Chandamama Tv - Telugu

Chandamama Tv - Telugu Telugu stories

Deer friendship with Crows Hindi stories | हिरण और कौए की दोस्ती | funny Stories
22/07/2023

Deer friendship with Crows Hindi stories | हिरण और कौए की दोस्ती | funny Stories

Deer friendship with Crows Hindi stories | हिरण और कौए की दोस्ती | funny Stories https://www.you...

19/07/2023

అమాయకపు గాడిద తెలుగు కథ | Innocent Donkey funny Telugu stories

02/03/2023

కుందేలు లా మారిన సింహం | Telugu Kathalu | Moral stories in Telugu | Lion and Rabbit

डायनासोर भाग 10 हिंदी कहानी | Dinosaur vs wild animals big bottle Hindi stories https://www.youtube.com/watch?v=y4K7tKgG...
28/02/2023

डायनासोर भाग 10 हिंदी कहानी | Dinosaur vs wild animals big bottle Hindi stories

https://www.youtube.com/watch?v=y4K7tKgGWEU

डायनासोर भाग 10 हिंदी कहानी | Dinosaur vs wild animals big bottle Hindi stories ​

12/02/2023

మాయ దారులు నీతి కథ | Magical Paths Greedy Tiger and king lion story | Telugu kathalu

10/02/2023

వీర సింహం - మాయా చెట్టు పార్ట్-2 || King Lion and Magical Tree Greedy Gorilla attack Wild stories******* వీర సింహం - మాయా చెట్టు పార్ట్-2 ***************
వీర నెమ్మదిగా మెట్లెక్కి చెట్టు లోపలకు వెళ్ళాడు..
లోపల అదో అందమైన ప్రపంచంలా ఉంది.. చాలా ఆహారం కూడా కనిపించింది. అతనికి ఆహారం తినాలని లేదు..
"నాకు ముందు మా నాన్నను చంపింది ఎవరో తెలుసుకోవాలని ఉంది" అన్నాడు వీర..
"ముందు ఆకలి తీర్చుకో తరువాత అన్నీ తెలుస్తాయి.." అని వినిపించింది.
ఆకలిగా ఉందేమో.. అక్కడ కనిపించిన ఆహారాన్ని వేగంగా తినేసాడు.

తరువాత అక్కడికి ఎగురుకుంటూ బంగారు పక్షి ఒకటి వచ్చింది.. "వీరా.. నేను మాయా పక్షినీ .. నీ తండ్రిని చంపింది ఎవరో చెప్పడానికే నేను వచ్చాను.. "
ఆ మాట వినగానే వీర అదెవరో చెప్పమని చాలా తొందరచేసాడు.
"నీ తండ్రి ధీరని చంపింది నిన్ను చూసుకుంటున్న ఆ గొరిల్లానే.."
"నేను నమ్మను.. గొరిల్లా మామ చాలా మంచిది.. నన్ను బాగా చూసుకుంటుంది.. "
"అది మాయ మాటలతో నిన్ను మోసం చేస్తుంది వీరా.. శాశ్వతంగా ఈ అడవికి రాజు కావాలని దాని ఆశ.. మీ నాన్నను ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కానిపనీ.. అందుకే మీ నాన్న ధీరని.. పులివేషం వేసుకుని వచ్చి.. దొంగచాటుగా చంపేసింది.. ఒకవేళ మీనాన్నను చంపడం ఎవరైనా చూసిన అది పులి మీదకి నెట్టవచ్చని దాని ఎత్తుగడ.. ఇప్పుడు అదను చూసి నిన్ను చంపాలని చూస్తోంది.."
వీరకి గొరిల్లాపై చాలా కోపం వచ్చింది.
"నీకో నిజం చెప్పనా.. అదిప్పుడు అడవిలోని జంతువులన్నింటినీ చాలా కష్టాలు పెడుతోంది. ఈ అడవికి కాబోయే రాజుగా దానిని చంపి నీ వారిని రక్షించుకోవడం నీ బాధ్యత.. " అన్నది.
"కానీ నేను చిన్నవాడిని .. దానిని ఎదిరించడం నా వలన అవుతుందా.."
"ఏం భయపడకు.. నేను నీకు కొన్ని శక్తులు ఇస్తాను.. ఆ శక్తుల వల్ల నీవు ఎంతడి బలవంతుడినైనా ఎదిరించి నెగ్గగలవు.." అని శక్తులు ఇచ్చింది..
"వెళ్లు.. వెళ్లి నీ వారినీ, ఈ అడవిని కాపాడు.." అని చెప్పి ఎగిరిపోయిందా పక్షి.

