Kuwait Gulf News

Kuwait Gulf News కువైట్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల?
(5)

చక్రంపేట లో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ప్రార్ధనలు.చక్రంపేట : 11.04.2023: అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం లోని చక్రంపేట గ్ర...
11/04/2024

చక్రంపేట లో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ప్రార్ధనలు.

చక్రంపేట : 11.04.2023: అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం లోని చక్రంపేట గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ప్రార్ధనలు, హజరత్ మహమ్మద్ మొహతీర్ రహమాన్, గారి ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించినారు.

చక్రంపేట లోని జామియా మసీదు వద్ద నుండి ముస్లీమ్ మైనారిటీ పెద్దలు, యువకులు, పిల్లలు, ఒక సముహంగా బయలు దేరి గట్టు మీద వున్న ఈద్గా మైదానం చేరుకొని ఈద్ నమాజ్ ప్రార్ధనలు, ఆచరించినారు. అనంతరం హజరత్ మొహమ్మద్ మొహతీర్ రహమాన్ గారు రంజాన్ పండుగ విశిష్టత గురించి ఉపన్యాసం చేసినారు. ఈద్ నమాజ్ అనంతరం ముస్లీం మైనారిటీ సోదరులు ఒకరి కొకరు ఆలింగనం చేసుకొని ఈద్ శుభాకాంక్షలు తెలియ జేసుకున్నారు.

ఈద్ నమాజ్ ప్రార్ధనలలో చక్రంపేట, మరియు చుట్టుపక్కల గ్రామాల,లోని ముస్లీం సోదరులు పాల్గొన్నారు. కువైట్ లో స్థిరపడి వున్న ప్రవాసాంధ్ర చక్రంపేట ముస్లీం మైనారిటీ సోదరులు చక్రంపేట ముస్లింలకు రంజాన్ పండుగ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్ బి అంజద్ బాషా చేతుల మీదుగా ఎస్ ఎం ఎస్ మార్ట్ ప్రారంభం.కడప ,04.04.2023: కడప పట్టణంలో ప్రారంభించిన అన్నివర్గాల ప్రజలకు...
04/04/2024

ఎస్ బి అంజద్ బాషా చేతుల మీదుగా ఎస్ ఎం ఎస్ మార్ట్ ప్రారంభం.

కడప ,04.04.2023: కడప పట్టణంలో ప్రారంభించిన అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఎస్ ఎం ఎస్ మార్ట్ ప్రజల మన్ననలు పొందాలని ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ భాష మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు అన్నారు.

గురువారం నగరంలోని కాగితాల పెంట లో దర్బార్షా వలి ఎస్ ఎం ఎస్ మార్ట్ రెండవ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ మంచి క్వాలిటీ క్వాంటిటీ ఇచ్చి ప్రజల మన్ననలు పొందాలన్నారు .అనంతరం దర్బార్షా వలి మాట్లాడుతూ మా కస్టమర్ల అభిరుచుల మేరకు రెండవ బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మా వద్ద ప్రారంభోత్సవ సందర్భంగా డిస్కౌంట్ ధరలతో ప్రజలకు అందించనున్నామని స్వచ్ఛమైన నాణ్యమైన నిత్యవసర సరుకులు మా ప్రత్యేకత అన్నారు హోమ్ డెలివరీ సదుపాయం ఉందన్నారు

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపీ గల్ఫ్ కన్వీనర్ బి హెచ్ ఇలియాస్ ,యూఎస్ మహల్ అధినేత ఉస్మాన్,ఉమైర్, అల్లా బకాష్, జమాల్ వలి, రెడ్డి ప్రసాద్, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్, షఫీ ,బాలస్వామి రెడ్డి, ఐస్ క్రీమ్ రవీంద్రనాథ్ రెడ్డి, ఎల్లారెడ్డి ,ఎన్నారై బాబు, మొహిద్దిన్ సాహెబ్, నూర్ అహ్మద్, రియాజ్అహ్మద్ ,అబ్దుల్, హరీష్ ,అన్సర్ భాష ,బంగారు నాగయ్య యాదవ్, దర్బార్ , స్నేహితులు కుటుంబ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు.

గౌరవనీయులైన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ GCC సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు. NRI బస్సు యాత్ర 24 - 04 - 2024 నుంచి ప్రారం...
31/03/2024

గౌరవనీయులైన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ GCC సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు.

NRI బస్సు యాత్ర 24 - 04 - 2024 నుంచి ప్రారంభం అవుతుంది. 20 - 04 -2024 తేదీ మీరు ఇండియాలో అందుబాటులో ఉండాలి. మొదటి రెండు రోజులు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రాష్ట్ర అభివృద్ధి పనులు మరియు మన ప్రభుత్వంలో రాష్ట్రానికి తీసుకొని వచ్చిన పరిశ్రమక కంపెనీలు స్వయంగా చూస్తే మీరు ప్రజలకు రాష్ట్రం లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పేందుకు బాగుంటుంది.

గల్ఫ్ సభ్యులు 20 - 04 - 2024 కన్న రెండు రోజులు ముందు వచ్చేస్తే లోకల్ గా ఉన్న లీడర్స్ తో మాట్లాడుకొని 20 వ తేదీ నుంచి బస్ యాత్ర లో జాయిన్ కావచ్చు. ఎవరైనా ముందే ఇండియా వచ్చిన వారు గాని వచ్చే వారు ఉంటే మీ పూర్తి వివరాలు మెసేజ్ చేయండి.

NRI బస్సు యాత్ర మూడు లేదా నాలుగు విభాగాలుగా విభజించ బడును. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ. కువైట్ గ్రూప్ లో రాయలసీమ వారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి రాయలసీమకు చెందిన వారు ఎక్కువ మంది ఆ ప్రాంత బస్ యాత్ర లో వుండే లా ప్రయత్నిస్తాము. ఎవరైనా మీకు ఇష్టమై ఇతర జిల్లాలో తిరగాలి అనుకుంటే ముందే తెలియ జేయండి. దుబాయ్, సౌదీ, బెహ్రయిన్, ఖతార్నుంచి వచ్చే వాళ్ళు కూడా వుంటారు.

