Journalist Venkat

Journalist Venkat Journalist..

అహంకారంతో కొందరు..అధికారం కోసం కొందరు..ఆస్తి కోసం కొందరు..డబ్బు కొందరు,ప్రేమ కోసం కొందరు,మనుషులకు దూరంగా రాగ ద్వేషాలకు ద...
08/03/2024

అహంకారంతో కొందరు..
అధికారం కోసం కొందరు..
ఆస్తి కోసం కొందరు..డబ్బు కొందరు,ప్రేమ కోసం కొందరు,
మనుషులకు దూరంగా రాగ ద్వేషాలకు దగ్గరగా బ్రతుకుతున్న,విర్రవీగుతున్న అల్పులకు జ్ఞానోదయం కలిగించ ప్రార్ధన!

లోకాసమస్తా సర్వేజనః సుఖినోభవంతు!
హర హర మహాదేవ్..🙏

#మిత్రులకు_మహాశివరాత్రి_శుభాకాంక్షలు

#పసుల_వెంకట్✅
08.03.2024

నేను చాలాసార్లు గమనించానుఏదైనా ఒక సంఘంలో కలిసి పని చేసినప్పుడు, లేకపోతే ఏదైనా పని కలిసి చేయాల్సిన వచ్చినప్పుడు మాత్రమే మ...
16/02/2024

నేను చాలాసార్లు గమనించాను
ఏదైనా ఒక సంఘంలో కలిసి పని చేసినప్పుడు, లేకపోతే ఏదైనా పని కలిసి చేయాల్సిన వచ్చినప్పుడు మాత్రమే మన బాగోగులు, అవసరాల గురించి పట్టించుకుంటారు కానీ,కొంత మంది ఎలాంటి సందర్భాల్లోనైనా మన బాగోగుల గురించి ఆరా తీస్తుంటారు. అలాంటి కొద్ది మంది వ్యక్తుల్లో తుమ్మేటి రఘోత్తమ రెడ్డిగారు.

మంగళవారం రోజు నా జన్మదినం సందర్భంగా ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు, దానికంటే ముందు ఒకరోజు రఘోత్తమ రెడ్డి సార్ గారు నాకు ఫోన్ చేసారు. నాకు సంబంధించిన కొన్ని విషయాలు గురించి వారికి తెలియజేసాను..కొన్ని సందర్భాల్లో నేను రఘోత్తమ రెడ్డి సార్ గురించి నా పోస్టుల్లో చెప్పిన..

ఇప్పుడున్న కాలంలో ఆపద ఉంది అంటే, అయినా వాళ్ళు కూడా సహాయం చేయారు (అందరూ కాదు కొందరే) కానీ ఒక సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు..

ఫేస్బుక్ లో ఓ కుటుంబానికి ఆరోగ్య సమస్య వచ్చి, కోలుకున్న వ్యక్తికి మీరు ఏదైనా ఆర్థిక సాయం చేయండి అని, తన ఫేస్బుక్ వాల్ పైన చిన్నిస్టోరీ రాసారు.. ఓకేరోజులు దాదాపు లక్ష రూపాయల వరకు ఆ వ్యక్తి అకౌంట్ లో డబ్బులు జమయ్యాయి అంటే అది మాములు విషయం కాదు..

నా పుట్టినరోజు నాడు నాకు సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేస్తూ పోస్టు పెట్టాడు, నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వారు వయసులో చాలా పెద్దవారు, నాకు ఫోన్ చేసి జీవితంలో కొన్ని విషయాలు నాతో మాట్లాడం చాలా హ్యాపీగా అనిపించింది..మొదటిసారి నేను వారితో ఫోన్లో మాట్లాడం.. నేను చాలాసార్లు చెప్పాను కధ, 'ఏ దిక్కు లేనివారికి ఆ దేవుడే దిక్కు' అని అంటారు కధ, అట్లే ప్రతిరోజు 'తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ' గుడ్ మార్నింగ్ శీర్షిక చదవండి, ఇప్పుడున్న సమాజం పట్ల మనకు ఎంతోకొంత అవగాహన మాత్రం రావడం పక్క..

ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, చిదరింపులు, చిత్కారాలు.... వాటి నుంచి ఉపశమనం కలిగించడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న విజయాలు, మీ అభినందనలు.

చాలా మందికి సమాధానం ఇవ్వలేకపోయా. మెసేజుకు రిప్లై ఇవ్వలేకపోయా. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

'కన్న కొడుకు కండ్ల ముందు సచ్చిపోతే, కన్న తల్లిదండ్రులకు కాట్లే (సచ్చేదాక) పడేంత వరకు కష్టమే..'అని మొన్న మా నాన్నమ్మ అంటు...
05/01/2024

'కన్న కొడుకు కండ్ల ముందు సచ్చిపోతే, కన్న తల్లిదండ్రులకు కాట్లే (సచ్చేదాక) పడేంత వరకు కష్టమే..'

అని మొన్న మా నాన్నమ్మ అంటుంటే ఇన్న, అట్ల ఎందుకు అంటారు అని అడిగిన, చేతికొచ్చిన కొడుకు కండ్ల ముందే సచ్చిపోతే, అయ్యవ్వకు వాళ్ళు సచ్చేదాక పెద్ద గోసనే అన్నది..మొన్న మా సోపాతి గాడు పానం బాగలేక జీవిడిషిండు.రెండ్రోజులకు వల్ల బాపును పరామర్శించడానికి వెళ్లిన, ఇల్లంత ఎదో కోల్పోయినట్టు ఉంది, మంచం మీద ఒరిగిన వల్ల నాన్న నేను పొంగనే లేషిండు, మీదపడి మస్తు ఏడ్షిoడు, చేతికందిన కొడుకు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటాదో అప్పుడు అర్థం అయింది..

అందుకే కావొచ్చు ఈ సమేత వచ్చింది, వాడు ఉన్నన్ని రోజులు ఏ రండి లేకుండా బతికినం బిడ్డా! ఇప్పుడు నాకు ఎం జెద్దమన్న ధైర్యం సరిపోతలేదు అని, నేను సచ్చిపోయోటోన్ని నన్ను బతికించి వాడు చనిపోయిండని చెప్పిండు, వాడు నేను ఒక దగ్గరనే సదువుకున్నాం, కల్సి తిరిగినం పెద్దోళ్ళు అయినంక వాడు గజ్వేల్ పోయిండు,నెను ఇక్కడే ఉన్న ఎప్పుడు కలసిన అదే ప్రేమ ఉంటుండే.. మొన్న మేము 31st దవాత్ కూసుంటే వాని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాం..

నిన్న మా ఊరిలో ప్రజా పాలన కోసం దరఖాస్తు చేసుకొమ్మంటే కొంతమంది ఆ అప్లికేషన్లు రాయడం రాలేక నాఇంటి దాకా వచ్చిర్రు, నెను డ్యూటీ కెళ్ళి వచ్చేదాకా నా ఇంటికడనే కుసర్రు అంటే నామీద నమ్మకంతోనే వచ్చిర్రు. నేను రాస్తుంటే కొడుకులు చనిపోయిన తల్లిదండ్రులు బాధపడడం శాన బాధనిపించింది..

మీ ఇంటికి అట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చిన ఒక 5.నిమిషాలు సమయం తీసుకొని ఆ అప్లికేషన్ నింపండి

#పసుల_వెంకట్✅
05.01.2024

డ్యూటీకు తాయారైనంక రోజు రెండు రౌండ్లు తిప్పి ఇంటికాడ కిందికి దింపంగనే బాయ్ చెప్పి ఒక ఫ్లైయింగ్ కిస్ పాడేశి నీ పనైపోయింది...
14/12/2023

డ్యూటీకు తాయారైనంక రోజు రెండు రౌండ్లు తిప్పి ఇంటికాడ కిందికి దింపంగనే బాయ్ చెప్పి ఒక ఫ్లైయింగ్ కిస్ పాడేశి నీ పనైపోయింది అని ఎనకమర్ర సూడకుంట పోతడు మా చిన్నోడు (అన్నయ్య కొడుకు).. ఇయ్యాల అట్లనే చేసి కిందికి దింపిన.. బాయ్ చెప్తే బాబా బాబా అని గట్టిగ ఒర్లుడు చేసిండు.. మల్లోక రౌండ్ ఎయ్యాలేమో అని బండెక్కిచ్చిన.. ఒర్రుడు ఆపలే.. కిందికి దింపంగనే దన్న దన్న లోపటికి ఉరికి టేబుల్ మీద ఉన్న హెల్మెట్ సూపిచ్చి దా దా అని అన్నడు.. ఏమంటాడో సూద్దాం అని వద్దు అన్న.. అది తిస్కునేదాక గులిగిండు.. ❤️

ఆని శాతలు సూషి గమ్మతనిపిస్తది.. ఆనికి అన్ని అర్థం అయిపోతున్నయి.. పెద్దోడు అయిపోతుండు..🥰

#పసుల_వెంకట్✅

మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటే నచ్చదు కాని?! గంగవ్వ చెప్పే ముచ్చట్లు నచ్చుతాయి!కలిసి ఉంటే కలదు సుఖం అని కన్న తల్లి, తండ్రి చెప...
08/12/2023

మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటే నచ్చదు కాని?! గంగవ్వ చెప్పే ముచ్చట్లు నచ్చుతాయి!

కలిసి ఉంటే కలదు సుఖం అని కన్న తల్లి, తండ్రి చెప్తే నచ్చదు కాని?! బలగం లాంటి సినిమా తీస్తే ఆహా,ఓహోలు!
సంపాదించ పోతే చేతకానోడు అంటారు.! ఎక్కువ సంపాదిస్తే ఎంత ఉన్న సరిపోదు అంటారు.!

ఒకడు నాశనం ఐతే చూసి నవ్వుకుంటారు.! ఒకడు బాగు పడితే చూసి ఓర్వలేరు.!

ఇలాంటి దరిద్రపు బుద్ధులన్నీ మనిషిలో పోగొట్టి,మనిషి బ్రతకడానికి ఎం జరిగిన ఎం అవ్వదు అనే ధైర్యం లేదా ఏదైనా పర్లేదు బ్రతకగలను అనే తెగింపు ప్రసాదించాలని ఆ మహాశివుణ్ణి కోరుకుంటు!