చెట్టులోంచి బయటకు వచ్చిన వీర కోపంతో ఊగిపోతూ వేగంగా గొరిల్లా స్దావరానికి వెళ్లాడు. అప్పటికే వీర కనిపించకపోవడంతో తిరగొచ్చిన గొరిల్లా కోపంతో ఉంది.. స్దావరానికి వస్తూనే వీర "మా నాన్నను చంపిన నిన్ను వదలను..." అంటూ గొరిల్లాపై దాడికి దిగింది.
వీరకి అసలు నిజం తెలిసిపోయిందని గ్రహించిన గొరిల్లా కూడా పిల్ల వీరనే కదా అనుకుని ప్రతి దాడికి దిగింది. ఈ యుద్దాన్ని చూడటానికి జంతువులన్నీ కూడా అక్కడకు చేరాయి..

(వీర సింహం-గొరిల్లా ఫైట్)

చివరికి వీర చేతిలో గొరిల్లా చావు దెబ్బలు తిని ప్రాణాలు విడిచింది.
అలా దుష్ట గొరిల్లా బాధలు తప్పిపోవడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి. తమ యువరాజు వీర తిరిగి వచ్చినందుకు సంబరాలు చేసుకున్నాయి.

07/02/2023

******* వీర సింహం - మాయా చెట్టు పార్ట్-1 **************
అడవిలో ధీర అనే సింహం ఉండేది.. దానికి వీర అనే కొడుకు ఉన్నాడు. వీరకి తల్లి లేకపోవడంతో ధీర అన్నీ తానై కొడుకుని చాలా బాగా చూసుకునేది.
అలాగే ధీర ఆ అడవికి మృగరాజు. చాలా మంచిది కూడా.. జంతువులకు ఏ కష్టం వచ్చిన ఆదుకునేది. దాంతో జంతువులన్నీ కూడా యువరాజు వీరని బాగా ఆడించేవి. అలా అడవంతా ఎప్పుడూ సంతోషంగా ఉండేది.

ఒకనాడు ధీర సింహం కొడుకుని వెంటబెట్టుకుని అడవంతా తిరుగుతోంది. వీర అల్లరి చేస్తూ అప్పుడప్పుడూ తండ్రికి దూరంగా వెళుతూ అటూ-ఇటూ పరుగులు పెడుతోంది.
"ఆ.. వీర.. జాగ్రత్త.. నా నుండి దూరం వెళ్ళకు.. ఏదైనా ప్రమాదం పొంచి ఉండవచ్చు.." అని హెచ్చరించింది..
"నేను ఈ అడవికి కాబోయే రాజుని.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు" అంటూ వీర అల్లరి చేస్తూ తండ్రికి దూరంగా వెళ్లిపోయింది.

అప్పుడే చెట్టుచాటుగా నక్కి ఉన్న పులి ఒకటి ధీరపై అమాంతం దాడికి దిగింది. ఊహించని ఈ దొంగ దాడికి సింహం నేల కొరిగే పరిస్దితి వచ్చింది. అయినా మృగరాజు కాబట్టి.. సత్తువ కూడగట్టుకుని దానిపై ప్రతిదాడికి దిగింది.

(ధీర సింహం-పులి ఫైట్)

దొంగ దెబ్బతో సగం ప్రాణాలు కోల్పోయిన ధీరసింహం .. తన కొడుకు వీర కోసం చూస్తూనే ప్రాణాలు విడిచింది. పులి తన పన్నాగం ఫలించడంతో అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్లిపోయింది.

