సూర్యలంక బీచ్ (బాపట్ల)
Suryalanka Beach Bapatla
@top fans
అయితే ఏంటంటావ్ ఇప్పుడు.. ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టిన మెగాస్టార్..
సత్యదేవ్ హీరోగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘జీబ్రా’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకలో చిరు ఓ అభిమానితో సరదాగా వైజాగ్ యాసలో మాట్లాడారు.
'బాసూ నిన్ను చూసేందుకు వైజాగ్ నుంచి వచ్చాను' అని ఓ అభిమాని గట్టిగా అరవగా..
'నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే..
మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి..
భలేవాడివే' అంటూ చిరు వైజాగ్ యాసలో మాట్లాడారు.
నాగార్జున సాగర్ to శ్రీశైలం
సోమశిల to శ్రీశైలం
పల్నాడు జిల్లా
బాంబులు వేసి ప్రజల పొలాలను లాక్కొని వాటికోసం జగన్ షర్మిల కొట్టుకుంటున్నారు -డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం గ్రామం
గత వైసిపి ప్రభుత్వం సరస్వతి పవర్ ప్లాంట్స్ కు సంబంధించి ఇచ్చిన భూములను పరిశీలించిన పవన్ కళ్యాణ్
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
1. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన సరస్వతి పవర్ ప్లాంట్స్ కు భూములు ఇవ్వలేదని ప్రజలపై బాంబులు వేసి బెదిరించి వందల ఎకరాల భూమిని ప్రజల వద్ద నుండి లాక్కున్నారన్నారు
2. ప్రజల వద్ద నుండి బలవంతంగా లాక్కున్న భూముల కోసం ఈరోజు జగన్ షర్మిల బజారుకెక్కి కొట్టుకుంటున్నారు అన్నారు
3. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కోడెల శివప్రసాద రావు గారు అసెంబ్లీ నుంచి ఫర్నిచర్ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన వసతి లేకపోతే తన కుటుంబ సభ్యు
కొండమోడు నుండి గుంటూరు వెళ్ళు రహదారిని సుమారు 9 వందల కోట్ల రూపాయలతో జాతీయ రహదారిగా రూపకల్పన చేస్తూ నిధులు మంజూరు చేయించి అనుమతులు తీసుకొచ్చిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి పలనాడు ప్రజానికం తరఫున తరఫున హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
Sri Krishna Devarayalu Lavu
#lavusrikrishnadevarayalu
#TeluguDesamParty
#Palnadu
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి బస్టాండ్ పరిస్థితి మరి దారుణంగా తయారయ్యింది
కొన్ని సంవత్సరాల నుండి దాచేపల్లి బస్టాండ్ నిరూపయోగంగా ఉండడం వలన రోడ్ల కూడలిలో ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బస్సుల కోసం వేచి ఉంటున్నారు.ఇక్కడ తాగునీరు,మరుగుదొడ్లు కనీసం నీడ కూడా లేకపోవడంతో స్కూల్ పిల్లలు,వృద్ధులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
నిరూపయోగంగా బస్టాండ్ ఉండటం వలన అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది
ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ఆర్టీసీ ఉన్నత అధికారులు స్పందించి ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు
చూస్తూ ఆగలేకపోయాం సార్ ...
ప్రాణం పోయినంత పనయ్యింది : మందుబాబులు
గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో పట్టుబడిన రూ.50లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్లో ధ్వంసం చేశారు.
ఈ నేపథ్యంలో కొందరు యువకులు, మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను దోచుకెళ్లారు.
*సత్తెనపల్లి లో మొట్టమొదటి సారి 61 అడుగుల మట్టి విగ్రహం ఏర్పాటు*
*గుంటూరు జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన గణనాథుడు*
సత్తెనపల్లి పట్టణంలో నాగార్జున కాలనీ నందు మట్టితో తయారుచేసిన 61 అడుగుల గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు.....
పట్టణ ప్రజలు విగ్రహాన్ని చూడటానికి అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.....
*ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ..*
గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సారి మట్టితో ఏర్పాటు చేసిన 61 అడుగులు విగ్రహం.. ఏర్పాటు చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము...
ఇలా మట్టి విగ్రహం ఏర్పాటు చేయటం మొదటిసారి..
రెండో సంవత్సరం కూడా మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు...
12వ తారీకు గురువారం అన్నదాన కార్యక్రమం జరుగును...
కావున భక్తులందరూ అన్నదాన జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం..
#Palnadu
అన్న క్యాంటీన్ల ద్వారా రుచి, శుభ్రత కలిగిన ఆహారం అందించనున్న అక్షయపాత్ర.
#AnnaCanteen
#AndhraPradesh
శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేత
ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు.
చిన్న చిన్న బుట్టలు వేసుకొని నదిపై గుంపులు గుంపులుగా చేపలకు వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులవుతున్న యాత్రికులు.
గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందకి వదిలిన అధికారులు.
ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించిన అధికారులు.
ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు.