50 మీటర్ల రోడ్డు వేయలేని నాయకులెందుకు??
---------------------------------------
RR పేట్ కు దాదాపుగా ఏలూరు లోని 95 శాతం ప్రజలు నిత్యం లేదా రెండూ మూడు రోజులకు ఒకసారైనా వస్తారు. రమ మహల్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఉన్న ఈ రోడ్డు చంద్రమండలాన్ని తలపిస్తోంది. పెద్ద పెద్ద గోతులతో నిత్యం ఇటు వచ్చేవారు నరకం అనుభవిస్తున్నారు. ఏలూరు జిల్లా అధికారులు అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు నిత్యం తిరిగే రోడ్డును బాగు చేయాలి అని ఆలోచన మాత్రమే ఎవరికీ రావడం లేదు. 50 మీటర్ల రోడ్డులో 100 కు పైగా గుంతలు ఉన్నాయి. వర్షం వస్తే ఈ గుంతల్లో పడి వాహనదారులు కింద పడిపోతున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ 50 మీటర్ల రోడ్డు వేయలేని నాయకులు.... ఇంక ఏలూరును ఉద్దరిస్తారు అంటే నమ్మగలమా???
#elurucity #eluru #elurucorporation #BadetiChanti #shiknurjahan #elurucorporation
తరతరాల గతి.. ఇది ఏలూరు దుర్గతి
-----------------------------
1950- 60 దశకాల్లో ఏలూరు స్వరూపం చిన్నగా ఉన్నపుడు తమ్మిలేరు నుంచి ఇతర గ్రామాలకు వెళ్లేందుకు శనివారం పేట వద్ద ఎడ్ల బళ్ళ కోసం వేసిన బల్లకట్టు దారి లోనే ఇప్పటికి సగం నగరం నిత్యం ప్రయాణం. ఏలూరు నగరపాలక సంస్థగా మారినా.. రాను రాను నగర విస్తీర్ణం పెరుగుతున్న అదే బల్లకట్టు దారిలో ప్రయాణమే గతి. తమ్మిలేరుకు 2 వేల క్యూసెక్కుల నీరు వస్తే చాలు ఈ శనివారం పేట బల్లకట్టు దారి పూర్తిగా మునిగిపోతుంది. కొన్ని వేల కుటుంబాలకు ఏలూరు నుంచి దారి కనుమరుగు అవుతుంది. ప్రత్యామ్నాయ దారులు ఉన్న.. ఈ కీలకమైన బల్ల కట్టు దారికి ఎన్ని ప్రభుత్వాలు, ఎంతమంది నాయకులు వచ్చినా మోక్షం మాత్రం కలగలేదు.. ఈ దుర్గతిని పట్టించుకునే నాయకుడే కరువయ్యాడు. 😔
#eluru #elurucorporation #elurucity
అనుకోకుండా వచ్చిన వరద తో వేలేరుపాడు లో 25 మందిని హెలికాప్టర్ సాయం తో రక్షించిన ఏలూరు జిల్లా అధికారులు
#elurudistrict
ఇది సినిమా కాదు... సినిమాను తలపించే సన్నివేశం 😍
తూగో జిల్లా : రాజమండ్రి :
🔴 ఆత్మహత్యాయత్నం‼️
▪️ సినీ స్టైల్ లో పడవపై వేగంగా వచ్చి కాపాడిన జాలర్లు ▪️
▪️ హ్యాట్సాఫ్ పోలీస్..‼️
కుటుంబ కలహాల నేపథ్యంలో దూడల నాగలక్ష్మి (40) రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నుండి గోదావరిలోకి దూకిన వైనం..‼️
మహిళ గోదావరిలోకి దూకుచుండగా...
పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించి..
సదరు మహిళను జాలర్లు సహాయంతో కాపాడి , రక్షించి , స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించిన పోలీసులు..!!
పడవపై వేగంగా జాలర్లు వచ్చిన తీరు.. రక్షించిన తీరు.. పోలీసులు స్పందించిన తీరుకు.. స్థానికులు, ప్రజలు హర్షం వ్యక్తం..!!
రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రత్తయ్య & కానిస్టేబుల్ లీల కుమార్ .. ఫోన్ కాల్ కి స్పందించి వెంటనే మహిళను జాలర్ల సహాయంతో రక్షించడం అత్యద్భుతం అని పలువురి వ్యాఖ్య..!!
పాలన వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయడం మానేసి... పార్టీల కోసం పనిచేసేలా చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇది చాలా ప్రమాదకరం.. ఏలూరులో వైసిపి రంగుల లైటింగ్ ఖర్చు అక్షరాల రూ. 45 లక్షలు .. ఇది ప్రజా ధనం.
#eluru #YSRCongressParty
భోజనాలు పెట్టలేం.. బాలోత్సవ్ కు రాకండి 😡
-----------------------------------
4వ హేలాపురి బాలోత్సవ్ కు రావొద్దని తల్లిదండ్రులను అడ్డుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బాలోత్సవ్ వెళ్లే ప్రధాన ద్వారం అడ్డుగా బెంచీలను పెట్టి లోపలికి వెళ్ళవద్దని అడ్డుకున్నారు.... ఇదేమిటి అని ఆరా తీస్తే భోజనాలు సరిపోవడం లేదని శనివారం కూడా 3 వేల మందికి అనుకుంటే 6 వేల మంది భోజనాల కోసం వచ్చారాని చెప్పడం కొసమెరుపు... దీంతో తల్లిదండ్రులు తాము భోజనాల కోసం రావడం లేదని మాకు భోజనాలు అక్కర్లేదని చెప్పి లోపలికి వెళ్లడం మరింత చిత్రంగా అనిపించింది. 🤣
భోజనాలు పెట్టలేం బాబోయ్ అని ముందు చెప్పి ఉంటే బాగుండేది అన్నది ఏలూరు వాసుల ఆవేదన 🤣
#eluru #balothsav #elurucity
ఏసును ప్రేమించు"మన్నా"!!
ఏలూరు మన్నా చర్చ్ లో క్రిస్మస్ సందర్భంగా వెలుగు జిలుగులు!!
#eluru #cristmas2023
ఎన్ని రోజులు ఈ దౌర్భాగ్యం..?? ఏలూరు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయినా ఏలూరు దిశ మారలేదు... వర్షం పడిన ప్రతిసారి మోటార్ ఇంజిన్ తో నీళ్లు తోడుకునే దుస్థితి ప్రభుత్వ ఆస్పత్రి లో ఎన్నాళ్ళు.. ఎన్నేళ్లు??
#eluru
ఏలూరు లో వెలుగుల వేళ ❤️
#eluru
అన్యాయంగా ఫ్లెక్సీల తొలగింపు పై ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద జనసేన నిరసన
#Janasena #eluru
స్టేట్ మీడియా అంతా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరే 🤭
#TDP #Janasena
ఏలూరు రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. గూడ్స్ ఇంజన్ నుంచి ఒక్కసారిగా ఎగసి పడిన మంటలు.
#eluru #balasore