Telugu News 24

  • Home
  • Telugu News 24

Telugu News 24 Telugunews24.com is a online news channel for all viewers....

ప్రపంచస్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్‌ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ లో...
06/08/2024

ప్రపంచస్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్‌ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా కొత్త సెంటర్‌ నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇరవై వేలమంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్‌ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌తోపాటు కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఈ ఒప్పందం కుదిరింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీని విస్తరించడం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్‌ సీఈవో ఎస్‌ రవికుమార్‌ తెలిపారు. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాగ్నిజెంట్‌ కంపెనీ కొత్త సెంటర్‌ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు.

ఈ ఏడాది ప్రారంభంలో ఆసియాలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భారత కరెన్సీ రూపాయి(Indian rupees) నేడు అత్యంత దారుణమైన స్థాయి...
05/08/2024

ఈ ఏడాది ప్రారంభంలో ఆసియాలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భారత కరెన్సీ రూపాయి(Indian rupees) నేడు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయింది. ఈ క్షీణత ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా మాంద్యం భయాందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో(stock market) సూచీలు మొత్తం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతోపాటు ఆసియా మార్కెట్లు కూడా తీవ్ర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం 12.18 గంటలకు ఈ నివేదికను దాఖలు చేసే సమయానికి రూపాయి 83.85 వద్ద ట్రేడైంది. గ్లోబల్ మార్కెట్ బలహీనత, అమెరికా మాంద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు అనుగుణంగా రూపాయి పతనం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను పునరుద్ధరించాలని మెదక్ ఎంపీ రఘు...
04/08/2024

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను పునరుద్ధరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి లతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ కు చేరుకున్న ఎంపీ రఘునందన్ తొలుత మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్తువుల ప్రదర్శనను తిలకించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తో పాటు మున్సిపల్ అధికారులతో సమావేశమైన ఎంపీ రఘునందన్ రావు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలపై రివ్యూ నిర్వహించారు.
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపాలిటీ లో భవన వ్యర్థాలను రోడ్లపై వేయడంతో పాటు చెరువులలో పారబోస్తున్నారని దీని పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా కాలనీలలోని మురుగునీటిని చెరువులు కుంటలలో వదలడం ద్వారా చెరువులు కంపు కొడుతున్నాయన్నారు. వెంటనే సదరు కాలనీలను గుర్తించి ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 15 తర్వాత మరొక సారి సమీక్ష నిర్వహిద్దామని ఆ లోపు తెల్లాపూర్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ల పూర్తి విస్తీర్ణం వివరాలు ఇవ్వాలని, చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని ఆదేశించారు.
చెరువులలో అక్రమ నిర్మాణాల తొలగింపులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని అవసరమైతే తాను ముందుండి చెరువుల పరిరక్షణలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తెల్లాపూర్ లో రేడియల్ రోడ్డు సమస్యతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు, సబ్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్ విషయాన్ని స్థానికులు ఎంపీ ఆ దృష్టికి తీసుకుని రాగా సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. 30 పడకల ఆసుపత్రి విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదనలు పెట్టామని, పాత మున్సిపల్ కార్యాలయంలో యుద్ధ ప్రతిపాదికన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటారన్నారు. డిసెంబర్ వరకు తెల్లాపూర్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనుల అమలును కొలిక్కి తీసుకుని వచ్చి పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఎట్టకేలకు చెరువులపై ఫోకస్ పెట్టారు. మార్నింగ్ వాక్‌లో శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి...
03/08/2024

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఎట్టకేలకు చెరువులపై ఫోకస్ పెట్టారు. మార్నింగ్ వాక్‌లో శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ ఇప్పుడు చెరువుల పరిరక్షణ, సుందరీకరణపై దృష్టిసారించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నందున చెరువుల పరిరక్షణ, సుందరీకరణ విషయంలో ఏమైనా సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే జోనల్ కమిషనర్లకు సూచించినట్లు సమాచారం.
హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 2,250 చెరువులుండగా, జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 185 చెరువులున్నాయి. వీటికి ఇప్పటికే ఫెన్సింగ్ ఏర్పాటు చేయటంతో పాటు సీసీ కెమెరాలతో నిఘాను కూడా ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఈవీడీఎం జవాన్లతో సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసినా, చెరువుల్లోకి మురుగు జలాలు ప్రవహించటం, భవన నిర్మాణ వ్యర్థాలు పడటం వంటి వాటికి బ్రేక్ పడటం లేదు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని చెరువుల్లోకి మురుగు నీరు రాకుండా చేపట్టాల్సిన చర్యలపై హెల్త్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో కలిపి కమిషనర్ ఓ కమిటీని నియమించినట్లు సమాచారం. ఈ కమిటీ నగరంలోని మొత్తం 185 చెరువులను క్షేత్రస్థాయిలో సందర్శించి పలు వివరాలను సేకరించాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా చెరువులకు చుట్టూ ఫెన్సింగ్ ఉందా? లేదా? ఒక వేళ లేనిచో వెంటనే ఏర్పాటు చేయాలని, ఫెన్సింగ్ ఉండి ఉంటే అది ఎంత వరకు ధృడంగా ఉందన్న విషయాలను పరిశీలించి, చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం.
మురుగు నీరు చెరువులోకి భారీగా వస్తుందనుకుంటే ఆ నీరు చెరువులోకి ప్రవహించే ముందే వాటిని ట్రీట్‌మెంట్ ప్లాంట్లలోకి పంపి, శుద్ధి చేసి చెరువులోకి వదిలితే సీవరేజీ తీవ్రత తగ్గే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. గెటెడ్ కమ్యూనిటీ, విల్లాలు, అపార్ట్‌మెంట్ల నుంచి సీవరేజీ వాటర్ వస్తున్నట్లు గుర్తిస్తే, సదరు భవనం యజమానులకు గానీ, ఫ్లాట్స్ అసోసియేషన్ వారికి కూడా చెరువులోకి మురుగు నీరు రాకుండా చూడాలని సూచించాలని ఆదేశించినట్లు సమాచారం. భారీగా మురుగు నీరు చేరే చెరువుల పక్కనే ఉన్న గెటెడ్ కమ్యూనిటీ, విల్లాలు, అపార్ట్‌మెంట్లు విధిగా సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా భవన నిర్మాణ నియమావళిలో కఠినమైన సవరణలు తీసుకురావాలన్న విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో మరోసారి చర్చలు జరిపి, అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మియాపూర్‌(Miyapur)లోని ఓ మాల్‌లో అనుమతికి మించి ఎక్కువ స్ర్కీన్‌లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. హోటళ్లలోనే కాదు.. మల్టీ...
03/08/2024

మియాపూర్‌(Miyapur)లోని ఓ మాల్‌లో అనుమతికి మించి ఎక్కువ స్ర్కీన్‌లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. హోటళ్లలోనే కాదు.. మల్టీప్లెక్సుల్లో ఆహారమూ ప్రమాణాల ప్రకారం లేదు. కాలం చెల్లిన పదార్థాలను విక్రయించడంతో పాటు.. ఆహారం తయారీలోనూ వినియోగిస్తున్నారు. పార్కింగ్‌ రుసుము వసూలు చేయవద్దన్న నిబంధనలూ వారు పట్టించుకోవడం లేదు. సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ఫిర్యాదుల నేపథ్యంలో పార్కింగ్‌ రుసుము అక్రమ వసూలు పరిశీలనకు కమిషనర్‌ ఆమ్రపాలి(Commissioner Amrapali) సర్కిళ్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్‌ విభాగం, రెవెన్యూ, ఫుడ్‌ సేప్టీ విభాగాల అధికారులుండే బృందాలు డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌ నేతృత్వంలో తమ పరిధిలోని మాల్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మియాపూర్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌(Miyapur, Kukatpally, Madapur) తదితర ప్రాంతాల్లో అనుమతి తీసుకున్న దాని కంటే ఎక్కువ స్ర్కీన్‌లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఫుడ్‌ కోర్టుల్లోనూ నాణ్యమైన ఆహారం లేదని గుర్తించారు. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమ్రపాలి హెచ్చరించారు.
మాల్స్‌లో పార్కింగ్‌ రుసుము
నిబంధనల ప్రకారం సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో మాత్రమే పార్కింగ్‌ రుసుము వసూలుకు అవకాశం ఉంది. మాల్స్‌లో మొదటి అరగంట పార్కింగ్‌ ఉచితం. అంతకంటే ఎక్కువ సమయం వాహనం నిలిపితే పార్కింగ్‌ రుసుము కంటే ఎక్కువ మొత్తం కొనుగోలు చేసినా, సినిమా చూసినా పార్కింగ్‌ ఫీ వసూలు చేయకూడదు. కానీ కొన్ని మాల్స్‌లో వినియోగదారుల నుంచి జబర్దస్తీగా పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. జరిమానాలు మాత్రం విధించలేదు. పైగా, ఏ మాల్‌లో తనిఖీలు నిర్వహించారు, నిబంధనలకు విరుద్ధంగా గుర్తించిన విషయాలేంటి..? అన్న వివరాలను అధికారులు వెల్లడించడం లేదు. మాల్స్‌ వివరాలను గోప్యంగా ఉంచుతూ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని చెబుతున్నారు.