మిత్రులందరికీ,
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు,
హర హర మహాదేవ్!

#పసుల_వెంకట్✅
08.12.2023

సరిగ్గా అయితే గుర్తుకు లేదు కానీ నేను పదవ తరగతి 2012 లో చదువుతున్న సమయంలో రాత్రి 11 గంటలకు నాన్న ఒక్కడే లేచి పొలంకి పోదా...
07/12/2023

సరిగ్గా అయితే గుర్తుకు లేదు కానీ నేను పదవ తరగతి 2012 లో చదువుతున్న సమయంలో రాత్రి 11 గంటలకు నాన్న ఒక్కడే లేచి పొలంకి పోదాం అని రెడీ అవుతుండు, ఈ టైంలో ఎడికి బాపు అంటే ' మొక్కజొన్న' మొత్తం ఎండిపోతుంది, రాజన్నకు జెనరేటర్ తీసుకోని రమ్మన్న ఇప్పుడు వస్తున్న అని ఫోన్ చేసిండు అన్నాడు..

కొన్నిరోజులుగా అలాగే నాన్నతో పాటు నేను వెళ్లేవాన్ని' నాన్న వెళ్ళగానే నీళ్లు కట్టడం మొదలుపెడితే ఉదయం 2 గంటల వరకు కడితే ఎకరానర పొలం పారేది..అప్పుడు నీళ్లకు, కరెంటుకు మస్తు తిప్పలు పడ్డాం, ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న గారు సీఎం అయిన తర్వాత నీళ్ల కష్టాలు,కరెంటు కష్టాలు తిరినై (భూములు తీసుకోవడం పెద్ద తప్పు)

మొన్న జరిగిన ఎన్నికలలో కేసీఆర్ గెలుపుకు Venkatreddy Veluri అన్న, Ramakrishna Reddy Erri అన్న, Balu Yadav అన్న, Nagaraj Patel అన్న ఇతర యువకులు చాలా కష్టపడ్డారు. కేసీఆర్ గెలుపు మాత్రం కృషి చేసింది పక్క విల్లే..

Kalvakuntla Kavitha
Kalvakuntla Taraka Rama Rao - KTR
Harish Rao Thanneeru
KCR

#పసుల_వెంకట్
07.12.2023

మీ ఓపికకు దండం  నర్సన్న అన్న..బతుకంతా పోరాటమే..అలుపెరుగని రాజకీయ పోరాట యోధుడు టిఎన్ఆర్.రాజకీయ దురదృష్టవంతులునమ్మిన సిద్ధ...
07/12/2023

మీ ఓపికకు దండం నర్సన్న అన్న..

బతుకంతా పోరాటమే..అలుపెరుగని రాజకీయ పోరాట యోధుడు టిఎన్ఆర్.

రాజకీయ దురదృష్టవంతులు
నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి,నాటి నుండి నేటి వరకు కేసీఆర్ పై పోరాడుతూనే వస్తున్నాడు,గజ్వేల్ లో కాకుండా యాడ పోటీ చేసిన తూముకుంటా నర్సారెడ్డి చట్ట సభలో అడుగు పెట్టేవారు...

మళ్ళీ బీఅర్ఎస్ కు వెళ్ళిన.. కేబినెట్ రాంక్ హోదా లేదా మంచి పదవి వచ్చేది.. కానీ మనసు సంపుకొని వెళ్ళలేదు..
పదవుల కోసం ఎప్పుడు చూడలేదు..10 ఏండ్లు గా.. గజ్వేల్ లో రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నారు..ఆత్మస్థైర్యాన్ని వీడలేదు

గజ్వేల్ లో ఎమ్మెల్యే గా ఓడిపోయిన.. కాంగ్రెస్ హయాంలో మంచి పదవి రావాలని కోరుకుంటున్న..ఎవరు అధికారంలో ఉన్న,గజ్వేల్ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలి,పార్టీలకతీతంగా గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి పై కలసికట్టుగా ముందుకు వెళ్లాలి...

Thumkunta Narsareddy
Anksha Reddy

#పసుల_వెంకట్✅
06.11.2023

అమ్మ : "లెవ్వవారా ఇంక.."😡నేను : "యే పోమ్మ.. ఆదివారం పూట కుడ ఏందమ్మ లొల్లి.."😏😏అమ్మ :"రాత్రి దాకా ఫోన్లు టిక్క టిక్క ఒత్త...
30/11/2022

అమ్మ : "లెవ్వవారా ఇంక.."😡

నేను : "యే పోమ్మ.. ఆదివారం పూట కుడ ఏందమ్మ లొల్లి.."😏😏

అమ్మ :"రాత్రి దాకా ఫోన్లు టిక్క టిక్క ఒత్తుడు.. ఎండ మొకం మీదికొచ్చేదాక పండుడు.."😡😡

నేను : "రోజు లేస్తన్న కదనే జల్దిన్నే.. ఇయ్యాల్నన్న పండుకోనియ్యి.. ఏమన్న పనుంటే అన్నను లేపు.."😏😏

అమ్మ : 'అన్న మబ్బులనే కొలువుకు పోయిండు'పత్తెరాలి కులోళ్లు ఓస్తుర్రు' జల్దీ లేషి మొఖం కడుక్కో'శాయ్ తాగి పోదాం మేం ఏరిన కొద్దీ సంచులల్ల నింపుదువు'😡

నేను : నువ్వెన్ని తిట్టిన సరే ఇయ్యల లెవ్వ అంతే..🫣😞

అమ్మ : లెవ్వురా పనుంది..😠 లేషి ఆ కులోళ్లను దించిరా..

