Kondamadugula Sudhakar Reddy

Kondamadugula  Sudhakar Reddy Entrepreneur

03/02/2025

తాడేపల్లి శ్రీ ఫార్చూన్‌ గ్రాండ్‌ హోటల్‌ ఎమ్.డి, వైఎస్సార్సీపీ నేత కొండా సూర్య ప్రతాప్‌ రెడ్డి వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్

తాడేపల్లి శ్రీ ఫార్చూన్‌ గ్రాండ్‌ హోటల్‌ ఎమ్.డి, వైఎస్సార్సీపీ నేత కొండా సూర్య ప్రతాప్‌ రెడ్డి వివాహ వేడుకకు హాజరైన మాజీ...
03/02/2025

తాడేపల్లి శ్రీ ఫార్చూన్‌ గ్రాండ్‌ హోటల్‌ ఎమ్.డి, వైఎస్సార్సీపీ నేత కొండా సూర్య ప్రతాప్‌ రెడ్డి వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌

కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు పరిమళ రెడ్డి, కొండా సూర్య ప్రతాప్‌ రెడ్డి దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్‌ జగన్

17/01/2025

Congratulations dear! Not only have you graduated from a prestigious institute such as King’s College London, but you have made us proud passing with distinction! God bless you dear!

ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..
14/01/2025

ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..

13/01/2025
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ పులివెందుల పర్యటనవైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్య...
11/01/2025

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ పులివెందుల పర్యటన

వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ వైయస్‌ అభిషేక్‌ రెడ్డి పార్ధీవదేహానికి నివాళులర్పించిన శ్రీ వైయస్‌ జగన్‌, శ్రీమతి వైయస్‌ భారతి, కుటుంబ సభ్యులు

డాక్టర్‌ అభిషేక్‌ రెడ్డి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. పులివెందులలోని స్వగృహంలో అభిషేక్‌ రెడ్డి పార్ధీవదేహానికి పలువురు వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు.

ఉదయం బెంగళూరు నుంచి పులివెందుల చేరుకున్న వైయస్‌ జగన్‌ దంపతులు... వైయస్‌ అభిషేక్‌ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు అనారోగ్యంతో బాధపడుతున్న వైయస్‌ ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మను వారి నివాసంలో పరామర్శించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు.

తిరుపతి పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, వ...
09/01/2025

తిరుపతి పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

శ్రీ వైయస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ ముఖ్యాంశాలు:
– ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ అందరూ బాధ్యులే. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలి.
– తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతూ, తప్పుడు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ 194–సెక్షన్‌కు బదులు బీఎన్‌ఎస్‌ 105– సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి.
– దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.
– గాయపడిన వారికి మంచి వైద్యం అందించడంతో పాటు, డిశ్చార్జ్‌ సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలి. ఇది మా డిమాండ్‌.
– చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు. భయం లేదు. అందుకే శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదంపైనా ఆరోపణలు చేశారు. దుష్ప్రచారం చేశారు.
– ఈరోజు కూడా ఆయన వైఖరి వల్లనే ఈ దుర్ఘటన జరిగింది.

తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలోనే లేదు. తొక్కిసలాటకు ఇంత మంది బలి కావడం గతంలో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది.
దీనికి కారణాలు చూస్తే..
– ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం కొన్ని లక్షల మంది వస్తారు.
– ఆరోజు స్వామి వారిని దర్శిస్తే, మహా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే లక్షల మంది తరలి వస్తారు.
– ఆ దర్శనం కోసం టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు?
– టీటీడీ అ«ధికారులు మొదలు జిల్లా కలెక్టర్‌ వరకు అందరూ దీనికి బా««ధ్యులు.

– చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులు 6వ తేదీ నుంచి 8వరకు పర్యటించారు. ఆరోజు మధ్యాహ్నం వరకు ఆయన కుప్పంలోనే ఉన్నారు. మొత్తం సెక్యూరిటీ ఆయన దగ్గరే ఉంది.
– 8వ తేదీ రాత్రి 8.30 గం.కు టోకెన్లు మొదలు పెట్టారు. లక్షల మంది వచ్చినా, తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు.
– బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్‌లో ఏర్పాటు చేసిన టోకెన్‌ సెంటర్‌ వద్ద, భక్తులను ముందు పార్కులోనే ఉంచేసి, రాత్రి ఒకేసారి వదిలేశారు.
– నిజానికి ఆ పార్కులో భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేదు.
– పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను కట్టడి చేసేందుకు తగిన సంఖ్యలో పోలీసులు లేరు. ఉన్న కొద్దిమంది పోలీసులు వారిని నియంత్రించలేకపోయారు.