ఎక్కడో దూరంలో ఆడుకుని తిరిగి వచ్చిన వీర.. తండ్రి అచేతనంగా కనిపించడంతో "లే నాన్నా .. లే.." అంటూ భోరున ఏడ్చేసింది. అసలు తన తండ్రిని చంపవలసిన అవసరం ఎవరికి ఉందో కూడా తెలియక వీర అయోమయంలో పడిపోయింది. చాలాసేపు అలా ఏడుస్తూనే ఉంది.
తండ్రి దగ్గరే కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీర దగ్గరకు గొరిల్లా వచ్చింది. గొరిల్లాకి వీర పరిస్దితి చూసి చాలా బాధనిపించింది.
"చూడు వీరా.. ఇలా ఎంతసేపు బాధపడుతూ కూర్చుంటావు.. నెమ్మదిగా దీనికి కారకులను కనిపెడదాం.. కానీ ఆకలి సహజ లక్షణం .. మన కడుపు నింపుకునేందుకు అన్నీ మరిచి ముందుకు నడవక తప్పదు.. నీవు పెరిగి పెద్దవాడివి అయ్యేంత వరకూ మామలా నీ బాధ్యత నేనే చూసుకుంటాను.. పదా.." అని ఓదార్చి తన వెంట తీసుకెళ్ళింది..

ఆనాటి నుండి వీర మంచిచెడ్డలు గొరిల్లానే చూసుకునేది. వీర చిన్నవాడు కావడంతో అడవిలో మిగిలిన జంతువులకు నాయకుడిలా గొరిల్లా ఉండేది. అవన్నీ గొరిల్లా చెప్పినట్టే నడుచుకునేవి.

ఒకనాడు గొరిల్లాకి వేరే చోటుకి వెళ్లే పని పడి.. వెళుతూ వీరతో ఇలా అంది.
"నీవు చిన్నవాడివి .. బయట ఎవ్వరినీ కలవకు.. ఎందుకంటే.. ఎవరి వలన ఎప్పుడు ఎలాంటి ఆపద ముంచుకొస్తుందో మనం గ్రహించలేం.. ఇప్పటికీ మీ నాన్నను చంపింది ఎవరో మనకు తెలియలేదు.. జాగ్రత్త.. లోపలే ఉండు.."
అందుకు వీర సరేననడంతో గొరిల్లా వెళ్లిపోయింది.

గొరిల్లా వెళ్లి చాలా సేపయింది.. వీరకి విపరీతమైన ఆకలి వేస్తోంది. ఎంతసేపటికీ గొరిల్లా తిరిగి రాకపోవడంతో వీర స్థావరంలోంచి బయటకు వచ్చి ఆహారం కోసం వెతకసాగింది. వీర తిరిగి తిరిగి అలిసిపోయి ఒక చెట్టు క్రిందకు చేరింది.
వెంటనే ఆ చెట్టు బంగారు రంగులోకి మారిపోయి మాట్లాడటం మొదలుపెట్టింది.
"రా వీర.. మెట్లెక్కి లోపలికిరా.. "
చెట్టు మాట్లాడటంతో వీరకి ఆశ్చర్యం వేసింది..
"నాకేం అర్దం కావడం లేదు.. నీవెవరు.. "
"నేను మాయా చెట్టుని.. నీ ఆకలి తీర్చే బోలెడు ఆహారం నా దగ్గర ఉంది.. రా పైకిరా.. "
దాంతో వీర ముందు ఆకలి తీర్చుకోవాలి కాబట్టీ ఆలోచనలో పడ్డాడు..
"అంతేకాదు.. నీ తండ్రి ధీరని చంపిన వాడు ఎవడో నీకు చెబుతాను.. రా.. లోపలికి రా.."
వీర ఇక మరేమీ ఆలోచించకుండా.. మెట్లెక్కి చెట్టు లోపలికి వెళ్లసాగాడు..