నేను : మొదలువెట్టినవా..ఈ ఐతరం గోలనే మీకు అన్ని పనులు యాదికస్తయ్

రాధమ్మ : 'బాబాయ్ లెవ్వురా తాత వస్తుండు' మనం అంబాలు (ఆవులు) పోదాం తమ్ముడు లక్కీ గిట్ల..😘

జీవితం అంటే గింతే ఆదివారం నౌకరి లేదని ముర్షేలోపే' బాయికడి పనులన్ని మతికస్తాయ్..☺️

పొద్దుగాళ్లనే వచ్చి నేను చేసే పనులో నాకు ఆసరా అయినా సోపాతిగాళ్ళు( Raju Mudhiraj Haribabu Mudhiraj ) శికటివడే యల్లదాకా ఉన్నారు..దవాత్ గట్టిగానే అయింది..😊

29.11.2022

ఆమ్మ జన్మనిస్తుంది,రక్తదాత పునర్జన్మనిస్తారు.❤️5వ సారి రక్తదానాం చేసే అవకాశం ఇచ్చిన తుర్కపల్లి 'డియర్ వన్ నియర్ వన్'  ఫౌ...
21/09/2022

ఆమ్మ జన్మనిస్తుంది,రక్తదాత పునర్జన్మనిస్తారు.❤️
5వ సారి రక్తదానాం చేసే అవకాశం ఇచ్చిన తుర్కపల్లి 'డియర్ వన్ నియర్ వన్' ఫౌండేషన్ సభ్యులకు
హృదయ పూర్వక ధన్యవాదాలు...తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రక్తదానం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా..

కొంతమందికి అవగాహన కోసం
ఈ పోస్ట్ పెడుతున్నాను

ఆరోగ్య వంతులు అయిన ప్రతి ఒక్కరు 50 కిలోల బరువు ఉన్నవారు 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయచ్చు ప్లేట్ లెట్స్ కౌంట్ పరీక్ష చేసుకొని 60కిలోల పైన బరువు ఉన్న వాళ్ళు 15 రోజులకు ఒక సారి ప్లేట్ లెట్స్ ఇవ్వొచ్చు...

రక్తదానం చేసినప్పుడు 350 ml రక్తం మన శరీరం నుండి వెళ్తుంది కానీ ప్లేట్ లెట్స్ దానం చేస్తే 30 ml నుండి 50 ml లోపు రక్తం మాత్రమే వెళ్తుంది.వీటి నుండే కణాలు ఉత్పత్తి అవుతాయి ఒకసారి ప్లేట్ లెట్స్ దానం చేసిన తర్వాత 72 గంటల్లో మళ్ళీ పునరుత్పత్తి అవుతాయి సంపూర్ణ ఆరోగ్యం తో ఉంటాము కావున దయచసి యువత ఒకసారి ఆలోచించండి🙇‍♂️🙏
మీ అందరికి హృదయా పూర్వక విజ్నప్తి మీ కుటుంబం కోసం మీ ఇంటి నుండి మీరే రక్తదాతగా ప్రాణ దాతగా ముందుకు రండి సామాజిక సేవకుకు గా చరిత్రలో నిలవండి..

నాసరం (నాచారం) జాతర..Bhanu Prasad Goud  అన్న ఇయ్యల స్టోరీ పెట్టిండు అని వచ్చినా,బ్రహ్మోత్సవాలకు ఇదే కొత్త రావడం..అందరిలా...
02/04/2022

నాసరం (నాచారం) జాతర..

Bhanu Prasad Goud అన్న ఇయ్యల స్టోరీ పెట్టిండు అని వచ్చినా,బ్రహ్మోత్సవాలకు ఇదే కొత్త రావడం..

అందరిలాగే నాకు జాతర పోవలె అని ఉంటది నేను శిన్నగున్నప్పుడు మా ఇంటిపక్కోల్లు,సుట్టలు,చెప్తుండే కొంచం బాధగా అనిపించింది,అప్పుడు కొంచం మా బాపు మీద కోపం వస్తుండే ఎక్కడి ఏ జాతరకు తీసుకపొడు అని ఇప్పుడు బాధ్యత పెరిగిన తర్వాత నాకు యాదికి వస్తుంది,నలుగురం కడుపులో పుట్టినం గదా ఎనక ముందు బాపుకు పైసలు ఎడికెళ్లి వస్తాయి అని అర్థం అయింది జాతరకు మేము రాకపోవడానికి అసలు కారణం మా ఆర్థిక పరిస్థితి బాగలేక,అలా ఎప్పుడు మాకు కష్టం రాకుండా సాదిండు గదా అందుకే రాలేక పోయిన