– ఇంత జరిగినా, సీఎం చంద్రబాబు పద్ధతి లేకుండా మాట్లాడారు.
ఎఫ్‌ఐఆర్‌ కూడా తప్పులతడకగా నమోదు చేశారు.
– టీటీడీ అనేది ఒక గొప్ప వ్యవస్థ. వైకుంఠ ఏకాదశి రోజున లక్షల మంది వస్తారు.
– సీఎం చంద్రబాబు మొదలు, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసులు.. అందరూ ఈ దుర్ఘటనకు బాధ్యులే.
– ఇది సీఎం చంద్రబాబు సొంత జిల్లా. అయినా టీటీడీ బాధ్యతారహితంగా వ్యవహరించింది.
– దుర్ఘటనలో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. ఉజ్జాయింపు లెక్కల ప్రకారం చూస్తే కనీసం 50 నుంచి 60 మంది గాయపడ్డారు.
– గతంలో ఏనాడూ తిరుపతిలో ఇంత దారుణ ఘటన జరగలేదు. ఇది పూర్తిగా టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమే.

– తిరుపతికి లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా, వారికి ఏ విధంగా వసతులు కల్పించాలి? ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు కానీ, టీటీడీ ఛైర్మన్‌ కానీ ఆలోచించలేదు.
– భక్తులకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. తాగడానికి మజ్జిగ కూడా సరఫరా చేయలేదు.
– అన్ని తప్పులు చేసినా, ఏదో గొప్పగా చేశామని ఈరోజు చెబుతున్నారు.
క్యూ లైన్లలో ఉన్న వారికి కనీసం ఆహారం లేదు. నీళ్లు కూడా ఇవ్వలేదు.

– ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఘటనకు పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత.
– ఘటనలో చనిపోయిన వారికి కనీసం రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.
– గాయపడిన వారికి పూర్తి వైద్యం చేయడంతో పాటు, ఇంటికి పంపే సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలి.
ఇది మా డిమాండ్‌.

– సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, ఈఓ, ఏఈఓ, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌.. వీరందరిదీ ఈ ఘటనకు బాధ్యులు. కాబట్టి వారందరిపై చర్య తీసుకోవాలి. ఇంకా, హోం మంత్రి, దేవాదాయ మంత్రుల బాధ్యత కూడా ఉంది.

– ఇక వీరి ఎఫ్‌ఐఆర్‌ చాలా దారుణంగా ఉంది.
– బీఎన్‌ఎస్‌ 194 సెక్షన్‌ పెట్టారు. అది పూర్తిగా తప్పు. సెక్షన్‌ 105 నమోదు చేయాలి.
– చంద్రబాబు సీఎం అయ్యాక, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తింటోంది. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
– శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనా దుష్ప్రచారం చేశారు. ఇవాళ కూడా ఆయన చర్య వల్లనే ఈ ఘటన జరిగింది.

– నిజానికి క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో టీటీడీకి ఎంతో పేరుంది.
– కానీ ఈరోజు తిరుమలకు రావాలంటే, భయపడే పరిస్థితి వచ్చింది.

– తమిళనాడులో శ్రీరంగం అనే క్షేత్రం ఉంది. అక్కడికి కూడా భక్తులు చాలా మంది వెళ్తారు. మరి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చూడండి.
– చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు. అందుకే తిరుమల ప్రసాదంపై కూడా ఆరోపణలు చేశారు. అబద్ధాలు ప్రచారం చేశారు.
– పోలీసులు మొత్తం చంద్రబాబు సేవలోనే ఉన్నారు. ఆయన మూడు రోజులు కుప్పంలో మకాం వేస్తే, పోలీసులు మొత్తం ఆయన భద్రతలోనే ఉన్నారు.
– దీంతో తిరుపతిలో తగిన సంఖ్యలో పోలీసులు లేరు. ఇది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

– అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనకు కచ్చితంగా సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీనే బాధ్యులు.
– చంద్రబాబు నిర్వాకం వల్ల గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది చనిపోయారు. కేవలం ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసం అంత మందిని బలి తీసుకున్నారు.