01/02/2023

The Bear and two friends English stories | moral stories in English

Cartoon Gorilla video
02/12/2022

Cartoon Gorilla video

Greedy Wolf steals watermelons || Gorilla and monkey Cunning wolf comedy video Please like and subscribe the channel ...

30/11/2022
30/11/2022

తెలివైన రైతు నీతి కథ || Foolish king and wise farmer Funny stories | Telegu kathalu by Chandamama Tv

28/11/2022

డినోసార్ 🥚 funny telugu video

28/11/2022
25/11/2022

1) డైనోసార్ పార్ట్-3
తెల్లారిన తర్వాత రామేశ్వర్ పట్నానికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు.
"చిట్టీ.. నేను పట్నానికి వెళుతున్నాను.. అక్కడ చిన్న పని ఉంది చూసుకుని త్వరగా వచ్చేస్తాను.. వచ్చేటప్పుడు నీ కోసం రకరకాల ఆహార పదార్దాలను తెస్తాను.. అంత వరకూ లోపలే ఉండు.. బయటకు వెళ్లకు.. కొత్తవారితో జాగ్రత్త".. అని డైనోసార్‌కి చాలా జాగ్రత్తలు చెప్పి, రామేశ్వర్ పట్నానికి బయలుదేరి వెళ్ళిపోయాడు.

ఇంటి బయటే నిలబడి భీమేష్ ఇదంతా గమనించాడు.
"రామేశ్వర్ పట్నానికి వెళుతున్నాడంటే సాయంత్రం వరకూ తిరిగిరాడు. ఈలోగా ఈ చిట్టీ పని పట్టాలి. కాకపోతే అది గుడ్డుగా ఉన్నప్పుడే నా పనిబట్టింది.. ఇప్పుడు అది పిల్ల కూడా అయ్యింది.. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.."
కాసేపు తీవ్రంగా ఆలోచించి భీమేష్ ఒక నిర్ణయానికి వచ్చాడు.
"ఎస్.. దానికి మత్తు మందు కలిపిన కేకు తినిపిస్తాను.. తర్వాత స్పృహ తప్పి పడిపోయివున్న డైనోసార్‌ని అనుచరుల సాయంతో అడవిలోకి తీసుకెళ్లి వదలడమో, ఏదైనా చేయడమో చేయవచ్చు.. " అని నిశ్చయించుకున్నాడు.

వేగంగా కేకుని సిద్దం చేసుకుని, దానిపైన మత్తుమందు చల్లాడు.. ఆ కేకును తీసుకుని డైనోసార్ దగ్గరకు వెళ్ళాడు భీమేష్.
"హల్లో చిట్టీ.. హేపీ బర్త్‌డే.. నీ గురించి నా మిత్రుడు రామేశ్వర్ చెప్పగానే నీ కోసం కేకు తీసుకుని వచ్చాను.." అని కేకు చూపించాడు. కేకుని చూస్తూనే డైనోసార్ ఆనందంతో ఎగిరి గంతులు వేసింది.
"ఇదంతా నీకోసమే తిను.. తిను.." అంటూ అందించాడు. కేకు మొత్తం ఒకేసారి నోట్లో వేసేసుకుందది.

కాసేపు ఎవో మంచి మాటలు చెబుతున్నట్టు నటించాడు భీమేష్.. కొంతసేపటికి కదలకుండా పడిపోయిందా డైనోసార్.. అంతా తను అనుకున్నట్టే జరగడంతో భీమేష్ గట్టిగా విజిల్‌ వేసాడు. అదివిని బైట ఉన్న ఇద్దరు అనుచరులు తాళ్లను పట్టుకుని లోపలకు వచ్చారు. భీమేష్, అనుచరులు కలిసి చిట్టీని తాళ్లతో బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.