వైఎస్సార్ కుటుంబం, ముస్లిం మైనారిటీల పక్షపాతి : వైఎస్సార్సిపీ గల్ఫ్, కువైట్ కన్వీనర్లు.కువైట్ 17.03.2024 : కువైట్ దేశం ల...
18/03/2024

వైఎస్సార్ కుటుంబం, ముస్లిం మైనారిటీల పక్షపాతి : వైఎస్సార్సిపీ గల్ఫ్, కువైట్ కన్వీనర్లు.

కువైట్ 17.03.2024 : కువైట్ దేశం లోని ఫర్వానియా, ప్రాంతంలో గల, నౌషాద్ హోటల్ లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సభ్యులు ,షేక్ గఫార్, షా హుస్సేన్, రహమతుల్లా, ఆబూతురాబ్, అప్సర్ అలీ, మహబూబ్ తదితరుల, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిధులుగా వైఎస్సార్సిపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారు,మరియు, స్టాక్ అధినేత హబీబ్ చెప్పాలి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో, కడప, రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గాల ముస్లిం మైనారిటీ సోదరులు భారీగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి గారు మాట్లాడుతూ, మైనారిటీ ముస్లిం సోదరులకు ఏదైనా మంచి జరిగింది అంటే ఇద్దరే ఇద్దరు మహా నేత దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు, వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీ సోదరులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పూల బాట వేశారని రిజర్వేషన్ ద్వారా ఎంతో మంది పేద కుటుంబాల పిల్లలు డాక్టర్లు గా ఇంజనీర్లుగా ఎన్నో ఉన్నతమైన చదువులు చదివారు. తన తండ్రి ఆశయ సాధన కొరకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకు వేసి రాజకీయాలలో కూడా ఉన్నత స్థానం కల్పించారు 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగున్నర సం:లుగా పైగా మైనారిటీ ముస్లింలకు మంత్రివర్గంలో స్థానం లేని రాష్ట్రంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మన ముఖ్యమంత్రి గారి మంత్రివర్గంలో కడప ముద్దు బిడ్డ ఎస్. బి. అంజాద్ బాషా గారిని ఏకంగా ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని శాసనమండలిలో రాయచోటికి చెందిన మహిళ జకియా ఖానం గారిని డిప్యూటీ చైర్మన్ గా నియమించిన ఘనత వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారిదని భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా గిడ్డంగుల శాఖ చైర్మన్ గా నియమిచాలంటే ఎన్నికల సమయంలో ఆర్ధికంగా ఆదుకునే వారిని మాజీ పార్లమెంట్ సభ్యులను నియమిస్తారు ఒక సామాన్యుడిని కడప ప్రాంతానికి చెందిన కరీముల్లా గారిని నియమించడం నిజంగా ముస్లిం పేద సోదరుల పై ఉన్న ప్రత్యేక అభిమానానికి నిదర్శనమని తెలిపారు రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వచ్చిన వారు పార్టీ అభ్యర్థుల విజయం కొరకు పని చేయాలని ఇక్కడ ఉన్న వారి ప్రభావం వారి కుటుంబ సభ్యులపై ఉంటుందని తమ కుటుంబ సభ్యులకు మిత్రులకు స్నేహితులకు టెలిఫోన్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పాలని అభ్యర్ధించారు.

షేక్ గఫార్, షేక్ రహమతుల్లా, సయ్యద్ సదారుద్దీన్ ఖాద్రి ( లక్కీ అజిస్ ) తదితరులు, మాట్లాడుతూ 2019 ముస్లిం సోదరులకు 5 అసెంబ్లీ సీట్లు 2024 లో ఏకంగా 7 మంది సోదరులను అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం వారి కన్నా రాష్ట్ర ప్రజలకు ఉందని ఇతరులు ఎవరూ వచ్చిన ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోతాయని నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వేయమని మీకు మంచి జరగలేదంటే నాకు ఓటు వేయవద్దు అని చెప్పిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి చెప్పలేడని ముఖ్యంగా కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలను పట్టించుకోని ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు అర్హత ఉందా కరోనా కష్ట కాలంలో కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రజలకు అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారని ఇంతటి మంచి మనసు ఉన్న ప్రజా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ప్రవాసాంధ్రులకు కూడా రాష్ట్రానికి పోయిన 55 వేల ప్రవాసాంధ్రులకు అన్ని విధాలా ఆదుకున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గల్ఫ్ సలహాదారులు యం. వి. నరసారెడ్డి, నాయని మహేష్ రెడ్డి, గల్ఫ్ కొర్ కమిటీ సభ్యులు షేక్ ఫయాజ్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్ మర్రి కళ్యాణ్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. లక్ష్మి ప్రసాద్, గోవిందు రాజు, అన్నాజీ వెంకట కృష్ణ, ఎక్సిక్యూటివ్ సభ్యులు పులపత్తూరు సురేష్ రెడ్డి, సయ్యద్ సలీం, ఎస్. తరుణ్ రెడ్డి, సయ్యద్ సజ్జాద్, సయ్యద్ ఇమ్రాన్, పోలి గంగిరెడ్డి, యం. కిషోర్ కువైట్ సలహాదారులు ఆరవ సుబ్బారెడ్డి, షేక్ నాసర్, కొర్ కమిటీ సభ్యులు షేక్ సబ్దర్, షేక్ యాసిన్ బాషా, జిలాని బాషా, షేక్ ఇస్మాయిల్, షేక్ ముస్తఫా,యదువంశీ వృక్షం కువైట్ కమిటీ సభ్యులు ,సుదర్శన్ రెడ్డిమరియు, భారీ ఎత్తున ముస్లీం మైనారిటీసోదరులు, పాల్గొన్నారు.

Source.
Iliyas B H
&
Shaik Gouse Basha

వైఎస్సార్సిపీ కువైట్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం లో పాల్గొన్న  బి హెచ్ ఇలియాస్.2014 సార్వత్రిక ఎన్నికలకు, 2024 సార్వత్రి...
17/03/2024

వైఎస్సార్సిపీ కువైట్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం లో పాల్గొన్న బి హెచ్ ఇలియాస్.