హైదరాబాద్‌ వాసుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో.. ఒంటి గంట వరకు అన్ని దుకాణాలు హోటళ్లు, రెస్టారెంట్ల...
02/08/2024

హైదరాబాద్‌ వాసుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో.. ఒంటి గంట వరకు అన్ని దుకాణాలు హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చారు. మద్యం దుకాణాలు తప్ప.. నగరంలో ఏ దుకాణాలైన తెరుచుకోవచ్చని.. వ్యాపారాలు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా.. నగరంలో 11 గంటల వరకే పోలీసులు వచ్చి దుకాణాలు మూసేయిస్తున్నారని పలువులు సభ్యులు సీఎం దృష్టికి తీసుకురాగా ఈ మేరకు ప్రకటన చేశారు.

మీరెప్పుడైనా కొన్ని నిమిషాల్లోనే వేల కోట్లు సంపాదించిన వ్యక్తి గురించి విన్నారా. మాములుగా అయితే దేశంలో ప్రముఖ వ్యాపారవేత...
02/08/2024

మీరెప్పుడైనా కొన్ని నిమిషాల్లోనే వేల కోట్లు సంపాదించిన వ్యక్తి గురించి విన్నారా. మాములుగా అయితే దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(mukesh ambani), గౌతమ్ అదానీ లేదా రతన్ టాటా పేర్లు చెబుతుంటాం. కానీ ప్రస్తుతం ఓ యువ వ్యాపారవేత్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనే Zomato సహ వ్యవస్థాపకుడు, CEO అయిన దీపిందర్ గోయల్(Deepinder Goyal). ఈ ఫుడ్ డెలివరీ వ్యాపారవేత్త దీపిందర్ ఈరోజు(ఆగస్టు 2న) కొన్ని నిమిషాల్లోనే 1,638.60 కోట్ల రూపాయలను సంపాదించారని చెప్పవచ్చు. ఈ బిజినెస్ మ్యాన్ ఇటివల భారతదేశంలోని బిలియనీర్ల గ్రూప్‌లో కూడా చేరారు. అయితే అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నష్టాల వేళ కూడా..
నేడు (ఆగస్టు 2న) దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) భారీ నష్టాలు కొనసాగిన వేళ కూడా జోమాటో షేర్లు భారీగా పుంజుకున్నాయి. అయితే జూన్ 30, 2024 (Q1 FY25)తో ముగిసిన త్రైమాసికంలో (Q1 FY25) నికర లాభం మూడు రెట్లు పెరిగిందని సంస్థ వెల్లడించిన క్రమంలో ఈ స్టాక్ జోరు పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ రికార్డ్ బ్రేకింగ్ లాభాలను ఆర్జించింది. ప్రస్తుత వ్యాపార సంవత్సరం మొదటి త్రైమాసికంలో తమ లాభం భారీగా పెరిగిందని కంపెనీ ఎక్స్ఛేంజీకి తెలిపింది. కంపెనీ లాభం రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు చేరుకుంది. ఆ క్రమంలో కంపెనీ ఏకీకృత ఆదాయాలు ఏటా రూ.2416 కోట్ల నుంచి రూ.4206 కోట్లకు పెరిగాయి. ఈ కారణంగా ఈ రోజు షేర్లలో అద్భుతమైన పెరుగుదల కనిపించింది.
ఒకానొక దశలో
ఆ క్రమంలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఒకానొక సమయంలో Zomato షేర్లు 19% వరకు పెరిగాయి. ఆ నేపథ్యంలో బీఎస్‌ఈలో గత ముగింపు రూ.234.10 నుంచి షేర్ ధర రూ.278.45 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (MCAP) విలువ దాదాపు రూ.2.46 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. కేవలం కొన్ని గంటల్లోనే కంపెనీ తన ఎంక్యాప్‌(MCAP)కు దాదాపు రూ.40,000 కోట్లు పెరగడం విశేషం.
