్వంసం చేస్తూ సాగుతుంది రేవంత్ రెడ్డి పాలన
అసత్యాలు, దుష్ప్రచారాలు నమ్మిన ప్రజలేంకోల్పోతున్నారో ఒక్కొక్క వర్గానికి అర్థమైతుంది, వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటారో ఏమో కానీ ఈలోపు అభివృద్ది పథంలో ముందుకు పోవాల్సిన రాష్ట్రం ఈ విద్వంసకారుల చేతుల్లో ఏమైపోతదో?