2014 సార్వత్రిక ఎన్నికలకు, 2024 సార్వత్రిక ఎన్నికలకు చాలా చాలా వ్యత్యాసం ఉంది. 2024 లో వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయడం తధ్యం: గల్ఫ్, కువైట్ కన్వీనర్లు

కువైట్ 16.03.2024 : కువైట్ దేశం లోని ఫర్వానియా పట్టణంలో గల నౌషాద్ హోటల్ లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ నూతన కమిటీ సభ్యులకు పార్టీ కండువాలు వేసి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీ విధి విధానాలు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కమిటీ సభ్యులు ఎవరెవరు వస్తున్నారని వారి పూర్తి వివరాలు ఇవ్వాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి గారు మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు తో సార్వత్రిక ఎన్నికలకు పోయాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కారణాలు కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావలి అని ప్రజలు అనుకున్నారు దానికి తోడు ప్రశ్నించేందుకు జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ పై అభిమానంతో వారి సామాజిక వర్గం అభిమానులు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని అలాగే మోడీ *కరిష్మా* ఇవన్నీ కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, 2014లో ఎన్నికల ప్రచారంలో సుమారు 6 వందల ఉచిత హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి నెరవేర్చలేదు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ 4 సం: లలో ఒకసారి కూడా ప్రశ్నించలేదని, ప్రత్యేక హోదా 5 సం:లు కాదు 10 సం: లు రాష్ట్రానికి ఇస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా మాటే మరిచింది. ఈ మూడు పార్టీలపై ప్రజలకు నమ్మకం లేదని, 2019 లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక చెప్పనివి ఎన్నో సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు చేశారు.

2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందజేసి తన తండ్రిలాగే ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం కల్పించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ 2014 లాగా 2024 కూడా గెలుస్తాం అని ఊహల్లో ఉన్నారని ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన విజయం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీదే. జననేత జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఇది నిజం ఇది సత్యం ఇది తధ్యం అని తెలిపారు.
గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గల్ఫ్ సలహాదారులు నాయని మహేష్ రెడ్డి, మాట్లాడుతూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని రష్యా ఉక్రెయిన్ సమయంలో విద్యార్థులను రాష్ట్రాన్ని సురక్షితంగా తీసుకొని రావడంలో గాని సుడాన్ లో ప్రజలకు ప్రభుత్వానికి జరిగిన అంతర్గత ఘర్షణ సమయంలో సుడాన్ లో మన రాష్ట్రానికి చెందిన 63 మందిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొని రావడం లో సఫలీ కృతు లయ్యారు. కరోనా సమయంలో ప్రవాసాంధ్రులకు చేసిన మేలు జీవితంలో మరచి పోలేమని 2019 నుండి ఇప్పటి వరకు 2 లక్షల 50 వేలకు పైగా ప్రవాసాంధ్రుల వివిధ రూపాల్లో సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ APNRTS ద్వారా సమస్యలను పరిష్కరించింది. ఒక కువైట్ లోనే చాలా ఎక్కువ మంది సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు.

వైఎస్ఆర్సిపీ కువైట్ కో కన్వీనర్ రమణ యాదవ్, మర్రి కళ్యాణ్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు షేక్ గఫార్ మాట్లాడుతూ, అవ్వా తాతలకు పింఛన్ సరి అయిన సమయానికి ఇంటి దగ్గర తెచ్చి ఇవ్వాలన్న, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత చదువుకోవాలన్న, రాజకీయాలలో సామాజిక న్యాయం కావాలన్న, మరల వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. గఫార్, అన్నాజీ రాజశేఖర్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారాని తెలిపారు.

ఈ కార్యక్రమంలో(జిసిసి) గల్ఫ్ సలహాదారులు యం.వి నరసారెడ్డి, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు, షేక్, గౌస్ బాషా, కువైట్ కో కన్వీనర్లు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, పులపుత్తూరు సురేష్ రెడ్డి, ఆకుమర్తి లాజరాస్, షేక్ షా హుస్సేన్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. లక్ష్మి ప్రసాద్, షేక్, రహమతుల్లా, బి. ఎన్. సింహా, ఏ. బాలకృష్ణ రెడ్డి, గోవిందు రాజు, అప్సర్ అలీ, పి. ప్రభాకర్ యాదవ్, మహబూబ్ బాషా, చల్లా అమర్నాథ్ రెడ్డి, సయ్యద్ ఇమ్రాన్, ఆబూతురాబ్, సయ్యద్ సలీం, పాటూరు వాసు, సుబ్బారావు,కల్లూరు వాసుదేవ రెడ్డి,పోలి గంగిరెడ్డి, మరియు నూతన కువైట్ కమిటీ సభ్యులు వై.యస్. కుటుంబ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సమాచార సేకరణ
ఇలియాస్ బి హెచ్.

ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం  కొరకు ఏపీఎన్ఆర్టీఎస్ అనునిత్యం పనిచేస్తుంది : డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్.కువైట్  16.03.20...
16/03/2024

ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం కొరకు ఏపీఎన్ఆర్టీఎస్ అనునిత్యం పనిచేస్తుంది : డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్.

కువైట్ 16.03.2024: కువైట్ దేశం లోని మాలియా ప్రాంతంలో ఉన్న ( TCC ) తెలుగు క్రైస్తవ సంఘం చర్చ్ లో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ( APNRTS ) ప్రవాసాంధ్రులకు చేస్తున్న సేవల గురించి వివరించిన APNRTS డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్ గారి నేతృత్వంలో APNRTS ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించడం కొరకు అనునిత్యం పని చేస్తుందని ఈ సంస్ధకు రాష్ట్ర ప్రభుత్వ బాడీ చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి ఎస్. బి. అంజాద్ బాషా గారు సీఈఓ గా పి. హేమలత రాణి గారు ఉన్నారని. 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 2 లక్షల 50 వెలుగు పైగా ప్రవాసాంధ్రులు వివిధ రూపాల్లో సహకరించారని. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో స్వరాష్ట్రం వచ్చిన ప్రవాసాంధ్రులకు వారు దిగిన విమానాశ్రయం నుంచి వారికి కేటాయించిన క్వారంటైన్ ఉచిత బస్సు, ఉచిత క్వారంటైన్ ఉచిత పౌష్ఠికహరం గల భోజనం ఏర్పాటు చేసిన ఘనత వై.యస్, జగన్మోహన్ రెడ్డి గారిదని భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి ప్రవాసాంధ్రులకు ఇటువంటి సౌకర్యం ఎవ్వరు చేయలేదని అంతే గాక ఉచిత అంబులెన్స్ చనిపోయిన కుటుంబానికి 50 వేల ఎక్స్గ్రేషియా ఇస్తున్నారని ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని ప్రవాసాంధ్రుల కొరకు 2019 ఎన్నికల సమయంలో ఎటువంటి ఇవ్వక పోయినా ప్రవాసాంధ్రుల కొరకు పని చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మీ పార్ధన లో గుర్తు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి బ్లేసింగ్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఇంతటి మంచి అవకాశం కల్పించిన సంఘం వ్యవస్థాపకులు పెద్దలు అపోస్తులు డా: లివింగ్ స్టాన్ గద్దె గారికి, సంఘం సభ్యులకు ముఖ్యంగా నా మిత్రులు జాన్ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.