ఈ అద్భుతమైన పెరుగుదల నేపథ్యంలో Zomato CEO దీపిందర్ గోయల్ 4.19% షేర్ల నికర విలువ రూ. 1,638 కోట్లకు పైగా పెరిగింది. జూన్ 30, 2024 నాటికి గోయల్ కంపెనీలో 36,94,71,500 ఈక్విటీ షేర్లను లేదా 4.19 శాతం వాటాను కలిగి ఉన్నారు. దీని ప్రకారం చూస్తే జొమాటో షేర్లు ఈ రోజులో అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు కంపెనీలో దీపిందర్ గోయల్ వాటా రూ.10,288 కోట్లు పెరిగిందని చెప్పవచ్చు.

కేటుగాళ్లు రోజుకింత రాటుదేలుతున్నారు. పోలీసులను మస్కా కొట్టించి మరీ స్మగ్లింగ్ చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చట్ట...
01/08/2024

కేటుగాళ్లు రోజుకింత రాటుదేలుతున్నారు. పోలీసులను మస్కా కొట్టించి మరీ స్మగ్లింగ్ చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చట్ట వ్యతిరేక పనులు చేసేస్తున్నారు. కానీ, అన్ని రోజులూ వారివే కాదు కదా! తాజా ఘటనలో అదే జరిగింది. ఖాకీల తెలివి ముందు.. ఈ కేటుగాళ్లు బేజారయ్యారు. ఇంకేముంది.. తప్పుడు పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌గేట్ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. రూ. 2.51 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. చెన్నై నుంచి కారులో అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. బంగారం, కారు సీజ్ చేయడంతో పాటు.. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు డీఆర్ఐ అధికారులు.

దర్యాప్తు దశలో ఉన్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసు వివరాలను నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు వెల్లడించడంతో పాటు అందుకోసం ప్రజాధ...
01/08/2024

దర్యాప్తు దశలో ఉన్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసు వివరాలను నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు వెల్లడించడంతో పాటు అందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సీఐడీ పూర్వ అడిషనల్‌ డీజీ సంజయ్‌, మాజీ అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శికి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌. ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై నాడు దాఖలు చేసిన స్కిల్‌ కేసు వివరాలను పత్రికా సమావేశాలు నిర్వహించి వెల్లడించడం ద్వారా నిబంధనలు అతిక్రమించిన సంజయ్‌, పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ యునైటెడ్‌ ఫోరం ఫర్‌ యునైటెడ్‌ క్యాంపెయిన్‌ అధ్యక్షుడు ఎన్‌.సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.గిరిబాబు వాదనలు వినిపించారు. ఆంగ్లంలో తర్జూమా చేసిన వివరాలను కోర్టు ముందు ఉంచామన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

నేటి యువతలో కొందరికి ఉద్యోగమంటే లక్ష్యం లేదంటూ ఓ స్టార్టప్ సంస్థ యజమాని లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా (Viral) మ...
31/07/2024