– నేను ఇక్కడికి వస్తానని, వాస్తవాలు ప్రజలకు చెబుతానని భయపడి నేను ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలని చూశారు.
– నేను ఆస్పత్రికి రాకుండా చేయాలని చూశారు. నన్ను ట్రాఫిక్‌లో ఆపి, నా కాన్వాయ్‌ ఆస్పత్రికి రావొద్దన్న కుట్ర చేశారు.
– చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని తరలించాలని చూశారు. వారు ఎదురు తిరగడంతో ఊర్కున్నారు.
– అప్పటికి కొందరు పేషెంట్లను బలవంతంగా డిశ్చార్జ్‌ చేశారు.

– ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ అందరూ బాధ్యులే. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలి.
– తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతూ, తప్పుడు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ 194–సెక్షన్‌కు బదులు బీఎన్‌ఎస్‌ 105– సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి.
– దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.
– గాయపడిన వారికి మంచి వైద్యం అందించడంతో పాటు, డిశ్చార్జ్‌ సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలి. ఇది మా డిమాండ్‌.

08/01/2025

నోవాటెల్‌ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్‌, పెన్షనర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి కుమారుడి వివాహా రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులు హనీ ప్రియ రెడ్డి, కౌషిక్‌ కుమార్‌ రెడ్డిలకు వివాహా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన శ్రీ వైయస్‌ జగన్

ఉమ్మడి నెల్లూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్ సమావేశం
08/01/2025

ఉమ్మడి నెల్లూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్ సమావేశం

Wish you all  a happy and prosperous new year 2025.May this year be filled with joy and prosperity. May everyone be heal...
01/01/2025

Wish you all a happy and prosperous new year 2025.
May this year be filled with joy and prosperity. May everyone be healthy and may everyone’s aspirations be fulfilled.

26/12/2024

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మూడో రోజు పులివెందుల పర్యటన, క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌

వైఎస్సార్సీపీ శ్రేణులకు శ్రీ వైయస్‌ జగన్‌ భరోసా

ప్రజాదర్భార్ లో కలిసిన వారి యోగక్షేమాలు తెలుసుకున్న శ్రీ వైయస్‌ జగన్‌

పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌... కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్‌‌ జగన్‌ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు.

ఆపన్నులకు అండగా

వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైయస్‌ జగన్‌ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు.ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన శ్రీ వైయస్‌ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్‌ ఛార్జీలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని ఆయన అన్నారు.

26/12/2024
వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైఎస్‌ జగన్  ప్రజాదర్బార్‌ కార్యక్రమం
26/12/2024

వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైఎస్‌ జగన్ ప్రజాదర్బార్‌ కార్యక్రమం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలోని క్...
26/12/2024

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ప్రజాదర్బర్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాలు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.

26/12/2024

వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైఎస్‌ జగన్ వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్బంగా వైఎస్‌ జగన్‌ నేడు ప్రజాదర్బార్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్యాంపు ఆఫీసుకు వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు.

లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని ప్రారంభించిన మాజీ సిఎం శ్రీ వైయస్ జగన్కోదండ రామాలయం నిర్మాణం పూర్తి చేసుకుని నే...
25/12/2024

లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని ప్రారంభించిన మాజీ సిఎం శ్రీ వైయస్ జగన్

కోదండ రామాలయం నిర్మాణం పూర్తి చేసుకుని నేడు విగ్రహ ప్రతిష్ట

విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న శ్రీ వై యస్ జగన్

శ్రీ వైయస్ జగన్ కు బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు

రామాలయ విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో గ్రామంలో పండుగ వాతావరణం

పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో శ్రీ వై యస్ జగన్ ..
25/12/2024

పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో శ్రీ వై యస్ జగన్ ..

*ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో క్రిస్మస్‌ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న శ్రీ వైయస్‌ జగన్‌, కుటుంబ సభ్యులు...
24/12/2024

*ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో క్రిస్మస్‌ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న శ్రీ వైయస్‌ జగన్‌, కుటుంబ సభ్యులు*

*హాజరైన శ్రీమతి వైయస్‌ విజయమ్మ, శ్రీమతి వైయస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు*.

Address

Hyderabad
500072

Website

Alerts

Be the first to know and let us send you an email when Kondamadugula Sudhakar Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kondamadugula Sudhakar Reddy:

Videos

Share