సమాచార సేకరణ
బి హెచ్ ఇలియాస్

15/03/2024

గీతాంజలి గారికి శ్రద్ధాంజలి ఘటించిన యుఏఈ వైఎస్ఆర్సిపీ నాయకులు, మరియు అంబేద్కర్ సేవా సమితి సభ్యుల బృందం

యూఏఈ : 15.03.2024: YSRCP NRI అధ్య క్షులు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ ఛైర్మెన్, శ్రీ మేడపాటి వెంకట్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ, యూఏఈ కమిటీ మరియు అంబెడ్కర్ యూఏఈ సేవ సమితి ఆధ్వర్యంలో, టీడీపీ జనసేన ల సోషల్ మీడియా దురాఘాతాలకు, బలిఅయిన తెనాలి కి చెందిన గీతాంజలి అనే సోదరీ కి ఘననివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి సంఘీభావం గా సుమారు 100మందితో దుబాయ్ లోని బార్ దుబాయ్ ప్రాంతంలో లో ఈ రోజు ( 15 March,శుక్రవారము)సాయంత్రం 9.30 గంటలకు సమావేశం ఏర్పాటుచేసి ఆ సొదరికి ఘన
నివాళులర్పించినారు.

ఈ కార్యక్రమంలో YSRCP NRI విభాగ సలహాదారులు శ్రీ ప్రసన్న సోమిరెడ్డి,అంబేడ్కర్ యువజన సంఘ UAE విభాగ సమన్వయ కర్త శ్రీ మోహన్ రావు,వైఎస్సార్సీపీ UAE విభాగ కమిటీ సభ్యులు శ్రీ . రెద్దయ్య రెడ్డి,శ్రీనివాస్ చౌదరి, ధనలక్ష్ణి,విజయ,శ్రీ కుమార్,శ్రీ రవి మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఆవిడకి ఘన నివాళులు అర్పిస్తూ , కొవ్వొత్తుల ప్రదర్శన చేసేరు.ఈ విధంగా trolls చేస్తూ మానసిక క్షోభకు గురి అయ్యేట్టు చేసి ఆవిడ ఆత్మహత్యకు పురుగొల్పోయే లాగ చేసిన వాళ్ళను పట్టుకుని తగిన శిక్ష వెయ్యాలని ప్రభుత్వా న్ని NRI ప్రతినిధులు కోరడం జరిగింది.

APNRTS కువైట్ రీజినల్ కో ఆర్డినేటర్ నాయని మహేశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయం : APNRTS డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్, కువైట్ : ...
15/03/2024

APNRTS కువైట్ రీజినల్ కో ఆర్డినేటర్ నాయని మహేశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయం : APNRTS డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్,

కువైట్ : కడప పట్టణం కుమార్ కుంటకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ 6 నెలల క్రితం డ్రైవర్ పని కొరకు కువైట్ వచ్చాడు కువైటీ ( స్పాన్సర్ ) ప్రతి రోజు కొట్టడం తిట్టడం చేసే వాడు ఇలా దినసరి చర్యలో భాగం అయింది. రెండు నెలలు ఓపిక పట్టి 4 నెలల క్రితం కువైటీ ఇంటి నుంచి పారిపోయి తెలిసిన వారి దగ్గర ఉన్నాడు విజా తీసిన ఏజెంట్ ను అడిగితే నీవు చెప్పకుండా పారిపోయావు నేను ఏమి చేయలేను అని చెప్పాడు. కొడుకు విషయం అమ్మకు తెలిసి బెంగ పట్టుకొని తమ 34వ డివిజన్ ఇంచార్జ్ షేక్ అలీ అక్బర్ దృష్టికి తీసుకెళ్లి మా అబ్బాయి కువైట్ కష్టాల్లో ఉన్నాడు ఎవరికో ఒకరికి చెప్పి ఇండియా పిలిపించి మార్గం చూడమని అభ్యర్ధించారు. వెంటనే APNRTS డైరెక్టర్ ఇలియాస్ దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే కువైట్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి గారికి తెలపగా మహేష్ భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి షేక్ మహమ్మద్ రఫీ పై ఎటువంటి కేసులు లేకుండా జైలుకు పోకుండా అవసరం అయితే మరల కువైట్ వచ్చేటట్లు చేశారు.

ఈ సందర్భంగా ఇలియాస్, బాలిరెడ్డి గారు మాట్లాడుతూ APNRTS గౌరవ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో APNRTS అధ్యక్షులు మేడపాటి ఎస్ వెంకట్ గారి నేతృత్వంలో అను నిత్యం ప్రవాసాంధ్రుల సంక్షేమం సమస్యల పరిష్కారం కొరకు పని చేస్తుందని APNRTS కు రాష్ట్ర ప్రభుత్వ చెర్మైన్ గ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, సీఈఓ గా పి. హేమలత రాణి గారు ఉన్నారని కువైట్ APNRTS తరపున మన రాష్ట్ర వాసుల ఎన్నో సమస్యలను పరిష్కరించిన నాయని మహేష్ గారికి అభినందించారు ఇండియా వెళ్ళేండేందుకు టికెట్ బాధితుడి స్నేహితుడు కుటుంబ సభ్యులు భరించారు అని తెలిపారు.