నేటి యువతలో కొందరికి ఉద్యోగమంటే లక్ష్యం లేదంటూ ఓ స్టార్టప్ సంస్థ యజమాని లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా (Viral) మారింది. ముంబైకి చెందిన సెనైన్ సావంత్ ముంబైలో ఓ స్టార్టప్ సంస్థ ప్రారంభించారు. సంస్థలో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ జాబ్‌ కోసం మంచి ఉద్యోగులు దొరక్క ఆమె సతమతమవుతున్నారు. పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె ముందుకు ఓ అభ్యర్థి రెజ్యూమే వచ్చింది. అయితే, దీని ఆధారంగా ఆమె పూర్తి అంచనాకు రాలేకపోయింది. అభ్యర్థి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడా? కనీసం ట్రెయినీగా అన్నా పనికివస్తారా అన్న విషయంలో ఆమె నిర్ధారణకు రాలేకపోయింది. దీంతో, సదరు వ్యక్తిని వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ చేసింది.
వీడియో కాల్ ఇంటర్వ్యూకు హాజరైన వ్యక్తి తన కంప్యూటర్ కెమెరా ఆన్ చేసి ముఖం చూపించలేదు. ఎందుకని అడిగితే ఓఎస్ అప్‌డేట్ కారణంగా ల్యాప్‌టాప్ కెమెరా ఆన్‌కావట్లేదని చెప్పుకొచ్చాడు. దీంతో సావంత్.. కెమెరా ఆన్‌ అయినప్పుడే ఇంటర్వ్యూ ప్రారంభిద్దామని మర్యాదగానే చెప్పింది. సరేనని ఉద్యోగార్థి కాల్ కట్ చేశారు (Mumbai entrepreneur shares hiring horror story ).
ఆ తరువాత వాట్సాప్ చాట్ సందర్భంగా అభ్యర్థి మితిమీరి మాట్లాడారు. వీడియో కాల్ ఇంటర్వ్యూ విషయాన్ని తాను స్పష్టంగానే పేర్కొన్నానని సావంత్ చెప్పగా ఉద్యోగార్థి మాత్రం రెచ్చిపోయాడు. ఉద్యోగం అని చెప్పి ట్రెయినీ పోస్టు గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. రెజ్యూమేలోని వివరాలను బట్టి ట్రెయినీ పోస్టుకు అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటే తప్పేంటని, సామర్థ్యాన్ని బట్టి అవకాశాలు ఉంటాయనే అర్థంలో ఆమె చెప్పింది.
దీనికి స్పందించిన అభ్యర్థి తనకు ఏడాది అనుభవం ఉందంటూ మరింత చిరాకు ప్రదర్శించారు. చివరకు సావంత్‌ను అనకూడని మాట అన్నారు. దీంతో, ఆశ్చర్యపోయిన ఆమె నీ సంస్కారం ఇంతే అంటూ సంభాషణ ముగించింది. అనంతరం, ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకుంది. జెన్ జెడ్‌కు చెందిన కొందరు యువతకు జాబ్ అంటే లక్ష్యం లేదని, తామేదో ప్రత్యేకమని, అందరూ తమ అడుగులకు మణుగులొత్తాలన్న భావనలో ఉన్నారని కామెంట్ చేసింది. వాళ్లకి ఉద్యోగాలంటే తమకు నచ్చినప్పుడు చేసుకునే ఆదాయమార్గాల్లా మారాయని కామెంట్ చేశారు. నెటిజన్లు అనేక మంది ఆమెతో ఏకీభవించారు.

తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతుల...
26/07/2024

తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. 33 రకాల వరి పంటలకు బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
‘తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతున్నది. పండిన పంటకు సరైన ధర రాక, పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి, వాటిని పండించిన రైతుకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల సన్న రకం వరి సాగు విస్తీర్ణం పెరిగి, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేద ప్రజలను మోసం చేసిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పూటగ...
25/07/2024

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేద ప్రజలను మోసం చేసిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పూటగడవని నిరుపేదలకు గూడు సమకూర్చడం ప్రభుత్వ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిరుపేదలకు ఎన్నో ఆశలు కల్పించి.. ఇళ్లు కేటాయించకుండా దగా చేసిందన్నారు. పేద ప్రజల సొంతింటి కళను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించామన్నారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షల సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్రంలో 4లక్షల 50 వేల గృహాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క తెలిపారు.