ఇందకే మా హరి బాబు అన్న నేను రవీందర్ వచ్చినుండే దర్శనం బాగానే అయింది,గుళ్లో ఎవరులేరు కానీ బయటనే బాగానే ఉన్నరూ అనిపించింది, ఏడోళ్ళు ఆడనే పడుకున్నారు,మాకు కొద్దిసేపు ఉంటేనే దోమలు బాగా కుచినయ్ అక్కడా ప్రజలు ఎట్లా ఉంటారో మరి, కొత్తగా పోయిన అంత కొత్తగా అనిపిస్తుంది, మెల్ల మెల్లగా అన్ని దుకండ్లు సూసుకుంటు ఒచ్చినం,dj పాటలు ఏ గల్లీల సూసిన బుల్లెట్ బండి,రాధమ్మ,మైసమ్మ పాటలు జోరు నడుస్తున్నాయి కొందరి డాన్సులు చూస్తే బాగా చేశిర్రు

మొత్తానికి ఇగ దేవాలయం విషయం వస్తే రాష్ట్ర ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది కానీ అవేవి ఇక్కడ కనిపించలేదు,నాచారం గుట్టకు ఆ పేరు ఎలా వచ్చింది ఆలయ నిర్మాణం గురించి మొత్తం ఉన్నది ఉన్నట్టు మా అన్న (భాను ప్రసాద్) అన్న చెప్పిండు అన్న వాల్ మీద ఉంది చూడని వారు సుడుర్రి

సోపాతిగాళ్లకు,అన్నలకు అక్కలకు తెలుగు నూతన సంవత్సర మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు

ఊళ్లే ఒగ్గుకథ చెప్పేటోళ్లు ఇప్పుడు మా దిక్కు శానమంది పోరాలను తయ్యార్ జేసిండు మా ఒగ్గు యాదయ్య మామా గారు,మొన్న పాతుర్ గ్రా...
27/01/2022

ఊళ్లే ఒగ్గుకథ చెప్పేటోళ్లు ఇప్పుడు మా దిక్కు శానమంది పోరాలను తయ్యార్ జేసిండు మా ఒగ్గు యాదయ్య మామా గారు,మొన్న పాతుర్ గ్రామంలో ఎల్లమ్మ పట్నాలు ఏసుకుర్రు అంటే మా దోస్తులతో కలిసి సుడపోయిన నాకు తెలిసిన తమ్ముడు స్త్రీ వేషం ఏశిండుల్లా ఇచ్ఛాత్రం అనిపించింది ఆ పాత్రలో ఎల్లమ్మ తల్లి వేషంలో నిలమైండు,

తమ్ముని పెరు శ్రీశైలం చిన్నప్పటి సంది ఒగ్గుకథలు అంటే జెరంత ఇష్టం ఉండే ఇగ ఆర్థికంగా వెనుకబడిన వాడు కాబట్టి కథలు నేర్చుకుంటుండు,ఏనుకట ఊర్ల కథ చెప్పితే చాలామంది సుడనికి వచ్చేవాళ్ళు అంట గిప్పుడు ఎవరన్నా పండుగ చేసుకుంటేనే కథలు చెప్పుడు సుస్తునం ఎప్పుడైతే ఊర్లకు డిష్ లు,వచ్చినయో అప్పటి నుంచి ఊరి కళలు బందు అయినయి,ఇగ ఎప్పుడైతే మొత్తము స్మార్ట్ ఫోన్ ఇంకా వందల చానెళ్లు వచ్చిన తరువాత సిరియల్లు చూడనికి అలవాటు పడ్డరు,రాత్రి 7 గంటలకు నుంచి మొదలు వెడితే రాత్రి 9 గంటల దాకా సిరియల్లు చూడనికి అలవాటు పడ్డారు (మా ఇంట్లో కూడా కొంత వరకు తగ్గింది) ఇంకా అందులో కూడా ఎడుపుగొట్టువి,అత్తకోడండ్ల పంచాయతీ,ఒక్క మొగుడు ఇద్దరు పెండ్లాలు ఇలాంటి సొల్లు కథలతో సాగదిత స్టోరీలు నడుస్తున్నాయి

మనకు ఎలాగో ఇష్టం ఉండదు కానీ కళాకారులకు ఏదైనా ఆపాదవస్తే మనవంతు సాయం చేద్దాం కళలను ప్రోత్సాహిద్దం కళాకారులను గౌరవిద్దాం..🙏

పండుగ బాగానే జరిగింది మేమేం కూడా తమ్ముడు చెప్పిన కథను కొద్దిసేపు విన్నాం కానీ మేము అనుకున్న సమయం కంటే ఎక్కువే అయింది అని ఒక ఫోటో దిగి అక్కడి నుండి బయలుదేరినం మొన్న ఒక వీడియో పెట్టిన చాలామంది బాగుంది బాగుంది అన్నారు అందులో పాడిన తమ్ముడే ఈ శ్రీశైలం..🙏

20/11/2021

ఎన్ని సార్లు విన్నసరే కొన్నిటి మీద ఇష్టం పోదు అలాంటిదే ఈ పాట కూడా..!!