బాధితుడు రఫీ మాట్లాడుతూ నేను కువైట్ ఇంటి నుండి వచ్చినప్పుడు ఏజెంట్ తో సహా చాలా మంది నీవు ఇండియా వెళ్లాలంటే జైలు కు పోయి పోవాలి మరల కువైట్ రాలేవు అని భయపెట్టారు. దేవుడి దయ వలన మన అక్బర్ అన్న ఇలియాస్ అన్న మహేష్ అన్న వారు చేసిన సహాయంతో నేను ఈ రోజు ఇండియా వెళ్లగలుగుతున్నానని వీళ్ళు ఎవార్ప్ నాకు తెలియదు నా సొంత అన్నల మాదిరిగా సహాయం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేడపాటి వెంకట్ గారికి, ఇలియాస్ గారికి, బాలిరెడ్డి గారికి ముఖ్యంగా నాయని మహేష్ అన్న కు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవిందు నాగరాజు, మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, పులపత్తూరు సురేష్ రెడ్డి, పోలి గంగిరెడ్డి, సయీద్ నజర్ తదితరులు పాల్గొన్నారు.

సమాచార సేకరణ
బి హెచ్ ఇలియాస్.

*దోహా (ఖతార్) APNRTS కో ఆర్డినేటర్, సామాజిక సంఘ సేవకురాలు శ్రీమతి. రజనీ మూర్తి గారిని  ఘనంగా సన్మానించిన APNRTS డైరెక్టర...
12/03/2024

*దోహా (ఖతార్) APNRTS కో ఆర్డినేటర్, సామాజిక సంఘ సేవకురాలు శ్రీమతి. రజనీ మూర్తి గారిని ఘనంగా సన్మానించిన APNRTS డైరెక్టర్ ఇలియాస్ మరియు ఖతార్ APNRTS సభ్యులు*

దోహా, ఖతార్ : 16 సంవత్సరాల క్రితం శ్రీమతి. రజనీ మూర్తి ఖతార్ లో ఫ్రెంచ్ టీచర్ గా పనిచేశారు. రజనీ గారి భర్త బాలకృష్ణ మూర్తి విశ్వనాథం జీసీసీ ( గల్ఫ్ ) ఖతార్, కువైట్, దుబాయ్, ఒమాన్ దేశాలకు జనరల్ ఎలక్ట్రానిక్ (GE) కంపెనీ లో రీజినల్ జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఇటీవలే రజనీ గారు ఉద్యోగం మానేసి, తన భర్త సహకారంతో సామాజిక సేవలో నిమగ్నం అయ్యారు. APNRTS కో ఆర్డినేటర్ గా, సామాజిక సేవకురాలిగా ఖతార్ లో తెలుగువారికి అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు..
రజనీ మూర్తి గారు ఇండియన్ కమ్యూనిటీ బెనవలెంట్ ఫోరమ్ లో వరుసగా 4 సంవత్సరాలు పనిచేశారు. (నిరుపేద మహిళలకు రాయబార కార్యాలయంలోకి ప్రవేశించడానికి మద్దతు ఇవ్వడం, వారికి అవసరమైన పత్రాలు సిద్ధం చేయడం, దుస్తులు మరియు ప్రాథమిక అవసరాలు అందించడం, రాయబార కార్యాలయం సహాయంతో స్థానిక జైలు సందర్శన). లేబర్ ఆఫ్ ఇండియా కమ్యూనిటీకి లేబర్ ఆఫీసర్ల సేవలు పొందడంలో సహాయం చేశారు. అంతేకాకుండా డాక్యుమెంటేషన్ మరియు సలహాలు ఇస్తూ వారికి సహాయమందించారు.
ఈ సందర్భంగా APNRTS డైరెక్టర్ బి.హెచ్. ఇలియాస్ మాట్లాడుతూ... ఇంతటి సేవలు అందిస్తున్న రజనీ మూర్తి గారు APNRTS లో భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా రజనీ గారు APNRTS ద్వారా రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ లలో పనిచేసే ఉపాధ్యాయులకు, తనతో పాటు, ఇతర NRI టోస్ట్ మాస్టర్లను భాగస్వాములను చేస్తూ స్వచ్చందంగా 4 నెలల పాటు, వారానికి ఒకసారి రెండు గంటల చొప్పున ఈ శిక్షణ అందిచారు. ఇంగ్లీష్ మాధ్యమంలో భోదించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడంపై శిక్షణ ఇచ్చారు. ఇలా 2 బ్యాచులకు శిక్షణ పూర్తి చేసారు. ఒక బ్యాచ్ గిరిజన సంక్షేమ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు, మరొకటి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అందించారు. ఈ నేపథ్యంలో APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి గారు, సీఈఓ పి. హేమలత రాణి గారు రజనీ మూర్తి గారి సేవలను అభినందించి, ఖతార్ APNRTS సభ్యులతో కలిసి సన్మానించామని ఇలియాస్ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో APNRTS సభ్యులు దొండపాటి శశికిరణ్, వర్జిల్ బాబు, మనీష్ రెడ్డి మరియు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, ఖతార్ కో కన్వీనర్ జాఫర్ హుస్సేన్, కె. లక్ష్మణ్, గల్ఫ్ కొర్ కమిటీ సభ్యులు నల్లి నాగేశ్వర రావు, జయరాజు, తదితరులు పాల్గొన్నారు.

Source
B H Iliyas
Director APNRTS.