ఇంతలో ఉన్నట్టుండి.. డైనోసార్ అరుస్తూ ఒక్కసారిగా పైకి లేచింది. నోట్లోంచి కేకును బయటకు ఊసేసింది. ఇదంతా చూసి భీమేష్ షాకయ్యాడు.
"హమ్మా.. కేకును నమిలి మింగకుండా తెలివిగా నోట్లోనే దాచుకుందన్నమాట.. దీనికీ ఆ రామేశ్వర్‌గాడి తెలివితేటలే వచ్చాయి.. "
డైనోసార్ గట్టిగా అరుస్తూ భీమేష్‌నీ, ఇద్దరు అనుచరుల్ని గాల్లోకి ఎగరేసి ఎగరేసి మరీ కుమ్మేసింది..
(డైనోసార్- భీమేష్‌, ఇద్దరు అనుచరుల Fight....)

చిట్టీ దెబ్బలకు తట్టుకోలేక ముగ్గురూ అక్కడి నుండి పరుగులు తీసారు..

Lion and the Crane English stories || Bone stuck in Lion mouth moral stories stoke  Tales 3D
09/11/2022

Lion and the Crane English stories || Bone stuck in Lion mouth moral stories stoke Tales 3D

Lion and the Crane English stories || Bone stuck in Lion mouth moral stories stoke Tales 3D Fairy Tales 3D

Foolish monkey and elephant English funny story || Mad Monkey monkey cutting tree  Tales 3D
07/11/2022

Foolish monkey and elephant English funny story || Mad Monkey monkey cutting tree Tales 3D

Foolish monkey and elephant English funny story || Mag Monkey monkey cutting tree Tales 3D Fairy Tales 3D

Greedy Wolf steals Truck Comedy video || Funny Monkey cartoon Gorilla Short stories  Tv
30/10/2022

Greedy Wolf steals Truck Comedy video || Funny Monkey cartoon Gorilla Short stories Tv

Greedy Wolf steals Truck Comedy video || Funny Monkey cartoon Gorilla Short stories Tv Please like an...

Tiger with golden bangle English stories | Greedy Tiger attack on traveler moral story
26/10/2022

Tiger with golden bangle English stories | Greedy Tiger attack on traveler moral story

Tiger with golden bangle English stories | Greedy Tiger attack on traveler moral story Tales ...

Greedy Elephant steals Banana Comedy video | Monkey and Buffelo vs Elephant big battle funny video
21/10/2022

Greedy Elephant steals Banana Comedy video | Monkey and Buffelo vs Elephant big battle funny video

Greedy Elephant steals Banana Comedy video | Monkey and Buffelo vs Elephant big battle funny video Please like and subscribe t...

19/10/2022

dinosaur egg - 2 తెలుగు కథ || Dinosaur surprise egg Funny stories by Chandamama Tv Telugu


1) డైనోసార్ పార్ట్-2
వాయిస్ : రామేశ్వర్ ఇంటికి తిరిగి వచ్చిన గుడ్డు కొద్దికొద్దిగా అటూఇటూ కదులుతూ పగలడం మొదలైంది. ఆ గుడ్డు చేస్తున్న శబ్దానికి నిద్రపోతున్న రామేశ్వర్ లేచాడు. కొంతసేపటికి గుడ్డు పగిలి అందులోంచి డైనోసార్ పిల్ల బయటకు వచ్చింది. దానిని చూస్తూనే రామేశ్వర్ చాలా సంబర పడ్డాడు.

రామేశ్వర్ : చూడటానికి చాలా అందంగా ముద్దుముద్దుగా ఉన్నావు.. అందుకే నిన్ను "చిట్టీ" అని పిలుస్తాను.

వాయిస్ : దాంతో అది ఆనందపడి ఎగిరెగిరి గంతులు వేసింది. దానిని దగ్గరకు తీసుకుని ప్రేమను చూపించాడతను.

రామేశ్వర్ : నీకు బాగా ఆకలిగా ఉండి ఉంటుంది. ఉండు, లోపల ఉన్న పాలు, పండ్లు తెస్తాను..

వాయిస్ : లోపలకు వెళ్ళి పాలు, పండ్లు తెచ్చి దాని ముందు పెట్టాడు. అది పాలను వేగంగా తాగేసింది. తరువాత పండ్లు తినడం ప్రారంభించింది.

రామేశ్వర్ : చిట్టీ .. నాకు నిద్ర వస్తోంది.. నీవు పండ్లు తిని కాసేపు నిద్రపో.. తెల్లవారక నేను బయటకు వెళ్లి నీకు కావలసిన రకరకాల ఆహార పదార్ధాలు తీసుకుని వస్తాను.. సరేనా..

వాయిస్ : రామేశ్వర్‌కు నిద్ర రావడంతో పడుకున్నాడు. డైనోసార్ పండ్లు తింటూ ఉంది.

వాయిస్ : మరోవైపు భీమేష్ కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. తనకు తగిలిన దెబ్బలకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు.

భీమేష్ : అరేయ్ రామేశ్వర్ .. నీ గుడ్డుతో నా గుండునే పగుల కొట్టిస్తావురా.. పాములాంటి నా తోక తొక్కావు.. ఇవాళ్టితో నీ పని ఫినిష్..

వాయిస్ : పెద్ద బుట్టపై ఉన్న మూతను తీసాడు.. అందులోంచి బయటకు వచ్చిన పాము బుసలు కొడుతూ రామేశ్వర్ ఇంటిలోకి వెళ్లింది. నిద్రపోతున్న రామేశ్వర్ దగ్గరకు వెళ్ళి.. బుసలు కొట్టడం మొదలు పెట్టింది.
ఆ శబ్దం విని రామేశ్వర్ లేచాడు. అంత పెద్దపాముని చూస్తూనే వణికిపోయాడు.

రామేశ్వర్ : పాము.. పాము.. కాపాడండీ.. కాపాడండీ..

వాయిస్ : అంటూ భయంతో గట్టిగా అరిచాడు. అరుపులు విని లేచిన డైనోసార్ పాముతో తలపడింది.. డైనోసార్‌కి పాముకి మధ్య చాలాసేపు యుద్దమే జరిగింది.

(Dinosaur-Snake Fight)

వాయిస్ : చివరకు పాము చనిపోయింది. చనిపోయిన పాముని డైనోసార్ దూరంగా విసిరేసింది. ఆ పాము ఎగరుకుంటూ వెళ్ళి భీమేష్‌ మెడలో పడటంతో..

భీమేష్ : అమ్మో.. పాము.. పాము..

వాయిస్ : అంటూ భయంతో అరుస్తూ కళ్లు తిరిగి క్రింద పడ్డాడు. తనను కాపాడిన డైనోసార్ చిట్టీని రామేశ్వర్ ఎంతగానో మెచ్చుకున్నాడు.

Cunning Eagle and Fox Hindi stories || चालाक लोमड़ी और बाज़ | Hindi Greedy stories moral stories
17/10/2022

Cunning Eagle and Fox Hindi stories || चालाक लोमड़ी और बाज़ | Hindi Greedy stories moral stories

Cunning Eagle and Fox Hindi stories || चालाक लोमड़ी और बाज़ | Hindi Greedy stories moral stories Subscribe : htt...

Magical golden fish Hindi story || जादुई सुनहरी मछली || 3D Hindi Kahaniya Stories Fairy tales kahani
12/10/2022

Magical golden fish Hindi story || जादुई सुनहरी मछली || 3D Hindi Kahaniya Stories Fairy tales kahani

Magical golden fish Hindi story || जादुई सुनहरी मछली || 3D Hindi Kahaniya Stories Fairy tales kahani

Crazy Wolf eat Hot chilli comedy video | cartoon Gorilla and Monkey Fox Funny video  Tv
07/10/2022

Crazy Wolf eat Hot chilli comedy video | cartoon Gorilla and Monkey Fox Funny video Tv

Crazy wolf eat Hot chilli comedy video | Gorilla and Monkey Helping Fox Funny video Tv Please like and subscribe t...

05/10/2022

Dinosaur part 1 Telugu funny stories | Dinosaur cartoons || Telugu kathalu Tv - Telugu

Address

Darsi
523247

Website

Alerts

Be the first to know and let us send you an email when Chandamama Tv - Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chandamama Tv - Telugu:

Videos

Share


Other Darsi media companies

Show All