జైభీమ్ సినిమా తమిళనాడు లోని రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు గారి జీవితం ఒక న్యాయవాదిగా వృత్తి ప్రారంభించి మానవ హక్కుల ...
03/11/2021

జైభీమ్ సినిమా తమిళనాడు లోని రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు గారి జీవితం ఒక న్యాయవాదిగా వృత్తి ప్రారంభించి మానవ హక్కుల కోసం డబ్బులు తీసుకోకుండా వాదించి ఎంతో మంది పీడిత వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి కథనే ఈ సిన్మా...

ఆయన జడ్జి అయ్యాక 6 సంవత్సరాల కాలంలో 96,000 (వేలకు) పైగా కేసులు వాదించి పరిష్కరించి రికార్డ్ సృష్టించారు మహిళలకు దేవాలయంలో పూజారులు కావొచ్చు,కాలం ఏదైనా అందరికి ఒకే స్మశానం ఉండాలి ఇలా ఎన్నో విప్లమాత్మక తీర్పులు ఇచ్చారట

ఇగ కథలోకి వస్తే...

ఇంతకు ముందు వీళ్ళు ఎన్ని సినిమాల్లో చేశారో తెలీదు గానీ ఈ సినిమాతో నటనలో ఎవరెస్టు అంత ఎత్తుకు ఎదిగారు..

సూర్య యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పేందుకు లేదు ఎందుకంటే తన స్థాయి ఏంటో మనకు ముందే తెలుసు నిర్మాతగా ఇటువంటి ఆణిముత్యాలని వెలుగులోకి తెచ్చినందుకు మాత్రం ఇండస్ట్రీ ఋణపడింది తనకి

ఇంత క్లియర్గా ఉన్నది ఉన్నట్టు తమిళ్ డైరెక్టర్లు,సూర్య జ్యోతికలకే చెల్లింది.

సినతల్లికి ఒక పోలీసు చెప్తాడు "ఈ కేస్ ఏటో పోతుంది, ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటే తీసుకరా" అని

గాయాలు కొన్ని రోజుల్లో మానిపోతాయి..కానీ ఒక్కసారి దొంగ అని ముద్ర పడితే దాన్ని చేరపడం కష్టం..
"లా" అనేది ఒక వెపన్ ఇలా కొన్ని డైలాగ్ బాగున్నాయి..

అయిన ఎవరు వస్తారు....!? ఇట్లా ఎంతమంది అమాయకులు బలైపోతున్నారో..

మొన్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సార్ ఒకమాట క్లియర్ గా చెప్పిన్రు..."దొంగలుగా ముద్రపడిన వారు కొన్ని సామాజిక వర్గాల ప్రజలే ఎందుకు ఉంటారు...? కార్లలో, తెల్ల బట్టలు ఏసుకొని మాతో(పోలీసు) దర్జాగా ఏసీ రూముల్లో కూర్చునేవాళ్ళు ఎవరని... ? ఏ తప్పు చేయకున్న చెట్ల కింద బయట పడిగాపులు కాసే జనాలు ఎవరని... ??"

అసలు ట్రైబల్స్ ఉన్న గుడిసెలు అచ్చంగా అడవిలో ఉన్నట్టే మక్కీకి మక్కీ దింపిండ్రు ప్రతీ ఫ్రేమ్ డైనమిక్ సహజత్వం ఎక్కడ పోనియ్యలేదు

ఒక ఆదివాసీ (ట్రైబల్) మహిళను కేసు ఎపించి ఆ మహిళకు కమ్యూనిస్ట్ నాయకులు ఉపాధ్యాయురాలు సహకారంతో పాటు ఆ కేసుని అద్వకేట్ 'చంద్రు' వాదించడం ఈ సిన్మాకు సెట్ అయింది..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి అన్యాయం జరగడం లేదు అని నేను భావిస్తున్న అందరూ చూడాల్సిన సినిమా చదువు గురించి తెలియజేసే సిన్మా...

Journalist Venkat

లిక్కరే ప్రధాన ఆదాయ వనరు అని..  అవ్వి లేకుంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందివ్వలేమని అంటారు..కానీ అసలు లిక్కర్ లేకుంటే.. అద...
03/08/2021

లిక్కరే ప్రధాన ఆదాయ వనరు అని.. అవ్వి లేకుంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందివ్వలేమని అంటారు..
కానీ అసలు లిక్కర్ లేకుంటే.. అది తాగకుంటే పేదలకు డబ్బులు మిగులుతాయి..
అనవసర అనారోగ్యాలు ఉండవు,
హాస్పిటల్స్ ఖర్చులు ఉండవు.
ఇంట్లో గొడవలు ఉండవు
తాగిన మైకంలో మహిళల పట్ల వేధింపులు ఉండవు
తాగి నడిపడం వల్ల జరిగే యాక్సిడెంట్లు ఉండవు
యాక్సిడెంట్స్ లో చనిపోయి గాయపడిన కుటుంబాలకు కడుపుకోత ఉండదు..
తాగిన మత్తులో మర్డర్లు ఉండవు
తాగిన సోయిలో మిత్రులతో గొడవలు ఉండవు
తాగిన నిషాలో చేసే చిల్లర గోడవలతో జైలుపాలు అయ్యే అవకాశాలు ఉండవు..