*ఖతార్ ఇండియన్ అంబాసిడర్ శ్రీ. హెచ్.వి. విపుల్ గారిని కలిసిన  APNRTS డైరెక్టర్ మరియు ఖతార్ APNRTS కో ఆర్డినేటర్స్* దోహా,...
12/03/2024

*ఖతార్ ఇండియన్ అంబాసిడర్ శ్రీ. హెచ్.వి. విపుల్ గారిని కలిసిన APNRTS డైరెక్టర్ మరియు ఖతార్ APNRTS కో ఆర్డినేటర్స్*

దోహా, ఖతార్: ఇండియన్ అంబాసిడర్ శ్రీ. హెచ్. వి. విపుల్ గారిని APNRTS డైరెక్టర్ బి.హెచ్. ఇలియాస్, ఖతార్ కో ఆర్డినేటర్స్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో APNRTS పనిచేస్తుందని తెలిపారు. ఈ సంస్థ అధ్యక్షులు శ్రీ. మేడపాటి ఎస్ వెంకట్ గారి నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి APNRTS సేవలు అందిస్తుందని తెలిపారు. 24/7 హెల్ప్ లైన్ ద్వారా నిత్యం వారికి అందుబాటులో ఉంటాము. APNRTS గవర్నింగ్ బాడి చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ వెల్ఫేర్ శాఖ మాత్యులు శ్రీ. ఎస్.బి. అంజాద్ బాషా గారు, సీఈఓ పి . హేమలత రాణి గారు ఉంటారని, APNRTS సేవలు, పనితీరును గౌరవ అంబాసిడర్ గారికి వివరించారు.

APNRTS చేస్తున్న సేవల బ్రోచర్ మరియు 2019 నుండి ఇప్పటి వరకు చేసిన సేవల గణాంకాలు, లబ్దిదారుల సంఖ్య, ప్రభుత్వం భరిస్తున్న మొత్తం తదితర వివరాల బ్రోచర్ ను ఇలియాస్ గారు అంబాసిడర్ గారికి ఇచ్చారు. వివరంగా అన్ని చదివిన అంబాసిడర్ గారు మీ రాష్ట్రం నుండి ఇన్ని సర్వీసెస్ ప్రవాసాంధ్రులకు (NRTs) అందివ్వడం గొప్ప విషయమని, మీ ముఖ్యమంత్రి గారు ప్రవాసుల క్షేమం కోసం APNRTS ద్వారా ఇన్ని సేవలు అందించడం అభినందనీయమన్నారు.

అనంతరం, మీ సంస్థ ఇంత చేస్తున్నా, మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు అక్రమ ఏజెంట్లు మాయమాటలు చెప్పి, నమ్మిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక వారిని పట్టించుకోకపోవటంతో ఖతార్ లో పనిచేయటానికి వచ్చి ఇబ్బంది పడుతున్నారన్నారు. మీరు వలసకార్మికుల కోసం సక్రమ వలసలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తద్వారా ఈ సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు.

ఇలియాస్ మరియు కువైట్ APNRTS కో ఆర్డినేటర్ గోవిందు నాగరాజు, ఖతార్ కో ఆర్డినేటర్స్ డి. శశి కిరణ్, ఎస్ . జాఫర్ హుస్సేన్, ఆరోన్ మనీష్, నల్లి నాగేశ్వర రావు మాట్లాడుతూ ఖతార్ లో బంధువులు ఎవరూ లేక కష్టాల్లో ఉండి, భారతదేశం వెళ్ళలేని వారికి, ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఎంబసీ ద్వారా ఉచిత విమాన టికెట్ ఇవ్వాలని మనవి చేశారు.

దీనికి అంబాసిడర్ గారు సానుకూలంగా స్పందించి, నిజమైన బాధితులు ఉండి నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా టికెట్ ఉచితంగా ఇస్తామని చెప్పారు.

APNRTS తరపున అంబాసిడర్ గారికి బి.హెచ్. ఇలియాస్ మరియు కో ఆర్డినేటర్లు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.

ఏపీఎన్ఆర్టిఎస్ వారు చేసిన మేలు జీవితంలో మరచి పోలేను: పప్పు పద్మకువైట్:  12.03.2024: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం...
12/03/2024

ఏపీఎన్ఆర్టిఎస్ వారు చేసిన మేలు జీవితంలో మరచి పోలేను: పప్పు పద్మ

కువైట్: 12.03.2024: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్న గొట్టిగల్లు మండలానికి చెందిన పప్పు పద్మ గత 2 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం కువైటీ ఇంట్లో హౌస్ మెయిడ్ గా వచ్చింది. వచ్చినప్పటి నుంచి కష్టాలు పడుతూ, అయినాతన ముగ్గురు కుమారుల ఉజ్వల భవిష్యత్తు కొరకు కష్టం ఉన్న భరిస్తూ పనిచేసుకుంటూ వచ్చింది.
24/02/2024 వతేదీన తన చిన్న కుమారుడు తరుణ్ ఆత్మహత్య ప్రయత్నం తన కుమారుడి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది డాక్టర్ రెండు మూడు రోజులు పోతే గాని ఏం చెప్పలేము అని చెప్పడంతో తన కుమారుడి చుడానికి స్వదేశానికి వెళ్లేందుకు తన కువైటి ని అడిగితే వారు తనను పంపడానికి నిరాకరించారు.

ఈ విషయం గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు దృష్టికి తీసుకొని వెళ్ళగానే వెంటనే స్పందించి ఏపీఎన్ఆర్టీ ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ నాయిని మహేశ్వర రెడ్డి గారికి విషయం వివరించి ఇండియా కు పంపమని అభ్యర్థించగా వెంటనే మహేష్ గారు భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి సంబంధిత పేపర్ వర్క్ పనులు పూర్తి స్పాన్సర్ ను అంబాసి వద్ద పిలిపించి పప్పు పద్మ ను ఎందుకు స్వదేశానికి ఎందుకు పంపలేదని, ఆమె పాస్ పోర్ట్ విమాన టికెట్ తెచ్చి ఇచ్చేది అని అడగక నిన్న 11-03-2024 విమాన టికెట్ మరియు దారి ఖర్చులు కువైటి ఇచ్చారు.

ఈ సందర్భంగా, పప్పు పద్మ గారు మాట్లాడుతూ APNRTS ద్వారా ప్రవాసాంధ్రులకు ఆదుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారికి అధ్యక్షులు మేడపాటి ఎస్ వెంకట్ గారికి, సీఈఓ పి. హేమలత గారికి, డైరెక్టర్ ఇలియాస్ గారికి, వైకాపా కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారికి, ముఖ్యంగా తనను, ఇండియా వెళ్ళేందుకు అన్ని విధాలా సహకరించిన నాయిని మహేశ్వర రెడ్డి గారికి, భారత రాయబార కార్యాలయం అధి కారులకు, మరియు గోవిందు నాగరాజు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయ వలన నా కుమారుడి ఆరోగ్యం స్థిరంగా ఉంది APNRTS వారు చేసిన మేలు జీవితాంతం మరచిపోలేనని తెలిపారు.

సమాచార సేకరణ
బి హెచ్ ఇలియాస్.
డైరెక్టర్ ఏపీఎన్ఆర్టీఎస్.

బి హెచ్ ఇలియాస్ గారికి ఘన స్వాగతం పలికిన కువైట్ వైఎస్ఆర్సిపీ నాయకుల బృందం.కువైట్: 11.03.2024: గల్ఫ్ దేశాలలో వైఎస్ఆర్సిపీ...
11/03/2024

బి హెచ్ ఇలియాస్ గారికి ఘన స్వాగతం పలికిన కువైట్ వైఎస్ఆర్సిపీ నాయకుల బృందం.

కువైట్: 11.03.2024: గల్ఫ్ దేశాలలో వైఎస్ఆర్సిపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఖత్తర్ పర్యటన ముగించుకొని కూవైట్ కు విచ్చేసిన సందర్భంగా బి హెచ్ ఇలియాస్ గారికి, గల్ఫ్ కో-కన్వీనర్ గోవింద నాగరాజు గారికి, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైఎస్ఆర్సిపీ నాయకులు ఘన స్వాగతం పలికినారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నిన 2024 లో అధికారం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ దే  : ఇలియాస్ గ...
10/03/2024

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నిన 2024 లో అధికారం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ దే : ఇలియాస్ గల్ఫ్ కన్వీనర్

దోహా ఖతార్: ఖతార్ లోని తాజ్ మహారాజా రెస్టారెంట్ లో ఖతార్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యుల పరిచయ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్. గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు పాల్గొన్నారు ఇలియాస్ నూతన కమిటీ సభ్యులను పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ 40 సం :ల పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం 14 సం :లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన అమ్ముల పొదిలో ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని ఉపయోగిస్తున్నారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్ల కొరకు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్న కూడా ఓట్లు షేర్ అయితాయో లేదో అని కాంగ్రెస్ పార్టీతో ఉన్న గత సంబంధాలు ఉపయోగించు కొని మోసురుపల్లి షర్మిల శర్మను కాంగ్రెస్ అధ్యక్షురాలు చేపించి కనీసం 10 శాతం వై.యస్.ఆర్. కాంగ్రెస్ ఓట్లు చీల్చిన పర్వాలేదు అని భావించాడు అది వాస్తవ రూపం దాల్చడం లేదని వై.యస్. వివేకానందరెడ్డి కూతురు, భార్య, వై.యస్. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన డ్రైవర్ దస్తగిరి చేత ఎన్నికల సమయం అని మా అధినేత వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా ఆచరణలో రావడం లేదని భయంతో బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజల ఆశీర్వాదంతో వై.యస్,ఆర్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రెండోసారి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం అని చెప్పారు.

గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు మాట్లాడుతూ ఖతార్ కన్వీనర్ గా రెండోసారి ఎన్నికైన డి. శశికిరణ్ గారికి అభినందనలు తెలిపి నూతన కమిటీ సభ్యులు అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపి మా అధినేత వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్య మంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఎవరెవరు ఎన్నికల సమయంలో దోహా ఖతార్ నుంచి రాష్ట్రానికి వస్తున్నారు వారి వివరాలు ఇవ్వాలని మనవి చేశారు.

ఖతార్ కన్వీనర్ శశికిరణ్, గల్ఫ్ అడ్వైజర్ వర్జిల్ బాబు, కో కన్వీనర్ జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి మహా నాయకులు వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని తన తండ్రి ఆశయ కొరకు రాజకీయాల్లో వచ్చిన మా అధినేత వై.యస్. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కన్నా రెండడుగులు ముందుకేసి మైనారిటీలకు రాజకీయంగా ఆర్థికంగా ఆదుకుంటూ అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని. ముఖ్యంగా గల్ఫ్ ప్రవాసాంధ్రుల కొరకు APNRTS ద్వారా వారు అందిస్తున్న సేవలు మరచి పోలేమని ముఖ్యంగా కరోనా విపత్కర సమయంలో రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సేవలు మరిచిపోలేమని రాష్ట్ర ప్రజలతో పాటు ప్రవాసాంధ్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరోసారి ముఖ్యమంత్రి గా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు.

గల్ఫ్ కొర్ కమిటీ సభ్యులు నేతల జయరాజు, నల్లి నాగేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నవరత్నాల పేరుతో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతి పక్షాలు రాష్ట్రం దివాళా దివాళా తీస్తుంది రాష్ట్రం మరో శ్రీలంక అయితది అని గంగోల్లు పెట్టిన ప్రతి పక్షాలు ఎన్నికలు సమిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఇస్తామని ప్రతి పక్షాలు చెప్పడం వారి దివాళాకోరు రాజాకీయాలకు దోహదం పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోహా ఖతార్ వైఎస్ఆర్సిపీ సీనియర్ నాయకులు వర్ధనపు ప్రకాష్ బాబు, కో కన్వీనర్లు మనీష్ రెడ్డి, కె. లక్ష్మయ్య, మోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

ఏపీఎన్ఆర్టిఎస్ అను నిత్యం ప్రవాసాంధ్రుల సంక్షేమం కొరకు పని చేస్తుంది : APNRTS డైరెక్టర్ ఇలియాస్దోహా  ఖతార్ : ఖతార్ అబూ ఉ...
08/03/2024

ఏపీఎన్ఆర్టిఎస్ అను నిత్యం ప్రవాసాంధ్రుల సంక్షేమం కొరకు పని చేస్తుంది : APNRTS డైరెక్టర్ ఇలియాస్