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాఠ్మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్‌ అవుతుండగా కు...
25/07/2024

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాఠ్మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్‌ అవుతుండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. పైలట్‌ మనీశ్‌ ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన కళ్లకు, నుదురుకు గాయాలయ్యాయని, ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. నేపాల్‌లోని శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన బాంబార్డియర్‌ సీఆర్‌జే-200 విమానం బుధవారం ఉదయం 11.15 గంటలకు త్రిభువన్‌ ఎయిర్‌పోర్టు నుంచి పొఖారాకు బయల్దేరింది. టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే అదుపుతప్పి కూలిపోయింది. విమానం నేలను తాకగానే మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్నవాళ్లంతా శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బందేనని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ చీఫ్‌ అర్జున్‌ చాంద్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు విమాన సిబ్బంది కాగా, 17 మంది టెక్నీషియన్లని పేర్కొన్నారు. రొటీన్‌గా చేసే నిర్వహణా పరీక్షల(మెయింటెనెన్స్‌ చెకింగ్‌) కోసం వారు ఆ విమానంలో ఎక్కారని తెలిపారు. విమానం కూలిపోతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, విమానం ఎగరగానే ఎడమవైపు తిరగాల్సి ఉండగా అదుపు తప్పి కుడివైపు తిరిగిందని, వెంటనే కూలిపోయిందని త్రిభువన్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. నేపాల్‌లో గడిచిన 30 ఏళ్లలో 720 విమాన ప్రమాదాలు జరిగాయి. గతేడాది పొఖారా విమానాశ్రయంలో యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిపోయి 72మంది దుర్మరణం పాలయ్యారు. కాగా, తాజా విమాన ప్రమాదానికి ఎయిర్‌పోర్టులోని టేబుల్‌ టాప్‌ రన్‌వేనే కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టుల్లోనే ఎత్తైన ప్రదేశంలో ఉండే రన్‌వేలను టేబుల్‌ టాప్‌ రన్‌వేలు అంటారు. వీటిపై టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో పైలట్లు అప్రమత్తతతో వ్యవహరించాలి. నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదాల్లో ఎక్కువగా టేబుల్‌టాప్‌ రన్‌వేలపైనే జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బి...
24/07/2024

పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ పథకం కింద ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. మరోపక్క, అణువిద్యుత్‌ రంగంలో తొలిసారి ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. చిన్నపాటి అణు విద్యుత్‌ రియాక్టర్ల(ఎ్‌సఎంఆర్‌) ఏర్పాటు, అభివృద్ధి అంశంలో ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం కానుంది. పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని ప్రకటించింది.

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల బుధవారం శాసనసభ దద్దరిల్లింది. నిధుల కేటాయింపు విష...
24/07/2024

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల బుధవారం శాసనసభ దద్దరిల్లింది. నిధుల కేటాయింపు విషయంలో అసెంబ్లీలో చర్చ ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు రావాలంటే పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు గొంతు విప్పి కోట్లాడాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆనాడు మోదీ మొదటి ప్రభుత్వంలో రాజ్యసభలో బీజేపీ బలం లేకపోతే పలు బిల్లుల ఆమోదానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏకంగా నరేంద్ర మోడీకి ఊడిగం చేశారంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.
జీఎస్టీ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వకుండా ఓటింగ్‌లో పాల్గొనకుండా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారని ఆరోపించారు. దేశంలో పారదర్శక పాలన అందించేందుకు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్ట్‌కు తూట్లు పొడిచేలా ఆర్టీఐ సవరణ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఓటింగ్ పాల్గొనిందని తెలిపారు. 2016 డిసెంబర్ 16న పెద్ద నోట్ల రద్దు బిల్లు స్వాగతిస్తూ.. కేసీఆర్ ఇదే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రధాని నిర్ణయం అద్బుతం, అమోఘమని పొగిడారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇలా ప్రతి విషయంలోనే బీజేపీ, బీఆర్ఎస్‌‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు నిరుద్యోగుల ఇతర న్యాయపరమైన డిమాండ్లపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార...
24/07/2024

జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు నిరుద్యోగుల ఇతర న్యాయపరమైన డిమాండ్లపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు వాయిదా తీర్మానం ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిపాదించిన ఈ వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ రిజెక్ట్ చేశారు. బీఆర్ఎస్ కోరిన అంశాలపై చర్చ జరిపేందుకు స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ.. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు అసెంబ్లీ సెషన్ హాట్ హాట్ సాగుతోంది. ఆర్టీసీపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ జరిగింది.

ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) త...
24/07/2024

ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు. ఇప్పుడున్న ప్రభుత్వ విద్యకంటే నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వివరించారు.
ఈరోజు (మంగళవారం) తెలంగాణ సచివాలయంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ... ఒక్కో పాఠశాల కోసం రూ.80 నుంచి రూ. 100 కోట్లు ఖర్చు చేయబోతున్నామని అన్నారు. ఒక్రేజ్, బిర్లా ఓపెన్ స్కూల్స్ టైప్ ప్రభుత్వ పాఠశాలలు రాబోతున్నాయని చెప్పారు. ప్రతీ మండలానికి రెండు లేదా మూడు పాఠశాలలు తొలుత రాబోతున్నాయని అన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడొద్దని హితవు పలికారు.
రుణమాఫీపై ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. బీఏసీలో బీఆర్ఎస్ నేతలు పేర్లు మార్చుకున్నారని.. అందుకే ఆ సమావేశం ఆలస్యమైందని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వమని.. ప్రతీ అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ ఐ-ఫోన్ల తయారీలో భారత్ గణనీయ వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ అవసరాల్లో 14 శాతం...
23/07/2024

గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ ఐ-ఫోన్ల తయారీలో భారత్ గణనీయ వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ అవసరాల్లో 14 శాతం ఐ-ఫోన్లను ఆపిల్ దేశీయంగా అసెంబ్లింగ్ చేసింది. తద్వారా భారత్ నుంచి విదేశాలకు ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు నాలుగు స్థానాలు మెరుగు పడ్డాయి. అమెరికాకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2022-23లో 2.2 బిలియన్ డాలర్లు, 2023-24కల్లా 5.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. సోమవారం ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంగతి వెల్లడించారు.
థర్డ్ పార్టీ డేటాను ఉటంకిస్తూ 2023-24లో దేశీయంగా ఆపిల్ 14 బిలియన్ డాలర్ల విలువైన ఐ-ఫోన్లను అసెంబ్లింగ్ చేసిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇది అంతర్జాతీయంగా ఆపిల్ ఐ-ఫోన్ల ఉత్పత్తిలో 14 శాతం. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆపిల్ ఐ-ఫోన్లను ఫాక్స్‌కాన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. 2018లో 0.63 శాతంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 2022 నాటికి 0.88 శాతానికి పెరిగాయి. అంతర్జాతీయంగా భారత్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతుల ర్యాంకింగ్ 28 నుంచి 24వ ర్యాంకుకు పెరిగింది. 2018-19లో గూడ్స్ మర్చండైజ్డ్ ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువుల వాటా 2.7 శాతం ఉంటే 2023-24కల్లా 6.7 శాతానికి పెరిగిందని ఆర్థిక సర్వే తెలిపింది. 2014 నుంచి 2021-22 కల్లా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో వృద్ధిరేటు 3.7 శాతానికి పెరిగిందని, మొత్తం జీడీపీలో ఎలక్ట్రానిక్స్ రంగం వాటా నాలుగు శాతంగా నమోదైందని ఎకనమిక్ సర్వే వెల్లడించింది.

Address


Alerts

Be the first to know and let us send you an email when Telugu News 24 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share