ఇన్ని లేకుండా ఉంటే ప్రతి ఇంటికి కచ్చితంగా డబ్బులకు లోటు ఉండదు..
సోమరితనం నేర్పే పనికిమాలిన సంక్షేమ పథకాల అవసరం ఉండదు.

 #పోచమ్మలోళ్ళు #పెద్దమ్మలోళ్ళుతెలంగాణ పల్లెల్లో పంటలు ఇంటికి వచ్చే మాసంలోఈ పోచమ్మలోళ్ళు భార్యభర్తలు కలిసి వచ్చి ఇంటింటిక...
10/07/2021

#పోచమ్మలోళ్ళు
#పెద్దమ్మలోళ్ళు
తెలంగాణ పల్లెల్లో పంటలు ఇంటికి వచ్చే మాసంలో
ఈ పోచమ్మలోళ్ళు భార్యభర్తలు కలిసి వచ్చి ఇంటింటికి తిరుగుతూ ధాన్యాన్ని దానంగా స్వీకరిస్తారు భార్య ఒక పోచమ్మ పోటో నెత్తిమీద పెట్టుకుని డోలు, డప్పు కొడుతుంది.
భర్తనేమో ఒక #ఇరగోలతో కొట్టుకుంటాడు.

ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు కనుమరుగు అయ్యే దిశలో ఉన్నాయి.

ఒకప్పుడు మా ఊరికి దాదాపుగా పది నుంచి ఇరవై వరకు ఇలా పోచమ్మలోళ్ళు వచ్చేవారు.
ఇప్పుడు అప్పటి పరిస్థితి మాత్రం లేదని చెప్పాలి.
మహా అయితే ఒకరిద్దరు మాత్రమే వస్తున్నారు.
ఇంటి దగ్గర పిల్లలు అన్నం తినకపోతే
"పోచమ్మలోళ్ళు వస్తున్నారు. వారికి పట్టిస్తిను అని",

"అన్నం తినకపోతే పోచమ్మలోళ్ళకు పట్టిస్తా అప్పుడు మంచిగైతది" అని పిల్లలకు భయపెట్టి అన్నం తినిపించేవారు.

( ఇక్కడ పోచమ్మలోళ్ళను అవమానించడం మాత్రం కాదు సుమా..!).

ఒక్క వరి పంటకు మాత్రమే కాదు.
జోన్నలు, మినుములు, పెసర్లు,శెనగలు,పల్లికాయ మొదలగు ధాన్యం దానం చేసేవారు.
ఇంట్లో కోడళ్ళు ఎంతమంది వస్తరు.
అందరికీ దానం చేస్తే ఉన్నది అమ్ముకునే పరిస్థితి వస్తదని అన్నప్పుడు మాత్రం
ఇంట్లో ఉండే పెద్దమనుషులు కలుగజేసుకుని దానం చేసేటోళ్ళు.

పోచమ్మలోళ్ళకు దానం చేస్తే దేవుడికి చేసినట్లేనని పెద్దమనుషులు అంటారు.
మా నాన్నమ్మ (పసుల లచ్చవ్వ) ఇంటికి వచ్చిన వారికి కాదనకుండా ఎంతోకొంత కలిగిన దాంట్లో దానం చేయడమే కాకుండా ఇంట్లో పెట్టిన చింతకాయ తొక్కు,మామిడి కాయ తొక్కు,దానం ఇస్తుండే.
నేటితరం పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పకపోకవడం వలన
మన పల్లెల్లో ఉంటే దానగుణం
మరియు మానవత్వ దృక్పథం తెలియకుండా పోతుంది నేను 10 రూపాయలు ఇచ్చిన

ములుగులో దింపిన ఫోట్వా ..

తెలంగాణ దర్శకుల సంఖ్య  తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య పెరుగుతూఉండటం చూస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది.  కేవలం కామెడీ కోసం వా...
13/06/2021

తెలంగాణ దర్శకుల సంఖ్య తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య పెరుగుతూఉండటం చూస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది. కేవలం కామెడీ కోసం వాడబడ్డ తెలంగాణ భాష ఇప్పుడు రాజసంగా తన ఉనికిని సగర్వంగా చాటుకుంటుంది.

మొన్న వచ్చిన " దొరసాని ".. ఈ మధ్యే ఆహాలో వచ్చిన "మెయిల్" (కంబాలపల్లి కథలు) సినిమా .. ఇప్పుడు "అర్ధశతాబ్ధం " సినిమాలు.. తెలంగాణ భాషతో జీవం పోసుకుని మన ప్రాంతం మన కథలు మన సంస్కృతి అని చెప్పుకోదగ్గ పరిధిని విస్తృత పరుస్తూ వస్తున్నాయి/వచ్చాయి.