దోహా ఖతార్ : ఖతార్ అబూ ఉమర్ ప్రాంతంలో ఉన్న ఇండియాన్ చర్చ్ కాంప్లెక్స్ లోని తెలుగు చర్చ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ (TCF) లో APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ గారికి చర్చ్ ఫాస్టర్ బుల్లబ్బాయి గారు APNRTS చేస్తున్న సర్వీస్ గురించి వివరించా మని అవకాశం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఇలియాస్ గారు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల సంక్షేమం మరియు వారి సమస్యలను పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో అధ్యక్షులు మేడపాటి ఎస్ వెంకట్ గారి నేతృత్వంలో APNRTS అను నిత్యం పని చేస్తుందని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు దురదృష్టం కొద్దీ ఎవరైనా మరణిస్తే వారి భౌతికకాయాన్ని స్వరాష్ట్రం పంపినప్పుడు బాడీని విమానాశ్రయం నుంచి స్వగృహం వరకు APNRTS ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేస్తుందని మరియు మరణించిన పేద వారు ఉంటే గుర్తించి వారి కుటుంబానికి 50 వేలు ఎక్స్గ్రేషియా ద్వారా ఆర్ధికంగా APNRTS ఆదుకుంటుంది
ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గమే APNRTS .ప్రవాసాంధ్రుల
కోరకు ఇంత మంచి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారికి మీ పార్ధనలో పార్ధించి మీ బ్లేస్సింగ్ ఇచ్చి మరో మారు ముఖ్యమంత్రి చేసుకోవాలని అభర్ధన చేశారు.

ఖతార్ APNRTS కో ఆర్డినేటర్స్ శశికిరణ్ , వర్జిల్ బాబు, శ్రీమతి రజని మూర్తి, మనీష్ రెడ్డి, లక్ష్మణ్, వసంతప్ప, వెంకట్రాం , ప్రజలకు పరిచయం చేసి వారు సేవలను గుర్తించి వారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్లి నాగేశ్వరావు, జయరాజు, లియో తదితరులు పాల్గొన్నారు

కుల మతాలకు అతీతంగా రాజకీయ అభివృద్ధి వైఎస్సార్సిపీ లోనే :: ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషకడప;మార్చి 3, రాజకీయంగా ప్రతి ఒక్కరూ ...
03/03/2024

కుల మతాలకు అతీతంగా రాజకీయ అభివృద్ధి వైఎస్సార్సిపీ లోనే :: ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష

కడప;మార్చి 3, రాజకీయంగా ప్రతి ఒక్కరూ ఎదగాలంటే వైయస్సార్సీపీలోనే అది సాధ్యమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు. ఆదివారం కడప నగరం రవీంద్ర నగర్ లో ఏర్పాటుచేసిన ఎన్నారై గయాజ్, బీహెచ్ ఇలియాస్ డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, చల్ల రాజశేఖర్, రెడ్డి ప్రసాద్ ల ఆధ్వర్యంలో టిడిపి నుండి వైసీపీలోకి పలువురు చేరినారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలు పూర్తి చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు నవరత్నాల రూపంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నారు. రాజకీయం అనేది ఎన్నికల సమయంలోనే తప్ప ఎన్నికైన తర్వాత నేను ఒక ముఖ్యమంత్రిగా ఐదు కోట్ల మంది నా ప్రజలే అనుకొని పరిపాలన చేస్తున్నానని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారన్నారు. కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా రెండు వేల కోట్ల రూపాయలు సంక్షేమం పేరుతో నేరుగా అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయని ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూలు అభివృద్ధి చేయబడిందన్నారు. ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా కడప నగరంలో 12 పీహెచ్సీలను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించామని తెలిపారు గతంలో ఎప్పుడు వరదలు వస్తాయో ఎప్పుడు రవీంద్ర నగర్లోకి నీళ్లు వస్తాయో తెలియక ప్రజలు ఇబ్బంది పడే వారిని ఎన్నికల ముందు రవీంద్ర నగర్ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఎన్నికల తరువాత బుగ్గ వంక వాల్ ఎస్టిమేషన్ వేసుకుని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని డబ్బులు శాంక్షన్ చేయించుకుని ఈరోజు బుగ్గ వంక వాల్ గోడ పూర్తి చేయడం జరిగిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

కడపలో ఏ ప్రాంతము తెలియని వ్యక్తులు కడపకు వచ్చి అభివృద్ధి జరగలేదంటూ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తున్న వ్యక్తులకు ఈ సభాముఖంగా సవాల్ విస్తృతంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత ఎంత అభివృద్ధి చేశామో కరపత్రాల రూపంలో మేము విడుదల చేసాం దమ్ముంటే మీరు ఏం అభివృద్ధి చేశారో కరపత్రాల రూపంలో ప్రజలకు వివరించగలరా అంటూ సవాల్ విసిరారు రవీంద్ర నగర ప్రజలకు బిడ్జిలు లేక ఇబ్బంది పడుతున్న వారి కొరకు త్వరలో రెండు బ్రిడ్జిలు 20 కోట్ల రూపాయలతో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

అనంతరం వక్తలు మాట్లాడుతూ కడుప లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రతినిత్యం అందుబాటులో ఉన్న నాయకులు అంజద్ భాష అని అన్నారు. కరోనా కష్టకాలాల్లో కుటుంబంలో కుటుంబ సభ్యులకు రెండు సార్లు కరోనా వచ్చిన ప్రజల కోసం ప్రతి సందు తిరిగి ప్రజల అవసరాలు తీర్చిన మా నాయకులు అంజద్ భాష అని కొనియాడారు. ఏ పార్టీ అధికారం లేకొస్తే ఏ నాయకుడు అధికారంలోకి వస్తే మన కుటుంబాలు బాగుంటాయో అటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని అంజాద్ భాషను గెలిపించుకునే బాధ్యత మనపై ఉందన్నారు. నిత్యం ఏదో ఒక అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేసే నాయకుడు చంద్రబాబు అని అన్నారు. కడప అభివృద్ధి జరిగిందో లేదో కడప ప్రజలకు తెలుసని వలస పక్షులకు ఏమి తెలుసని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కడప ఇంచార్జ్ అహ్మద్ బాషా, నాయకులు షఫీ, ఉమేర్, అల్లా బాకాష్, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, కమల్ భాష, చల్ల రాజశేఖర్, దాసరి శివ, డాక్టర్ మురద్, లాయర్ అబ్బాస్, రెడ్డి ప్రసాద్, వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు రవీంద్ర నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Address

Hyderabad
5000082

Alerts

Be the first to know and let us send you an email when Kuwait Gulf News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kuwait Gulf News:

Videos

Share


Other Media/News Companies in Hyderabad

Show All

You may also like