ఇక 11 వ తారీకున అంటే ఇవ్వాళ "ఆహా" అనే OTT లో విడుదలయిన సినిమా " అర్ధశతాబ్ధం " ఇప్పటి వరకు జరిగినా.. జరుగుతూ వస్తున్న సామాజిక దౌష్ట్యాన్నీ.. స్వాతంత్త్ర్యం వచ్చి ఇన్నేళ్లయిన మారని అడ్డుగోడలనూ..సమాజంలో ఉన్న వైరుధ్యాలను ప్రశ్నించే సినిమాగా మన ముందుకు వచ్చింది.

దర్శకుడు రవీంద్ర పుల్లె కి నా అభినందనలు. అలాగే తమ్ముడుకీ .. ఊర్లో గొడవలు పెట్టి మారణహోమం జరిగేందుకు కారణమైన అగ్గిపుల్ల Mankenapalli కి మిగతా team అంతటికి best wishes.

చివరిగా రవీంద్రకి .
సినిమా తీసి జనాల్లోకి వదిలాక.. రాళ్లు పడ్డా పూలు పడ్డా సంతోషంగా స్వీకరించండి. Don't drop your spirits and Enjoy .. you have achieved a dream of becoming a Director. All the best

Thank You So Much   SAMEER ANNA and Team...🙏వర్గల్ గ్రామానికి చెందిన గుట్టమీద పద్మ కు ఇద్దరు  కూతుళ్లు ఒక కుమారుడు భర్త ...
13/06/2021

Thank You So Much SAMEER ANNA and Team...🙏

వర్గల్ గ్రామానికి చెందిన గుట్టమీద పద్మ కు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు భర్త లేకపోవడంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం వెల్లదీస్తున్నారు పెద్ద కుమార్తె *రేణుక* పెళ్లి కుదరడంతో మొన్న ఉదయం నాకు పెళ్లి కూతురు రేణుక నాకు ఫోన్ చేసి అన్న 13వ తేదీన నా పెళ్లి ఉంది ఆర్థిక పరిస్థితులు బాగలేవు అన్న నువ్వు చాలా మందికి హెల్ప్ చేస్తావ్ కధ నాకు కూడా ఏదైనా సాయం ఇప్పించు అన్న అని కొంచం బాధతో మాట్లాడింది..

నాకేమో మనసులో కొంచం బాధ దాదాపు ఎవరి సాయం అడగక చాలా రోజులు అవుతుంది ఎవరిని అడగాలి అనుకుంటే సరే అని ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వలేదు..

తరువాత...

వాట్సాప్ లో ఎప్పుడు సేవ కార్యక్రమంలో ముందుడే నాకు తెలిసిన గజ్వేల్ కు చెందిన సహాయ ఫౌండేషన్ అధ్యక్షులు మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ మహమ్మద్ సమీర్ ను సంప్రదించి తన పెళ్లికి సాయం చేయాలని కోరడంతో ఆయన స్పందించి సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాటికొండ భాస్కర్ రెడ్డి భాగస్వామ్యంతో పెళ్లికి కావాల్సిన పెండ్లి వస్తువులు సామానులతో తో పాటు బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ సభ్యులు మోహన్ రెడ్డి , యువజన నాయకులు సామాజిక కార్యకర్త సాదక్ పాషా ఉన్నారు అలాగే గజ్వేల్ కు చెందిన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో (గుంటుకుశ్రీనివాస్1500₹ ,పిట్ల ఆంజనేయులు1500₹, చింత శ్రీనివాస్1500₹, కొట్టాలశ్రీనివాస్1500₹,గుంటుకు యాదగిరి1000₹ ,బాకి నర్సింహులు100₹,).నుండి 7100 రుపాయలు ఆర్థిక సాయం అందించారు

నోట్:- ఇలా ఆర్థిక పరిస్థితులు బాగలేని వారు మన మండలంలో చాలా మందే ఉన్నారు వీరిని దృష్టిలో పెట్టుకుని కొన్ని రోజుల క్రితం నేను మేము ఫౌండేషన్ అని నెలకు 100 రూపాయలు అని పెట్టిన రెండు నెలలు ఇచ్చారు తర్వాత ఎవరు పంపలేదు ఏది ఏమైనా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..🙏
సరిత హిందూ అక్క 1000/-
Sadakk Pashah
Sangapu Kanna Gajwel II
Nagraj Patel Sameer Mohammad

ఒగ్గు కథల్లో...తరగని స్వరాలు ఉన్నాయి..ఒడువని ఏతలు ఉన్నాయి..మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి..వాటిని సజీవంగా ఉంచుతూ..ముం...
10/06/2021

ఒగ్గు కథల్లో...
తరగని స్వరాలు ఉన్నాయి..
ఒడువని ఏతలు ఉన్నాయి..
మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి..
వాటిని సజీవంగా ఉంచుతూ..
ముందు తరాలకు అందిస్తున్న కళాకారులందరికీ శతకోటి షణార్ధులు...🙏

26/05/2021

Address

Gajwel
502279

Telephone

+919032604447

Website

Alerts

Be the first to know and let us send you an email when Journalist Venkat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Journalist Venkat:

Videos

Share


Other Digital creator in Gajwel

Show All

You may also like